భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు రణ్‌బీర్ కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లు(ఫస్ట్ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. సంజు మూవీ రివ్యూ
బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్‌బీర్ కెరీర్‌లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment