మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది.
తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment