కింగ్‌స్టన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు రోహిత్‌శర్మకు తుది జట్టులో ఆడే అవకాశం రానప్పటికీ అభిమానులకు వినోదం పంచడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా రోహిత్ తన అభిమానులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి బీసీసీఐ తమ ట్విటర్‌లో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తరువాత రోహిత్‌శర్మ స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులను కలిసేందుకు వచ్చాడు. అక్కడ ఉన్న వారిలో నుంచి ఇద్దరిని బయటకు రమ్మని కోరాడు. ప్రేక్షకుల నుంచి ఇద్దరు యువకులు హిట్‌మ్యాన్ వద్దకు వచ్చి వన్డే,టీ20ల్లో రోహిత్ ఉపయోగించే జెర్సీని వేసుకొని పలు డ్యాన్స్ మూమెంట్‌లను షేర్ చేసుకున్నారు. అందులోనూ విండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో 'చాంపియన్' పాటకు నృత్యం చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఇది కాస్తా వైరల్‌గా మారింది.
కాగా, తాజాగా విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీమిండియా 120 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఈ సిరీస్ విజయంతో టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించి విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్‌కోహ్లి.. ధోనిని అధిగమించడం విశేషం. భారత పేస్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్, షమీ తమ బౌలింగ్‌తో చెలరేగిపోవడం, విరాట్ కోహ్లి, రహానేలు సెంచరీలతో మెరవడం, ముఖ్యంగా ఆంధ్ర బ్యాట్సమెన్ హనుమ విహారి మిడిలార్డర్‌లో విశేషంగా ఆడి సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో టీమిండియా గెలుపులో భాగమయ్యాడు.
This is awesome from @ImRo45 when he randomly pulled out two of his loyal fans from the crowd in Jamaica🕺🕺 #TeamIndia 😁👌👌 pic.twitter.com/PqRV1xtjgH
— BCCI (@BCCI) September 2, 2019
Comments
Please login to add a commentAdd a comment