నిర్మాతగా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు | GV Prakash Kumar Turned As Film Producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు

Published Thu, Oct 12 2023 2:23 PM | Last Updated on Thu, Oct 12 2023 8:49 PM

GV Prakash Kumar Turned As Film Producer - Sakshi

సంగీత దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న జీవీ.ప్రకాశ్‌కుమార్‌ కథ నచ్చితే చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. అలా తాజాగా ఈయన కథానాయకుడిగా, సంగీతదర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలను నిర్వహిస్తున్న చిత్రం మంగళవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకలో నటుడు కమలహసన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇది జీవీ.ప్రకాశ్‌కుమార్‌ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. దీనికి కింగ్‌స్టన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు.

(ఇదీ చదవండి: నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడ్చేసిన మహాలక్ష్మి భర్త)

ఈ చిత్రాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్‌ పరలస్‌ యూనివర్శల్‌ పిక్చర్స్‌ సంస్థ, జి.స్టూడియోస్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి కమల్‌ ప్రకాశ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దివ్యభారతి నాయకిగా నటిస్తున్న ఇందులో మేర్కు తొడర్చి మలై ఆంటోని, కల్లూరి వినోద్‌, సేతన్‌, కుమరవేల్‌, మలయాళ నటుడు సబుమోన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సముద్రం నేపథ్యంలో సాగే సాహసోపేతమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు.

తన లాంటి వర్ధమాన దర్శకుడిని నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు, జి.స్టూడియోస్‌ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ పేర్కొంటూ దర్శకుడు చెప్పిన కథ వినగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అలరిస్తుందని భావించి వెంటనే చిత్రాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఒక చిత్రానికి మంచి శ్రీకారం అవసరం అన్నారు. అలా తన చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి, శుభాకాంక్షలు అందించిన నటుడు కమలహాసన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement