మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్‌వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయింది. ఫలితంగా అధికారులు ఈ సబ్‌వేను మూసివేశారు.
ముంబైలో నేటి (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కరుస్తున్న దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలను మూసివేశారు.
Watch: Heavy rain in Mumbai has led to intense morning showers and four feet of water accumulation in the Andheri subway. The subway has been closed to traffic since 6: 30 AM. pic.twitter.com/jHcocRmTZY
— IANS (@ians_india) July 20, 2024
Comments
Please login to add a commentAdd a comment