అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. హిందూ మతాన్ని దూషించేలా సినిమా ఉందని గుజరాత్ కోర్టులో పిటీషన్ వేయడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. వాస్తవంగా ఈ సినిమా జూన్ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదల కాలేదు. అయితే, తాజాగా మహారాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
మహారాజ్ సినిమా ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జూన్ 21 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మతాన్ని కించపరిచేలా ఈ చిత్రం లేదని న్యాయస్థానం వెళ్లడించింది. దీంతో ఈ మూవీని నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి ఊరట లభించినట్లు అయింది. అయితే, ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా మహారాజ్ స్ట్రీమింగ్ అవుతుంది.
మహారాజ్ చిత్రంలో జునైద్ ఖాన్‍తో పాటు షాలినీ పాండే, జైదీప్ అహల్వాత్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహించారు. 1860 బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా రూపొందింది. జర్నలిస్ట్, సామాజిక సంస్కర్త కర్సన్‍దాస్ ముల్జీ జీవితం గురించి ఈ చిత్రం ఉంది. 1862 సమయంలో హిందూ మతానికి చెందిన ఓ బాబా అన్యాయాలను ముల్జీ బహిర్గతం చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం కథ సాగింది.
Comments
Please login to add a commentAdd a comment