
‘ప్రతి గింజపై తినే వారి పేరు రాసి ఉంటుంది’ అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని.... ‘ప్రతి పాటపై పాడే వారి పేరు రాసి ఉంటుంది’ అంటాడు ఏసుదాస్. సినిమాల్లోని పాత్రలకు సంబంధించి కూడా ఇది వర్తిస్తుందేమో! ఊహించిన పాత్రలో నటించి, ఆ నటనకు ఫస్ట్ క్లాసు మార్కులు తెచ్చుకుంటే ఆ సంతోషమే వేరు. ఇటీవల విడుదలైన హిస్టారికల్ డ్రామా మూవీ ‘ఛావా’లో మహారాణి యశూబాయి పాత్రలో నటించింది రష్మిక(Rashmika Mandanna). మరాఠా సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీకౌశల్, అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు.
మిగిలిన పాత్రల సంగతి ఎలా ఉన్నా సౌత్ ఇండియన్ అమ్మాయి యశూబాయి భోంస్లే పాత్రలో నటించడం ఆశ్చర్యంగా, విశేషంగా మారింది. రష్మికకు ఈ పాత్ర సవాలుగా మారింది. గతంలో ఎంతో మంది ప్రతిభావంతులు నాటకం, సినిమా, టీవీల్లో ఈ పాత్రను రక్తి కట్టించడం వల్ల సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.
ఆ అంచనాలకు తగ్గకుండా నటించి శభాష్ అనిపించుకుంది రష్మిక. ‘ఛావా’ సెట్స్‌కు సంబంధించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అన్–సీన్ ఫొటోలు, వీడియోలు నెట్‌లోకంలో చక్కర్లు కొడుతున్నాయి. ‘మహారాణి యశూబాయి పాత్రని పోషిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. దక్షిణ భారతానికి చెందిన అమ్మాయిగా అది సాధ్యం అవుతుంది అని అనుకోలేదు’ అని తన మనసులో మాట రాసింది రష్మిక.
Comments
Please login to add a commentAdd a comment