taran adarsh
-
Hanuman Movie: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. గూస్బంప్స్ ఖాయం!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: 'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్) ఈ నేపథ్యంలో ఇప్పటికే హనుమాన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని చూసి తన రివ్యూను వెల్లడించారు. ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైనర్ను అందించాడని అన్నారు. కథ, భావోద్వేగాలు, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే గూస్బంప్స్ ఖాయమంటున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. హనుమాన్ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఆయన 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మూవీని హిందీలో చూసిన ఆయన తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. #OneWordReview...#HanuMan: FASCINATING. Rating: ⭐️⭐️⭐️½ Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd — taran adarsh (@taran_adarsh) January 11, 2024 -
‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్.. ఇంత మంది మూర్ఖులా!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఏముందని చూస్తున్నారు? ‘పఠాన్’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్’ను కనుగొన్నారని సెటైర్ వేశారు. My estimate of fools in India has gone up from 90% to 95% after seeing the response to the film Pathan — Markandey Katju (@mkatju) January 26, 2023 అన్నీ ఉన్నాయి 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్’లో అన్నీ ఉన్నాయి. స్టార్ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్ ఖాన్. 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్!’అని ట్వీట్ చేశారు. అంతేకాదు ట్విటర్లో ‘పఠాన్’సినిమాకు నాలుగున్న స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. #OneWordReview...#Pathaan: BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/Xci1SN72hz — taran adarsh (@taran_adarsh) January 25, 2023 కాగా, పఠాన్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్ పని అయిపోయిందంటూ ట్వీట్.. చివర్లో ట్విస్ట్!) -
'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా
Jersey Movie Again Postponed From December 31: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేశారు. అయితే తాజాగా డిసెంబర్ 31న కూడా జెర్సీ చిత్రం విడుదలకు నోచుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడినట్లు ప్రముఖ చిత్ర పరిశ్రమ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్లో తెలిపాడు. 'ఎక్స్‌క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ చిత్రం డిసెంబర్ 31 విడుదల కావట్లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు.' అని ట్వీట్ చేశారు. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... #BreakingNews... #Jersey POSTPONED... WON'T RELEASE ON 31 DEC... New date will be announced shortly... Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC — taran adarsh (@taran_adarsh) December 28, 2021 ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
నో థియేటర్..ఓన్లీ ‘ఓటీటీ’: నష్టాలకే మొగ్గు!
ఓవైపు థియేటర్ యాజమాన్యాల హెచ్చరికలు.. మరోవైపు సంగ్ధిగ్ధ స్థితిలో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాయి. వెరసి.. ‘పెద్ద సినిమాల రిలీజ్’ వివాదాస్పదంగా మారుతోంది. అయితే సౌత్‌తో పోలిస్తే.. నార్త్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మరి ‘డిజిటల్’ రిలీజ్‌లతో నిర్మాతలు నిజంగా అంత లాభపడుతున్నారా? సాక్షి, వెబ్‌డెస్క్: కిందటి ఏడాది కరోనా-లాక్డౌన్ టైం నుంచే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి హిందీ సినిమాలు. నెలకు కమ్‌సేకమ్ ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా ఉంటుండగా, అందులో స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలు, అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఉంటున్నాయి. అయితే చాలాకాలం నుంచి థియేటర్లు తెరుస్తారనే సంకేతాలు ప్రభుత్వాల నుంచి వెలువడుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ స్ట్రీమింగ్ సర్వీసులకే ప్రాధాన్యం ఇస్తోంది బాలీవుడ్. ‘భుజ్’ లాంటి భారీ ప్రాజెక్టు ఓటీటీ రిలీజ్‌కే మొగ్గు చూపడం అందుకు నిదర్శనం. కొసమెరుపు ఏంటంటే.. ఇలా ఓటీటీ రిలీజ్ ద్వారా ఫిల్మ్‌మేకర్స్ పెద్దగా వెనకేసుకుంటోంది ఏం లేకపోగా.. కొందరైతే నష్టాలతోనే అమ్మేసుకుంటున్నారు. ఒరిగిందేం లేదు ఆలస్యం చేయకుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కువ రీచ్ ఉంటుందని నిర్మాతలు పైకి చెప్పుకుంటున్నప్పటికీ.. ఆర్థికంగా ఆ నిర్ణయం వాళ్లను పెద్ద దెబ్బే తీస్తోంది. కిందటి ఏడాది లాక్డౌన్ టైంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ. డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం ‘డిజాస్టర్’. కానీ, ఆ సీజన్లో వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఓటీటీ హక్కుల ద్వారా వంద కోట్ల దాకా వెనకేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో వరుణ్ ధావన్ ‘కూలీ నెం.1’ క్రిస్మస్ సీజన్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. నిజానికి టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలు గనుక థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉంటే.. మినిమమ్ వంద కోట్ల బిజినెస్.. మాగ్జిమం 250 కోట్ల దాకా ఫుల్‌రన్ బిజినెస్ చేసి ఉండేవేమో. అటుపై టాక్‌ను బట్టి శాటిలైట్, ఓటీటీ రైట్స్‌తో అదనంగా ఆదాయం వచ్చి ఉండేది. అదే విధంగా ఈ ఏడాదిలో సల్మాన్ ఖాన్ ‘రాధే’, ఫర్హాన్ అక్తర్ ‘తూపాన్’ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ, వీటి రేంజ్‌కి థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే.. డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా పెద్దగా వచ్చిన లాభం ఏం లేదని బాలీవుడ్ ట్రేడ్ గణాంకాలే చెప్తున్నాయి. అయినను ఓటీటీకే.. అక్షయ్ కుమార్ బాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన సినిమా మినిమమ్ వంద కోట్ల బిజినెస్ చేస్తుంటుంది. అలాగే అజయ్ దేవగన్‌కి కూడా వంద కోట్ల మార్కెట్ ఉంది. ఫర్హాన్ అక్తర్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లకు రేంజ్ 75 కోట్ల రూపాయల పైనే. ఇక స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఎలాగూ 30 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేస్తుంటాయి. ఇలాంటి టైంలో లాభాలు తెచ్చే థియేటర్ బిజినెస్‌ను కాదని.. ఓటీటీకే ఫిక్స్ అవుతున్నారు నిర్మాతలు. త్వరలో బాలీవుడ్లో ‘భుజ్ ది ప్రైడ్’, సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’లు ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతున్నాయి. మరో నాలుగైదు సినిమాలు కొన్ని రిలీజ్ కాగా, మరికొన్ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకులనే అలరించబోతున్నాయి. మొత్తంగా థియేటర్ బిజినెస్‌తో ఇవి ఐదారు వందల కోట్ల దాకా బిజినెస్ చేయొచ్చు. కానీ, కేవలం 150 కోట్ల డీల్‌తో ముగించుకుని డిజిటల్ తెరపై సందడి చేయబోతున్నాయి. ఇందులో భుజ్.. భారీ కాస్టింగ్, బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే నిర్మాణ ఖర్చుల కంటే తక్కువ ధరకు ఓటీటీ రిలీజ్‌కు వెళ్తుండడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే షేర్షా కూడా బడ్జెట్ కంటే తక్కువ మార్కెట్‌తోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన లాభాల మాటేమోగానీ.. లాస్‌తోనే ఈ రెండు సినిమాలు థియేటర్లను కాదనుకుని రిలీజ్ అవుతున్నాయి. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి థియేటర్లో భారీ సంఖ్యలో స్క్రీన్లపై రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఇందుకు థియేటర్-మల్టీఫ్లెక్సుల యాజమాన్యాలు అంగీకరిస్తాయా? అనేది ప్రశ్నార్థకమే. బ్యాడ్మార్క్ వల్లే.. కరోనా టైం నుంచే బాలీవుడ్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. సుశాంత్ మరణానంతరం బాలీవుడ్ పరిణామాలు విపరీతంగా మారిపోయాయి. ఆడియొన్స్‌లో ఇండస్ట్రీ పట్ల నెగెటివిటీ కొనసాగుతోంది. ఉదాహరణగా సడక్-2కు ఎంత దారుణంగా తిప్పి కొట్టారో తెలిసిందే. అలాగే మంచి సినిమాలకు ఆదరణ కూడా అంతంతగా మాత్రంగానే దక్కింది. అనూహ్యంగా.. ఓటీటీలో సౌత్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఈ తరుణంలోనే థియేట్రికల్ రిలీజ్‌కు బడా ఫిల్మ్ మేకర్లు వెనుకంజ వేస్తున్నారనేది ముంబైకి చెందిన ఓ సీనియర్ క్రిటిక్ అభిప్రాయం. అయితే ఇందులో నిజం లేదని, పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి మునుపటిలా మారుతుందనేది బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్నాడు. ఏదేమైనా బాలీవుడ్ మునుపటిలా కలెక్షన్లు కొల్లగట్టే స్థితికి చేరేది అనుమానమనేది చాలామంది విమర్శకుల అంటున్న మాట. -
‘జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్?’
వాషింగ్టన్: కరోనా లాక్డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు రీఓపెన్ కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. జులై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని సమాచారం. అయితే ఇక్కడ కాదండోయ్ అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికాలో. జులై 10 నుంచి లాస్ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలలో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 10 నుంచి థియేటర్లలో సినిమా చూడొచ్చని అక్కడి వార్తాసంస్థ ట్వీట్ చేయగా ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ రీట్వీట్ చేశారు. దీంతో అక్కడి సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (ఆ దేవదూతకు కృతజ్ఞతలు: నటి) ఇక భారత్‌లో లాక్డౌన్ సండలింపులు ఇస్తున్నప్పటికీ థియేటర్స్ రీ ఓపెన్‌కు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. జనసమూహం ఎక్కువగా ఉండటం, కరోనా వ్యాప్తి ఎక్కువగా చెందే అవకాశం ఉండటంతో థియేటర్లు, విద్యాసంస్థలు, తదితర వాటికి అనుమతులను ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వాలు పలు నిబంధనలతో అనుమతులు ఇస్తున్నాయి. ఇక షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియక ఓటీటీ బాట పడుతున్నాయి. (బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది) IMPORTANT DEVELOPMENT... Movie theatres in #LA and #NYC hope to reopen on 10 July 2020 https://t.co/PvYLUhyAI9 — taran adarsh (@taran_adarsh) June 17, 2020 -
‘రూ వంద కోట్ల క్లబ్ చేరువలో బాలా’
ముంబై : ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. శనివారం రూ 6 కోట్లు కలెక్ట్ చేసిన బాలా మొత్తం వసూళ్లు రూ 82.73 కోట్లు రాబట్టగా ఆదివారం రూ 90 కోట్ల మార్క్ దాటి రూ 100 కోట్ల క్లబ్‌కు చేరువవుతుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత వారం విడుదలైన బాలా పాజిటివ్ రివ్యూలతో క్రమంగా వసూళ్లను కొల్లగొడుతూ నిలకడగా సాగుతోంది. బట్టతల కష్టాలను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయుష్మాన్ ఖురానా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా, భూమి పెడ్నేకర్, యామి గౌతమ్‌లు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. -
దెబ్బకు ట్వీట్ డెలిట్ చేశాడు!
సినీ ప్రేమికులందరికీ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో ఆయన ఇచ్చే రివ్యూలకు, చెప్పే బాక్సాఫీస్ కలెక్షన్లపై అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే ఈ సారి ఆయన చెప్పిన బాక్సాఫీస్ లెక్కలు తప్పాయి. అందులోనూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తక్కువ చేసి చూపడంతో ఆ చిత్ర నిర్మాత తరణ్ ఆదర్శ్‌కు చురకలంటించారు. ఆ దెబ్బతో ఆయన ఆ ట్వీట్‌ను డెలిట్ చేసేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎండ్‌గేమ్ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని.. బాహుబలి2 రెండో స్థానంలోకి వెళ్లిందని ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో మరో మూడు, నాలుగు హిందీ సినిమాల పేర్లు ఉన్నాయని తెలిపాడు. అయితే బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌కు స్పందించారు. మీరు లిస్ట్‌లో చేర్చిన సినిమాలను తక్కువ చేయాలని మాట్లాడటం లేదు.. కానీ మీరు చేసిన పోలిక మాత్రం సరైంది కాదు ఎందుకుంటే బాహుబలి2 అనేది కేవలం హిందీలో డబ్ కాగా ఆ చిత్ర వసూళ్లను.. మిగతా చిత్రాలతో ఎలా పోలుస్తారు అంటూ ప్రశ్నించారు. మిగతా సినిమాలన్నీ ఇండియా పాన్ సినిమాలని, అన్ని భాషల్లో కలిపి సాధించిన వసూళ్లతో బాహుబలి2ను ఎలా ఒకటిగా పరిగణిస్తారంటూ ట్వీట్ చేశారు. దీంతో తరణ్ ఆదర్శ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. Not to take away the success any of the films listed below, I don't think this is a right comparison and doesn't put things in perspective especially from veteran trade analyst like yourself! BB2 one language (predominantly North India) vs all other films all languages pan India https://t.co/IP2d2BbMEK — Shobu Yarlagadda (@Shobu_) May 3, 2019 -
మణికర్ణిక మూడు రోజుల వసూళ్లు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. తొలిరోజు ఆశించిన వసూళ్లు లేకున్నా మెల్లగా పుంజుకున్న మణికర్ణిక రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయిగా ప్రేక్షకులను అలరించడంతో వసూళ్లు జోరందుకున్నాయి. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన థాకరే బయోపిక్ మహారాష్ట్రలో విజయవంతంగా నడుస్తున్నా థియేటర్ల వద్ద మణికర్ణిక జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ, పంజాబ్, రాజస్ధాన్‌లలో మణికర్ణిక భారీ వసూళ్లను రాబడుతోందని విడుదలైన మూడు రోజుల్లో హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లు కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
తప్పు నాదే, క్షమించండి: ఆమిర్ ఖాన్
బాలీవుడ్‌కు ఈ ఏడాది కచ్చితంగా గుర్తుండిపోతుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. బాహుబలి రికార్డులను వేటాడటానికి బరిలోకి దిగిన ఈ సినిమా.. పెట్టిన దాంట్లో కనీసం సగంవరకు కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. ఇంతటి పరాభవాన్ని ఆమిర్ మునుపెన్నడూ ఎదుర్కోలేదు. గత కొంతకాలంగా ఆమిర్ తన సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తుండగా.. ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రం పరాజయం కావడానికి తానే కారణమని, ఆ తప్పును తనమీదే వేసుకున్నాడు ఆమిర్ ఖాన్. అయితే ఏదైనా సినిమా ఫెయిల్ అయితే హీరోలు బయటకురావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆమిర్ మాత్రం అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులను అలరించలేపోయినందుకు క్షమాపణలను కోరారు. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. ఈ ఆటలో గెలుపోటములు సహజమని ఆమిర్ తప్పక మళ్లీ తన స్టామినా ఏంటో చూపిస్తారనే నమ్మకం మాకుందని.. ఓటమిని ఒప్పుకోవడం చాలా కొద్దిమంది స్టార్స్లోనే చూశానని ఆమిర్‌కు ఎంతో ధైర్యం ఉందని.. అందుకే ఈ మూవీ ఫెయిల్యూర్‌ను తన భుజాన వేసుకున్నారని అన్నారు. Hits and flops are a part of the game... You win some, you lose some... Am sure, Aamir and YRF will bounce back with renewed vigour... #TOH is akin to a wake up call for everyone in the industry... Never take the audience for granted! — taran adarsh (@taran_adarsh) November 27, 2018 That moment when the audience delivers its verdict and the BO numbers start crumbling, I have seen the biggest of actors and film-makers break into a cold sweat... Fridays can make or break a film and change the fortunes - that’s the reality… #TOH — taran adarsh (@taran_adarsh) November 27, 2018 Very brave and courageous of Aamir Khan to admit #TOH is a failure and take the onus on himself... Very few people associated with a dud would accept that *on a public platform*... In the past, I have seen actors/filmmakers come up with hazaar excuses... — taran adarsh (@taran_adarsh) November 27, 2018 -
ఆమిర్ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?
మిస్టర్ పర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా ఫేల్యూర్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయొచ్చని ఆశపడ్డ ఆమిర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో.. భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. సినిమా విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండిపడింది. బాహబలి రికార్డులను తిరగరాయడం మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 100 కోట్ల మార్కును మాత్రమే దాటిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత నాలుగు రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో వెల్లడించారు. (‘థగ్స్’కు అంత సీన్ లేదు..!) హిందీ పరిశ్రమ వసూళ్లు (కోట్లలో) : గురువారం- 50.75; శుక్రవారం- 28.25; శనివారం- 22.75; ఆదివారం- 17.25; సోమవారం- 5.50 మొత్తం : 124.50 కోట్లు తెలుగు+తమిళం వసూళ్లు (కోట్లలో) : గురువారం- 1.50 కోట్లు; శుక్రవారం- 1 కోటి; శనివారం-75 లక్షలు; ఆదివారం- 75 లక్షలు; సోమవారం- 50 లక్షలు మొత్తం : 4.5 కోట్లు ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కథ, కథనం సీరియల్ తరహాలో సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారని సినీ విమర్శకులు రివ్యూలు రాశారు. విమర్శకుల రివ్యూలు పక్కనబెడితే.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై అభిమానులు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ట్విటరటీలు చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లు మీకోసం.. ఈ సినిమా మొదలైన 20 నిముషాల తర్వాత.. ఓ యువతి ‘నన్ను వెళ్లనీయండి ప్లీజ్.. నేను వెళ్లాలి’ అంటూ దీనంగా అర్థించే వీడియో ఒకరు పోస్టు చేయగా.. టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని మరొకరు ట్వీట్ చేశారు. సినిమా చూసొచ్చిన అభిమానులంతా కట్టగట్టుకుని బావిలో దూకే వీడియో పెట్టి మరొకరు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సినిమాకు షారుఖ్‌ఖాన్ తాజా మూవీ... ‘జీరో’ రేటింగ్ ఇస్తున్నామని ఇంకొకరు వ్యంగ్యాస్త్రం వేశారు. ఇంకోవైపు.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అద్భుతంగా ఉందనీ, ఆమిర్, అమితాబ్ నటనకు జేజేలు పలుకుతున్నారు కొందరు అభిమానులు. కాగా, విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దంగల్ ఫేం.. ఫాతిమా సనా షేక్ నటించారు. -
కంటెంట్ కింగ్.. ఆడియన్స్ కింగ్మేకర్స్!
ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. అందులోఉన్న చిన్న లాజిక్, జనాలు మెచ్చే కంటెంట్ లేకపోతే అది డిజాస్టర్‌గా మిగిలిపోవాల్సిందే. సినిమాను నిలబెట్టేది స్టార్లు కాదు.. స్టోరీ. కథ, కథనాలు లేని సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి భారీ తారాగణంతో ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని ఆశపడిన బాలీవుడ్ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది. రికార్డుల మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల మార్కును మాత్రమే దాటింది. అయితే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండికొట్టింది. ఎంత ఆమిర్, అమితాబ్‌లు ఉన్నా.. సినిమాలో అసలు విషయం లేకపోయే సరికి వసూళ్లపై ప్రభావం గట్టిగా చూపింది. అయితే ఇదే సమయంలో కుటుంబ కథానేపథ్యంలో లేటు వయసులో ప్రేమ, బిడ్డను కనడం, కుటుంబ ఘర్షణలు, ప్రేమానురాగాలతో కూడిన ‘బధాయీ హో’ విమర్శకుల ప్రశంసలనే కాదు, ప్రేక్షకుల మన్నలను కూడా దక్కించుకుంది. అయితే దివాళి కానుకగా అన్ని థియేటర్లలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ను ప్రదర్శించారు. దాని ఫలితం తేలిపోయేసరికి వీకెండ్లో ఎలాగోలా గట్టెక్కించారు. అయితే ఈ వీకెండ్లో ‘బదాయిహో’కు షోలు తగ్గించేశారు. కానీ ఈ సోమవారం నుంచి మళ్లీ బధాయీ హోకు షోలు పెరిగాయి. ఎప్పటికైనా కథే కింగ్, అని ఆడియెన్సే కింగ్ మేకర్స్ అంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. Boxoffice can be most unpredictable, but that’s the beauty of this business... #BadhaaiHo was down to 2/3 shows at several plexes during #Diwali weekend, but, today [Mon] onwards, the film is back in 4/5/6 shows... Content is King and the audiences are King Makers! — taran adarsh (@taran_adarsh) November 12, 2018 చదవండి : ‘బధాయీ హో’పై సమీక్ష -
‘అరవింద’ ప్రీమియర్ షో కలెక్షన్లు అదుర్స్
మాటల మాంత్రికుడు కలానికి పదును పెట్టి మాటల తూటాలను పేల్చితే ఎలా ఉంటుందో.. యంగ్ టైగర్ తన నట విశ్వరూపాన్ని చూపితే ఎలా ఉంటుందో.. సరైన సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ,ఎన్టీఆర్ కాంబినేషన్‌ల్లో రిలీజైన ‘అరవింద సమేత’ ఓవర్సీస్లో దూసుకెళ్తోంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్లో ఒక్కరోజులోనే మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. ఈ హవా చూస్తుంటే మూడు మిలియన్ల మార్క్‌ను కూడా అవలీలగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో.. వేచి చూడాలి. జగపతి బాబు, నాగ బాబు, పూజా హెగ్డే, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందిచారు. #MillionDollarAravindhaSametha 🔥 pic.twitter.com/XeBEGsNNY9 — #RageOfTiger / Vainavi Hanvi Creations (@vainavihanvi) 12 October 2018 చదవండి : ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ రివ్యూ -
అఫీషియల్: ఎన్టీఆర్‌లో రానా
నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ ఆయన తనయుడు బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంపార్టెంట్ అప్డేట్ అందింది. యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టులో భాగంగా కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించాడు. ‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ బాలయ్య, క్రిష్‌లతో ఓ సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానా.. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడి పాత్రలోనే కనిపించబోతున్నాడంటూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. నందమూరి బాలకృష్ణతోపాటు విష్ణు వర్ధన్, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కైకాల సత్యనారాయణ, ప్రకాశ్ రాజ్, విద్యాబాలన్, సీనియర్ నటుడు నరేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఎన్టీఆర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. #BreakingNews: Rana Daggubati to play Andhra Pradesh CM and NTR’s son-in-law N Chandra Babu Naidu in #NTR biopic... Stars Balakrishna [as NTR] and Vidya Balan [as NTR’s wife Basavatarakam]... Directed by Krish... Produced by Balakrishna, Vishnu Vardhan Induri and Sai Korrapati. pic.twitter.com/vl31OqmodQ — taran adarsh (@taran_adarsh) 3 August 2018 -
హయ్యెస్ట్ గ్రాసర్‌గా ‘సంజు’
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు రణ్‌బీర్ కెరీర్లోనే బెస్ట్ వసూళ్లు(ఫస్ట్ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. సంజు మూవీ రివ్యూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్‌బీర్ కెరీర్లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్లోనే వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
నిలకడగా ‘పరమాణు’ కలెక్షన్స్
జాన్ అబ్రహాం, డయానా పెంటీ జంటగా నటించిన పరమాణు చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. దర్శకుడు అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని పొఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక పక్క రేస్ 3, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా.. వాటి పోటీని తట్టుకుని ఈ చిత్రం నిలబడింది. పరమాణు చిత్ర కలెక్షన్స్‌కు సంబంధించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ.. రేస్ 3 వంటి కమర్షియల్ సినిమాని తట్టుకుని 62.14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాలు గడిచినప్పటికి రోజు వారి కలెక్షన్స్‌లు బాగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, వికాస్ కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
వంద కోట్ల క్లబ్లో రేస్ 3
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రేస్ 3 విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన పొందినా కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. రేస్ 3 రూ వంద కోట్ల క్లబ్లో అవలీలగా చోటు దక్కించుకుంది. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిన సల్మాన్ నాలుగో సినిమాగా నమోదైందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకూ సల్మాన్ నటించిన భజరంగిభాయ్‌జాన్, సుల్తాన్, టైగర్ జిందాహై మూడు రోజుల్లో వంద కోట్ల వసూళ్ల మార్క్‌ను అధిగమించాయి. ఇక రేస్ 3 శుక్రవారం రూ 29.17 కోట్లు, శనివారం 38.14 కోట్లు, ఆదివారం రూ 39.14 కోట్లు కలెక్ట్ చేసిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. రేస్ 3లో సల్మాన్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, బాబీ డియోల్, సాఖిబ్ సలీం, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రేస్ ఫ్రాంచైజ్‌లో గతంలో సైఫ్ అలీఖాన్ నటించగా, రేస్ 3లో బాలీవుడ్ కండలవీరుడు ఎంటరయ్యాడు. -
ఆ హీరోయిన్ డ్రెస్‌కి 25 ఏళ్లంట!
ముంబై: ప్రముఖ డైరెక్టర్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో బాలీవుడ్ నటులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు. తాజాగా కరినా వేసుకున్న డ్రస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్ వేసుకున్న డ్రస్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఆ డ్రస్ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్ 25 ఏళ్ల క్రితం డిజైన్ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్ చేయమన్నారు. స్కర్ట్, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్ చేశాం. పెళ్లి సీన్లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’ అని అబుజానీ వెల్లడించారు. మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్’ సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
భాగీ 2 వసూళ్ల సునామీ
సాక్షి, న్యూఢిల్లీ : విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా భాగీ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టైగర్ ష్రాఫ్ ఈ మూవీతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్డాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావత్‌ను అధిగమించి 2018లో అత్యధిక ప్రారంభ వసూళ్లు దక్కించుకున్న భాగీ 2 మూడవ వారానికి రూ 155 కోట్లు వసూలు చేసింది. భాగీ 2 రూ 150 కోట్ల మార్క్‌ను దాటి మాస్, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో బారీ వసూళ్లను రాబడుతోందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ 155.65 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు.టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా తెరకెక్కిన భాగీ 2ను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రియల్ లైఫ్‌లో డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న టైగర్, దిశా ఆన్‌స్క్రీన్ కెమిస్ర్టీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 2016లో తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా బాలీవుడ్లో భాగీ తెరకెక్కి ఘనవిజయం దక్కించుకుంది. -
ఓపెనింగ్ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ తాజా సినిమా ‘రెయిడ్’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్’... ఈ ఏడాది వీకెండ్ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచిందని ఫిలీం ట్రెడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్ కలెక్షన్లతో పద్మావత్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్ రెండో స్థానంలో ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజా సినిమా ‘రెయిడ్’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది. మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్ అనాలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ కమీషనర్ అమై పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది. -
రెండు వారాల్లో రూ. 200 కోట్లు క్రాస్
సాక్షి, సినిమా : వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగు పెట్టినా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లు దాటిపోయింది. ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 212.5 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారంలో రూ. 166.50 కోట్లు, రెండో వారంలో రూ. 46 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.212.50 కోట్లు వసూలు చేసిందని పోస్ట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. #Padmaavat biz at a glance... Week 1: ₹ 166.50 cr Weekend 2: ₹ 46 cr Total: ₹ 212.50 cr India biz. SUPER-HIT. — taran adarsh (@taran_adarsh) 5 February 2018 -
'అజ్ఞాతవాసి'ని ఇంకా ఏమంటారు : తరణ్ ఆదర్శ్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అజ్ఞాతవాసి, ఓవర్ సీస్ లో మాత్రం భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అమెరికాలో హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటీపడి తెలుగు సినిమా టాప్ స్థానంలో నిలిచిందని, తొలిరోజు కలెక్షన్లపై తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 'అజ్ఞాతవాసి సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో మొదలయింది. వీకెండ్ మధ్యలో విడుదలైనా కానీ.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(9 కోట్ల 65 లక్షల రూపాయలు)కు పైగానే కలెక్ట్ చేసింది.. ఈ కనెక్షన్లను తుఫాన్ అనాలా..?, సునామీ అనాలా..? టైఫూన్ అనాలా..?. అమెరికాలో కేవలం ప్రీమియర్ల ద్వారానే 1.5మిలియన్ డాలర్లను అజ్ఞాతవాసి సినిమా దాటేసింది. వర్కింగ్ డే అయినా కూడా.. ఈ రేంజ్ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రాన్ని అద్భుతం కాకుండా ఇంకా ఏమంటారు?’ అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. Call it a STORM... Or call it a TSUNAMI or a TYPHOON... Fact is, a Telugu stands TALL at USA Boxoffice along with Hollywood giants... Yes, #Agnyaathavaasi takes an EARTH-SHATTERING start, despite midweek release [Tue] in USA... Data follows... — taran adarsh (@taran_adarsh) 10 January 2018 Telugu film #Agnyaathavaasi takes a FANTABULOUS START in USA... Tue previews $ 1,513,540 [₹ 9.65 cr]... Yes, you read it right: $ 1.5 million on a working day... If this is not AWESOME, what is? @Rentrak — taran adarsh (@taran_adarsh) 10 January 2018 -
దూసుకెళ్తున్న ‘టైగర్’
సల్మాన్‌ఖాన్ సినిమా అంటే చాలు కథతో సంబంధం అవసరం లేకుండా హిట్ అవుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో టైగర్ జిందా హై హవా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టినా..కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. వీకెండ్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమా కలెక్షన్లపై సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో స్పందించారు. భజరంగీ భాయిజాన్ (రూ.320కోట్లు), సుల్తాన్(రూ.300కోట్లు) రికార్డును ఈ సినిమా ఛేజ్ చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 200కోట్లు దాటిపోయింది. వీకెండ్ , న్యూ ఇయర్ వల్ల ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏక్తా టైగర్‌కు స్వీకెల్‌గా వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సల్మాన్ అభిమానులను మాత్రమే అలరించేలా ఉందని అంటున్నారు. సల్మాన్.. తర్వాత రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’, ముచ్చటగా మూడోసారి అలీ అబ్బాస్ డైరెక్షన్లో ‘భరత్’ సినిమాలో నటిస్తారు. #TigerZindaHai maintains a STRONG TREND... Now chasing the score set by #BajrangiBhaijaan [₹ 320.34 cr] and #Sultan [₹ 300.45 cr]… Biz expected to jump again on Sat [today], Sun and Mon [1 Jan]… [Week 2] Fri 11.56 cr. Total: ₹ 217.60 cr. India biz. #TZH — taran adarsh (@taran_adarsh) 30 December 2017 -
ఎన్టీఆర్ బయోపిక్ మరో వార్త..!
నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందించనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరు ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. Biopic on legendary actor and politician NTR being made in Telugu and Hindi. Actor Balakrishna [son of NTR] will play NTR in the biopic... pic.twitter.com/q8b6QYTD34 — taran adarsh (@taran_adarsh) 13 October 2017 -
450 కూడా దాటేస్తారా?
విడుదలైన మొదటి రోజు నుంచే అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి-2 సినిమా హిందీలో అయితే రాక్ బస్టర్లా సాగిపోతోంది. ఇప్పటికే దాదాపు 433 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా కచ్చితంగా రూ. 450 కోట్లు దాటేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మూడో వారంలో కూడా ఈ సినిమా తన వసూళ్ల పరుగును ఆపడం లేదని, అలాగే కొనసాగుతోందని చెప్పాడు. కేవలం హిందీ వెర్షన్లోనే మొత్తం 17 రోజుల్లో రూ. 432.80 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలిపాడు. ఇప్పుడు రూ. 450 కోట్ల దిశగా వెళ్తోందన్నాడు. రెండో రోజున రూ. 50 కోట్లు దాటిందని, మూడో రోజున రూ. 100 కోట్లు దాటిందని, నాలుగో రోజున రూ. 150 కోట్లు, ఆరో రోజున రూ. 200 కోట్లు, 8వ రోజున రూ. 250 కోట్లు, 10వ రోజున రూ. 300 కోట్లు, 12వ రోజున రూ. 350 కోట్లు, 15వ రోజున రూ. 400 కోట్లు దాటినట్లు వివరించాడు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్దమొత్తంలో వసూలు చేసిన సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం. #Baahubali2 continues its PHENOMENAL RUN... Collects ₹ 42.55 cr in Weekend 3... 17-day total: ₹ 432.80 cr Nett. HINDI... REMARKABLE... — taran adarsh (@taran_adarsh) 15 May 2017 #Baahubali2 is now racing towards ₹ 450 cr... [Week 3] Fri 10.05 cr, Sat 14.75 cr, Sun 17.75 cr. Total: ₹ 432.80 cr Nett. HINDI. India biz. — taran adarsh (@taran_adarsh) 15 May 2017 #Baahubali2 Crossed ₹50 cr: Day 2 100 cr: Day 3 150 cr: Day 4 200 cr: Day 6 250 cr: Day 8 300 cr: Day 10 350 cr: Day 12 400 cr: Day 15 HINDI — taran adarsh (@taran_adarsh) 15 May 2017 -
ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..
బాలీవుడ్లో శుక్రవారం రెండు సినిమాలు ప్రధానంగా విడుదలయ్యాయి. వాటిలో ఒకటి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించినది కావడంతో దానిమీద ఎంత లేదన్నా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు ఒక్కొక్క మాటలోనే రివ్యూ చెప్పాలంటే.. అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ పాత్రికేయుడు తరణ్ ఆదర్శ్ చెప్పేశాడు. సర్కార్ 3: డిజప్పాయింటింగ్ (నిరాశాజనకం), మేరీ ప్యారీ బిందు: బోరింగ్ అని తన రివ్యూ ఇచ్చేశాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో మూడోదిగా వచ్చిన సర్కార్ 3 సినిమాకు కొందరు విమర్శకులైతే కేవలం ఒకటిన్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు. అమితాబ్ లాంటి అగ్రనటుడు ఉన్నా కూడా ఆ సినిమాను పెద్దగా కాపాడలేకపోయారని చెప్పారు. #OneWordReview...#Sarkar3: Disappointing#MeriPyaariBindu: Boring — taran adarsh (@taran_adarsh) 12 May 2017 -
బాహుబలి: ఇంకేమైనా రికార్డులు మిగిలాయా?
హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా సృష్టిస్తున్న సంచలనం చూసి మార్కెట్ వర్గాలతో పాటు విమర్శకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ఒక్కదాంట్లోనే రూ. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసిన బాహుబలి-2 సినిమా, ఇప్పుడు రూ. 350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఇప్పటికే బాహుబలి 2 సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టిందని ఆయన తెలిపారు. ఫాస్టెస్ట్ 50 కోట్లు, ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 150 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు, ఫాస్టెస్ట్ 250 కోట్లు, ఫాస్టెస్ట్ 300 కోట్లు... వీటన్నింటినీ ఇప్పటికే దాటేసిందని, ఇప్పుడు రూ. 350 కోట్ల వైపు వెళ్తోందని చెప్పారు. ఈ సినిమా నిజంగా ఒక గేమ్‌ఛేంజర్ అని ఆయన ప్రశంసించారు. అయితే, ఉత్తరాదిలో మాత్రం కొందరు దక్షిణాది సినిమా ఇంతలా విజయం సాధించడం ఏంటన్న భావనలోనే ఉన్నట్లుంది. 'డియర్ బాహుబలి.. దంగల్ పని ఇంకా అయిపోలేదు, కలెక్షన్లు వస్తున్నాయి' అంటూ జాతీయ మీడియాలోని ఒక వర్గం వ్యాఖ్యానించింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి వసూళ్లను దాటి వెళ్తుందన్న ఉద్దేశంలో అలా రాశారు. #Baahubali2 RECORDS: Fastest ₹ 50 cr... Fastest ₹ 100 cr... Fastest ₹ 150 cr... Fastest ₹ 200 cr... Fastest ₹ 250 cr... Fastest ₹ 300 cr... — taran adarsh (@taran_adarsh) 9 May 2017 #Baahubali2 is now set to cross ₹ 350 cr, the FASTEST to achieve it. Seriously, is there any record left? This film is truly a GAME CHANGER! — taran adarsh (@taran_adarsh) 9 May 2017 -
వంద కోట్ల క్లబ్లో మరో మూవీ!
రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాయిస్' భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో గత బుధవారం విడుదలైన ఈ మూవీకి భిన్న స్పందనలు వస్తున్నా, కలెక్షన్ల పరంగా సక్సెస్ వైపు నడుస్తోంది. ఓవరాల్‌గా శనివారం నాటికి రూ.121 కోట్లు వసూలు చేసింది. విదేశాలలో రూ.45.63 కోట్లు వసూలు చేసిన రాయిస్.. కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏరియాలలో తొలి నాలుగు రోజుల్లో రూ.20.43 కోట్లు (మూడు మిలియన్ డాలర్లు) వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా రెండురోజుల్లో రూ. 46.72 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.75.44 కోట్లు రాబట్టిందని ట్వీట్ చేశారు. దీంతో ఓవరాల్‌గా రాయిస్ నాలుగోరోజు కలెక్షన్లతో వంద కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది. మంచి కలెక్షన్లు రాబట్టి రాయిస్ జబర్దస్త్‌గా రన్ అవుతుందని ట్వీట్లో రాసుకొచ్చారు. మరోవైపు హృతిక్ ఛాలెంజింగ్‌గా తీసుకుని అంధుడి పాత్రలో కనిపించిన మూవీ కాబిల్ కలెక్షన్లలో మాత్రం వెనకబడి పోయింది. #Raees is EXCELLENT... Wed 20.42 cr, Thu 26.30 cr, Fri 13.11 cr, Sat 15.61 cr. Total: ₹ 75.44 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 29 January 2017 #Raees is TERRIFIC internationally... OVERSEAS - Wed to Sat: $ 6.7 million [₹ 45.63 cr]... Some territories/screens yet to report. — taran adarsh (@taran_adarsh) 29 January 2017 -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
ముంబై: ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే భారత్‌లో 100 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క చాలా సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం వెనకబడ్డాయి. ఇలాంటి సమయంలో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే తొలి రోజు కలెక్షన్లలో మాత్రం సుల్తాన్ రికార్డులను తిరగరాయలేకపోయింది. సుల్తాన్ తొలి రోజు రూ.33.34 కోట్లు సాధించగా, దంగల్ మాత్రం 29.78 కోట్లు రాబట్టింది. దంగల్ పై వచ్చిన రివ్యూలు కూడా సినిమాకు అనుకూలంగా రావడంతో ఆ తర్వాత రోజు నుంచి వసూళ్ల వేగం మరింతగా పెరిగింది. శనివారం 34.25 కోట్లు, ఆదివారం రూ.42.35 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులను కలుపుకొని కేవలం భారత్‌లోనే రూ. 106.95 కోట్ల వసూళ్లును కొల్లగొట్టిందని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆమిర్ ఖాన్ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది. #Dangal Fri 29.78 cr, Sat 34.82 cr, Sun 42.35 cr. Total: ₹ 106.95 cr [incl Tamil and Telugu]. India biz. FANTABULOUS! — taran adarsh (@taran_adarsh) 26 December 2016 -
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దంగల్'
-
'మూడు రోజుల్లో వందకోట్లు'
ఆమిర్ బాక్సాఫీస్ మీద తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దంగల్, రిలీజ్ తరువాత కూడా అదే హవా కంటిన్యూ చేసింది. భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దంగల్ డిమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ను దాటి భారీ వసూళ్లను రాబడుతోంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా 29.78 కోట్లు సాధించింది. శని, ఆది వారాల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉండటంతో తొలి మూడు రోజుల్లోనే దంగల్, వంద కోట్ల క్లబ్లో చేరుతుందని తెలిపారు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్. సూపర్ హిట్ మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది. #Dangal wrestles demonetisation... Sets the BO on fire... Ends the lull phase... Fri ₹ 29.78 cr [incl ₹ 59 lacs from Tamil and Telugu]. — taran adarsh (@taran_adarsh) 24 December 2016 #Dangal Sat and Sun biz will be higher... Word of mouth is terrific... Expected to cross ₹ 100 cr mark in first 3 days... India biz. — taran adarsh (@taran_adarsh) 24 December 2016 -
ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్
రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'. దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై భారీ వసూళ్లు వసూలుచేస్తోంది. రిలీజైన తొలిరోజు మొత్తం రూ. 10.36 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల కిందట ఆ మూవీ యూనిట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే భారీగా వీక్షించారు. అందులోనూ మూవీలో రణవీర్, వాణీల లిప్ లాక్ సీన్లు ఉండటం మూవీకి కలిసొస్తుందని నటీనటులతో పాటు టెక్నిషియన్లు భావించారు. వారు అనుకున్నట్లుగానే మూవీకి మంచి ఓపెనింగ్ లభించిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 45 శాతం మార్నింగ్ షోలకే టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారత్ లో 2100 స్క్రీన్లు, విదేశాలలో 800 స్క్రీన్లలో విడుదల చేశారు. నోట్ల రద్దుతో సతమతమవుతున్నా ట్రైలర్ చూసిన వాళ్లు కచ్చితంగా థియేటర్లకు రావడం ఖాయమని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఎన్నో హాట్ లిప్ లాక్స్ ఉన్నా మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించడం కలిసొచ్చిందని చెప్పవచ్చు. -
సినిమా కలెక్షన్లకు దీపావళి దెబ్బ
సాధారణంగా పండుగ సీజన్లో సినిమాలు విడుదల చేస్తే బంపర్ కలెక్షన్లు వస్తాయని హీరోలందరూ తమ సినిమాలను పండుగల కోసం రిజర్వు చేసుకుంటారు. కానీ.. దీపావళి మాత్రం చాలామంది హీరోలకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా దీపావళికి ముందు వచ్చిన శుక్ర, శనివారాల్లో చాలా బ్రహ్మాండంగా వచ్చిన కలెక్షన్లు కూడా ఆదివారం, పండుగ కలిసి రావడంతో ఒక్కసారిగా తగ్గిపోయాయి. కుర్రాళ్లందరూ టపాసులు కాల్చుకునే సరదాలో ఉండి సినిమాలను పక్కన పెట్టేశారు. పగటి పూట కూడా లక్ష్మీపూజలు జరగడంతో సాధారణంగా ఆదివారం ఖాళీగా ఉండే వ్యాపార వర్గాలు కూడా సినిమాలకు వెళ్లలేదు. దాంతో కలెక్షన్లకు భారీగా గండి పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో గట్టి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్న ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కూడా ఇదే దారిలో నడిచింది. విడుదలైన శుక్రవారం 13.30 కోట్లు, శనివారం 13.10 కోట్లు సాధించిన ఈ సినిమా.. ఆదివారం మాత్రం కేవలం 9.20 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మొదటి వారాంతంలో భారతదేశంలో కలెక్షన్లు 35.60 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఇది మంచి విజయం సాధించిందని, తొలి వారాంతంలో మొత్తం రూ. 41.05 కోట్ల కలెక్షన్లు సాధించి కరణ్ జోహార్, రణబీర్ కపూర్లకు హయ్యస్ట్ ఓపెనింగ్ వీకెండ్‌గా నిలిచిందని వివరించాడు. దీపావళి పూజలు, పండుగ కారణంగానే ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్ రెండు సినిమాలకూ ఆదివారం ఏమాత్రం బాగోలేదని.. సోమ, మంగళవారాల్లో బిజినెస్ పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. #ADHM Fri 13.30 cr, Sat 13.10 cr, Sun 9.20 cr. Total: ₹ 35.60 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 #ADHM packs a SOLID PUNCH in intl markets... Opening weekend: $ 6.15 million [₹ 41.05 cr]... HIGHEST opening weekend for KJo and Ranbir. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 Diwali pooja and festivities made a dent in the biz of #ADHM and #Shivaay on Sun... Biz should witness an UPWARD TREND on Mon and Tue. — taran adarsh (@taran_adarsh) 31 October 2016 -
మూడో రోజు భారీ కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లో 66 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం విశేషం. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు 21.30 కోట్లు, రెండో రోజు శనివారం 20.60 కోట్లు రాగా, మూడో రోజు ఆదివారం 24.10 కోట్ల రూపాయలు వచ్చాయి. మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్ దాటుతుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా వేసినట్టే జరిగింది. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వీకెండ్ కలెక్షన్లలో సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ నిలిచింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. -
రెండు రోజుల్లో రూ. 42 కోట్ల కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 41.90 కోట్ల రూపాయలు (గ్రాస్) వసూలు చేసింది. తొలిరోజు 21.30 కోట్ల రూపాయలు రాగా, రెండో రోజు శనివారం 20.60 కోట్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆదివారం కలెక్షన్లు కలిపి మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల మార్క్ దాటుతుందని ఆదర్శ్ అంచనా వేశారు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. -
తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. తొలిరోజు 21.30 (గ్రాస్) కోట్ల రూపాయలు వచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో సుల్తాన్ (36.54 కోట్లు) తర్వాత ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉంది. ఇక బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో తొలిరోజు మాదిరే శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ధోనీ పాల్గొనడంతో అభిమానుల్లో అమితాసక్తి ఏర్పడింది. -
‘పింక్’ కలెక్షన్ల పరుగు
బాలీవుడ్ సినిమా ‘పింక్’ బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటోంది. ఈ నెల 16న విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆరు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 30 కోట్లు దాటాయి. బుధవారం నాటికి రూ. 32.67 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు హిందీ సినిమా విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తొలి రోజు రూ. 4.32 కోట్లు, రెండో రోజు రూ. 7.65 కోట్లు, మూడో రోజు రూ. 9.54 కోట్లు, నాలుగో రోజు రూ.3.78 కోట్లు, ఐదో రోజు రూ. 3.51 కోట్లు, ఆరో రోజు రూ. 3.87 కోట్లు వసూళ్లు రాబట్టిందని తెలిపారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ సినిమాకు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించారు. -
‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్
‘జ్యో అచ్యుతానంద’ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు కోటిన్నర రూపాయలు దాటేశాయి. ఈనెల 8న విడుదలైన ఈ సినిమా అమెరికాలో మొదటి మూడు రోజుల్లో రూ. 1.82 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గురువారం 30,864, శుక్రవారం 90,539, శనివారం 149,927 డాలర్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోంది. #JyoAchyuthananda [Telugu] maintains a STRONG GRIP in USA: Thu $ 30,864, Fri $ 90,539, Sat $ 149,927. Total: $ 271,330 [₹ 1.82 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 11 September 2016 -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’
-
కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’
ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. కబాలి(రూ.87.5 కోట్లు), బాహుబలి(రూ.73 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెన్సింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలియింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ తొలి రోజే రూ. 41 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో తొలి మూడు రోజుల్లో రూ. 6.34 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రూ. 40 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. లాంగ్ వీకెండ్ ఉండటం వరుసగా సెలవులు కూడా రావటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Telugu film #JanathaGarage is having a TERRIFIC RUN in USA... Wed + Thu $ 737,816, Fri $ 215,221. Total: $ 953,037 [₹ 6.34 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 3 September 2016 -
అక్కడ దుమ్మురేపుతున్న 'జనతా గ్యారేజ్'!
భారీ అంచనాల నడుమ విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' ప్రస్తుతం థియేటర్లలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మిక్స్డ్ టాక్ వచ్చినా.. తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా అమెరికాలో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో (బుధవారం) విడుదలైనా జనతా గ్యారేజ్ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అమెరికాలో ఈ సినిమా సెన్సేషనల్ ప్రారంభ వసూళ్లను సాధిస్తున్నదని, ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి మొదటి రోజు కలెక్షన్లు రూ. 3.76 కోట్లు వచ్చినట్టు చెప్పారు. Going through @Rentrak... Telugu film #JanathaGarage takes a SENSATIONAL start in USA... Data still being compiled... Updates later! — taran adarsh (@taran_adarsh) 1 September 2016 Despite midweek release [Wed], the start of Telugu film #JanathaGarage is much much more than the start of most Hindi biggies in USA. — taran adarsh (@taran_adarsh) 1 September 2016 Telugu film #JanathaGarage is PHENOMENAL, despite midweek release in USA... Wed $ 560,509 [₹ 3.76 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 1 September 2016 -
బాహుబలికి దగ్గరగా వచ్చేస్తున్నాడు!
బాలీవుడ్ బాక్సాఫీసును సల్మాన్ షేక్ చేస్తున్నాడు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కలెక్షన్ల సునామీ ఎలా సృష్టించాడో.. ఇప్పుడు అలాగే 50 ఏళ్ల వయసులో మల్లయోధుడి పాత్రలో జీవించిన సల్మాన్.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. సుల్తాన్ సినిమా విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లకు దగ్గరగా వచ్చేశాడు. అయితే... ఆలిండియా కలెక్షన్లలో ఆల్‌టైం రికార్డులు తిరగరాసిన బాహుబలిని మాత్రం ఇప్పటికి ఇంకా దాటలేకపోయాడు. మొదటి ఐదు రోజుల్లో బాహుబలి గ్రాస్ 320 కోట్ల రూపాయలు కాగా, నెట్ వసూళ్లు రూ. 260 కోట్లు. ఇప్పుడు సల్మాన్ మొదటి ఐదు రోజుల్లో తన సుల్తాన్ సినిమాకు రూ. 200 కోట్ల వసూళ్లకు దగ్గరైనట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. సర్వసాధారణంగా ఉన్న ఓ కథకు తనదైన శైలిలో మాస్ మసాలా జోడించడం ద్వారా సల్మాన్ ఈ మ్యాజిక్ చేశాడని బాలీవుడ్ పండితులు అంటున్నారు. ఫ్యాన్లు తనను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే చేయడంతో పాటు.. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా తగినంత ప్రాధాన్యం కల్పించడం ప్రేక్షకులకు నచ్చిన అంశం. మొదటి ఐదు రోజుల్లో సుల్తాన్ సాధించిన వసూళ్లు ఇప్పటివరకు అతడి కెరీర్లో ఏ సినిమాకూ రాలేదట. ప్రస్తుతం దేశమంతా ‘సల్మానియా’ (సల్మాన్ మానియా) అలముకుందని తరణ్ ఆదర్శ్ అంటున్నాడు. సల్మాన్‌కు ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే రూ. 200 కోట్ల క్లబ్బులో చేరాయి. ఒకటి ప్రేమ్ రతన్ ధన్ పాయో, మరొకటి కిక్. ఇక బజరంగీ భాయీజాన్ అయితే రూ. 300 కోట్లు వసూలు చేసింది. సుల్తాన్ ఇప్పటికే రూ. 200 కోట్లకు రావడంతో.. ఇక రూ. 300 కోట్లు సాధించడం కూడా కష్టం కాకపోవచ్చని అంటున్నారు. What's REMARKABLE is that #Sultan has crossed *lifetime biz* of several biggies in just 5 days... All set for ₹ 200 cr... WOW! — taran adarsh (@taran_adarsh) 11 July 2016 #Sultan creates HISTORY... Had an UNPRECEDENTED 5-day weekend... Raises the bar for Hindi film biz... It's a MONSTROUS HIT! — taran adarsh (@taran_adarsh) 11 July 2016 -
వీరప్పన్‌కు మంచి మార్కులు?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లే కనపడుతున్నాడు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన ఊపుతో.. వీరప్పన్ జీవితం మీద మరో సినిమా తీశాడు. ఈ సినిమాకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్లో ఓ పట్టాన ఏ సినిమానూ పెద్దగా మెచ్చుకోడని పేరున్న కమాల్ ఆర్ ఖాన్ కూడా వీరప్పన్ సినిమాను ప్రశంసించాడు. అయితే ఒక్క లీసా రే తప్ప అందులో అందరూ బాగా చేశారని, సినిమా చాలా అద్భుతంగా ఉందన్న టాక్ వినిపిస్తోందని ట్వీట్ చేశాడు. తాను ఈరోజే ఆ సినిమా చూస్తానని చెప్పాడు. ఇక అత్యంత ప్రమాదకరమైన బందిపోటు దొంగ వీరప్పన్ జీవితం, అతడి కాలం గురించిన వివరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ మంచి ఫాంలో ఉన్నాడని కితాబిచ్చాడు. వీరప్పన్‌గా సందీప్ భరద్వాజ్ చాలా అద్భుతంగా చేశాడని కూడా అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే మరోసారి రామ్ గోపాల్ వర్మ పెద్ద హిట్ సాధించడం ఖాయమేననిపిస్తోంది. #Veerappan gives an insight into the life and times of the dreaded bandit. RGV is in good form. Sandeep Bhardwaj as Veerappan is superb. — taran adarsh (@taran_adarsh) 26 May 2016 Reports are out n #Veerappan is a fantastic film. Every actor has done great job except Lisa Roy. So I will watch it today only. — KRK (@kamaalrkhan) 26 May 2016 -
సూర్య సినిమాకు కలెక్షన్ల సునామీ
సూర్య లేటెస్ట్ మూవీ '24' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్ సీస్ లో రికార్డు వసూళ్లు రాబడుతోంది. అమెరికా, కెనడాలో భారీగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. వారం రోజుల్లో మొత్తం రూ. 8.22 కోట్లు వసూలు చేసింది. గురువారం నుంచి మంగళవారం వరకు అమెరికాలో 1,157,926 డాలర్లు, కెనడాలో 76,627 డాలర్లు వసూలు చేసిందని సినీ విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. 'టైమ్ ట్రావెల్' అనే వినూత్న అంశంతో 'సైన్స్-ఫిక్షన్'గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూర్య విలక్షణ నటన, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను హిట్ జాబితాలో చేర్చింది. టాలీవుడ్, కోడీవుడ్ లోనూ మొదటి వారంలో '24' భారీ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. -
ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే..
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిట్ట చివరి చిత్రం.. మనం. ఈ సినిమాను అత్యంత ధైర్యంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా చూశాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ చాలామంది దీనిగురించి చర్చించుకుంటున్నారు. ఆ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన మరో చిత్రం.. సూర్య హీరోగా నటించిన '24'. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రివ్యూ చూసిన తరణ్.. తన భావావేశాన్ని ఆపుకోలేక ఈ సినిమా గురించి వరుస ట్వీట్లతో మోతెక్కించాడు. విక్రమ్ తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడని, 24 సినిమా సబ్జెక్టును చాలా మేధస్సుతో డీల్ చేశాడని తరణ్ అన్నాడు. ఈసారి మూడు పాత్రలలో నటించిన సూర్య కూడా అవార్డు విన్నింగ్, నాకౌట్ పెర్ఫార్మెన్సు చూపించాడని ప్రశంసించాడు. ముఖ్యంగా చెడ్డవాడైన విరోధి పాత్రలో అదరగొట్టాడని చెప్పాడు. ఈ సినిమాను కేవలం బాగుందని చెప్పలేమని.. ఇందులో ఇంకా చాలా ఉన్నాయని అన్నాడు. ఇంత మంచి సబ్జెక్టును తీసుకున్నందుకు మొత్తం సినిమా టీమ్‌కు అభినందనలు చెప్పాడు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం, సబ్జెక్టు మీద పట్టు, వాటన్నింటితో పాటు ఆర్థిక దన్ను అన్నీ ఉండాలని తెలిపాడు. టైటిళ్లతో మొదలుపెట్టి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తర్వాత 2.40 గంటల పాటు ఒక రోలర్ కోస్టర్‌లో తిరుగుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతికి లోనవుతారని తరణ్ అన్నాడు. ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని కాన్సెప్టేనని, దానికి తోడు ఇందులో కావల్సినంత వినోదం, ఎవరూ ఊహించలేని ట్విస్టులు, మలుపులు ఉంటాయంటూ ప్రేక్షకులను ఊరించాడు. సూర్య - సమంతల మధ్య సన్నివేశాలు కూడా చూడదగ్గవేనని, మంచి ఇంటర్వెల్ పాయింటు ఉందని తెలిపాడు. It requires courage, conviction, command over the medium and of course, financial strength to bring to life a film like #24TheMovie... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie grabs your attention from the titles itself and for the next 2.40 hours you're hooked on to this terrific roller coaster ride... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Biggest strength of #24TheMovie is its concept. It also packs loads of entertainment and unpredictable twists and turns that win you over... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 High points: Dramatic start, cute light moments [Suriya-Samantha], fab interval point, emotional moments, the culmination #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Vikram Kumar, who directed the terrific #Manam [Telugu], displays his mastery yet again. He handles the subject with brilliance #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Suriya, in triple roles this time, delivers an award-worthy, knockout performance. He's stupendous as the evil antagonist #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie is not just a good looking film, but has lots to offer. Kudos to the team for pulling off the subject with élan! — taran adarsh (@taran_adarsh) 5 May 2016 -
తొలి వారం నీర్జా రికార్డ్
స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ సాధించటంలో మాత్రం వెనకబడిన అందాల భామ సోనమ్ కపూర్. సినిమాల సంగతి ఎలా ఉన్నా తన గ్లామర్ షో తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తొలిసారిగా నీర్జా సినిమాతో తన కల నెరవేర్చుకుంది. 1986లో జరిగిన విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన బయోగ్రఫికల్ థ్రిల్లర్ నీర్జాలోఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ పాత్రలో నటించింది సోనమ్. ఈ సినిమాతో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్.. ఇన్నాళ్లు తనను ఊరిస్తున్న భారీ కమర్షియల్ హిట్‌ను కూడా సాధించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలివారం పూర్తయ్యే సరికి 35 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న నీర్జా లాంగ్ రన్లో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3'
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్ ౩' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును అధిగమించి రికార్డు వసూళ్ల దిశగా దూసుకు పోతోంది. దీపావళికి రెండు రోజులు ముందుగా నవంబర్ 1న విడుదలయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల పైగా వసూళ్లు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా సోమవారం నాటికి 108.6 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒక్కరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా 'క్రిష్ 3' నిలిచిందని వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఈ సినిమా రూ. 35.91 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిందని తెలిపారు. ఇంతవరకు ఏ సినిమా కూడా ఒక్కరోజులో ఇంత కలెక్షన్ సాధించలేదని వివరించారు.