బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన తొలి సినిమా 'మహరాజ్'. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. సుమారుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ తెరకెక్కించింది.
ఆమిర్‌ఖాన్ వారసుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జునైద్ హీరోగా తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు. భారీ ఆశలతో ఆయన నటించిన మహరాజ్ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో పండితుడి పాత్రలో కనిపించాడు.
1862లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జర్నలిస్ట్ పాత్రలో జునైద్ కనిపించనున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండనుంది. జునైద్ సినిమాల్లోకి రావడానికి ముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా నటనలో శిక్షణ తీసుకున్నారు . ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తకు ఆయన జన్మించాడు. అతనికి ఇరా అనే సోదరి కూడా ఉంది. ఆమీర్ ఖాన్ ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment