పట్టు బిగించిన కివీస్ | Taylor strikes stymie New Zealand progress | Sakshi
Sakshi News home page

పట్టు బిగించిన కివీస్

Published Thu, Jun 12 2014 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Taylor strikes stymie New Zealand progress

 కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. నాలుగో రోజు లంచ్ సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. లాథమ్ (51 బ్యాటింగ్), నీషామ్ (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
 
  జెరోమీ టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన కివీస్ ప్రస్తుతం ఓవరాల్‌గా 342 పరుగులు ముందంజలో ఉంది. అంతకు ముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే ఆలౌటైంది. చందర్ పాల్ (138 బంతుల్లో 84 నాటౌట్; 13 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. క్రిస్ గేల్ (64) హాఫ్ సెంచరీ చేశాడు. కివీస్ బౌలర్లలో సౌతీ (4/19) చెలరేగగా, క్రెయిగ్ కూడా 4 వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement