G. V. Prakash Kumar
-
'సంక్రాంతికి వస్తున్నాం' బాటలో జీవీ ప్రకాశ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం 'కింగ్స్టన్'. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలో ఓకేసారి రెండు ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.కాగా.. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.(ఇది చదవండి: 'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్)అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025 -
విడాకుల తర్వాత మాజీ భర్త గురించి సైంధవి పోస్ట్.. అభినందిస్తున్న ఫ్యాన్స్
విడాకుల తర్వాత కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్, గాయని సైంధవి మరోసారి ఒక వేదికపై కలవనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు కలిసి జీవించిన వారు తమ వైవాహిక బందానికి వీడ్కోలు పలికారు. బాల్యం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు. అలా 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగు అన్వి అనే కూతురు కూడా ఉంది.సింగర్ సైంధవి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన మాజీ భర్తకు సంబంధించిన సంగీత కచేరీ గురించి ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. గతంలో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన వీరిద్దరూ మరోసారి ఒక మ్యూజిక్ ప్రోగ్రాం కోసం కలిసి పనిచేయబోతున్నారు. డిసెంబర్ 7న మలేషియాలో జరిగే సంగీత కచేరి కార్యక్రమంలో వారిద్దరూ కలిసి కనిపించనున్నారు. దీంతో అభిమానులు సంతోషించడమే కాకుండా సైంధవిని అభినందిస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి వృత్తిరిత్యా జివి ప్రకాష్‌తో కలిసి పనిచేయడం అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా స్నేహం అనే చర్య తమ పరిపక్వతను తెలియజేస్తోందని సోషల్ మీడియాలో పలువురు కొనియాడారు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన ‘అమరన్’ సినిమాలోని ‘గానవే’ పాటను సైంధవి పాడడం గమనార్హం.విడాకుల సమయంలో కూడా జివి ప్రకాష్ గురించి సైంధవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జి.వి.ప్రకాష్ తనకు స్కూల్ నుంచే మంచి స్నేహితుడని ఆమె తెలిపింది. అలా 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసింది. విడాకుల తర్వాత అదే స్నేహంతో ప్రయాణం చేస్తామని ఆమె తెలిపింది. దానిని సైంధవి పాటిస్తున్నట్లు నెటిజన్లు తెలుపుతున్నారు. ప్రభాస్ చిత్రం 'డార్లింగ్' సినిమాలో 'ఇంకా ఏదో' అనే పాటతో జివి ప్రకాష్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. View this post on Instagram A post shared by DMY Creation (@dmycreation) -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్ షాక్
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. -
నిర్మాతగా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు
సంగీత దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న జీవీ.ప్రకాశ్‌కుమార్ కథ నచ్చితే చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. అలా తాజాగా ఈయన కథానాయకుడిగా, సంగీతదర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకలో నటుడు కమలహసన్ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇది జీవీ.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీనికి కింగ్స్టన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. (ఇదీ చదవండి: నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడ్చేసిన మహాలక్ష్మి భర్త) ఈ చిత్రాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ పరలస్ యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ, జి.స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి కమల్ ప్రకాశ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దివ్యభారతి నాయకిగా నటిస్తున్న ఇందులో మేర్కు తొడర్చి మలై ఆంటోని, కల్లూరి వినోద్, సేతన్, కుమరవేల్, మలయాళ నటుడు సబుమోన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సముద్రం నేపథ్యంలో సాగే సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తన లాంటి వర్ధమాన దర్శకుడిని నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు, జి.స్టూడియోస్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ పేర్కొంటూ దర్శకుడు చెప్పిన కథ వినగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తుందని భావించి వెంటనే చిత్రాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఒక చిత్రానికి మంచి శ్రీకారం అవసరం అన్నారు. అలా తన చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి, శుభాకాంక్షలు అందించిన నటుడు కమలహాసన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. A dream voice from tamil cinema … it’s a team full of youngsters with only passion and love for cinema … here is my production’s first film #Kingston #GV25 Thanks a lot @ikamalhaasan sir …#kingston @storyteller_kp @divyabarti2801 @gokulbenoy @dhilipaction @Sanlokesh… pic.twitter.com/XEha8DRzEa — G.V.Prakash Kumar (@gvprakash) October 10, 2023 -
‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అంటున్న జీవీ
సాక్షి, చెన్నై: జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడిగా.. నటుడిగా బిజీగా ఉంటూనే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. తాజాగా మైక్‌సెట్ శ్రీరామ్ నటించిన ‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. అరుళ్‌రాజ్ సంగీతాన్ని అందించారు. మైక్‌సెట్ శ్రీరామ్ పాటను రాసి జననీ దుర్గతో కలిసి ఈ వీడియో ఆల్బంలో నటించారు. అజార్ నృత్య దర్శకత్వం వహించిన దీనిని విల్వా దర్శకత్వంలో మైక్‌సెట్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌రాజ్ రూపొందించారు. శుక్రవారం చెన్నైలోని పీవీఆర్ థియేటర్లో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పీవీఆర్ సౌత్ హెడ్ సాబ్రియా, నటుడు ఆర్జే విఘ్నేష్ కాంత్, కదీర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
మావయ్య బాణీలు కట్టాలి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను గెలిచి మన దేశానికే కీర్తిని ఆపాదించారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మరో సంగీత దర్శక తెరంగం జీవీ.ప్రకాశ్‌కుమార్. ఈయన ఏఆర్.రెహ్మాన్‌కు స్వయానా మేనల్లుడన్న విషయం తెలిసిందే. తమిళ చిత్రాల నుంచి హాలీవుడ్ వరకూ పలు భాషా చిత్రాలకు పని చేసిన ఘనత ఏఆర్.రెహ్మాన్‌ది. 25 ఏళ్ల వయసుకే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక సంగీత దర్శకుడు బహుశ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే జీవీ.ప్రకాశ్‌కుమార్ ఒక్కరే అనుకుంటా. అంతే కాదు ఇప్పుడీయన కథానాయకుడిగా యమ బిజీ.హీరోగా సక్సెస్ సాధించిన సంగీత దర్శకులు అరుదే. జీవీ నటించిన డార్లింగ్, త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రాలు రెండూ విజయం సాధించాయి. జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా అంగీకరించిన చిత్రాలు చాలా ఉన్నా ప్రస్తుతం ఏక కాలంలో మూడు చిత్రాల్లో నటిస్తుండడం గమనార్హం. ఆ చిత్రాల వివరాలను జీవీ తెలుపుతూ ప్రసాద్ పాండియరాజ్ దర్శకత్వంలో బ్రూస్లీ, శ్యామ్ ఆండన్ దర్శకత్వంలో ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు, ఎం.రాజేశ్ దర్శకత్వంలో కడవుళ్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపారు. వీటితో పాటు శంకర్ గుణ దర్శకత్వంలో కెట్టపయ్యన్ ఇంద కార్తీ చిత్రం చేయనున్నానని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకుడు వెట్రిమారన్ కథను అందించగా మరో దర్శకుడు అట్లీ సంభాషణలు రాస్తున్నారని తెలిపారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు తానే సంగీతాన్ని అందిస్తున్నానన్నారు. తాను హీరోగా నటించిన ఒక చిత్రానికైనా తన మావయ్య సంగీత బాణీలు కట్టాలని ఆశిస్తున్నానని జీవీ అన్నారు. ఆయన కోరిక నెరవేరాలని ఆశిద్దాం. -
త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ
త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ సోషల్ నెట్‌వర్క్సులో హల్చల్ చేస్తోంది. యువ సంగీత దర్శకుడు, నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం త్రిష ఇల్లన్నా నయనతార. కయల్ ఫేమ్ నందిని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ట్రీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తాను మొట్టమొదట కథ వినిపించింది కలైపులి ఎస్.థానుకేనని తెలిపారు. అలాంటిది తనతొలి చిత్ర ట్రీజర్ను కూడా ఆయనే ఆవిష్కరించడం అంతులేని ఆనందాన్ని ఇస్తుందన్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ ఇప్పటికే సోషల్ నెట్ వర్క్సులో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోందని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అన్నారు.