Rajkumar Hirani
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న డంకీ విడుదలైంది. 2023లో పఠాన్,జవాన్ చిత్రాలతో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా ఆ రెండు చిత్రాల రేంజ్లో మెప్పించలేక పోయింది. దీంతో రూ. 470 కోట్ల కలెక్షన్స్ వద్ద డంకీ ఆగిపోయింది. తాజాగా డంకీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వాస్తవంగా ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండు షారుక్ డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో టాలీవుడ్ సినిమాలు అయిన సలార్,యానిమల్,గుంటూరు కారం, హాయ్‌నాన్న వంటి చిత్రాలు టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డంకీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. థియేటర్స్‌లో డంకీ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Dunki Movie Review: ‘డంకీ’ మూవీ రివ్యూ
టైటిల్: డంకీ నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమాన్ ఇరానీ, అనీల్ గ్రోవర్ తదితరులు నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ నిర్మాతలు:గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్(పాటలు) సినిమాటోగ్రఫీ: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్ విడుదల తేది: డిసెంబర్ 21, 2023 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాలను తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీ ఒకరు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారుక్ ఖాన్‌తో సినిమా అంటే.. ఆ అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. అందుకే డంకీపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 21)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్, జవాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత షారుక్ నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? షారుక్ ఖాతాలో హ్యాట్రిక్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. డంకీ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1995లో సాగుతుంది. శత్రువుల దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ(షారుఖ్)ని ఓ వ్యక్తి కాపాడుతాడు. కొన్నాళ్ల తర్వాత అతన్ని కలిసేందుకు హార్డీ పంజాబ్‌కి వస్తాడు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణిస్తాడు. అతని సోదరి మను రంధ్వా అలియాస్ మన్ను(తాప్సీ పన్ను) కుటుంబ బాధ్యతను తీసుకుంటుంది. అప్పులు కట్టలేక ఇంటిని కూడా ఆమ్మేస్తారు. లండన్ వెళ్లి బాగా డబ్బు సంపాదించి.. అమ్ముకున్న ఇంటిని మళ్లీ కొనాలనేది మను కల. అలాగే ఆమె స్నేహితులు బుగ్గు లక్నపాల్(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) కూడా డబ్బు సంపాదించడానికై లండన్ వెళ్లాలనుకుంటారు. వీసా కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. తన ప్రాణాలను కాపాడిన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న హార్డీ.. మనుని లండన్ పంపించేందుకు సహాయం చేస్తాడు. ఈ నలుగురు వీసా కోసం ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అష్టకష్టాలు పడతారు. ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో ఈ నలుగురికి సుఖీ(విక్కీ కౌశల్) పరిచయం అవుతాడు. తన ప్రియురాలి జెస్సీని కలిసేందుకు అతను లండన్ వెళ్లాలనుకుంటాడు. వీళ్లంతా లీగల్‌గా ఇంగ్లండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. దీంతో దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లండ్‌కు అక్రమంగా వెళ్లే క్రమంలో వీళ్లు పడిన కష్టాలేంటి? లండన్‌లో వీళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రియురాలి కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్న సుఖీ కల నెరవేరిందా లేదా? మన్నుతో ప్రేమలో పడిన హర్డీ.. తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చాడు? పాతికేళ్ల తర్వాత.. మన్ను తిరిగి ఇండియాకు ఎందుకు రావాలనుకుంది? ఈ క్రమంలో హార్డీ మళ్లీ ఎలాంటి సహాయం అందించాడు? మను, హర్డీల ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను తెరకెక్కించడం రాజ్ కుమార్ హిరాణి స్పెషాలిటీ. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమాను తీర్చిదిద్దుతాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకే, సంజు..చిత్రాలే వీటికి నిదర్శనం. డంకీ చిత్రంలో కూడా మంచి సోషల్ మెసేజ్ఉంది. కానీ దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేదే తీర్చిదిద్దడంలో రాజ్ కుమార్ హిరాణీ పూర్తిగా సఫలం కాలేదు. భారత్ నుంచి అక్రమంగా యూకేలోకి ప్రవేశించాలనుకునే నలుగురు స్నేహితుల కథే డంకీ. దర్శకుడు రాజ్ కుమార్.. అక్రమ వలసదారుల కాన్సెప్ట్‌ని తీసుకొని దానికి దేశభక్తి, లవ్‌స్టోరీని టచ్ చేసి ఎమోషనల్ యాంగిల్లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలదారుల భావోద్వేగాలను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయలేకపోయాడు. ఎమోషనల్ సీన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు. వినోదం పండించడంలో మాత్రం తన పట్టు నిలుపుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. పాతికేళ్లుగా లండన్‌లో ఉన్న మన్ను తిరిగి ఇండియా రావాలనుకొని ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే కథ 1995లోకి వెళ్తుంది. మన్ను.. ఆమె స్నేహితులు బల్లి,బుగ్గుల నేపథ్యం నవ్విస్తూనే.. ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. ఇక హీరో ఎంట్రీ అయిన కాసేపటికే కథంతా కామెడీ మూడ్‌లోకి వెళ్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ మను గ్యాంగ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కాస్త సీరియస్‌గా సాగుతుంది. డంకీ రూటులో( దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబ్‌లో దాన్ని డంకీ అని పిలుస్తారు) ఇంగ్లండ్‌కి వెళ్లే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక లండన్ వెళ్లాక ఈ నలుగు పడే కష్టాలు నవ్విస్తూనే..కంటతడి పెట్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. తిరిగి ఇండియాకు రావాలనుకున్నా..మళ్లీ డాంకీ ట్రావెలే చేయాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కన్నీళ్లను పెట్టిస్తుంది. కథ సాగదీసినట్లుగా అనిపించడం.. ప్రేక్షకుడి ఊహకు అందేలా కథనం సాగడం కూడా మైనస్. ఎవరెలా చేశారంటే.. పఠాన్, జవాన్ చిత్రాల్లో యాక్షన్‌తో ఇరగదీసిన షారుక్.. ఇందులో సాదాసీదా పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హార్డీసింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కామెడీ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఓల్డ్ లుక్‌లో షారుఖ్‌ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తాప్సీకి మరో బలమైన పాత్ర లభించింది. మన్ను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా మొత్తం ఆమె పాత్ర ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తనదైన నటనతో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా..గుర్తిండిపోయే పాత్రలో నటించాడు. విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రీతమ్ పాటలు పర్వలేదు.లుట్ ఫుట్ గయా సాంగ్ ఆకట్టకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కూతురుతో షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
బాలీవుడ్ కింగ్ షారుక్‌ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డంకీ'. ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు నానుంది. ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్ సంచలనం సృష్టించారు. తాజాగా 'డంకీ'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు షారుక్ కూడా ప్రమోషన్స్లలో బిజీగా ఉన్నారు. తాజాగా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్‌కు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్ సన్మానం చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న షారుక్.. అక్కడి నుంచి కారులో బయల్దేరి సాయి బాబా ఆలయానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లిన షారుక్ అక్కడ అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గత రెండు సినిమాలు పఠాన్,జవాన్ విడుదలకు ముందు కూడా ఇలా పలు ఆలయాలను షారుక్ ఖాన్ దర్శించుకుని తన సనిమా మంచి విజయం సాధించాలని పూజలు జరిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 21న విడుదల కానున్న తన చిత్రం డంకీ కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆయన కోరుకుంటున్నారు. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ కూడా విడుదల కానుంది. -
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ వచ్చేసింది.. తక్కువ అంచనా వేయకండి
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఈ ట్రైలర్ SRK వాయిస్‌తో ప్రారంభం అవుతుంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు అనిపిస్తుంది. కానీ అతనికి ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా చూకేలోకి చొరబడాలని ప్రయత్నించడం ఆపై అక్కడి వారికి దొరికిపోవడం వంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. షారుక్ జర్నీలో స్నేహితులతో అతను పడే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడో డంకీ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. తాజాగా డంకీ ట్రైలర్‌ను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా చెప్పాడు. 'ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదంతో పాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను అందరినీ తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న సమయం వచ్చేసింది. డంకీ డ్రాప్ వచ్చేసింది.' అనే క్యాప్షన్‌తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్లో డంకీ చిత్రం రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్‌కు నెటిజన్ రిక్వెస్ట్!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. ఓ నెటిజన్ సినిమాను థియేటర్లలో చూడటానికి చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా? అన షారుక్‌ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్ను లైన్లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్ఆర్కేను కోరారు. దీనికి బాద్షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్‌కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 Yes I also told the team but the air conditioning is an issue. You have to go with kids and elders for the film…will be uncomfortable…so let’s keep this one in the theatres in the 21st December only. #Dunki https://t.co/vOkGZ2fJzD — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 -
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
ఇండియాని షేక్ చేయబోయే సూపర్ కాంబో..!
-
ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!
ఒక సినిమా వందకోట్లు కలెక్షన్స్ రావడమంటే అంతా ఈజీ కాదు. స్టార్ హీరోల సినిమాలకైతే వాళ్ల క్రేజ్‌ను బట్టి వసూళ్లు రాబట్టడం జరుగుతూ ఉంటోంది. ఇక హీరోల సంగతి పక్కన పెడితే.. దర్శకుడే సినిమాకు ప్రధాన బలం. వారి కథ, స్క్రీన్ ప్లేను బట్టి సినిమా హిట్టా, ఫ్లాపా అనే టాక్ తెచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వందకోట్లు కొల్లగొట్టడం చూస్తుంటాం. కానీ ఓకే దర్శకుడి తెరకెక్కించిన తొమ్మిదికి పైగా చిత్రాలు వంద కోట్లు రాబట్టమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనత సాధించిన దర్శకధీరుడి గురించి తెలుసుకుందాం. తొమ్మిది చిత్రాల దర్శకుడు 2000ల మధ్యకాలంలో భారతీయ సినిమాలు.. దేశీయ కలెక్షన్లతో వందకోట్ల మార్కు చేరుకున్న సినిమాలుగా గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తం కలెక్షన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటిన సినిమాలను వంద కోట్ల క్లబ్లో చేర్చారు. చాలా మంది హీరోల సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ వందకోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు నిర్మించిన దర్శకుల సంఖ్య మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఇలాంటి అరుదైన మైలురాయిని అందుకున్న దర్శకుల్లో రోహిత్ శెట్టి ఒకరు. ఆయన నిర్మించిన తొమ్మిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు సాధించాయి. అత్యధికంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తీసిన భారతీయ దర్శకుడిగా పేరు సంపాదించారు. గోల్మాల్ 3తో మొదలై.. గోల్మాల్ 3 చిత్రంతో మొదలైన రోహిత్ ప్రభంజనం సూర్యవంశీ వరకు కొనసాగింది. అతను నిర్మించిన చిత్రాల్లో రూ. 423 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఆ తర్వాత సింగం (రూ. 157 కోట్లు), బోల్ బచ్చన్ (రూ. 165 కోట్లు), సింగం రిటర్న్స్ (రూ. 219 కోట్లు), దిల్వాలే (రూ. 377 కోట్లు), గోల్మాల్ ఎగైన్ (రూ. 311 కోట్లు), సింబా (రూ. 400 కోట్లు) ఉన్నాయి. అయితే అయితే రోహిత్ శెట్టి తెరకెక్కించిన కొన్ని చిత్రాలు నిరాశపరిచనవి కూడా ఉన్నాయి. వాటిలో జమీన్ (రూ. 18 కోట్లు), సండే (రూ. 32 కోట్లు), సర్కస్ (రూ. 62 కోట్లు)తో రూ. 100 కోట్లు రాబట్టని లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా 100 కోట్లే.. తన ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన ఘనత కరణ్ జోహార్ సొంతం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో ఆదిత్య చోప్రాకు అసిస్టెంట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రనిర్మాత, 1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 107 కోట్లను రాబట్టి.. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ రూ.100 కోట్లు దాటాయి. ఇటీవల విడుదలైన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో ఏడో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.. రూ.100 కోట్ల చిత్రాల దర్శకులు వీళ్లే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించిన దర్శకులు కూడా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐదు చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కబీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ ఒక్కొక్కరు నాలుగు సినిమాలు ఉన్నాయి. దర్శకు ధీరుడి నాలుగు చిత్రాలు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వాటిలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ ఉన్నాయి. అయితే రాజమౌళి తెరకెక్కించిన రెండు సినిమాలు మాత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక దర్శకుడిగా రాజమౌళి మాత్రమే నిలిచారు . -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్‌లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్‌పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్‌కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వస్తున్నాడు. ప్రస్తుతం షారుక్ చేతి మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరాని ‘డంకీ’ ఒకటి. తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెట్స్‌పైకి వచ్చి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. చదవండి: అతియా, కేఎల్ రాహుల్ పెళ్లి డేట్‌పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి డంకీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన అమిత్ రాయ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ లేదు. తాజాగా ఈ వార్తలపై అమిత్ రాయ్ స్పందించాడు. ఇటీవల ముంబై మీడియాతో ముచ్చటించిన ఆయన ఇకపై తాను డంకీ మూవీకి పనిచేయడం లేదని స్పష్టం చేశాడు. ‘తొలి షెడ్యూల్లో భాగంగా డంకీ చిత్రానికి 18, 19 రోజులు వర్క్ చేశాను. ఇకపై నేను ఆ సినిమాకీ పని చేయడం లేదు. నాకు, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానికి మధ్య అనుకొని మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్ అనంతరం ఆయన మనస్పర్థలపై వివరణ ఇస్తూ.. ‘ఇద్దరి ఆలోచనలు ఏకీభవించడం లేదు. మేం ఒకే కోణంలో చూడలేకపోయాం. ఈ క్రమంలో మా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు దారి తీయకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడాను కూడా. ఇక పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చాం’ అని అన్నాడు. అయితే తాను తీసిన షాట్స్ మాత్రం అలాగే ఉంటాయని అమిత్ రాయ్ తెలిపాడు. కాగా ఈ సినిమాను 2023 డిసెంబర్ 22న థియేటర్లోకి తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొత్త సినిమా ప్రకటించిన షారుక్, డైరెక్టర్ ఎవరంటే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన ఫ్యాన్స్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు. మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారుక్ ప్రస్తుతం వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాకు సంతకం చేశాడు. తన తదుపరి సినిమా కోసం పీకే, మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రాల దర్శకుడు రాజ్‌కుమార్ హీరానీతో తొలిసారి జతకట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరానితో కలిసి ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంటూ మూవీ టైటిల్‌ను కూడా రివీల్ చేశాడు. ఈ వీడియోలో షారుక్ మున్నా భాయ్ ఎంబీబీఎస్, పీకే చిత్రాల పోస్టర్ల ఎదురుగా నిలబడి కనిపిస్తాడు. చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల ఆ తర్వాత రాజ్‌కుమార్ హీరానీతో తన కోసం కూడా ఏదైనా కథ ఉందా అని అడగ్గా అవును..ఉందని సమాధానం ఇస్తాడు. దీనికి టైటిల్ ఏంటని అడగ్గా డంకీ అంటూ టైటిల్ చెప్పేశాడు డైరెక్టర్. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాగే సంభాషణ ఫన్నీగా ఉంటుంది. ఇక ఈ పోస్ట్‌ను షారుక్ షేర్ చేస్తూ.. ‘డియర్ రాజ్‌కుమార్ సర్, మీరు నాకోసం సాంటా క్లాజ్‌ని వదిలారు. మీరు మొదలు పెట్టండి నేను వచ్చేస్తున్నా. చెప్పాలంటే ఇప్పటికే నేను సెట్లో ఉండాల్సింది. అయితే చివరకు మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో షారుక్ మూవీ టైటిల్ ‘డంకీ’ అని, 2023 డిసెంబర్ 22న ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురానున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ మూవీలో కథానాయికగా తాప్పీ పన్ను నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
కింగ్ ఖాన్‌తో జోడీ...
కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తారనీ బాలీవుడ్లో ఓ వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ వార్త నిజమేనని, షారుక్‌కు జోడీగా తాప్సీ నటించనున్నారనీ బాలీవుడ్ లేటెస్ట్ టాక్. చట్టవిరుద్ధంగా అమెరికా, కెనడా వంటి విదేశాలకు వీసాలు సంపాదించే విద్యార్థులు, వ్యక్తుల బ్యాక్‌డ్రాప్‌లో సాగే సోషల్‌డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే ఏడాది పంజాబ్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుందని టాక్. తాప్సీ కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లిన ‘బద్లా’ సినిమాకు షారుక్ ఖాన్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. -
అమీర్, అనుష్క ఎందుకు నోరు విప్పలేదు?
బాలీవుడ్ సంచలన హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్లపై మండిపడ్డారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును ఆమె ప్రస్తావిస్తూ.. సుశాంత్‌తో కలిసి నటించిన వాళ్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ.. సుశాంత్‌తో కలిసి 'పీకే' చిత్రంలో పని చేశారని తెలిపారు. ఈ ఇద్దరూ సుశాంత్‌కు న్యాయం జరగాలనో లేదా సీబీఐ విచారణ జరపాలనో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. వీళ్లే కాకుండా పీకే సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, సుశాంత్ సినిమాలను తెరకెక్కించిన నిర్మాత ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీళ్లందరినీ బాలీవుడ్ రాకెట్ ముఠాగా పరిగణించారు. (టర్కీ ప్రథమ మహిళతో ఆమిర్.. నెటిజన్ల ఫైర్) ఒక్కరు సైలెంట్‌గా ఉన్నా అందరూ అదే ఫాలో అవుతారు "ఈ రాకెట్ ఎలా పని చేస్తుందో తెలుసా? ఒక్కరు నోరు విప్పకపోయినా మిగతా అందరూ మౌనంగా ఉంటారు. అలా.. ఎవరూ సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేయడానికి ముందు రాలేదు. ఇదెలా ఉంటుందంటే.. అమీర్ ఖాన్ ఏమీ మాట్లాడలేదనుకో, అనుష్క కూడా నాకెందుకొచ్చిందిలే అని సైలెంట్‌గా ఉంటారు. అలానే రాజ్‌కుమార్ హిరానీ, ఆదిత్య చోప్రా, అతని భార్య రాణి ముఖర్జీ కూడా నోరు మెదపరు. వీళ్లదంతా ఓ గ్యాంగ్" అని కంగనా మండిపడ్డారు. (అమిర్ నాకు పెట్టకుండానే తిన్నారు: దీపిక) మీకు మాటలే కరువయ్యాయా? "మీకు ఎక్కడో చోట తప్పు చేశామన్న అపరాధ భావన లేకపోతే మీ సహనటుడు, ఇండస్ట్రీలోని ముఖ్య వ్యక్తి సుశాంత్ మరణంపై ఎందుకు స్పందించట్లేదు? అంటే మీకు ఈగనో, దోమనో చనిపోయినట్లు అనిపిస్తుందా? అతని కోసం చెప్పేందుకు మీకు మాటలే కరువయ్యాయా? అక్కడ అతని కుటుంబం రోదిస్తోంది. కనీసం వారి పట్ల మీరు సానుభూతి కూడా చూపించలేరా? సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని గొంతెత్తి ప్రశ్నించలేరా? ఇందులో మీరు ఏ ఒక్కటీ చేయలేదు, ఎందుకు? ఎందుకని ఇంతలా భయపడుతున్నారు? జరుగుతున్న పరిణామాలన్నింటినీ దేశమంతా చూస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. కాగా సుప్రీం కోర్టు సుశాంత్ బలవన్మరణం కేసును సీబీఐకి అప్పగించాలని కంగనా మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అనంతరం ఇదే డిమాండ్ అంతటా వినిపించడంతో ఎట్టకేలకు సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించిన విషయం తెలిసిందే. (సుశాంత్ కేసు సీబీఐకే) -
పంజాబ్ టు కెనడా
దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తర్వాతి చిత్రంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘జీరో’ చిత్రం తర్వాత షారుక్ మరో సినిమాకు సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించే చిత్రానికి రంగం సిద్ధమైందని బాలీవుడ్ టాక్. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని గత ఏడాదే వార్తలు వచ్చాయి. కథ రెడీ అయ్యిందని, హిరాణీ అండ్ టీమ్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారని సమాచారం. ఇందులో సరదా సరదాగా ఉండే వ్యక్తి పాత్రలో షారుక్ నటించబోతున్నారట. ఇందుకోసం ప్రస్తుతం జుట్టు పెంచుతున్నారని భోగట్టా. పంజాబ్ టు కెనడాల మధ్య ప్రయాణించే ఓ వ్యక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్‌ను ప్లాన్ చేశారట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
టాప్‌లో 3 ఇడియట్స్!
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్‌కి తాళం పడిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని ఈ పరిస్థితిలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాలను చూస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న యుఎస్‌లో లాక్డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ నిలిచింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు హిరాణీ. ఇక ‘ది డార్క్‌నైట్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘ఇన్సెప్షన్’, ‘మ్యారేజ్ స్టోరీ’ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా యూఎస్ ప్రజానీకం ఎక్కువగా వీక్షించారు. -
ఎదురు చూస్తున్నా
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కెరీర్లో ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’(2003), ‘లగే రహో మున్నాభాయి’ (2006) చిత్రాలు ప్రత్యేకమైనవి. ఈ రెండు చిత్రాల్లో మంచి ఎమోషన్‌కు కాస్త కామిక్‌ను జోడించి హిట్స్ అందుకున్నారు సంజయ్‌దత్. ఈ రెండు సినిమాలకు రాజ్‌కుమార్ హిరాణీయే దర్శకుడు. మరి... ఈ మున్నా భాయ్ ఫ్రాంౖచైజీలో థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్నను సంజయ్‌దత్ ముందు ఉంచితే – ‘‘మరో సీక్వెల్ రావాలని నేను కూడా దేవుణ్ని కోరుకుంటున్నాను. కానీ ఈ విషయం గురించి స్పందించాల్సింది దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. నేనైతే ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్‌కి కథ రాస్తున్నానని గతంలో రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మరి.. కథ ఎందాకా వచ్చింది? అనే విషయంలో క్లారిటీ లేకే సంజయ్ ఈ విధంగా చెప్పి ఉంటారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’ చిత్రాన్ని ‘శంకర్దాదాఎమ్బీబీఎస్’ (2004)గా, ‘లగే రహో మున్నాభాయ్’ చిత్రాన్ని ‘శంకర్‌దాదా జిందాబాద్’ (2007)గా చిరంజీవి తెలుగులో రీమేక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సోలోగానే వెళ్తానంటోన్న టాప్ డైరెక్టర్
తనుశ్రీ దత్తా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా, జర్నలిజం వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో దేశం అట్టుడికి పోయింది. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కూడా ఉన్నారు. ‘సంజు’ సినిమా సమయంలో రాజ్‌కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది అనీల్ కపూర్ - సోనమ్ కపూర్లు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా’ లగా చిత్రం నుంచి కూడా రాజ్‌కుమార్ పేరును తొలగించారు. ఇన్నాళ్లు వినోద్ చోప్రోతో కలిసి తన ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రాజ్‌కుమార్ హిరాణీ తొలిసారి ఒంటరిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ సారి రాజ్‌కుమార్ ఒక్కరే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులతో సినిమా గురించి మాట్లాడారు. వారంతా ఈ చిత్రంలో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన వెలువడనుంద’ని రాజ్‌కుమార్ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. గతంలో రాజ్‌కుమార్ సంజు, పీకే సినిమాలకు వినోద్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌కుమార్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. -
ఆ ఆరోపణలను నమ్మను
‘‘దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలసి చాలా సినిమాలు చేశాను. చాలా కాలంగా అతను నాకు పరిచయం. అతని మీద వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను నేను అస్సలు నమ్మను’’ అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ‘మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే, సంజు’ చిత్రాల దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను సంజయ్ దత్ కొట్టి పారేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘రాజు మీద ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఆరోపణలు కాకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చుగా?’’ అన్నారు. ‘‘మున్నాభాయ్ సిరీస్‌లో కొత్త చిత్రం కచ్చితంగా ఉంటుందని రాజు ఆల్రెడీ చెప్పాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో నాక్కూడా సరిగ్గా తెలియదు’’ అని కూడా సంజయ్ దత్ చెప్పారు. -
‘ఆ ఆరోపణలు అవాస్తవం అయితే..?!’
నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం సిని రంగంవారేకాక.. మీడియా రంగంలోని వారు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులను బయటపెట్టారు. బాలీవుడ్‌లోని చాలామంది ప్రముఖులు బాధితులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకడు రాజ్‌కుమార్ హిరాణీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రం పోస్టర్ నుంచి రాజ్‌కుమార్ హిరాణీ పేరు తొలగించారు. అయితే మీటూ ఉద్యమం ప్రారంభం నుంచి బాధితులకు మద్దతు తెలిపిన సోనమ్ కపూర్ రాజ్‌కుమార్ హిరాణీ విషయంలో మాత్రం ఆయనకే మద్దతిస్తోంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మీటూ ఉద్యమంలో ప్రతి బాధితురాలిని నేను నమ్ముతాను. కానీ హిరాణీ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. హిరాణీ దర్శకునిగానే కాక వ్యక్తిగతంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను ఆయనను చాలా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు నా సినిమా కూడా నాకు ముఖ్యమే. సినిమా విడుదలయ్యాక దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ నేను ఒక్క విషయం అడగదల్చుకున్నాను.. హిరాణీ మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలితే అప్పుడేంటి పరిస్థితి. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ ఉద్యమం పూర్తిగా దెబ్బతింటుంది’ అని తెలిపారు సోనమ్ కపూర్. హిరాణీ మీద వచ్చిన లైంగిక వేధింపలు ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కాక స్నేహితులు, పలువురు నటులు కూడా కొట్టిపారేస్తున్నారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. -
‘తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’
‘రాజ్‌కుమార్ చాలా మంచివాడు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నేను నమ్మను. తను ఎప్పటికీ అలాంటి పని చేయడు’ అంటూ నిర్మాత బోనీ కపూర్... బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీకి మద్దతుగా నిలిచారు. తనను లైంగికంగా వేధించారంటూ హిరాణీ వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి దియా మీర్జా, రచయిత జావేద్ అక్తర్, హర్షద్ వాసి, షర్మాన్ జోషి తదితర ప్రముఖులు రాజ్‌కుమార్‌కు మద్దతుగా నిలుస్తుండగా... మరికొంత మంది మాత్రం ఈ విషయం గురించి పూర్తి నిజాలు బయటపడిన తర్వాతే మాట్లాడాల్సి ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన హీరో ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ..‘ నేను దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. అయినా హిరాణీ ఈ వీటిని కొట్టిపారేశారు కూడా. నిజ నిర్ధారణ జరిగేంత వరకు ఈ విషయం గురించి కామెంట్ చేయకపోవడమే మంచిది’ అని వ్యాఖ్యానించాడు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం సినిమా షూటింగ్లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో #మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వివిధ రంగాల్లో తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. (టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!) రాజ్‌కుమార్ హిరాణీ -
‘15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు’
ముంబై: ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల హీరోయిన్ దియా మిర్జా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరగాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఈ వార్త విని చాలా బాధ పడ్డాను. 15 ఏళ్లుగా రాజు సర్ నాకు తెలుసు. ఆయనను ఎంతో గౌరవిస్తాను. నేను పనిచేసిన వారిలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. పూర్తి వివరాలు తెలియకుండా దీని గురించి వ్యాఖ్యానించలేను. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు జరగాల’ని దియా మిర్జా అన్నారు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన లగే రహో మున్నాభాయ్, సంజు సినిమాల్లో ఆమె నటించారు. హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తనను పలుమార్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బల్, సీనియర్ నటులు అలోక్‌నాథ్, నానాపటేకర్, సంగీత దర్శకుడు అనుమాలిక్ తదితరులు ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే. -
‘రాజ్‌కుమార్ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్ చోప్రాకు ఆమె ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది. -
రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో సంబురాలు
దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. సంజు చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజులో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించగా, రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్టర్. సంజు బాబా లైఫ్‌లోని ప్రధాన కోణాలతో ఈ చిత్రాన్ని భావోద్వేగంగా హిరాణీ తెరకెక్కించాడు. తొలిరోజు రూ.34 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన సంజు.. వరుస డిజాస్టర్లతో అయోమయంలో ఉన్న రణ్‌బీర్ కెరీర్‌కు భారీ సక్సెస్ ఇచ్చింది. అమీర్‌ఖాన్ దంగల్(2016 డిసెంబర్) తర్వాత రిలీజ్ అయిన (బాహుబలి-2ని మినహాయిస్తే...) చిత్రాలేవీ పట్టుమని మూడు వందల కోట్ల క్లబ్లో చేరలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్‌లైట్.. షారూఖ్ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్లు చతికిలపడగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్ జిందా హై, రేస్-3.. పద్మావత్ లాంటి చిత్రాలు ఆ ఫీట్‌ను సాధించలేకపోయాయి. ఈ తరుణంలో బిగ్గెస్ట్ హిట్ కోసం బాలీవుడ్ దాహాన్ని సంజు తీర్చేసింది. ఇండియాలో రెండువారాల్లో 378 కోట్ల (గ్రాస్), రూ.295 కోట్ల(నెట్) వసూళ్లు(తొలివారంలోనే రూ.202 కోట్లు) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో 7 మిలియన్ క్లబ్ దాటేసి ఇంకా దూసుకుపోతోంది. విమర్శలు... అయితే సంజు జీవితంలోని చీకటి కోణాలు పేరిట రాజ్‌కుమార్ హిరాణీ తప్పులను కప్పిపుచ్చాడని పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో మిశ్రమ రివ్యూలు ఇవ్వటంతోపాటు, పలు కోణాల్లో క్రిటిక్స్ సంజును తప్పుబట్టారు. అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని, దాచేందుకు ఏం లేదంటూ విమర్శలపై సంజయ్ దత్ అంతే ఘాటుగా స్పందించారు. -
సంజయ్ దత్ గొప్పా.. ఎలా? : పాంచజన్య
న్యూఢిల్లీ : సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్ కాలమ్‌లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్ మాత్రం అండర్వరల్డ్కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది.