ఐర్లాండ్‌కు నిరాశ | Second T20: Ireland finish short as West Indies escape with 1-1 draw | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌కు నిరాశ

Published Sun, Feb 23 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

ఐర్లాండ్‌కు నిరాశ

ఐర్లాండ్‌కు నిరాశ

 కింగ్‌స్టన్: తొలిసారిగా ఓ టెస్టు ఆడే దేశంపై సిరీస్ గెలవాలనే ఐర్లాండ్ ఆశలు గల్లంతమయ్యాయి. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో ఐర్లాండ్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ను ఐర్లాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైంది. శుక్రవారం సబీనా పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫ్లెచర్ (15 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
 
 అలెక్స్ కుసాక్‌కు నాలుగు వికెట్లు దక్కా యి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టును విండీస్ బౌలర్లు వణికించారు. స్యామీ మూడు వికెట్లు తీయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 85 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (39 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించాడు. కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇదే వేదికపై ఆదివారం ఇరు జట్లు ఏకైక వన్డే మ్యాచ్ ఆడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement