మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్' (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్‌లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్‌గా 'ఎల్2: ఎంపురాన్'ను( L2E Empuraan) తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. తెలుగు వర్షన్‌లో మీరు చూడాలంటే.. వీడియో దిగువన రైట్‌సైడ్ ఉండే సెట్టింగ్స్ వద్ద క్లిక్ చేసి ఆడియో ఆప్షన్‌లో తెలుగు భాషను ఎంచుకోవచ్చు.
లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' (రాజు కన్నా గొప్పవాడు) చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment