
తెరపై నగ్నంగా అమీర్!
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో త్వరలోనే తెరకెక్కనున్న ‘పీకే’ చిత్రంలో అమీర్ ఖాన్ నగ్నంగా నటించనున్నట్లు సమాచారం. ఈ రాజకీయ వ్యంగ్య చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటించనుంది. భూమిపైకి దిగే గ్రహాంతరవాసి పాత్రలో కనిపించనున్న అమీర్, ఈ చిత్రంలో అనుష్కాశర్మతో హాట్‌హాట్ ముద్దు సీన్లలో కూడా కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల భోగట్టా.
మల్లికలా ఉంటానట...
‘నేను మల్లికా షెరావత్‌లా ఉంటానట.. మా మేకప్ మ్యాన్ సహా చాలామంది నాతో ఈ మాట చెబుతున్నారు’ అంటూ హొయలు పోతోంది టీవీ నటి సోనాల్ వెంగుర్లేకర్. ‘దిల్ దోస్తీ డ్యాన్స్, ది బడ్డీ ప్రాజెక్ట్’ వంటి టీవీ సిరీస్‌లతో యువతను ఆకట్టుకున్న సోనాల్.. తాజాగా ‘శాస్త్రి సిస్టర్స్’లో కనిపించనుంది. నా పెదవులు, ముఖం అచ్చం మల్లికా షెరావత్‌లానే ఉంటాయని చాలామంది అంటుంటారంటూ సంబరపడుతోంది.