
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సంజుగా రణ్‌బీర్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా సంజు మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, రణ్‌బీర్ కపూర్‌లపై హీరోయిన్ అలియా భట్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన స్పందన తెలియజేస్తూ... ‘రాజ్‌కుమార్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. అయితే గత రెండేళ్లలో ఆయన తీసిన గొప్ప సినిమా ఏదంటే మాత్రం కచ్చితంగా సంజు అనే చెప్తాను. ఈ సినిమా ద్వారా ఆయన స్టామినా ఏంటో మరోసారి రుజువైంది’ అంటూ అలియా వ్యాఖ్యానించారు.
పనిలో పనిగా తన స్నేహితుడు రణ్‌బీర్ కపూర్‌ను కూడా పొగడ్తల్లో ముంచెత్తారు అలియా. ‘సంజు పాత్రలో రణ్‌బీర్ జీవించేశారు. నా ఫేవరెట్ సినిమాల్లోని టాప్ 10లో సంజుకు మొదటి స్థానం ఇస్తాను. విక్కీ కౌశల్, పరేష్ జీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇదొక అద్భుతమైన సినిమా’ అంటూ అలియా ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment