
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)'. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోదరి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ ఇండియాలో ఆమె నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈమేరకు ఆమె తాజాగా ఒక వీడియోతో ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు. సుభద్ర బెన్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. 2019లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా పార్ట్2ను మేకర్స్ నిర్మించారు.

ఆమీర్ ఖాన్ సోదరి నిఖాత్ ఖాన్ హెగ్డే(Nikhat Khan Hegde) లూసిఫర్2లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అమీర్ ఖాన్ కుటుంబంలో చాలామంది సినీ పరిశ్రమతో టచ్‌లో ఉన్నారు. కానీ, నిఖాత్ ఖాన్ మిషన్ మంగళ్ (2019) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. యాక్సిస్ బ్యాంక్,రిలయన్స్ జ్యువెల్స్,హల్దిరామ్స్,విప్రో,ఫస్ట్ క్రై వంటి యాడ్స్ ఆమెకు గుర్తింపు తెచ్చాయి. అయతే, తన సోదరడు అమీర్ ఖాన్ నటించిన లగాన్ (2001) సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment