బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన ఫ్లాట్‌ను అమ్మేశారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో ఖరీదైన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని ప్రముఖ రియాల్టీ సంస్థ స్క్వేర్‌యార్డ్స్ వెల్లడించింది. ఆ ఫ్టాట్ దాదారు 5 వేలకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపింది.
అమితాబ్ బచ్చన్ ఈ ఫ్లాట్‌ను ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ప్రాంతంలోని తన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను ఈనెల 17న వ తేదీన విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు.
కాగా.. అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎస్టేట్‌లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎస్టేట్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాటిలో ప్రధానందగా నివాస సముదాయాలతో పాటు వాణిజ్య స్థలాలు ఓషివారా, మగాథనే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment