మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి.
ఈ ప్రమాదంలో 13 మంది వ్యక్తులు గాయపడగా.. వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మొత్తం.. 90 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
ఘట్కోపర్ ఈస్ట్‌లోని రమాబాయి అంబేద్కర్ నగర్ మగస్వర్గియ హౌసింగ్ సొసైలో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన 90 మంది బిల్డింగ్ మెట్ల ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారని ముంబై అగ్నిమాపక దళం తెలిపింది. వారిని రాజావాడి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment