Zombie movie
-
ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!
మనుషులు జాంబీలుగా మారితే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ 'జాంబీరెడ్డి' అనే మూవీ ఉంది. అయితే ప్రపంచంలో ఈ జానర్లో వచ్చిన బెస్ట్ సినిమా అంటే చాలామంది చెప్పే పేరు 'ట్రైన్ టూ బుసన్'. ఒరిజినల్‌గా ఇది కొరియన్ చిత్రం. కానీ ఓటీటీలోనూ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే రివ్యూ చదివేయండి.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ))కథేంటి?ఫైనాన్సియల్ కంపెనీ నడిపే హీరో. అతడికి ఓ కూతురు. ఓ రోజు తన తల్లి ఉంటున్న బుసన్ ఊరికి వెళ్దామని వేకువజామున ట్రైన్ ఎక్కుతాడు. అయితే అప్పటికే ఓ ప్రాణాంతక వైరస్ వల్ల ఈ ఊరిలోని మనుషులందరూ జాంబీలుగా మారిపోయింటారు. కనిపించిన మనుషుల్ని పీక్కుతింటూ వాళ్లని కూడా జాంబీలుగా మార్చేస్తుంటారు. ఓ లేడీ జాంబీ.. హీరో ఎక్కిన ట్రైన్‌లోకి ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని కొరికేస్తూ ట్రైన్‌లోని చాలామందిని జాంబీలుగా మార్చేస్తుంది. మరి చివరకు ఏమైంది? హీరో, తన కూతురు బతికి బయటపడ్డారా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ట్రైన్ టూ బుసన్' సినిమాని ఈపాటికే మీలో చాలామంది చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే వాళ్ల కోసమే ఈ రివ్యూ. ఇప్పటివరకు హారర్, థ్రిల్లర్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ సినిమాలు. కానీ ఇది మాత్రం సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోనే బెస్ట్ మూవీ. జాంబీలు ఉంటాయి కాబట్టి కావాల్సినంత భయం కూడా ఉంటుంది.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)కేవలం రెండే గంటలున్న ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. ఒక్కో సీన్ చూస్తుంటే ఓ పక్క వణుకు, మరోపక్క భయంతో ప్యాంట్ తడిచిపోద్ది. చెప్పుకొంటే చిన్న కథనే గానీ చాలా గ్రిప్పింగ్‌గా తీశారు. డ్రామా, హారర్, యాక్షన్, థ్రిల్లర్.. ఒకటేమిటి బోలెడన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఇలాంటి జాంబీ మూవీలోనూ ఓ తండ్రి-కూతురి మధ్య బాండింగ్‌ని చాలా చక్కగా మనుసుని హత్తుకునేలా ఎష్టాబ్లిష్ చేశారు. తొలుత దీన్ని కొరియన్ బాషలో రిలీజ్ చేశారు. కానీ తర్వాత బోలెడంత పాపులారిటీ రావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.మనం చేసిన కొన్ని పనులు వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది అనే పాయింట్ ఆధారంగా దీన్ని తీశారు. కొరియన్ స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తాడనే రూమర్స్ వచ్చిన డాంగ్ ఇందులో ఉంటాడు. ఒక్క గుద్దుతో జాంబీలని చంపేవాడిగా కనిపిస్తాడు. ఈ వీకెండ్ ఏం చేయాలో తెలీక ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ట్రైన్ టూ బుసన్' చూడండి. చూసిన తర్వాత 'వర్త్ వర్మ వర్త్' అని కచ్చితంగా అంటారు!-చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా !
Zombivli Marathi Film Will Streaming On Zee5: డిఫరెంట్ జోనర్ చిత్రాలలో 'జాంబీస్' ఒకటి. ఒక వైరస్ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి తినేవారినే జాంబీస్ అంటారు. మనుషులను పీక్కు తినేందుకు వెంటపడే జాంబీస్ వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఈ తరహా సినిమాలు యాక్షన్, హార్రర్, ఎమోషన్స్‌తో కలగలపి ఎన్నో వచ్చాయి. తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 'జాంబీ రెడ్డి' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీలోకి ఈ జోనర్లో ఓ సినిమా రానుంది. ప్రముఖ మరాఠీ మూవీ డైరెక్టర్ ఆదిత్య సర్పోట్డార్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం 'జాంబీవిలీ'. ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ 'జాంబీవిలీ' చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఇండియా అధికారిక ట్విటర్లో పేర్కొంది. 'మహారాష్ట్ర జాంబీలు మీకోసం వచ్చేస్తున్నాయి. యాక్షన్ కామెడీతో నిండి ఉన్న ఈ చిత్రం చూసేందుకు సిద్ధంగా ఉండండి' అని ట్వీట్ చేసింది. ఓ నగరంలో జాంబీ వైరస్ వ్యాప్తి కావడంతో అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా కథ. అలాగే మరాఠీ భాషలో తొలిసారిగా జాంబీ జానర్లో వచ్చిన చిత్రం ఇది. ఇందులో అమీ వాఘ్, వైదేహి పరశురామి, తృప్తి ఖమ్కర్, జానకి పాఠక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: అతిగా భయపెట్టే 'జాంబీ' వెబ్ సిరీస్‌లు ఇవే.. Watch out, Maharashtra! The zombies are coming for you. Catch Marathi’s first-ever Zombie-filled, action-comedy #Zombivli Premieres 20th May on #ZEE5 pic.twitter.com/yAdPtvWY1z — ZEE5 (@ZEE5India) May 10, 2022 -
అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Zombie Web Series And TV Shows In OTT: కరోనా వ్యాప్తి, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం కళ్లారా చూశాం, అనుభవించాం కూడా. దగ్గు, తుమ్ములతోనే కరోనా వైరస్ వ్యాప్తి చెంది మన ఆరోగ్యాన్ని క్షిణించేలా చేసి మెలిమెల్లిగా చంపుతుంది. ఒక వైరస్ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి నరమాంస భక్షుకుల్లా పీక్కుతింటే. ఆ వైరస్ క్షణాల్లో సోకి మనుషులంతా చనిపోతే. ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అదే 'జాంబీ' వైరస్. ఈ జాంబీ వైరస్ కాన్సెప్ట్‌తో వచ్చినవే 'జాంబీస్' చిత్రాలు. 'జాంబీ రెడ్డి' సినిమాతో జాంబీస్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అదంతా సక్సెస్ సాధించలేదు. కానీ ఒళ్లు గగుర్పొడిచేలా ఈ జాంబీస్ మూవీస్, వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. ఇది వరకు సినిమాల్లో చూపించిన ఈ కరోనా వైరస్‌ను ప్రత్యక్షంగా అనుభవించాం. అయితే త్వరలోనే 'జాంబీ' వైరస్‌ను చూసే పరిస్థితి కూడా రావొచ్చనే భయాందోళనలు కలుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ జాంబీ వైరస్ బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్, టీవీ షోలను చూడాల్సిందే. ఈ జాంబీస్ మిమ్మల్ని నిద్రలోనూ వెంటాడతాయంటే అతిశయోక్తి కాదు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. 1. ది వాకింగ్ డెడ్ (నెట్‌ఫ్లిక్స్) 2. ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (నెట్‌ఫ్లిక్స్) 3. గేమ్ ఆఫ్ థ్రోన్స్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 4. బేతాల్ (నెట్‌ఫ్లిక్స్) 5. కింగ్డమ్ (నెట్‌ఫ్లిక్స్) 6. ది రిటర్న్డ్ (నెట్‌ఫ్లిక్స్) 7. బ్లాక్ సమ్మర్ (నెట్‌ఫ్లిక్స్) 8. ఐ జాంబీ (నెట్‌ఫ్లిక్స్) 9. అమెరికన్ గాడ్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 10. ఆష్ Vs ఎవిల్డెడ్ (నెట్‌ఫ్లిక్స్) -
‘జాంబీ రెడ్డి’లో అలరించనున్న లహరి షరీ
ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాంబీ రెడ్డి. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాంబీరెడ్డి సినిమాలో లహరి షరీ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుల్లితెర ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన లహరికి ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టనుందనడంలో సందేహం లేదు. టీవీ ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించిన లహరి పలు ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తరువాత తన టాలెంట్‌తో అనేక సినిమాల్లో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయమయ్యారు లహరి. అందులో అమాయక నర్సుగా నటించి అందరి మన్ననలు పొందారు. చదవండి: కరోనా నేపథ్యంలో జాంబీ రెడ్డి తరువాత మళ్లీ రావా (2017 ), పటేల్ సార్ (2017), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), అజ్ఞాతవాసి(2018) తిప్పర మీసం (2019) సినిమాల్లో ఆకట్టుకున్న లహరి ఇప్పుడు జాంబీ రెడ్డి ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో లహరి షరీ పాత్ర కీలకం కావడంతో ఇది ఆమె కెరీర్లో పెద్ద హిట్‌గా నిలవబోతుందనడంలో ఆశ్చర్యం లేదు. కాగా జాంబీ రెడ్డి ట్రైలర్‌ను ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఆనందీ, దక్ష నగర్కర్, గెటప్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, అన్న పూర్ణమ్మ, కిరీటి, హరితేజ, మహేష్ విట్ట ఇతర పాత్రల్లో నటించారు. కరోనా వైరస్ చుట్టూ తిరిగే ఈ కథను కర్నూలులో తీశారు. మహమ్మారిని కట్టడి చేయడంలో కర్నూలు ప్రజలు ఎలా బయటపడ్డారనేది చిత్రం. లాహరి షరీ ప్రస్తుతం కన్నడ సినిమా ‘గ్రామ’లో నటిస్తున్నారు. హేమంత్ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుందని లాహరి షరీ నమ్మకంగా ఉన్నారు. మున్ముందు మరింత బిజీ అవుతానని ఆమె ఆశిస్తున్నారు. -
‘జాంబీ రెడ్డి’ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రభాస్
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం జాంబీ రెడ్డి. పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన తేజ సజ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల సమంత, దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జనవరి 2న రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా బిగ్ బైట్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం సాయత్రం ప్రభాస్ విడుదల చేశారు. తెలుగులో మొదటి జాంబీ చిత్రం అంటూ ట్విటర్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ, రాజ్ శేఖర్ వర్మ, తేజ సజ్జ, మార్క్ కే రాబిన్‌తోపాటు చిత్ర యూనిట్‌కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్ తెలియ జేశారు. చదవండి: దర్శకుడు క్రిష్‌కు కరోనా.. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు. హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన 'జాంబి' జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఈ సిినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ జాంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్).. విన్నర్స్ జాబితా -
జాంబిరెడ్డి ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్
'ఇంద్ర' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం జాంబి రెడ్డి. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్, పోస్టర్లను స్టార్ బ్యూటీ సమంత, హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. జనవరి 2న బాహుబలి హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుందట. అంటే ప్రభాస్ ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: దిల్ రాజుతో టాప్ హీరోలు.. ఫోటోలు వైరల్) ఏది ఏమైనా జాంబి రెడ్డి టీమ్ పోస్టర్ సహా ప్రతీది సెలబ్రిటీల చేతుల మీదుగా విడుదల చేస్తూ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకుంటోంది. మొన్న సామ్‌ను రంగంలోకి దింపిన జాంబి రెడ్డి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరిన ప్రభాస్‌తో సర్ప్రైజ్ రివీల్ చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ జాంబిరెడ్డి చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజు, గెటప్ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు. మార్క్. కె. రాబిన్ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు ప్రభాస్ కూడా జనవరిలో రెండు సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారని టాక్. (చదవండి: ఆన్లైన్లో జోంబీ వేషంతో.. అంతే ఒక్కసారిగా!) -
ఆన్లైన్లో జోంబీ వేషంతో..
బ్యాంకాక్: ఆన్లైన్లో బట్టల వ్యాపారం క్లిక్ అయ్యేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆమె భయంకరమైన వేషధారణతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన కనిట్టా థాంగ్నాక్(32) అనే మహిళ మరణించిన వారికి అవసరమైన వస్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించేది. అందుకోసం ఆమె భయానకంగా జోంబీ వేషం వేసింది. ఈ జోంబీ మేకప్‌తో అర్థరాత్రి ఆన్లైన్ ద్వారా వివిధ రకాలుగా మరణించిన వారు ఎలా చనిపోయోరో ఆమె వద్ద ఉన్న దుస్తులతో వివరింస్తుంది. దీంతో ఆమెకు ఆన్లైన్ ప్రేక్షకులు పెరగడమే కాకుండా.. కస్టమర్ల సంఖ్య కూడా వేలకు చేరింది. దీంతో ఆమె వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. (చదవండి: జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్) దీనిపై థాంగ్నాక్ మాట్లాడుతూ.. నా దగ్గర ఉన్న బట్టలు మరణించిన వారికి ఎలా ఉపయోగిపడతాయో... వాటిని నేను జోంబో మేకప్‌తో ధరించి ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులకు వివరించడం ప్రారంభించాను. వాటిని నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేదాన్ని. దీంతో అప్పటి నుంచి కస్టమర్లు కొంచంగా కొంచంగా ఆసక్తి చూపారు. అంతేగాక ఆన్లైన్ ప్రేక్షకులు కూడా పెరిగారు. ఈ జోంబీ మేకప్ వేసుకునేందుకు తనకు మూడు గంటల సమయం పెట్టేదని కూడా తెలిపింది.తన ఆదాయంలో కొంత భాగాన్నిబౌద్ధ దేవాలయాలకు విరాళంగా ఇస్తానని ఆమె పేర్కొంది. (చదవండి: వాలిబాల్ ఆడుతున్న పక్షులు.. గెలిచేదెవరు?) -
సమ్మర్లో ‘జోంబీ’
చిన్న చిన్న పాత్రలతో కమెడియన్‌గా ఎదిగిన నటుడు యోగిబాబు ఇప్పుడు కథానాయకుడి స్థాయికి చేరుకున్నాడు. ఒక పక్క హాస్యనటుడిగా బిజీగా ఉన్నా, మరో పక్క తన కోసమే తయారు చేసిన కథా చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలా యోగిబాబు నటిస్తున్న తాజా చిత్రాల్లో జోంబీ ఒకటి. ఇందులో నటి యాషిక నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రానికి యువన్ నలన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ జోంబీ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం చెన్నై, వీసీఆర్ రోడ్డులోని ఒక గెస్ట్‌హౌస్‌లో నిర్వహించినట్లు తెలిపారు. ప్రేమ్‌జీ అమరన్ సంగీతాన్ని అందించిన చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర కథ చెన్నై, వీసీఆర్ రోడ్డు, పాండిచ్చేరిలలో ఒకే రాత్రి జరిగే సంఘటన ఇతివృత్తంగా ఉంటుందని చెప్పారు. దీన్ని ఎస్ 3 పిక్చర్స్ పతాకంపై ఆర్.వసంత్ మహాలింగం, వి.ముత్తుకుమార్ నిర్మిస్తున్నారు. -
అర్ధరాత్రి అలర్ట్.. సిటీ వణికిపోయింది
అర్ధరాత్రి నగరం మొత్తం గాఢ నిద్రలో ఉన్న వేళ.. ఒక్క మెసేజ్ నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. జాంబీల భయంతో నిద్రలేని రాత్రి గడిపారు. అయితే ఉదయం అయ్యాక అదంతా ఉత్త పుకారే అని తేలటంతో అధికారులపై ప్రజలు మండిపడ్డారు. ఫ్లోరిడా: విషయంలోకి వెళ్తే మే 20వ తేదీన ఫ్లోరిడాలోని లేక్వర్త్ నగరంలో ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి ఓ సందేశం వచ్చింది. ‘విద్యుత్ అంతరాయం.. జాంబీ అలర్ట్.. సగం జనాభా ప్రమాదంలో ఉంది. పరిస్థితి మాములు స్థితికి వచ్చేందుకు ఎంత టైం పడుతుందో ఖచ్ఛితంగా చెప్పలేం’ అంటూ అర్ధరాత్రి 1గం.45ని. సమయంలో సందేశం వచ్చింది. ఆ అలర్ట్ చూసిన ప్రజలంతా వణికిపోయి రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. ఉదయానికల్లా వార్త దావానంలా పాకటంతో అధికారులు రంగంలోకి దిగారు. పబ్లిక్ ఇన్ఫర్మెన్ కార్యాలయం నుంచే ఆ సందేశం ప్రచారం కావటంతో నగరవాసులకు క్షమాపణలు తెలియజేశారు. తాము కేవలం పవర్‌కట్‌కు సంబంధించి సందేశం మాత్రమే పంపామని.. జాంబీ అలర్ట్‌ను ఎవరో జత చేసి ఉంటారని ప్రకటించారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పుకార్లు గతంలోనూ ప్రజలకు దడ పుట్టించాయి. ఈ ఏడాది జనవరిలో హవాలి వాసులకు బాలిస్టిక్ మిసైల్ దాడి అంటూ ఓ సందేశం పాకిపోయి పెనుకలకలమే రేగింది. -
భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ
బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే పలుచిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ కొట్టాలని భావిస్తోంది. జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అదే జోష్‌లో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తెలుగుతెర మీద ఇంత వరకు నేరుగా రాని జాంబి తరహా కథాకథనాలతో తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్లో రష్మి లీడ్ రోల్లో కనిపించనుంది. జాంబీ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'తను వచ్చెనంట' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. రష్మితో పాటు తేజ కాకుమాను, ధన్యా బాలకృష్ణన్, చలాకీ చంటి ఇతర ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు బుల్లితెర మీద, వెండితెర మీద తన గ్లామర్‌తో, మంచి టైమింగ్‌తో నవ్వించిన రష్మి ఇప్పుడు ఈ హర్రర్ సినిమాతో ఎంత వరకు భయపెడుతుందో చూడాలి.