కింగ్‌స్టన్(జమైకా) : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 87 పరుగులకు 7 వికెట్ల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన విండీస్ కేవలం మరో 30 పరుగులు మాత్రమే చేసి 117 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. విండీస్ జట్టులో హెట్‌మైర్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా, షమీ 2,ఇషాంత్, జడేజాలు చెరో వికెట్ తీశారు. దీంతో భారత్‌కు 299 పరుగుల భారీ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది.
పాలోఆన్‌కు అవకాశమివ్వని టీమిండియా..
మొదటి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌటైన విండీస్ జట్టుకు పాలోఆన్ ఆడే అవకాశమివ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఇప్పటికే 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వీలైనంత తొందరగా ఎక్కువ పరుగులు చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తోంది. లంచ్ సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసి 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్ 6 పరుగులు,పుజారా 5పరుగులతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment