
కోలీవుడ్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం 'కింగ్‌స్టన్'. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలో ఓకేసారి రెండు ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్‌స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.
కాగా.. కింగ్‌స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.
(ఇది చదవండి: 'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్)
అసలు కింగ్‌స్టన్ కథేంటంటే..
కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్‌స్టన్ సినిమా చూడాల్సిందే.
The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵
India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025