Zombivli Marathi Movie Will Streaming On Zee5, Full Details here - Sakshi
Sakshi News home page

Zombivli Movie: ఓటీటీలోకి 'జాంబీవిలీ' చిత్రం.. ఎప్పుడు ? ఎక్కడంటే ?

May 10 2022 4:13 PM | Updated on May 10 2022 6:41 PM

Zombivli Marathi Film Will Streaming On Zee5 - Sakshi

డిఫరెంట్‌ జోనర్‌ చిత్రాలలో 'జాంబీస్‌' ఒకటి. ఒక వైరస్‌ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి తినేవారినే జాంబీస్‌ అంటారు. మనుషులను పీక్కు తినేందుకు వెంటపడే జాంబీస్‌ వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఈ తరహా సినిమాలు యాక్షన్‌, హార్రర్‌, ఎమోషన్స్‌తో కలగలపి ఎన్నో వచ్చాయి. తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'జాంబీ రెడ్డి' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

Zombivli Marathi Film Will Streaming On Zee5: డిఫరెంట్‌ జోనర్‌ చిత్రాలలో 'జాంబీస్‌' ఒకటి. ఒక వైరస్‌ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి తినేవారినే జాంబీస్‌ అంటారు. మనుషులను పీక్కు తినేందుకు వెంటపడే జాంబీస్‌ వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఈ తరహా సినిమాలు యాక్షన్‌, హార్రర్‌, ఎమోషన్స్‌తో కలగలపి ఎన్నో వచ్చాయి. తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'జాంబీ రెడ్డి' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీలోకి ఈ జోనర్‌లో ఓ సినిమా రానుంది. ప్రముఖ మరాఠీ మూవీ డైరెక్టర్‌ ఆదిత్య సర్పోట్డార్‌ తెరకెక్కించిన హారర్‌ కామెడీ చిత్రం 'జాంబీవిలీ'. ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. 

ఈ 'జాంబీవిలీ' చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఇండియా అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. 'మహారాష్ట్ర జాంబీలు మీకోసం వచ్చేస్తున్నాయి. యాక్షన్‌ కామెడీతో నిండి ఉన్న ఈ చిత్రం చూసేందుకు సిద్ధంగా ఉండండి' అని ట్వీట్‌ చేసింది. ఓ నగరంలో జాంబీ వైరస్‌ వ్యాప్తి కావడంతో అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా కథ. అలాగే మరాఠీ భాషలో తొలిసారిగా జాంబీ జానర్‌లో వచ్చిన చిత్రం ఇది. ఇందులో అమీ వాఘ్, వైదేహి పరశురామి, తృప్తి ఖమ్కర్‌, జానకి పాఠక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

చదవండి: అతిగా భయపెట్టే 'జాంబీ' వెబ్‌ సిరీస్‌లు ఇవే..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement