Ameer khan
-
లపతా లేడీస్ అరుదైన ఘనత.. ఏకంగా హాలీవుడ్ చిత్రాలతో పోటీ!
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లపతా లేడీస్. గతేడాది రిలీజైన ఈ సినిమా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు లపతా లేడీస్ ఎంపికైంది. ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన చిత్రాల్లో భారత్ నుంచి ఈ మూవీ నిలిచింది. ఈ హిట్ సినిమా ఏకంగా హాలీవుడ్ భారీ చిత్రాలైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్, జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్, సివిల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో పోటీపడుతోంది. బెస్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ విభాగంలో లపతా లేడీస్‌ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మార్చి 14న జరిగే అవార్డుల వేడుకలో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా విజేతలను ప్రకటిస్తారు. కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన లపాతా లేడీస్ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు.ఓపెన్ హైమర్‌తో ఢీ..కాగా.. గతేడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. 2023 జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు పైమాటే. -
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. -
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ఓటీటీలో వివాదాస్పద సినిమా..తెలుగులోనూ స్ట్రీమింగ్
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. హిందూ మతాన్ని దూషించేలా సినిమా ఉందని గుజరాత్ కోర్టులో పిటీషన్ వేయడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. వాస్తవంగా ఈ సినిమా జూన్ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల కాలేదు. అయితే, తాజాగా మహారాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.మహారాజ్ సినిమా ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జూన్ 21 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మతాన్ని కించపరిచేలా ఈ చిత్రం లేదని న్యాయస్థానం వెళ్లడించింది. దీంతో ఈ మూవీని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి ఊరట లభించినట్లు అయింది. అయితే, ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా మహారాజ్ స్ట్రీమింగ్ అవుతుంది.మహారాజ్ చిత్రంలో జునైద్ ఖాన్‌తో పాటు షాలినీ పాండే, జైదీప్ అహల్వాత్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహించారు. 1860 బ్రిటీష్ పాలన బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. జర్నలిస్ట్, సామాజిక సంస్కర్త కర్సన్దాస్ ముల్జీ జీవితం గురించి ఈ చిత్రం ఉంది. 1862 సమయంలో హిందూ మతానికి చెందిన ఓ బాబా అన్యాయాలను ముల్జీ బహిర్గతం చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం కథ సాగింది. -
అమీర్ ఖాన్ కుమారుడి సినిమా 'మహారాజ్'కు బ్రేకులు
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. జూన్ 14న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర నిర్మాణ సంస్థకు గుజరాత్ హైకోర్ట్ షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ తాజాగా మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంగీత కె విషెన్ ఉత్తర్వులు జారీ చేశారు.'మహారాజ్' అనేది 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసుపై ఆధారపడి ఉందని పిటిషనర్లు ఆరోపించారు. బొంబాయి సుప్రీంకోర్టులోని ఆంగ్ల న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన ఈ కేసులో హిందూ మతంతో పాటు శ్రీకృష్ణుడిపై దూషించే వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రజలను ప్రభావితం చేయడమే కాకుండా హిందూ మతానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించగలవని వారు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. 'మహారాజ్' చిత్రానికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జైదీప్ అహ్లావత్ కూడా నటించారు. -
స్టార్ హీరో కుమారుడి సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్విటర్ వార్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన తొలి సినిమా 'మహరాజ్'. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. సుమారుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించింది. అయితే, ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో భక్తి పేరుతో జరిగిన అన్యాయాలను ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రలో జునైద్ ఖాన్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని గంటల్లో మహరాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ దేశవ్యాప్తంగా ట్విటర్ వారు జరుగుతుంది. ఈ చిత్రంలో హిందూవుల మనోభావాలను చులకన చేస్తూ పోస్టర్స్ ఉన్నాయిని నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూ మత పెద్దలతో పాటు సన్యాసులను నెగెటివ్ కోణంలో చూపించనున్నారని సమాచారం. గతంలో అమీర్ ఖాన్ పీకే సినిమాలో కూడా శివుడిపై జోకులు వేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు జునైద్ కూడా హిందూ మతాన్ని కించపరిచేలా సినిమా తీశాడని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ నెట్టింట చాలామంది డిమాండ్ చేస్తున్నారు. #BoycottNetflix అనే ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. వారసులమని చెప్పుకుని తిరిగే వారి సినిమాలు చూడొద్దంటూ సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు. -
అమీర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ సినిమా.. నేరుగా ఓటీటీలోనే విడుదల
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన తొలి సినిమా 'మహరాజ్'. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. సుమారుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించింది.ఆమిర్‌ఖాన్ వారసుడిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జునైద్ హీరోగా తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు. భారీ ఆశలతో ఆయన నటించిన మహరాజ్ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. తాజాగా విడుదలైన పోస్టర్లో పండితుడి పాత్రలో కనిపించాడు.1862లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జర్నలిస్ట్ పాత్రలో జునైద్ కనిపించనున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండనుంది. జునైద్ సినిమాల్లోకి రావడానికి ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా నటనలో శిక్షణ తీసుకున్నారు . ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు ఆయన జన్మించాడు. అతనికి ఇరా అనే సోదరి కూడా ఉంది. ఆమీర్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. -
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్‌లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్‌లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్‌లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్‌గా అమెజాన్‌లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్‌పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్‌గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్‌లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు అప్లై చేసింది. రెజ్యూమ్‌లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది. -
సుహానీ భట్నాగర్ మృతిపై ఆమె తల్లి ఏం చెప్పారంటే..?
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ దంగల్ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ (19) మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో బబితా కుమారీగా ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె చిన్న వయసులోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు చింతించారు. సుహానీ మృతి పట్ల తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. 'సుహానీ ఈ వ్యాధితో చాల రోజులుగా ఇబ్బంది పడుతుంది. కానీ మేము ఎవరికీ చెప్పలేదు. సుహానీకి అమీర్ ఖాన్ చాలా సపోర్ట్‌గా ఉంటారు.. కానీ ఆయనకు కూడా తెలపలేదు. వాస్తవానికి మేము చర్మవ్యాధి అనుకున్నాం. అందువల్లనే చాలామంది డెర్మటాలజిస్ట్‌లను కలిశాం. ఎక్కడా ఆమెకు నయం కాలేదు. దీంతో చివరకు ఎయిమ్స్‌లో చేర్పించాము.. అక్కడే ఈ వ్యాధి (డెర్మటోమయోసైటీస్) గురించి మొదటిసారి చెప్పారు. ఈ వ్యాధికి వైద్యం లేదని తెలిసింది. ఆమె శరీరం ఎక్కువగా ఇన్ఫెక్షన్కు గురికావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో సుహానీ ప్రాణాలు విడిచింది.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సుహానీ తుదిశ్వాస విడిచిందన్న వార్త తమ మనసుల్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఆమె లేని 'దంగల్' అసంపూర్ణం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ వారు తెలిపారు. -
దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమెకి కాలు విరగడంతో వాడిన మందులు సైడ్ ఇఫెక్ట్ ఇవ్వడంతో చనిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ కుటుంబల సభ్యులు అందువల్ల కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మరణానికి అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధే కారణమన్నారు. ఆ వ్యాధితోనే పోరాడుతూ చనిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇంతకీ ఏంటా వ్యాధి. ఆ వ్యాధి వస్తే ఇక అంతేనా? అమీర్ ఖాన్ రెజ్లింగ్ మూవీ దంగల్‌లో యువ బబితా ఫోగట్‌గా నటించి మెప్పించిన సుహనీ భట్నాగర్ శనివారం ఢిల్లీలో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలిచివేసింది. అయితే ఆమె కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి అయిన డెర్మాటోమయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగానే ఆమెను ఫిబ్రవరి 7న ఎయిమ్స్‌కి తరలించినట్లు తెలిపారు. చివరికి ఆ వ్యాధి విషమించడంతో ఫిబ్రవరి 16న తుది శ్వాస విడించిందని అన్నారు. నిజానికి పదిరోజుల క్రితమే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ కాగా, రెండు నెలల క్రిత అందుకు సంబధించిన లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం సుహాని రెండు చేతులపై ఎర్రటి మచ్చలు వచ్చినట్లు తెలిపారు. అయితే తాము వివిధ ఆస్పత్రులు సంప్రదించాం. కానీ అది ఏం వ్యాధి అనేది నిర్ధారణ కాలేదని సుహాని తల్లి పూజ భట్నాగర్ కన్నీటిపర్యంతమయ్యారు. రోజురోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చేర్పించినట్లు చెప్పుకొచ్చారు పూజ. అలాగే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని, పైగా ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరడంతో అవి కూడా దెబ్బతిన్నాయని సహాని తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పారు. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిచారు కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆవేదనగా చెప్పుకొచ్చారు సుమిత్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నవారు ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు సహాని తండ్రి. డెర్మాటోమియోసిటిస్ అంటే.. డెర్మాటోమియోసిటిస్ అనేది బంధన కణజాలం, కండరాలు, చర్మం అంతర్గత అవయవాల వాపుతో కూడిన పాథాలజీ. సకాలంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి రోజు రోజుకి తీవ్రతరమవుతుంది. ఈ డెర్మాటోమియోసిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ పాథాలజీ. అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఆటంకాలు కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయిత, పాథాలజీ అభివృద్ధి విధానం.. శరీరం దాని స్వంత కణాలను విదేశీగా గ్రహించడం ప్రారంభిస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత కండరాలు బంధన కణజాలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత నెమ్మమదిగా వారిలో వాపుకు గురయ్యే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థే రోగి అంతర్గత అవయవాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. లక్షణాలు: అలసట, జ్వరం బరువు తగ్గడం కండరాల నొప్పి భుజం కటి ప్రాంతంలో బలహీనత బహుశా కనురెప్పలు లేదా మెల్లకన్ను పడిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మింగడంలో ఇబ్బంది చర్మం పొలుసులుగా ఎరుపు రంగులోకి మారడం, వాయడం వంటివి. కంటి ప్రాంతంలో వాపు, ఎరుపు. చికిత్స: మందులు (కార్టిసోన్ వంటివి) కండరాల శిక్షణ. ఫిజియోథెరపీ వంటి వాటితో అదుపులో ఉంచగలరు. పూర్తి స్థాయిలో క్యూర్ అవ్వడం అంటూ ఉండదు. (చదవండి: అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్ ప్లేగు వ్యాధి కలకలం) -
హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వరుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare) జాగింగ్ చేసుకుంటూ పెళ్లి మండపానికి రావడం, అలాగే వధువు ఇరాఖన్ చాలా సాదాసీదా కనిపించడం తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావు సందడిగా కనిపించడం విశేషంగా నిలిచింది. తాజా మరో విషయం నెటిజనులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతీ ఇంటికి ఆడబిడ్డ అంటే మురిపెం. అడిగింది కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కానీ పెళ్లీడు వచ్చి ఒక అయ్యలో చేతిలో పెట్టి అత్తారింటికి పంపే క్రమంలో మాత్రం తన ప్రాణమే పోతున్నంత బాధపడతారు. ముఖ్యంగా తండ్రులు బరువెక్కిన గుండెలతో భావోద్వేగానికి గురవుతుంటారు. ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అని ఓ సినీ కవి అన్నట్టు తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఇరా-నూపుర్ జంట బుధవారం ఉదయపూర్‌లో ఉంగరాలు మార్చుకుని మరో వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ సమయంలో పెళ్లికూతురు తండ్రి అమీర్ ఖాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. View this post on Instagram A post shared by B O L L Y W O O D (@filmyselfies.official) -
తన ఫిట్నెస్ ట్రైనర్‌తో స్టార్ హీరో కూతురి పెళ్లి..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అమీర్ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్‌ను ఆమె ప్రేమించింది. వారిద్దరూ కూడా ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం ఆపై పెద్దల అంగీకారంతో ఏడాది క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 3, 2024, అంటే రేపు ఐరా ఖాన్- నుపుర్ శిఖరే వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు మరో రోజు మాత్రమే ఉండటంతో, వధూవరుల తల్లిదండ్రుల నివాసంలో వివాహ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అమీర్ ఇంటికి సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ నివాసంలోని రెండు అంతస్తులు విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మరోవైపు అమీర్ మొదటి భార్య రీనా దత్తా ఇల్లు కూడా పూలతో కళకళలాడుతోంది. వివాహానికి సంబంధించి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. నవంబర్ 2022లో ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ఐరా ఖాన్ నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం అనంతరం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహానికి ముందు ఆచారాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కెల్వన్, ఉఖానా చేయడం ద్వారా వివాహానికి ముందు వేడుకలు ప్రారంభమవుతాయి. బాంద్రాలోని రాయల్ తాజ్ ల్యాండ్స్ అండ్ హోటల్లో గ్రాండ్‌గా వెడ్డింగ్ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనవరి 6, 10 తేదీల మధ్య, 2 రిసెప్షన్ పార్టీలు నిర్వహించబడతాయని సమాచారం. ఢిల్లీ, జైపూర్లలో రిసెప్షన్ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొననున్నారు. అమీర్ తన కుమార్తె పెళ్లి కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే తన బాలీవుడ్ స్నేహితులను వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. మానసిక కుంగుబాటుకు గురైన 'ఐరా' ఆమిర్‌ఖాన్ - ఆయన మొదటి భార్య రీనా దత్‌లకు ఐరా జన్మించారు. పరస్పర అంగీకారంతో తల్లీదండ్రులిద్దరూ విడిపోయిన తర్వాత ఐరా మానసిక కుంగుబాటుకు గురయ్యారు. కరోనా సమయంలో ఆమిర్ ఫిట్నెస్ ట్రైనర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది ప్రేమగా మారింది. ఇప్పుడు వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం విశేషం. కూతురు పెళ్లిపై గతంలో అమీర్ ఎమోషనల్ కామెంట్ కూతరు పెళ్లి గురించి తన అభిమానులతో అమీర్ పంచుకున్నాడు. జనవరి 3న ఐరా - నుపుర్‌ల పెళ్లి చేయాలని తాము నిశ్చయించామని ఆయన గతంలోనే చెప్పాడు. నుపుర్ మంచి అబ్బాయని, ఐరా గతంలో మానసిక కుంగుబాటుతో పోరాడుతున్న సమయంలో తనకి అతడే అండగా నిలిచాడని ఆయన చెప్పాడు. పెళ్లి బంధంతో వాళ్లు సంతోషంగా ఉన్నందుకు తానెంతో ఆనందిస్తున్నానని ఆయన ప్రకటించారు. వారిద్దరిలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. వాళ్ల పెళ్లి నాడు తానెంతో భావోద్వేగానికి గురవుతానని ముందే చెప్పాడు అమీర్.\ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్ క్లియర్
సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది. (ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ) బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులో హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. బాలీవుడ్లో పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ పనిచేశాడు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా తెరపై కనిపించనున్నాడు. తన తండ్రి పేరు చెప్పకుండా మొదటి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సుమారు 20 సార్లు తిరస్కరణకు గురి అయిన తర్వాత సినిమా అవకాశం దక్కించుకున్నాడు. నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలిసిందే. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్‌గా స్మైల్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ. వెండితెరపై తన పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా స్క్రీన్‌పై తక్కువుగా కనిపిస్తున్న ఆమె. చివరగా 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఆమె ఈ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
2022 Year End: బాయ్‌కాట్ బాలీవుడ్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్..!
ప్రతిరంగంలో వివాదాలు, గొడవలు సర్వ సాధారణం. కానీ సినీ పరిశ్రమలో అవి మరింత ఎక్కువ. బాలీవుడ్లో అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఏకంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అనే నినాదం ఊపందుకునేలా వివాదాలు తలెత్తాయి. 2022లో వివాదాలకు దారితీసిన ఆ చిత్రాలు, సంఘటనలేవో ఓ లుక్కేద్దాం. ఓ మ్యాగజైన్ కవర్‌పై రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో, సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ ఫోటో 2022లో అతిపెద్ద వివాదాలుగా నిలిచాయి. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు రావడం హాట్ టాపిక్‌గా మారింది. అలాదే అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ హిందీ భాషపై వివాదం ఇలా చాలానే ఉన్నాయి. రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోకు పోజులివ్వడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై పోలీసు ఫిర్యాదులు కూడా చేశారు. కొంతమంది బాలీవుడ్ నటులు విద్యాబాలన్, మసాబా గుప్తా, నకుల్ మెహతా, చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ దీన్ని ప్రశంసించగా.. ముంబైకి చెందిన ఎన్జిఓ 'మహిళల మనోభావాలను దెబ్బతీయడం'పై అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. సుస్మితా సేన్‌తో లలిత్ మోదీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ జూలైలో అనుకోని రీతిలో సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు. అతను సుస్మితా సేన్‌తో కలిసి మాల్దీవుల్లో ఉన్నరొమాంటిక్ ఫోటోలతో వార్తల్లో నిలిచారు. 2018లో ఆయన భార్య మరణించిన తర్వాత కొత్త జీవితంలో 'బెటర్ హాఫ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . "పెళ్లి చేసుకోలేదు - కేవలం ఒకరితో ఒకరు డేటింగ్. అది కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది.” అంటూ లలిత్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను సుస్మితతో ఉన్న ఫోటోను పెట్టాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన వ్యక్తులలో ఇద్దరూ కూడా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రావడం సంచలనంగా మారింది. దీంతో జాక్వెలిన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆమె క్రమం తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరవుతూనే ఉంది. ఈడీ ఆరోపణల ప్రకారం ఆమెతో పాటు మరో నటి నోరా ఫతేహి.. సుఖేశ్ నుంచి కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న నోరా దిల్లీ కోర్టులో జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా వేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. బిగ్ బాస్ 16లో సాజిద్ ఖాన్ ఎంట్రీ దుమారం: లైంగిక వేధింపుల జాబితాలో దర్శకుడు సాజిద్ పేరు ముందుటుంది. మీటూ ఉద్యమంలో ఆయనపై పలువురు నటీమణులు ఆరోపణలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ షో పోటీదారులలో ఒకడిగా ఉండడాన్ని పలువురు తప్పుబట్టారు. అతనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయాలను ఛానెల్ పట్టించుకోలేదు. అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య గొడవ: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఏప్రిల్‌లో జరిగిన ఒక ఈవెంట్లో "హిందీ జాతీయ భాష కాదు. అందుకే వారు పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నారు" అంటూ చేసిన వాఖ్యలు వివాదానికి దారితీశాయి. కిచ్చా సుదీప్ ప్రకటనపై హీరో అజయ్ దేవగణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారు?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే సుదీప్ దీనిపై స్పందిస్తూ కన్నడలో టైప్ చేసి ఉంటే అతని స్పందన అర్థం అయ్యేదా అని అజయ్‌ని అడిగాడు. “మేము కూడా భారతదేశానికి చెందినవారమే కదా సార్” అని సుదీప్ ట్వీట్ చేశాడు. లాల్ సింగ్ చద్దా వివాదం: అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చద్దా ఈ ఏడాది చాలా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. అయితే చాలామంది సినిమాకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీ విడుదల సమయంలో ట్విట్టర్లో బాయ్‌కాట్ లాల్‌సింగ్ చద్దా అంటూ అప్పట్లో ట్రెండ్ అయింది. పఠాన్ మూవీ బేషరమ్ రాంగ్: ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా నటించిన చిత్రం పఠాన్. ఈ సినిమాలోని బేషరమ్ రంగ్ అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. దీపికా పదుకొనే నటించిన ఈ చిత్రంలో బేషరమ్ రంగ్ పాటకు ధరించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు దీపిక ధరించిన కుంకుమ రంగు బికినీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. షారూక్‌ను సజీవ దహనం చేస్తానని అయోధ్యలోని ఆలయ ప్రధాన పూజారి హెచ్చరించారు. -
ఆ సినిమాకు నాగ చైతన్య అన్ని కోట్లు తీసుకున్నాడా?
Naga Chaitanya Charged Rs 5 Crores For Laal Singh Chaddha: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చై సినీ కెరీల్లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చైతూ, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ చైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో బాలా పాత్రకు చైతూ సుమారు 5 కోట్లు అందుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రం, అందులో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి ఎంతో లాభదాయకంగా ఉంటుదన్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని, దీంతో అతని మార్కెట్ పెరగనున్నట్లు వివరించాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అలాగే 'డీజే టిల్లుట సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. -
27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !..
ఖాన్ త్రయం (సల్మాన్, షారుక్, ఆమిర్) కలిసి సినిమా చేస్తే.. ఫ్యాన్స్ తీన్ మార్ డ్యాన్స్ వేయడం ఖాయం. అలాంటి ఓ ప్రాజెక్ట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖాన్ త్రయం కాంబినేషన్లో సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురుగ దాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆ విశేషాల్లోకి వెళదాం. గజిని, తుపాకీ, కత్తి, సర్కార్.. ఇలా తమిళంలో మురుగదాస్ భారీ చిత్రాలనే తెరకెక్కించారు. ఆయన ఇచ్చిన భారీ హిట్స్‌లో ఈ నాలుగుతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. ‘గజిని’ చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్‌తో తెరకెక్కించి, బాలీవుడ్‌లోనూ హిట్ సాధించారు మురుగదాస్. ఆ తర్వాత హిందీలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సల్మాన్, షారుక్‌లతో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ‘గజిని’ ద్వారా ఆమిర్‌తో ఏర్పడిన అనుబంధంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పారట మురుగదాస్. దాంతో షారుక్, సల్మాన్‌లను మురుగదాస్ కలిసే ఏర్పాటు ఆమిర్ చేశారని బాలీవుడ్ టాక్. ఇద్దరు ఖాన్లకు మురుగదాస్ స్టోరీ లైన్ చెబితే, నచ్చి, కథ డెవలప్ చేయమన్నారని భోగట్టా.. 27 ఏళ్ల తర్వాత.. 1995లో వచ్చిన ‘కరణ్ – అర్జున్’లో సల్మాన్, షారుక్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అలరించింది. అప్పటినుంచి ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తే బాగుండు అని కోరుకుంటున్నవాళ్లు లేకపోలేదు. అయితే మధ్యలో మనస్పర్థల వల్ల ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయి, ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు చేస్తున్నారు. సెట్స్‌లో ఉన్న సల్మాన్ ‘టైగర్ 3’లో షారుక్ అతిథిగా, షారుక్ ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కి పండగే. ‘కరణ్ – అర్జున్’ రిలీజైన 27 ఏళ్లకు సల్మాన్, షారుక్ చేసే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆమిర్ ఖాన్‌కి ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్ర రాస్తున్నారట మురుగదాస్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ఆరంభమవుతుందని బాలీవుడ్ అంటోంది. -
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
Chiranjeevi Introduces Kareena Kapoor As Roopa: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 57 ఏళ్ల వయసులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది బాలీవుడ్ దివా కరీనా కపూర్. తాజాగా కరీనా పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 'లాల్‌సింగ్ చద్దా' ప్రేయసి 'రూప'గా కరీనాను పరిచయం చేశారు చిరంజీవి. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్‌ను కరీనా కపూర్ హగ్ చేసుకుని ఉండటం చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికీ.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను...వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022 -
ఆమీర్‌ఖాన్‌తో ‘వాకరూ’ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఈ పండుగ సీజన్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ‘వాకరూ’ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రముఖ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్‌తో ఆరు రకాల ప్రచార చిత్రాలను రూపొందించింది. ఆమిర్‌ఖాన్ ఈ ప్రచార చిత్రాలలో ఆరు భిన్న పాత్రలతో కనిపించి వినియోగదారులకు బ్రాండ్‌పట్ల ఆసక్తిని పెంచనున్నారు. సరసమైన ధరలతో, నాణ్యతతో ఆధునిక వినియోగదారులను ఆకర్షించేలా వాకరో తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేస్తోంది. ఈ సందర్భంగా వాకరూ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీకేసీ నౌషాద్ మాట్లాడుతూ, ఆమిర్‌ఖాన్‌తో ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు మా కంపెనీ వినియోగదారుల సౌకర్యంపై దృష్టిపెట్టడంతో పాటు, అధునాతన మోడళ్లని ప్రవేశపెడుతోందని చెప్పారు. నేటితరం స్టైల్తోపా టు నాణ్యతకు కూడా ప్రాధాన్యతనిస్తోందని, వాకరూ కొత్తతరం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులపై దృష్టి సారిస్తుందని హవాస్ గ్రూప్ ఇండియా చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ బాబీ పవార్ పేర్కొన్నారు. ప్రచార చిత్రాలు సైతం వారు సంతృప్తి చెందేలా రూపొందించామని, టీవీలలో, సామాజిక మాధ్యమాలలో ఈ చిత్రాలను విస్తృతంగా ప్ర సారం చేయనున్నామని ఆయన చెప్పారు. పాదరక్షలతో నూతన పోకడలను పరిచయం చేసేలా 2012లో ‘వాకరూ’ను ప్రారంభించారు. అన్ని వ యసుల వారిని ఆకర్షించేలా ఈ కంపెనీ పాదరక్షలు రూపొందిస్తోంది. 2020–21లో వాకరూ రూ. 1,200 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడం విశేష -
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవనేది తరచూ వినిపించే మాట. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బంధాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్,కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో భారీగా భరణాలు ఇచ్చి విడాకులు తీసుకున్న జంటల గురించి.. హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. సుసాన్ ఖాన్‌కి విడాకులు ఇచ్చాడు హృతిక్. అయితే భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను అడిగిందట సుసాన్. అప్పట్లో ఈ వార్తలు దుమారం లేపాయి. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు బాలీవుడ్లో ప్రచారం జరిగింది. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్తాకు భారీగానే అప్పగించారట. ఆమిర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమిర్ రూ. కోట్లలో రీనా దత్తాకి ఇచ్చాడని టాక్. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సైఫ్ అలీఖాన్ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌కు భారీ నష్టపరిహారమే చెల్లించాడట. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. భరణంగా తన ఆస్తిలో సగ భాగం అమృత పేర రాసించ్చాడట సైఫ్ అలీఖాన్. అయితే అప్పట్లో ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది తెలియరాలేదు. ఇక అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సంజయ్ దత్, రియా పిళ్లై కూడా విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట! ఇక కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో దేశమంతా చర్చనీయాంశంగా మారింది నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్‌తో ప్రభుదేవాకు చెడిందనే వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, చివరకు విడాకుల వరకు వెళ్లింది. నష్టపరిహారంలో భాగంగా రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, రూ. 20-25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆమె పేరిట రాసిచ్చారని ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు అది విడాకుల వరకు వెళ్లింది. అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తంలోనే పాయల్ ఖన్నాకి అప్పజెప్పాడట. ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, బడా నిర్మాత కదా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్టపరిహారంగా ఇచ్చాడట. చదవండి : చెల్లం సర్, నాకు పెళ్లెప్పుడు అవుతుంది? ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
దేశీ టచ్‌తో విదేశీ కథలు
దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన రీమేక్ కావడం... ఉత్తరాది హిట్లు దక్షిణాదిన రీమేక్ కావడం సహజం. అయితే విదేశీ చిత్రాలు ఇక్కడ రీమేక్ కావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఒకేసారి రెండు అమెరికన్ చిత్రాలు, ఒక జర్మన్ థ్రిల్లర్, ఒక సౌత్ కొరియన్ మూవీ హిందీలో రీమేక్ కావడం విశేషం. ఈ విదేశీ కథలకు దేశీ టచ్ ఇచ్చి రీమేక్ చేస్తున్నారు. ఆ నాలుగు చిత్రాల కథా కమామీషు తెలుసుకుందాం. కొరియా ఈసారైనా కలిసొచ్చేనా? ఓ ధనవంతుడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు డిటెక్టివ్‌గా మారనున్నారు సల్మాన్ ఖాన్. సౌత్ కొరియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్న ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లోనే ఆయన డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత, నటుడు అతుల్ అగ్నిహోత్రి దక్కించుకున్నారు. వ్యాపారం ముసుగులో ఓ యువ వ్యాపారవేత్త నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ నేరాలను నిరూపించేందుకు ఓ డిటెక్టివ్, అతని బృందం ప్రయత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా ఈ కేసును డిటెక్టివ్ ఎలా పరిష్కరించాడన్నదే కథ. సల్మాన్‌కి తొలి సౌత్ కొరియన్ చిత్రం కాదిది. 2017లో విడుదలైన సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ హిందీ రీమేక్ ‘భారత్’లో ఆయన హీరోగా నటించారు. ‘భారత్’ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం ఇవ్వలేదు. మరి.. సల్మాన్ కమిట్ అయిన మరో సౌత్ కొరియన్ మూవీ ‘వెటరన్’ రీమేక్ హిట్ అవుతుందా? వేచి చూడాలి. లాల్‌సింగ్ ప్రయాణం ఆరు ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న అమెరికన్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’ (1994). విన్స్టన్ గ్రూమ్ రాసిన ‘ఫారెస్ట్ గంప్’ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’గా రీమేక్ అవుతోంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. ‘ఫారెస్ట్‌గంప్’ కథ విషయానికి వస్తే... ఓ పిల్లాడు మానసిక సమస్యతో ఇబ్బందిపడుతుంటాడు. పైగా కాళ్లు సరిగా ఉండవు. ఓ సందర్భంలో అతని కాళ్లు బాగుపడతాయి. ఆ తర్వాత అతను మిలటరీకి వెళతాడు. అక్కడ ఓ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వారి కుటుంబ సభ్యుల బాగోగులకు బాధ్యత వహిస్తాడు. మిలటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ బోటు ఓనర్‌గా మారి ధనవంతుడు అవుతాడు. ఆ తర్వాత తన గురించి తాను తెలుసుకోవడానికి దేశంలో సుదీర్ఘ దూరం పరిగెడతాడు. ప్రేయసిని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా ఓ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమాహారమే ‘ది ఫారెస్ట్ గంప్’ చిత్రం. ప్రియుడి కోసం సాహసం ప్రియుడి క్షేమం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధం అంటున్నారు హీరోయిన్ తాప్సీ. ‘లూప్ లపేటా’ చిత్రంలో తన లవర్ కోసం సాహసాలు చేయబోతున్నారామె. 1998లో వచ్చిన జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కి ‘లూప్ లపేటా’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తారు. 71వ ఆస్కార్ వేడుకల్లో ‘రన్ లోలా రన్’ చిత్రం ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. అయితే నామినేషన్ దక్కకపోయినా ‘రన్ లోలా..’ మంచి సినిమాగా ప్రేక్షకుల కితాబులందుకుంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకతను డబ్బు ఉన్న బ్యాగుతో ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు. కానీ అది అక్రమ సొత్తు. డబ్బు ఉన్న ఆ బ్యాగుని రైల్వే అధికారులు పరిశీలిస్తారనే భయంతో అతను ఆ బ్యాగును ట్రైన్లో వదిలి వెళ్లిపోతాడు. ఇంతలో అతని బాస్ ఫోన్ చేసి 20 నిమిషాల్లో తన డబ్బు తనకు కావాలని బెదిరిస్తాడు. జరిగిన విషయాన్ని తన ప్రేయసికి చెబుతాడు అతను. ఆమె తన తండ్రి దగ్గర లేదా ఏదైనా బ్యాంకులో డబ్బు కోసం ప్రయత్నిద్దామని చెబుతుంది. కుదరకపోవడంతో వారు ఓ సూపర్మార్కెట్లో దొంగతనం చేయాల్సి వస్తుంది. కానీ ఇద్దరిలో ఒకర్ని పోలీసులు పట్టుకుంటారు. ఒకర్ని తుపాకీతో కాలుస్తారు. మరి.. బాస్‌కు డబ్బు అందిందా? ప్రియుడ్ని ఆ యువతి ఎలా రక్షించుకుంది? అన్నదే కథ. మిస్సింగ్ మిస్టరీ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016). రచయిత పౌలా హాకిన్స్ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో అదే టైటిల్‌తో ఈ సినిమా రీమేక్ అవుతోంది. రిబుదాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఓ మహిళకు మద్యం తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఓ మిస్సింగ్ కేసులోనూ ఇరుక్కుంటుంది. అసలు.. ఈ మిస్టరీ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నదే కథ. విదేశీ కథలు మనకు నచ్చుతాయా? అంటే మన నేటివిటీకి తగ్గట్టు ఉంటే నచ్చుతాయి. ఈ నాలుగు చిత్రాల దర్శకులు కథలో మార్పులు చేశారు. మరి.. ఈ రీమేక్స్ బాక్సాఫీస్ వద్ద గెలుస్తాయా? వేచి చూద్దాం. -
ఖాళీగా లేను వచ్చేవారం రా!
స్మృతీ ఇరానీ కేంద్ర మంత్రి. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో స్మృతి ఇప్పుడు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను చూస్తున్నారు. తగిన శాఖే అనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ప్రసన్నవదనంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. సమస్యను సీరియస్‌గా తీసుకోరు. కానీ సీరియస్‌గా సాల్వ్ చేస్తారు. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు ఆమె పెడుతుండే పోస్టులు పొట్ట చెక్కలు చేస్తుంటాయి. ఎట్ ద సేమ్ టైమ్.. ఒక జీవిత సత్యాన్ని చెబుతుంటాయి. లేటెస్టుగా నిన్న శనివారం స్మృతి హాయిగా నవ్వించే పోస్టు ఒకటి పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు వీకెండ్స్ కూడా పనిచేస్తుండే వారి మీద! ఆ పోస్టుకు కొద్ది గంటల్లోనే పదివేల లైక్స్ వచ్చాయి. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ ఖాన్ ఓ సన్నివేశంలో ‘శభాష్’ అంటాడు. అది బాగా పాపులర్ అయిన సీన్. అలా అంటున్నప్పుడు ఆమిర్ పెట్టిన ఫీలింగ్స్ చూడాల్సిందే. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. కింద ఇలా కామెంట్ రాశారు స్మృతి. ‘‘ఖాళీగా లేను వచ్చేవారం రా.. అని మీరు మీ వీకెండ్‌తో అన్నప్పుడు..’’ అని రాశారు. వీకెండ్‌ని సింబలైజ్ చేస్తూ పైన ఆమిర్ ఫొటో.. శభాష్ అంటూ ఉంటుంది. వీకెండ్లో కూడా బిజీగా ఉండేవాళ్లపై వేసిన ఈ సున్నితమైన సెటైర్ వాళ్లను అర్థం చేసుకుంటూనే, లైఫ్‌కి అంత అవసరం లేదు అని చెప్పినట్లూ ఉంది. ‘‘మీరు మీ ఇన్‌స్టా అకౌంట్‌ని గొప్పగా హ్యాండిల్ చేస్తున్నారు స్మృతీ. ఐ లవ్ ఇట్’’ అని ఒకరు. ‘‘యు ఆర్ సో ఫన్నీ మేమ్’’ అని ఇంకొకరు. ‘‘మీ హాస్య చతురత చంపేస్తోంది’’ అని మరొకరు.. స్మృతి పోస్ట్‌కి కామెంట్స్ పెట్టారు. ప్రొడ్యూజర్ ఏక్తా కపూర్, నటి దివ్యాసేథ్ షా కూడా లైక్ కొట్టారు. ఈ పోస్ట్‌ని చూశాక ఎవరికి మాత్రం వీకెండ్‌ని ఎంజాయ్ చేయాలనిపించదు చెప్పండి. పని కూడా ఎంజాయ్‌మెంటే అనుకునేవాళ్లకు అసలు ప్రాబ్లమే లేదు. -
మనవాళ్లు ఐసా నహీ!
‘సార్.. బెంజి కారు తెచ్చాం’‘ఐసా నహీ’ ‘సార్.. లీచీ, బాదాం, కాజూ, పిస్తా, ఖజూర్, కిస్మిస్ జ్యూస్ ఆయా’‘ఐసా నహీ’‘మేడమ్.. టాప్ మీద గోల్డ్ ఎంబ్రాయిడరీ. కాలర్ మీద డైమండ్ స్టడ్డింగ్, బెల్టులో రూబీ ఫిట్టింగ్’‘ఐసా నహీ’ అసలు ‘ఐసా నహీ’ అంటే ఏంటి?‘ఇలా కాదు’ అని. బాలీవుడ్లో ప్రొడ్యూసరు ఏది చేసినా..‘ఐసా నహీ.. అలా కావాలి’ అని అడుగుతుంటారు స్టార్లు.వాళ్ల నకరాలు, ఎక్స్‌ట్రాలు చూస్తే మనవాళ్లు ఐసా నహీ అనిపిస్తుంది. నవంబర్‌లో ఆమిర్‌ఖాన్ యాక్షన్–అడ్వెంచర్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ రిలీజ్ అవుతోంది. థగ్స్ అంటే దోపిడీదారులు. 1839లో ఫిలిప్స్ మెడోస్ టేలర్ అనే ఫ్రాన్స్ రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ అనే నవల ఆధారంగా విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. (ధూమ్ వన్, టు, త్రీ; రావన్ ఈయనవే). నిర్మిస్తున్నది ఆదిత్యా చోప్రా. 210 కోట్ల రూపాయల బడ్జెట్. 19వ శతాబ్దం నాటి ఈ స్టోరీలో బ్రిటిష్ పాలకులకు కంట్లో నలకలా మారిన ఒక ఇండియన్ దోపిడీ ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడే ఆమిర్ ఖాన్. ‘ఆమిర్ అలీ’ అనే ఆ పాత్రలో ఆమిర్‌ఖాన్ జీవించేస్తున్నాడట! అయితే ఆ పాత్రలోనే కాదు, తన రెమ్యునరేషన్ దగ్గర కూడా ఆమిర్ ఒక దోపిడీ ముఠా నాయకుడికి ఏ మాత్రం తక్కువ కాని స్థాయిలో.. గొంతు మీద కత్తిపెట్టి, ‘తియ్.. ఎంతుందో’ అని డబ్బును డిమాండ్ చేశాడట! మూవీ ప్రాఫిట్లో 70 పర్సెంట్ తనకు ఇవ్వాలని ఆమిర్ అడిగినట్లు వార్తలొచ్చాయి. అంటే 147 కోట్ల రూపాయలు! ఇది తెలిసి ఇండస్ట్రీ షాక్ అయింది. నిర్మాతలకు, బయటì వాళ్లకు స్టార్లు, సెలబ్రిటీలు ఇచ్చే ఈ షాకులు కొత్తేం కాదు. వాళ్లు పెట్టే డిమాండ్లు ఎంత వింతగా, ఎంత విడ్డూరంగా, కొన్నిసార్లు ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా ఉంటాయో పాపం ఆ.. పడేవాళ్లకు మాత్రమే తెలుసు. అవి తీర్చలేని వారు ‘సారీ’ అంటారు. తీర్చక తప్పనివారు ‘సరే’ అంటారు. అలాంటి కొన్ని గొంతెమ్మ కోర్కెలు, వింత వింత షరతులు ఈవారం మన శాటర్డే స్పెషల్. ఫస్ట్ ఐశ్వర్యారాయ్‌తో స్టార్ట్ చేద్దాం. పెద్ద స్టార్ కదా మరి! నిర్మాతల్ని ఆమె పెద్దగా బెదరగొట్టలేదు కానీ, ఫ్లయింట్ సిబ్బందే.. ఐశ్వర్య ఎక్కిందంటే చాలు.. ‘బాబోయ్’ అని మూలమూలలకి నక్కేస్తారు. ఆమె గురించి తెలియనివాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి.. ‘యస్.. మ్యామ్. మేము మీకేదైనా సహాయపడగలమా?’ అని అడుగుతారు. ‘ఓయస్.. తప్పకుండా సహాయపడగలరు’ అని ఒక స్మయిల్ ఇచ్చి, ఫ్లయిట్లో ఏమేం డిష్‌లు ఉన్నాయో అన్నీ మొహమాటం లేకుండా తెప్పించుకుంటారు ఐశ్వర్య! అవన్నీ ఆరగిస్తారా అంటే లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని తెస్తే వాటిల్లో చూడచక్కగా ఉన్న ఒక్కటి మాత్రమే మేడమ్ సెలక్ట్ చేసుకుంటారు. ఫ్లయిట్లో ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్యకు ఇదో హ్యాబిట్. ఐశ్వర్యలా.. కరీనా కపూర్ తిండి విషయంలో ఏమంత పర్టిక్యులర్ కాదు. ఉన్నదేదో తినేస్తారు. అయితే ఉన్నవాళ్లెవరో వాళ్లతో నటించేయరు. అర్థం కాలేదా! నిర్మాతలు ఎవరైనా కరీనా దగ్గరికొచ్చి ‘కరీనాజీ మీరే మా సినిమాలో హీరోయిన్’ అని ఆనందంతో తబ్బిబ్బవుతూ చెబితే, కరీనా ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా ‘ఇంకా ఎవరెవరుంటారు మీ సినిమాలో?’ అని అడుగుతారు. ‘ఇంకా కాస్టింగ్ పూర్తి కాలేదు’ అంటే.. ‘ఎ–లిస్ట్’ యాక్టర్లు అయితేనే నేను చేస్తాను’ అని షరతు విధిస్తారు కరీనా! కరీనాలా అందరూ ఎ–లిస్ట్ వాళ్లే అయితే నిర్మాతలు ఏ లిస్టులోకి వెళ్లిపోతారో ఊహకు అందనిదేం కాదు. కరీనాలా రేఖ ఇలాంటి షరతులేం పెట్టకున్నా.. కరీనానే నయం అనిపించేలా చేశారొకసారి. అభిషేక్ కపూర్ చిత్రం ‘ఫితూర్’లో నటిస్తూ నటిస్తూ మధ్యలో క్విట్ కొట్టేశారు రేఖ. నిర్మాతకు కాళ్లు ఒణికాయి. ‘ఏమైంది తల్లీ?! మమ్మల్ని నడి సముద్రంలో వదిలేసివెళ్లారు’ అని ఫోన్‌చేసి అడిగాడు. ‘నా లుక్ నేను అనుకున్నంత బాగా రాలేదు. అందుకే మీ సినిమాను వదిలేశా’ అని కూల్‌గా చెప్పారు రేఖ. నిర్మాత కుప్పకూలిపోయాడు. తబూ వచ్చి పైకి లేపి నీళ్లిచ్చింది. నిర్మాత తేరుకుని ‘నువ్వే మా రేఖ’ అనేశాడు. రేఖతో షూట్ చేసిందంతా తిరిగి తబూతో చేయించాడు. ఈ బుద్ధి మల్లికా శెరావత్కీ ఉంది. సీన్ బాగా రాలేదని తనకు అనిపిస్తే (భలే వచ్చిందని డైరెక్టర్‌కి అనిపించినా కూడా) మళ్లీ తీయించమంటుంది. టేకులు తినకుండా టేకులు తినిపించడం అంటే ఇదే. ప్రియాంకా చోప్రాది ఇంకో రకమైన ధోరణి. బయట ‘ఫ్యాషనబుల్‌గా చిరిగిపోయిన’ బట్టల్ని వేసుకుని చక్కగా కనిపిస్తారు కదా ఈవిడ.. సినిమాల్లో నటించడానికి మాత్రం ‘నో–న్యూడిటీ’ క్లాజ్ పెట్టేస్తారు. ‘ఒక్క సీన్ మేడమ్.. ప్లీజ్’ అని బతిమాలినా కూడా కనికరం చూపరు. ఇప్పుడామె హాలీవుడ్ నటి. అక్కడ కూడా అంతే. ‘క్వాంటికో’, ‘బేవాచ్’ సీరీస్‌లో ఒళ్లు కనిపిస్తే ఊరుకోనన్నారు. దాంతో ఆమె ఒళ్లు కనిపించే అవసరం లేకుండా నిర్మాతలు నిరుత్సాహంగా సన్నివేశాలను తిరగ రాసుకున్నారు. దీపిక పడుకోన్ కూడా తక్కువేం తిన్లేదు. అయితే ఒళ్లు కనిపించనివ్వని విషయంలో కాదులెండి. విక్కీ కౌషల్ అనే యాక్టర్‌తో నటించేది లేదు పొమ్మంది. విక్కీ ఎ–లిస్టర్ కాదు. అదీ దీపిక అబ్జెక్షన్. వెంటనే నిర్మాతలు తన్ని తరిమేశారు. ఎవర్ని తన్ని తరిమేశారో వేరే చెప్పాలా?! పాపం విక్కీ. కత్రీనాకు ఈ టైప్ ఆఫ్ అభ్యంతరాలు తక్కువే. అయితే ‘ఫితూర్’ ఫిల్మింగ్ మొత్తం అయిపోయాక ఓ సీన్‌ని మళ్లీ తీయాలని పట్టుపట్టింది. ‘బాగానే ఉంది కదమ్మా’ అని నిర్మాత అన్నాడు. ‘ఏం బాగుంది! నా మొఖం. కొంచెం బొద్దుగా లేనూ. మళ్లీ తియ్యండి’ అని కత్రీనా హఠం పట్టింది. విషయం ఏంటంటే.. సినిమా పూర్తయ్యాక కత్రీనా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గాక అద్దంలో తనకు తనే విపరీతంగా నచ్చేసింది. ఆడియన్స్‌కి ఆ బొద్దు సీన్‌ని చూపించడం కన్నా, ఈ స్లిమ్ సీన్‌ని చూపించడం బెటర్ కదా అనుకుంది. చేసేది లేక నిర్మాత ‘ఓకే’ అన్నాడు. ‘అప్పుడే ఓకే కాదు, నాకు నచ్చిన స్టిల్ ఫొటోగ్రాఫర్ వచ్చి ఆ సీన్‌కి ఫొటో తీస్తాడు’ అంది. ‘అలాగే తల్లీ’ అని దండం పెట్టాడు నిర్మాత. ఇప్పుడొక చిన్న బ్రేక్. ముక్కు మీద వేలేసుకునే విషయం. సన్నీలియోన్ తెలుసు కదా. తెలియకుండా ఉంటుందా! ఉండదనే నిర్మాతలూ అనుకున్నారు. అయితే కాంట్రాక్ట్‌లో ఆమె పెట్టిన షరతు చూసి కుప్పకూలి పోయారు. ‘నో కిస్సింగ్’ క్లాజ్ అది. ఇప్పటికీ లియోన్ ఏమీ మారలేదు. రెమ్యునరేషన్ తర్వాతి సంగతి. ముద్దు సీనైతే లేదు కదా అని అడుగుతుంది. భలే అమ్మాయండీ! సోనాక్షి సిన్హా కూడా భలే అమ్మాయే. ఆమెకీ ఈ ‘ముద్దుపిచ్చి’ ఉంది. అంటే.. ముద్దిచ్చే పిచ్చి కాదు. ముద్దొద్దనే పిచ్చి. ‘నువ్విప్పుడు ఈ హీరోని ముద్దు పెట్టుకోవాలమ్మాయ్..’ అని అని చెబితే.. ‘ముందే చెప్పాను కదా.. నాకిలాంటివి ఇష్టం ఉండవని’ అంటుంది. సీన్ డిమాండ్ చేస్తోంది అమ్మాయ్’ అంటే.. నేను కమాండ్ చేస్తున్నా.. సీన్ మార్చండి అంటుంది. అలా చాలా సీన్లతో పాటు, చాలా సినిమాలూ వదులుకుంది సోనాక్షి. ‘దబాంగ్’లో సల్మాన్ పక్కన చేసింది సోనాక్షి. అతడూ అంతే ‘నో–కిస్సింగ్’ అంటాడు.. ప్రాజెక్టుకు సంతకం పెట్టే ముందే. అందుకనే సల్మాన్ చిత్రాల్లో మనకు అతడి కండలు కనిపిస్తాయి కానీ, అతడి ముద్దులు కనిపించవు. సల్మాన్‌తో నిర్మాతలకు ఇంకో ఇబ్బంది కూడా ఉంది. ఆకాశంలో ఔట్ డోర్ షూటింగ్ ఉన్నా.. అక్కడికి జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం తెప్పించమంటాడు! షాట్ గ్యాప్‌లో బాడీని వామప్ చేసుకోవాలనిపిస్తే అతడికి ఈ సరంజామా అంతా ఉండాలి. నాలుగు గుంజీళ్లు తీస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోడు. హృతిక్ రోషన్‌కి కూడా ఈ బాడీ పిచ్చి ఉంది. అయితే నిర్మాతల్ని మరీ అంతగా వేధించడు. ఔట్ డోర్‌కి వెళ్లే ముందు.. ‘మంచి జిమ్ బుక్ చెయ్యండి’ అని మాత్రం అడుగుతాడు. మరీ అంత మంచి జిమ్ దొరక్కపోయినా అడ్జెస్ట్ అయిపోతాడు. అక్షయ్‌కుమార్ ఇంకో రకం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. సండే సూర్యుడొచ్చి లేపినా లేవడు. ఇక డైరక్టరొచ్చి లేపితే లేస్తాడా! మంచి లైటింగ్ ఉంది లెమ్మంటే, రమ్మంటే.. ‘రేపు చూద్దాం’ అని నిర్మొహమాటంగా అనేస్తాడు. ఆదివారాలు ఈ మనిషి మనిషి కాదు అని వదిలేశారు దర్శకులు. ఆయన్ని వదిలేయడం కాదు. ఆయనపై ఆశల్ని వదులుకున్నారు. ఇప్పటికీ అంతే. అక్షయ్‌తో మరో తలనొప్పి కూడా ఉంది. షూటింగ్ ఎర్లీ మార్నింగ్ మొదలు కావాలంటాడు! ‘అదేంటీ అక్షయ్’ అని అడిగితే.. ‘లేట్ నైట్ నేను చెయ్యలేను’ అంటాడు. దీన్ని బట్టి అక్షయ్‌ది షూటింగ్‌లకు పనికొచ్చే బాడీ కాదనిపిస్తోంది. టెన్ టు ఫైవ్ ఉద్యోగానికి వెళ్లక, పొరపాటున ఇటు వచ్చినట్లున్నాడు. ఈ స్టోరీ ఆమిర్‌తో కదా మొదలైంది.. చుక్కలు కనిపించే ‘లెక్క’లేశాడని! ఈయనతో ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ‘లో యాంగిల్’ షాట్ తియ్యనివ్వడు. అంటే.. కాళ్ల దగ్గర కెమెరా పెట్టి, తనను షూట్ చెయ్యనివ్వడు. íసిగ్గట.. ఖాన్ సాబ్‌కి.ఈ సిగ్గులు, అసలు సిగ్గే పడకపోవడాలు డిమాండ్ ఉన్న స్టార్లకు మామూలే. వాళ్లేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. వాళ్లేం అడిగినా వాళ్ల కాళ్ల దగ్గరికి వచ్చేస్తుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే తప్ప ప్రొడ్యూసర్లు బయటపడరు. స్టార్లను వదిలించుకోరు. హద్దు దాటినప్పుడే.. పద్దులు చూసుకుంటారు. ‘అమ్మా నీకో దండం’, ‘అయ్యా నీకో నమస్కారం’ అని ప్యాకప్ చెప్పేసి, కొత్త వాళ్లతో మళ్లీ పికప్ అవుతారు. ముద్దంటే చేదు ముద్దు సీన్లంటే గిట్టనివాళ్లు సన్నీలియోన్, సోనాక్షీ, సల్మాన్ (అరె! ముగ్గురి పేర్లూ ‘ఎస్’ తోనే మొదలయ్యాయే) మాత్రమే కాదు. షారుక్ కూడా. (మళ్లీ ఇంకో ‘ఎస్’). అగ్రిమెంట్లో ‘నో కిస్సింగ్’ అని తప్పనిసరిగా కండిషన్ పెడతాడు షారుక్. ఒక్క యాష్ చోప్రా రిక్వెస్ట్పైన మాత్రం ‘జబ్ తక్ హై జాన్’లో తన రూల్‌ని తను బ్రేక్ చేసుకున్నాడు. రికార్డులు బ్రేక్ చేస్తేనే కాదు.. అప్పుడప్పుడు మన రూల్స్‌ని మనమే బ్రేక్ చేసుకున్నా గౌరవమే. యాష్ చోప్రా.. పై నుంచి షారుక్‌ని దీవిస్తూ ఉండివుంటారు.. ముద్దుకి షారుక్ ఓకే అన్నందుకు. -
మహాభారత్ సహ నిర్మాతగా దేశ సంపన్నుడు
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘మహాభారత్’ సినిమా సిరీస్‌కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ లలో ముఖేష్ పెట్టుబడులు పెట్టారు. అయితే కొత్త సంస్థను స్థాపించడం ద్వారా ‘మహాభారత్’'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే ఆయనకు ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్ 18 ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో స్పష్టత లేదు. నాలుగు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. ఎక్కువ మంది దర్శకులు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచంలోని సమారు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ప్రపంచ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ రచయితలను ఇక్కడకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ ఎక్కువగా కృషి చేస్తున్నారు. -
స్టార్ కోచ్
-
ఆమిర్ ఖాన్ భార్యకు అభినందనలు
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమిర్ ఖాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి బాసటగా నిలిచారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ ఖాన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాలలో నటించిన ఆమిర్.. సముచిత స్థానంలో ఉన్నాడని ఆయన తెలిపారు. గత కొన్ని మాసాలుగా తానూ అభద్రతాభావంతో ఉన్నానని జైపాల్ రెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న అసహనంపై తన అభిప్రాయాన్ని నిజాయితీగా భర్తకు తెలిపిన కిరణ్ రావును ఆయన అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అలా అభిప్రాపయడటం సహజమేనని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.