న్యూజిలాండ్ ఘన విజయం | new zealand won first test match against west indies | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ ఘన విజయం

Published Fri, Jun 13 2014 2:13 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

న్యూజిలాండ్ ఘన విజయం - Sakshi

న్యూజిలాండ్ ఘన విజయం

తొలి టెస్టులో 186 పరుగులతో విండీస్ చిత్తు
 కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ చారిత్రక విజయం సాధించింది. బుధవారం నాలుగో రోజే ముగిసిన ఈ మ్యాచ్‌లో కివీస్ 186 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. వెస్టిండీస్ గడ్డపై కివీస్‌కు ఇది రెండో టెస్టు విజయం మాత్రమే కావడం విశేషం. 403 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే కుప్పకూలింది.
 
 మార్క్ క్రెయిగ్ (4/97), ఇష్ సోధి (3/42) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. షిల్లింగ్ ఫోర్డ్ (29 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టెస్టుల్లో రెండో వేగవంతమైన (25 బంతుల్లో) అర్ధ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 156 పరుగులకు డిక్లేర్ చేసింది. లాథమ్ (73) టాప్‌స్కోరర్. క్రెయిగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌తో  100 టెస్టులు ఆడిన క్రిస్ గేల్ టెస్టుల్లో 7 వేల పరుగులు  పూర్తి చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement