షాహిన్ అఫ్రిది, పాకిస్తాన్ బౌలర్
కింగ్‌స్టన్: పేసర్ షాహిన్ అఫ్రిది (6/51) చెలరేగడంతో పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అబ్బాస్‌కు 3 వికెట్లు దక్కాయి. దాంతో పాక్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకు ముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫవాద్ ఆలమ్ (124 నాటౌట్) శతకం సాధించాడు.
చదవండి: పుజారా క్లాస్ ప్లేయర్ అయితే సూర్యకుమార్ మ్యాచ్ విన్నర్
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని పాక్ ఓవరాల్‌గా 358 పరుగుల భారీ టార్గెట్‌ను విండీస్ ముందు ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 17, అల్జారీ జోసెఫ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో రోజున విండీస్ గెలవాలంటే ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉండగా.. పాక్ విజయానికి 9 వికెట్లు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment