
‘పింక్’ కలెక్షన్ల పరుగు
బాలీవుడ్ సినిమా ‘పింక్’ బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటోంది. ఈ నెల 16న విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆరు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 30 కోట్లు దాటాయి. బుధవారం నాటికి రూ. 32.67 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు హిందీ సినిమా విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
తొలి రోజు రూ. 4.32 కోట్లు, రెండో రోజు రూ. 7.65 కోట్లు, మూడో రోజు రూ. 9.54 కోట్లు, నాలుగో రోజు రూ.3.78 కోట్లు, ఐదో రోజు రూ. 3.51 కోట్లు, ఆరో రోజు రూ. 3.87 కోట్లు వసూళ్లు రాబట్టిందని తెలిపారు.
ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ సినిమాకు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించారు.