Kingston
-
బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం
జమైకా దిగ్గజ అథ్లెట్.. ఒలింపియన్ ఉసెన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి. గార్డన్ తెలిపారు. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్ అకౌంట్లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్ తరపు లాయర్ గార్డన్ వెల్లడించారు. ''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని.. ప్రైవేటు పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్ట్ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్స్టన్ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్ గార్డన్ తెలిపారు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. విండీస్ 150 ఆలౌట్
కింగ్స్టన్: పేసర్ షాహిన్ అఫ్రిది (6/51) చెలరేగడంతో పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అబ్బాస్‌కు 3 వికెట్లు దక్కాయి. దాంతో పాక్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకు ముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫవాద్ ఆలమ్ (124 నాటౌట్) శతకం సాధించాడు. చదవండి: పుజారా క్లాస్ ప్లేయర్ అయితే సూర్యకుమార్ మ్యాచ్ విన్నర్ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని పాక్ ఓవరాల్‌గా 358 పరుగుల భారీ టార్గెట్‌ను విండీస్ ముందు ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 17, అల్జారీ జోసెఫ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో రోజున విండీస్ గెలవాలంటే ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉండగా.. పాక్ విజయానికి 9 వికెట్లు అవసరం. చదవండి: Ajinkya Rahane: ‘నా గురించి చర్చించడం మంచిదేగా’ -
WI Vs Pak: పాకిస్తాన్ 217 ఆలౌట్
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... అష్రఫ్ (44; 8 ఫోర్లు), బాబర్ ఆజమ్ (30; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, హోల్డర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 100 పరుగులు చేసింది. చదవండి: Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే... -
బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు
జమైకా: చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్(34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన జీవిత భాగస్వామి బెన్నెట్ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే రోజున ఫ్యామిలీ ఫోటోతో ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. అయితే, బోల్ట్ పిల్లల పేర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి పేర్లు వరసగా ఒలింపియా లైటనింగ్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్, థండర్ బోల్ట్ కాగా.. ఒలింపియా లైటనింగ్ బోల్ట్ 2020 మేలో జన్మించింది. ఇక కవలల ఫొటో మాత్రమే పంచుకున్న బోల్ట్ వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. బోల్ట్ పిల్లల పేర్లపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘లైటనింగ్ (మెరుపు), థండర్ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు.’’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. బోల్ట్ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బోల్ట్ జీవిత భాగస్వామి బెన్నెట్ స్పందిస్తూ.. ‘‘ ఈ కుటుంబానికి ఉస్సేన్ బోల్ట్ ఓ పెద్ద బలం.. పిల్లలకు ఓ గొప్ప తండ్రి.. ఎప్పటికీ ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2008, 2012, 2016 లో జరిగిన ఒలింపిక్స్‌లో ఉసేన్ బోల్ట్ ఎనిమిది బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండేసి పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్ ఉసేన్ బోల్ట్. Olympia Lightning Bolt ⚡️ Saint Leo Bolt ⚡️ Thunder Bolt ⚡️@kasi__b pic.twitter.com/Jck41B8j3J — Usain St. Leo Bolt (@usainbolt) June 20, 2021 చదవండి: Wrestler Khali: రెజర్ల్ కాళి ఇంట విషాదం -
అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది: విహారి
కింగ్స్టన్(జమైకా): స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలుగు క్రికెటర్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హనుమ విహారి అన్నాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక 468 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టును మట్టి కరిపించిన టీమిండియా ఐసీసీ వరల్డ్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా కరేబియన్ దీవుల్లో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఘనత సాధించింది. ఇక ఈ టెస్టులో సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన యువ క్రికెటర్ హనుమ విహారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విహారి మాట్లాడుతూ...టీమిండియా కోచ్ రవిశాస్త్రి సలహాలు, సూచనల వల్లే తాను ఈ మ్యాచ్‌లో రాణించగలిగానని పేర్కొన్నాడు. అదే విధంగా అజింక్య రహానే తనకు అండగా నిలబడి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడని తెలిపాడు. ‘తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. గత మ్యాచ్‌లో శతకం చేజార్చుకోవడంతో ఈసారి భారీ స్కోరు కోసం మరింత పట్టుదలగా నిలబడ్డాను. ఈ పిచ్‌పై ఓపిక అవసరం. బౌలర్లకు పిచ్ అనుకూలిస్తున్న సమయంలో చెత్త బంతి కోసం ఎదురు చూడాలి. రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రణాళిక బాగా పని చేసింది. నా బ్యాటింగ్ స్టాన్స్ మార్చుకునే విషయంలో కోచ్ రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశారు. అవి బాగా పని చేశాయి. ఒత్తిడిలో ఆడటాన్ని నేను ఇష్టపడతాను. అదే మనలోని అసలు సత్తాను బయటపెడుతుందని నా నమ్మకం. తొమ్మిదేళ్ల క్రితమే నా ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభమైంది కాబట్టి అప్పుడే 6 వేల పరుగులు దాటేశాను. స్వదేశంలో ఇంకా టెస్టు ఆడలేదు. దాని కోసం ఎదురు చూస్తున్నాను. మనోళ్ల మధ్య బ్యాటింగ్ చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. అయితే 26 ఏళ్ల వయసులోనే జుట్టు ఇంతగా ఎందుకు ఊడిపోయిందో తనకు తెలీదని... బహుశా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువగా బ్యాటింగ్ చేయడం వల్లేనేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. చదవండి : రెండో టెస్టులోనూ విండీస్ చిత్తు..సిరీస్ కైవసం కాగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విహారిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. తను ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు’ అని రోహిత్ శర్మను కాదని విహారిని జట్టులోకి తీసుకున్న తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నాడు. చదవండి : కెప్టెన్‌గా కోహ్లి సరికొత్త రికార్డు చదవండి : మా ముందున్న లక్ష్యం అదే : కోహ్లి -
రోహిత్ డ్యాన్స్ విత్ జమైకా ఫ్యాన్స్
-
రోహిత్ డ్యాన్స్ విత్ జమైకా ఫ్యాన్స్
కింగ్స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మకు తుది జట్టులో ఆడే అవకాశం రానప్పటికీ అభిమానులకు వినోదం పంచడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా రోహిత్ తన అభిమానులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి బీసీసీఐ తమ ట్విటర్లో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తరువాత రోహిత్‌శర్మ స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులను కలిసేందుకు వచ్చాడు. అక్కడ ఉన్న వారిలో నుంచి ఇద్దరిని బయటకు రమ్మని కోరాడు. ప్రేక్షకుల నుంచి ఇద్దరు యువకులు హిట్‌మ్యాన్ వద్దకు వచ్చి వన్డే,టీ20ల్లో రోహిత్ ఉపయోగించే జెర్సీని వేసుకొని పలు డ్యాన్స్ మూమెంట్లను షేర్ చేసుకున్నారు. అందులోనూ విండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో 'చాంపియన్' పాటకు నృత్యం చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, తాజాగా విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమిండియా 120 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఈ సిరీస్ విజయంతో టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించి విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్‌కోహ్లి.. ధోనిని అధిగమించడం విశేషం. భారత పేస్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్, షమీ తమ బౌలింగ్‌తో చెలరేగిపోవడం, విరాట్ కోహ్లి, రహానేలు సెంచరీలతో మెరవడం, ముఖ్యంగా ఆంధ్ర బ్యాట్సమెన్ హనుమ విహారి మిడిలార్డర్లో విశేషంగా ఆడి సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో టీమిండియా గెలుపులో భాగమయ్యాడు. This is awesome from @ImRo45 when he randomly pulled out two of his loyal fans from the crowd in Jamaica🕺🕺 #TeamIndia 😁👌👌 pic.twitter.com/PqRV1xtjgH — BCCI (@BCCI) September 2, 2019 -
టెస్టు సిరీస్ కోహ్లీసేన కైవసం
-
పాలోఆన్‌కు అవకాశమివ్వని టీమిండియా
కింగ్స్టన్(జమైకా) : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 87 పరుగులకు 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన విండీస్ కేవలం మరో 30 పరుగులు మాత్రమే చేసి 117 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. విండీస్ జట్టులో హెట్‌మైర్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా, షమీ 2,ఇషాంత్, జడేజాలు చెరో వికెట్ తీశారు. దీంతో భారత్‌కు 299 పరుగుల భారీ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. పాలోఆన్‌కు అవకాశమివ్వని టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌటైన విండీస్ జట్టుకు పాలోఆన్ ఆడే అవకాశమివ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఇప్పటికే 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వీలైనంత తొందరగా ఎక్కువ పరుగులు చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తోంది. లంచ్ సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసి 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్ 6 పరుగులు,పుజారా 5పరుగులతో క్రీజులో ఉన్నారు. -
హడావిడి లేకుండానే...
స్వస్థలం చేరిన ఉసేన్ బోల్ట్ కింగ్స్టన్: ఒక రజతమో, ఒక కాంస్యమో గెలిస్తేనే దేశమంతా ఊగిపోతూ చేసుకునే సంబరాలతో పోలిస్తే ఒలింపిక్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడికి ఎలాంటి స్థాయిలో ఘన స్వాగతం లభించాలో, ఏ రేంజ్లో వేడుకలు జరగాలో ఊహించుకోండి! కానీ సూపర్ స్టార్ ఉసేన్ బోల్ట్ మాత్రం ఇలాంటి హడావిడి ఏమీ లేకుండా బుధవారం తన సొంత నగరం కింగ్స్టన్కు చేరుకున్నాడు. రియోలో 3 స్వర్ణాలతో పాటు ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో 9 స్వర్ణాలు నెగ్గిన దిగ్గజానికి జమైకా ప్రభుత్వం తరఫున అధికారిక స్వాగతం అంటూ కూడా ఏమీ లేదు. ప్రశాంతంగా ఎయిర్‌పోర్ట్‌నుంచి బయటికి వచ్చిన అతను బయట నిలబడిన కొంత మంది అభిమానులను చిరునవ్వుతో పలకరించాడు. వారు చేసిన సరదా వ్యాఖ్యలకు స్పందించి బదులిచ్చిన అతను కొంత మందితో సెల్ఫీలు కూడా దిగాడు. ఒక కారులో తన లగేజీ పెట్టుకునే వరకు వేచి చూసిన బోల్ట్, మరో కారులో మేనేజర్‌తో కలిసి వెళ్లిపోయాడు. అతని వెంట ఎలాంటి బలగం, బృందం కూడా లేవు! -
సంతకం చేస్తేనే ప్రపంచకప్ కు....
కవిండీస్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక చెల్లింపులపై ముదిరిన సంక్షోభం కింగ్స్టన్: దాదాపు ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెల్లింపుల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా ఆరలేదు. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌కు ముందు కూడా మళ్లీ అదే కారణంతో ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్రమైంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ఆటగాళ్లు కూడా బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలను అంగీకరిస్తూ కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని సీఈఓ మైకేల్ ముర్హెడ్ ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. అందుకు ఆదివారం తుది గడువుగా నిర్దేశించారు. అయితే బోర్డు చెబుతున్న మొత్తం చాలా తక్కువని, ఇది దుర్మార్గమంటూ జట్టు కెప్టెన్ స్యామీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాయడంతో పరిస్థితి ముదిరింది. తమ వేతనాలను 80 శాతం తగ్గించారని... డబ్బులు పెంచకపోతే కుదరదని స్యామీ అంటున్నాడు. ప్రస్తుత నిబంధనల్లో ఒక్క మార్పూ చేయమని, అవసరమైతే ఈ ఆటగాళ్లను తప్పించి ద్వితీయ శ్రేణి జట్టును పంపించడానికైనా తాము సిద్ధమని ముర్హెడ్ గట్టిగా చెప్పడంతో వరల్డ్‌కప్‌కు గేల్, బ్రేవోలాంటి స్టార్లు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
‘కామన్వెల్త్’కు బోల్ట్
కింగ్స్టన్: భారత్‌లో 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు డుమ్మా కొట్టిన జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఈసారి మాత్రం గ్లాస్గోలో జరిగే క్రీడల్లో పాల్గొంటున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే ఈ క్రీడల కోసం జమైకా ప్రకటించిన అథ్లెట్ల జాబితాలో బోల్ట్ పేరు ఉంది. అలాగే మరో స్టార్ స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ కూడా ఈ గేమ్స్‌లో పాల్గొంటుంది. అయితే ఈ ఇద్దరూ క్రీడలకు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక బోల్ట్, షెల్లీ 100 మీటర్ల పరుగులో స్టార్స్ అయినప్పటికీ.. స్కాట్లాండ్లో 4x100 మీటర్ల రిలేలో పాల్గొనే అవకాశం ఉంది. -
న్యూజిలాండ్ ఘన విజయం
తొలి టెస్టులో 186 పరుగులతో విండీస్ చిత్తు కింగ్స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ చారిత్రక విజయం సాధించింది. బుధవారం నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో కివీస్ 186 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. వెస్టిండీస్ గడ్డపై కివీస్‌కు ఇది రెండో టెస్టు విజయం మాత్రమే కావడం విశేషం. 403 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే కుప్పకూలింది. మార్క్ క్రెయిగ్ (4/97), ఇష్ సోధి (3/42) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. షిల్లింగ్ ఫోర్డ్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టెస్టుల్లో రెండో వేగవంతమైన (25 బంతుల్లో) అర్ధ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 156 పరుగులకు డిక్లేర్ చేసింది. లాథమ్ (73) టాప్‌స్కోరర్. క్రెయిగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌తో 100 టెస్టులు ఆడిన క్రిస్ గేల్ టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
పట్టు బిగించిన కివీస్
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. నాలుగో రోజు లంచ్ సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. లాథమ్ (51 బ్యాటింగ్), నీషామ్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. జెరోమీ టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన కివీస్ ప్రస్తుతం ఓవరాల్‌గా 342 పరుగులు ముందంజలో ఉంది. అంతకు ముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే ఆలౌటైంది. చందర్ పాల్ (138 బంతుల్లో 84 నాటౌట్; 13 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. క్రిస్ గేల్ (64) హాఫ్ సెంచరీ చేశాడు. కివీస్ బౌలర్లలో సౌతీ (4/19) చెలరేగగా, క్రెయిగ్ కూడా 4 వికెట్లు తీశాడు. -
ఐర్లాండ్‌కు నిరాశ
కింగ్స్టన్: తొలిసారిగా ఓ టెస్టు ఆడే దేశంపై సిరీస్ గెలవాలనే ఐర్లాండ్ ఆశలు గల్లంతమయ్యాయి. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో ఐర్లాండ్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ను ఐర్లాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైంది. శుక్రవారం సబీనా పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫ్లెచర్ (15 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలెక్స్ కుసాక్కు నాలుగు వికెట్లు దక్కా యి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టును విండీస్ బౌలర్లు వణికించారు. స్యామీ మూడు వికెట్లు తీయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించాడు. కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇదే వేదికపై ఆదివారం ఇరు జట్లు ఏకైక వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. -
ఐర్లాండ్ సంచలనం
తొలి టి20లో వెస్టిండీస్‌పై గెలుపు కింగ్స్టన్: టి20ల్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు పసికూన ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. రెండు టి20ల సిరీస్‌లో భాగంగా సబీనా పార్క్‌లో బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును కంగుతినిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ (19 బంతుల్లో 18; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆ తర్వాత ఐర్లాండ్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసి గెలిచింది. ఓ దశలో 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా... ఎడ్ జాయస్ (49 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), పొయింటర్ (30 బంతుల్లో 32; 6 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చివర్లో కెవిన్ ఓబ్రియాన్ (12 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడి ఐదు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. జాయస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 2007 తర్వాత ఐర్లాండ్ జట్టు ఓ టెస్టు దేశంపై ఏ ఫార్మాట్లో అయినా మ్యాచ్ గెలవడం ఇప్పుడే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.