
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలో మరోసారి భూమి కొన్నారు. అయితే ఈసారి తను నిర్వహిస్తున్న హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ కోసం ఈ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. 54,454 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ల్యాండ్‌ను ఎంపిక చేసుకున్నారట. రామమందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఉంది. దీనికోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి హరివంశ్ రాయ్ గౌరవార్థం అక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
గతంలో కొన్న ప్లాట్ విలువ ఎంతంటే?
అమితాబ్ గతేడాది జనవరిలో అయోధ్యలోని హవేలి అవధ్‌లో ప్లాట్ కొన్నారు. ఇందుకోసం దాదాపు రూ.4.54 కోట్లు వెచ్చించారు. ఈ ప్లాట్ కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల ప్రయాణ దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది రిలీజైన కల్కి 2898 ఏడీ, వేట్టైయాన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ 'కౌన్ బనేగా కరోడ్ పతి 17'వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు రెడీ అవుతున్నారు.
చదవండి: వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్‌వశ్?
Comments
Please login to add a commentAdd a comment