మనుషులు జాంబీలుగా మారితే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ 'జాంబీరెడ్డి' అనే మూవీ ఉంది. అయితే ప్రపంచంలో ఈ జానర్‌లో వచ్చిన బెస్ట్ సినిమా అంటే చాలామంది చెప్పే పేరు 'ట్రైన్ టూ బుసన్'. ఒరిజినల్‌గా ఇది కొరియన్ చిత్రం. కానీ ఓటీటీలోనూ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే రివ్యూ చదివేయండి.
(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ))
కథేంటి?
ఫైనాన్సియల్ కంపెనీ నడిపే హీరో. అతడికి ఓ కూతురు. ఓ రోజు తన తల్లి ఉంటున్న బుసన్ ఊరికి వెళ్దామని వేకువజామున ట్రైన్ ఎక్కుతాడు. అయితే అప్పటికే ఓ ప్రాణాంతక వైరస్ వల్ల ఈ ఊరిలోని మనుషులందరూ జాంబీలుగా మారిపోయింటారు. కనిపించిన మనుషుల్ని పీక్కుతింటూ వాళ్లని కూడా జాంబీలుగా మార్చేస్తుంటారు. ఓ లేడీ జాంబీ.. హీరో ఎక్కిన ట్రైన్‌లోకి ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని కొరికేస్తూ ట్రైన్‌లోని చాలామందిని జాంబీలుగా మార్చేస్తుంది. మరి చివరకు ఏమైంది? హీరో, తన కూతురు బతికి బయటపడ్డారా అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
'ట్రైన్ టూ బుసన్' సినిమాని ఈపాటికే మీలో చాలామంది చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే వాళ్ల కోసమే ఈ రివ్యూ. ఇప్పటివరకు హారర్, థ్రిల్లర్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ సినిమాలు. కానీ ఇది మాత్రం సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లోనే బెస్ట్ మూవీ. జాంబీలు ఉంటాయి కాబట్టి కావాల్సినంత భయం కూడా ఉంటుంది.
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
కేవలం రెండే గంటలున్న ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. ఒక్కో సీన్ చూస్తుంటే ఓ పక్క వణుకు, మరోపక్క భయంతో ప్యాంట్ తడిచిపోద్ది. చెప్పుకొంటే చిన్న కథనే గానీ చాలా గ్రిప్పింగ్‌గా తీశారు. డ్రామా, హారర్, యాక్షన్, థ్రిల్లర్.. ఒకటేమిటి బోలెడన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఇలాంటి జాంబీ మూవీలోనూ ఓ తండ్రి-కూతురి మధ్య బాండింగ్‌ని చాలా చక్కగా మనుసుని హత్తుకునేలా ఎష్టాబ్లిష్ చేశారు. తొలుత దీన్ని కొరియన్ బాషలో రిలీజ్ చేశారు. కానీ తర్వాత బోలెడంత పాపులారిటీ రావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
మనం చేసిన కొన్ని పనులు వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది అనే పాయింట్ ఆధారంగా దీన్ని తీశారు. కొరియన్ స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తాడనే రూమర్స్ వచ్చిన డాంగ్ ఇందులో ఉంటాడు. ఒక్క గుద్దుతో జాంబీలని చంపేవాడిగా కనిపిస్తాడు. ఈ వీకెండ్ ఏం చేయాలో తెలీక ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ట్రైన్ టూ బుసన్' చూడండి. చూసిన తర్వాత 'వర్త్ వర్మ వర్త్' అని కచ్చితంగా అంటారు!
-చందు డొంకాన
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment