Andheri
-
ముంబైలో భారీ వర్షం.. అంథేరీ సబ్వే బంద్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయింది. ఫలితంగా అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.ముంబైలో నేటి (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కరుస్తున్న దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలను మూసివేశారు. Watch: Heavy rain in Mumbai has led to intense morning showers and four feet of water accumulation in the Andheri subway. The subway has been closed to traffic since 6: 30 AM. pic.twitter.com/jHcocRmTZY— IANS (@ians_india) July 20, 2024 -
అంధేరిలో సాయి మంజ్రేకర్ మరియు గురు రంధవా
-
గోఖలే వంతెన త్వరలో కూల్చివేత
సాక్షి, ముంబై: అంధేరీలోని గోఖలే వంతెన సాధ్యమైనంత త్వరగా కూల్చివేసి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని బీఎంసీ భావిస్తోంది. స్ధానికులు పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులకు 21 రోజుల్లో టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ పూర్తి చేయాలని బీఎంసీ భావిస్తోంది. 2023 మార్చి లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాకుండా కూల్చివేత పనుల్లో చివరి ఘట్టం పూర్తి చేయడానికి 30 గంటలపాటు రైల్వే నుంచి బ్లాక్ తీసుకోనున్నట్లు బీఎంసీ పేర్కొంది. ఆ తరువాత నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టనుంది. 1975లో నిర్మించిన అంధేరీలో తూర్పు–పశ్చిమ ప్రాంతాలను కలిపే గోఖలే వంతెన శిథిలావస్ధకు చేరుకోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినప్పటికీ అవికూడా సరిపోవడం లేదు. దీంతో కూల్చివేత పనులు వేగవంతం చేసి కొత్త వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని బీఎంసీ నిర్ణయించింది. ఎంత వ్యయం? ఎవరి బాధ్యత? గోఖలే వంతెన ఎవరు నేల మట్టం చేస్తారు..? ఎవరు నిర్మిస్తారనే ప్రశ్న స్ధానిక ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు కూల్చివేయాలి...? ఎవరు నిర్మించాలి...? అందుకయ్యే వ్యయంలో ఎవరు, ఎంత శాతం నిధులు వెచ్చించాలి..? ఇలాంటి కారణాలు తెరమీదకు వచ్చాయి. ఇదివరకు నేలమట్టం చేసిన అనేక వంతెనల పనులు జాప్యం జరగడానికి ఇవే ప్రధాన కారణాలయ్యాయి. దీంతో ఈ వంతెన రైల్వే హద్దులో ఉన్న పనులు పశ్చిమ రైల్వే చేపట్టనుంది. బీఎంసీ హద్దులో ఉన్న పనులు బీఎంసీ చేపట్టనుంది. కాని రైల్వే ట్రాక్స్ మీదున్న వంతెన భాగాన్ని కూల్చివేయాలంటే కూలీలకు ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం. ఓవర్ హెడ్ వైర్లోంచి 25 వేల ఓల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుంది. వంతెన కిందున్న ఆరు రైల్వే మార్గాల మీదుగా సగటున రెండు నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ వంతెన నేలమట్టం చేయాలంటే ఇటు ఇంజినీర్లకు, అటూ కూలీలకు కత్తిమీద సాములంటిదేనని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమీత్ ఠాకూర్ పేర్కొన్నారు. కూల్చివేత పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కంట్రాక్టర్లకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాధారణంగా గోఖలే వంతెన వినియోగంలో ఉన్నప్పుడే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ వంతెన మూసి వేయడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా స్ధానికులు విసిగెత్తిపోయారు. రోడ్డు మార్గం కంటే లోకల్ రైలు లేదా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్‌ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్‌గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్‌ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఉపఎన్నిక నుంచి బీజేపీ ఔట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం. పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్ఎన్ఎస్ చీఫ్ కోరారు. నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు -
గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరువర్గాల అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ గుర్తుపై సమతా పార్టీ, శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అంధేరీ ఉప ఎన్నిక వివాదాస్పదంగా మారే ప్రమాదం ఏర్పడింది. అభ్యర్థులకు కొత్త చిక్కులు... ఠాక్రే వర్గం తరఫున పోటీ చేస్తున్న రుతుజా లట్కే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న మూర్జీ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శనివారం నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని గుర్తుల కేటాయింపుపై కొత్త వివాదం తెరమీదకు రావడంతో ఇరు పార్టీల అభ్యర్ధులు అయోమయ స్ధితిలో ఉన్నారు. నవంబర్ మూడో తేదీన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతకు ముందు నుంచే శివసేన తమదేనంటూ ఉద్ధవ్ వర్గం, కాదు అసలైన వారసులం మేమేనని, మాకే మెజార్టీ ఉందని ఇటు శిండే వర్గం మధ్య వాగ్వాదం మొదలైన సంగతి తెలిసింది. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాని సుప్రీం కోర్టు ఈ వివాదం పరిష్కరించే బాధ్యతలు ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు గాని, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తుగాని ఎవరూ, ఎక్కడా వినియోగించరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అంతేగాకుండా మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లు మీరే సూచించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ మేరకు ఉద్ధవ్, శిండే వర్గాలు మూడు పార్టీ గుర్తులు, మూడు పార్టీ పేర్ల చొప్పున సూచించడంతో అందులోంచి ఠాక్రే వర్గానికి కాగడ, శిండే వర్గానికి కత్తులు–డాలు (తల్వార్–డాల్) కేటాయించిన విషయం తెలిసిందే. కాని మత సామరస్యాలకు సంబంధించిన గుర్తులు కేటాయించరాదని ఎన్నికల సంఘానికి నియమాలున్నాయి. ఆ ప్రకారం శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ (మషాల్) గుర్తు 1996 నుంచి తమ వద్దే ఉందని సమతా పార్టీ పేర్కొంది. దీంతో మా పార్టీ గుర్తును మరో పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ సీనియర్ నేత మరోపక్క అప్పట్లో శిండే సూచించిన త్రిశూలం గుర్తు మత సామరస్యానికి సంబంధించినదంటూ కేటాయించలేదు. సిక్కులకు ప్రతీకగా ఉన్న కత్తులు–డాలు గుర్తు కూడా అదే కోవకు చెందినదంటూ, దీంతో ఆ గర్తును రద్దు చేయాలని సచ్‌ఖండ్ గురుద్వార్‌కు చెందిన మాజీ సభ్యుడు రంజీత్ కామ్టేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతేగాకుండా కాగడ గుర్తు రద్దు చేయడమేగాకుండా దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వలంటూ సమతా పార్టీ ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే. మరోపక్క రంజీత్ కామ్టేకర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. -
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్‌ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిగ్ రిలీఫ్.. ఉపఎన్నికల్లో ఆమె పోటీకి లైన్ క్లియర్
ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను ఉన్నత న్యాయస్థానం మందలించింది. అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది. చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! -
అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్‌కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. భర్త మృతి.. అభ్యర్థిగా భార్య ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది. ఏక్నాథ్ శిందే ఎత్తుగడలు రమేశ్ లట్కే కుటుంబంతో ఏక్నాథ్ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్నాథ్ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్ కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్‌కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్నాథ్ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్‌పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్ నలిగి పోతున్నారు. నియమాలు ఏమంటున్నాయి.. బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నుంచి మూర్జీ పటేల్ ? ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్ వేస్తే మూర్జీ పటేల్ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్‌కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) -
షిండే వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్‌చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్ -
థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్!
సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్) గుర్తును ఖరారు చేసింది. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్చీ శివసేన' పేరును ఫైనల్ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది. అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్‌లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
ఖరీదైన బంగ్లాను అమ్మేసిన స్టార్ హీరో.. కారణమిదే!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె కట్పుత్లీ సినిమాతో ఆకట్టుకున్న అక్షయ్ గురించి తాజాగా బీటౌన్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఆయనకున్న బంగ్లాలో ఒకదాన్ని దబూ మాలిక్ అనే వ్యక్తికి అమ్మేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దబూ బాలిక్ మరెవరో కాదు..ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ తండ్రే. ముంబై అంధేరి వెస్ట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ సుమారు రూ. 6కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తుంది. గతంలో అక్షయ్ ఇదే అపార్ట్‌మెంట్‌ను రూ 4కోట్లకు కొనుగోలు చేశాడట. ఇక అక్షయ్‌కు ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర ప్రాందాల్లో పలు బంగ్లాలు ఉన్నాయి. కాగా ఆయన నటించిన చివరి చిత్రం కఠ్పుత్లీ సెప్టెంబర్ 2న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా రీమేక్ ఇది. -
షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..
Mumbai Dance Bar Raid: అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఓ బార్‌పై పోలీసులు దాడులు చేశారు. బార్ మొత్తం వెతికినా వారికి అక్కడ తప్పుగా ఏం దొరకలేదు. కానీ అక్కడున్న ఓ అద్దంపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే అద్దాన్ని పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులను షాక్‌కు గురయ్యారు. అద్దం వెనకాల ఓ సీక్రెట్ రూమ్ బయటపడింది. అందులోకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 యువతులు ఒకరి వెనక ఒకరు బయటకు వస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీక్రెట్ బేస్మెంట్లో ఈ చీకటి దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.అసలు ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే. వివరాలు.. ముంబై అంధేరిలోని దీప బార్‌పై ఆదివారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. దీప బార్లో యువతులను కస్టమర్ల ముందు వికృతంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు బార్‌పై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడి గురించి సమాచారం అందుకున్న బార్ యాజమాన్యం అప్రమత్తమై యువతలను వెంటనే అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్‌చేసే ఓ రహస్య గదిలోకి పంపారు. దీంతో పోలీసులు గంటలపాటు బార్ మొత్తం సెర్చ్ చేసిన ఎవరూ దొరకలేదు. వాష్‌రూం, కిచెన్, స్టోర్‌రూమ్‌లలో వెతికినా మొత్తం ఖాళీగా ఉంది. దీంతో బార్ ఓనర్, మేనేజర్, వెయిటర్స్‌ను పోలీసులు విచారించారు. కానీ తమ బార్లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం లేదని, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఆరోపణలు కొట్టిపారేశారు. చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య అయితే పోలీసులకు అప్పటికీ నమ్మకం కలగలేదు. అంతేగాక మేకప్ రూమ్‌లో తగిలించి ఉన్న పెద్ద అద్దం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. పోలీసులు ఆ అద్దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా.. అది కుదరలేదు. అనంతరం పెద్ద సుత్తి తీసుకొచ్చి అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. అద్దం వెనకాల పెద్ద సొరంగంలా ఉన్న ఓ రహస్య గది ఉంది. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది. కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు వచ్చారు. 17 మంది యువతలను పోలీసులు రక్షించి.. రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే.. There are shocking cases from Mumbai, the capital of Maharashtra. Now, recently, 17 girls have been detained by the Social Service Branch of Mumbai Police in Deepa bar in Andheri last Sunday night. @DGPMaharashtra pic.twitter.com/wIpE2PMYFU — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021 దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎన్జీఓ ప్రెసిడెంట్ రాజ్ మజీ ట్విటర్లో షేర్చేశారు. దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది. మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఉన్న యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయట వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే సీక్రెట్ రూమ్‌ను రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో బెడ్స్, ఏసీలు అన్నీ ఉన్నాయి. అంతేగాక రహస్య గదిలో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! Deepa Bar Andheri pic.twitter.com/dJeGm5YDbI — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021 -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై
ముంబై: కామవాంఛతో కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. యువతికి కోరికలు రేకెత్తేలా ఇంజెక్షన్లు.. మందుబిల్లలు ఇస్తూ 8 సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. భర్తకు భార్యనే ప్రోత్సహించడం గమనార్హం. మైనర్‌గా ఉన్నప్పుడు కిడ్నాప్ చేయగా ఇప్పుడు ఆ బాలిక యువతిగా మారింది. ఎట్టకేలకు నిందితుల చెర నుంచి ఆ యువతి బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్ చదువుతుండేది. 16 ఏళ్లు ఉన్న ఆ బాలికను ఎనిమిదేళ్ల కిందట కొందరు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. బాలికకు కామ కోరికలు కలిగేలా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. ఆమెపై ఇష్టమొచ్చినప్పుడల్లా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది. చివరకు వారి చెర నుంచి బయటకు వచ్చిన యువతి అంబోలి పోలీసులను సంప్రదించింది. 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. -
ముంబైలోని ఆంథేరి ఈస్ట్‌లో అగ్నిప్రమాదం
-
కుక్క వర్సెస్ చిరుత : చివరకు ఏమైదంటే..
ముంబై : నగరంలోని అంధేరీ తూర్పులో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున సీప్జ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ వీధి కుక్కపై చిరుత దాడికి పాల్పడింది. సీప్జ్‌కు ఎదురుగా ఉన్న టెలికామ్ పవర్‌గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్కను కొద్ది దూరం లాక్కెళ్లిన చిరుత దానిపై దాడికి యత్నించింది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో రక్తం కూడా చిందింది.. అయినప్పటికీ కుక్క చిరుతతో పోరాడింది. చివరకు చిరుత అక్కడి నుంచి పరిగెత్తుతుండగా.. కుక్క దాని వెంబండించింది. అయితే చిరుత, కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. కుక్కపై చిరుత దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లోనమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అక్కడి పరిసరాల్లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. తాను తెల్లవారుజామున 3 గంటలకు చిరుత రాకను గుర్తిచినట్టు తెలిపారు. దీంతో భయం వేసి తన క్యాబిన్ డోర్‌ను గట్టిగా లాక్ చేసుకున్నట్టు చెప్పారు. చిరుత సంచారంపై అవాజ్ వాయిస్ ఎన్జీవోకు ఫోన్ చేశానని.. దీంతో వారు అక్కడికి చేరుకుని చిరుత దాడిలో గాయపడిన కుక్కకు ప్రాథమిక చికిత్స అందించారని తెలిపారు. ఈ ఘటనను అటవీశాఖ అధికారి సంతోష్ కాంక్ ధ్రువీకరించారు. చిరుత సంచారాన్ని గుర్తించి.. దానిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరీ తూర్పు ప్రాంతంలో పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం చిరుత దాడిలో గాయపడిన కుక్కకు చికిత్స అందిస్తున్నారు. కాగా, జనావాసాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
కుక్క వర్సెస్ చిరుత : చివరకు ఏమైదంటే..
-
పేయింగ్ గెస్ట్.. తన రూమ్మేట్స్తో కలిసి..
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడే తనపై ఘాతుకానికి పాల్పడటంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. బాధితురాలు(25) అంధేరీలోని గోని నగర్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఉద్యోగరీత్యా ఎయిర్‌హోస్టెస్ అయిన సదరు యువతికి.. తమ కంపెనీలో పనిచేసే స్వప్నిల్ బడోడియాతో స్నేహం కుదిరింది. అతడు కూడా అదే వీధిలోని ఓ ఫ్లాట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాధితురాలిని డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు డ్రింక్ ఆఫర్ చేశాడు. ఇంతలో అతడి రూమ్మేట్స్ అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు సున్నితంగా డ్రింక్ తిరస్కరించినప్పటికీ ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందంటూ ఆమెతో తాగించాడు. అనంతరం అదే రాత్రి తన రూమ్మేట్స్తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 376డీ కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. స్వప్నిల్ నేరం అంగీకరించాడని, అయితే తన స్నేహితులకు మాత్రం ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. -
రాత్రంతా సినిమాలు చూస్తావా...?
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాత్రంతా సినిమాలు చూస్తుందనే కారణంగా ఓ వ్యక్తి తన భార్య(22)ను హతమార్చాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు... చేతన్ చౌగేలే(32) భార్యతో కలిసి అంధేరిలో నివసిస్తున్నాడు. వీరికి రెండేళ్ల బిడ్డ ఉంది. అయితే గత కొంత కాలంగా భార్య యూట్యూబ్‌కు బానిసగా మారడంతో చేతన్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. సౌండ్ ఎక్కువగా వస్తున్న కారణంగా తనకు, బిడ్డకు నిద్ర పట్టడం లేదని చేతన్ భార్యకు చెప్పినప్పటికీ ఆమె అతడి మాటలు పట్టించుకోలేదు. తెల్లవారి నాలుగు గంటల వరకు సినిమాలు చూస్తూనే ఉండటంతో కోపోద్రిక్తుడైన చేతన్ నైలాన్ తాడుతో ఉరి బిగించి, ఆమె గొంతు నులిమాడు. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలనుకోగా అప్పటికే ఆమె మృతి చెందింది. కాగా భార్య ప్రవర్తనతో విసిగిపోయి... క్షణికావేశంలోఆమెను హత్య చేశానని చేతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.