ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం : 5గురి మృతి | Fire Accident in Andheri ESIC Hospital, 5 died | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం : 5గురి మృతి

Published Mon, Dec 17 2018 7:52 PM | Last Updated on Mon, Dec 17 2018 8:13 PM

Fire Accident  in Andheri ESIC Hospital, 5 died - Sakshi

సాక్షి,ముంబై: ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంధేనిలోని ఈఎస్‌ఐసీ కామ్‌గార్‌ ఆసుపత్రిలో హఠాత్తుగా మంటలంటు కున్నాయి.  దీంతో  రోగులు పరుగులు తీయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పొగదట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక  రోగులు, వారి బంధువులు సతమతమయ్యారు.  ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 147మందికి తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయ కార్యక్రమాను పర్యవేక్షిస్తున్నారు. 10 అగ్నిమాపక శకటాలు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో చిక్కుక్కున్నవారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. 16 అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి తరలించి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.



No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement