ఐర్లాండ్ సంచలనం | Joyce leads Ireland to another famous win | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్ సంచలనం

Published Fri, Feb 21 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

ఐర్లాండ్ సంచలనం

ఐర్లాండ్ సంచలనం

తొలి టి20లో వెస్టిండీస్‌పై గెలుపు
  కింగ్‌స్టన్: టి20ల్లో ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌కు పసికూన ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. రెండు టి20ల సిరీస్‌లో భాగంగా సబీనా పార్క్‌లో బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును కంగుతినిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ (19 బంతుల్లో 18; 3 ఫోర్లు) టాప్ స్కోరర్.
 
   ఆ తర్వాత ఐర్లాండ్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసి గెలిచింది. ఓ దశలో 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా... ఎడ్ జాయస్ (49 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు), పొయింటర్ (30 బంతుల్లో 32; 6 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చివర్లో కెవిన్ ఓబ్రియాన్ (12 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడి ఐదు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. జాయస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 2007 తర్వాత ఐర్లాండ్ జట్టు ఓ టెస్టు దేశంపై ఏ ఫార్మాట్‌లో అయినా మ్యాచ్ గెలవడం ఇప్పుడే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement