Ghatkopar
-
ముంబైలో అగ్ని ప్రమాదం.. 13 మందికి గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి.ఈ ప్రమాదంలో 13 మంది వ్యక్తులు గాయపడగా.. వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మొత్తం.. 90 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.ఘట్కోపర్ ఈస్ట్‌లోని రమాబాయి అంబేద్కర్ నగర్ మగస్వర్గియ హౌసింగ్ సొసైలో ఈ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన 90 మంది బిల్డింగ్ మెట్ల ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడ్డారని ముంబై అగ్నిమాపక దళం తెలిపింది. వారిని రాజావాడి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ముంబై లోకల్ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబై లోకల్ ట్రైన్లో ఘాట్కోపర్ నుంచి కళ్యాణ్ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. లోకల్ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్‌లో కేరళలో నిర్మల వందేభారత్ రైలులో ప్రయాణించి అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
ముంబైలో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి
ముంబై: మహా నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. కాగా పెద్ద ఎత్తున మంటలు చుట్టుముట్టడంతో.. ఆర్పేందుకు 15 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ఫ్యాక్టరీలో మంటలకు కారణమయ్యే వివిధ రకాల రసాయనాలను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న దట్టమైన పొగలు, మంటలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. చదవండి: శ్రీచక్ర ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం -
పక్కా ప్లాన్‌తో..పుట్టినరోజు నాడే...
ముంబై : నమ్మిన స్నేహితులే ఓ యువకుడి పాలిట కాలయములయ్యారు. పుట్టినరోజు నాడే పాశవికంగా దాడి చేసి అతడిని హతమార్చారు. ఈ విషాదకర ఘటన ముంబైలోని ఘట్కోపర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...నితేశ్ సావంత్(32) అనే వ్యక్తికి అతడి స్నేహితులకు వారం కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ ఎనిమిది మంది మిత్రబృందం అతడితో మాట్లాడటం మానేశారు. అయితే ఆదివారం నితేశ్ పుట్టినరోజు కావడంతో అతడికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఘట్కోపర్లోని ఓ పార్కులో నితేశ్ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధాలతో అతడిని కసితీరా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది మందికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిందితులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నామని..త్వరలోనే నిందితుల ఆచూకీ కనుక్కుంటామని పేర్కొన్నారు. -
పెన్సిల్ గుచ్చి కన్ను పోగొట్టాడు..!
ముంబై : బడి పిల్లల మధ్య మొదలైన గలాట ఓ విద్యార్థి కంటి చూపు పోయేందుకు కారణమైంది. ఓ విద్యార్థి కంట్లో పెన్సిల్‌తో గుచ్చడంతో అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. ఈ ఘటన ఘట్కోపర్లో గతేడాది జూలై 21న జరిగింది. అయితే, చికిత్స చేస్తే తమ కుమారుడి (9) కన్ను బాగవుతుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన విద్యార్థి కుటుంబం నుంచి నష్టపరిహారం ఇప్పించడని పోలీసులను ఆశ్రయించారు. పెన్సిల్‌తో పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం నమ్మబలికిందని... ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నష్టపరిహారం ఇప్పించకపోగా.. రూ.3 వేలు ఫీజు కట్టలేదని తమ పిల్లాడి మార్కుల మెమోను నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించామని తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వాపోయారు. పెన్సిల్ లెడ్ చిన్నారి కంటిలోనే ఉండిపోవడంతో చూపు తిరిగిరావడం అసాధ్యమని వైద్యులు అంటున్నారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణల్ని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. పిల్లాడి కంట్లో దాడి చేసిందెవరో ఖచ్చితంగా తెలియదన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ టీచర్లెవరూ లేదని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇక బాధితుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా తాము ఎవరినుంచీ నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. కావాలంటే.. స్థానికంగా ఉండే నాయకుల సహకారంతో పిల్లాడి కంటి చికిత్సకు అవసరమైన సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. గతేడాది కాలంగా బాధిత విద్యార్థి ఫీజు తనే చెల్లిస్తున్నానని వెల్లడించారు. బాధితుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నిజానిజాలు కనగొంటామని పంత్నగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ రోహిణీ కాలే తెలిపారు. -
‘విమానం సరిగాలేదని ముందే తెలిసింది’
సాక్షి, ముంబై: గురువారం మధ్యాహ్నం ఘట్కోపర్లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదంలో మరణించిన మెయింటెన్స్ ఇంజనీర్ సురభి గుప్తా తన తండ్రితో విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదని తెలిపినట్లు వెల్లడైంది. ‘మరికొద్ది గంటల్లో 12 సీట్లతో కూడిన కింగ్ ఎయిర్ సీ90 విమానంలో ప్రయాణించబోతున్నాం. కానీ, అది బాగా పాతబడి ఉంది. విమానం కండీషన్ సరిగా లేదు’ అని సురభి తనతో ఫోన్లో తెలిపిందని మృతురాలి తండ్రి ఎస్పీ గుప్తా తెలిపారు. సురభిని ఆమె స్నేహితులు, బంధువులు కల్పనా చావ్లాగా పేర్కొనేవారని తెలిపారు. ఎంతో ధైర్య సాహసాలు గల తన కూతురు ప్రాణాలు పోవడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సరైన కండీషన్లో లేని విమానానికి అనుమతులెలా ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో సురభితో పాటు మరో ఇంజనీర్, ఇద్దరు ఫైలట్లు, ఒక పాదచారి మరణించారు. సురభి భర్త విమాన ఫైలట్ కావడం విశేషం. -
రూ. 1.51 కోట్ల పాత నోట్లు స్వాధీనం
రద్దయిన నోట్ల డిపాజిట్లకు సామాన్యులకు గడువు ముగిసినా... కోట్లకు కోట్లు పెద్ద నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ట్యాక్సీ క్యాబ్ లో తీసుకెళ్తున్న 1.51 కోట్ల రూపాయల పాత నోట్లను ఛేజ్ చేసి మరీ ముంబాయి పోలీసులు పట్టుకున్నారు. నగదును సీజ్ చేసిన పోలీసులు, నలుగురు నిందితులను ఘాట్కొపార్ లో అరెస్టు చేశారు. ఈ పాత నోట్లను కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి ట్యాక్సీలో తరలిస్తున్న క్రమంలో అవి పోలీసులు కంటపడ్డాయి. 10 నిమిషాల పాటు ఆ ట్యాక్సీని ఛేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఘాట్కొపార్ లోని ఎల్బీసీ మార్గ్ రోడ్డులో వాటిని పట్టుకున్నారు. క్యాబ్ కు వెనుక సీట్లలో రెండు బ్యాగుల్లో ఈ కోటిన్నరకు పైగా పాత నోట్లను ఉంచినట్టు పోలీసులు చెప్పారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో, వెంటనే క్యాబ్ డ్రైవర్ రిజ్వాన్ గులామ్ ఖాజీ పాటు కారులో ఉన్న మరో ముగ్గురు అయాజ్ అక్తర్, దానిష్ రఫీ, రెహాన్ సైఖ్ లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ అయిన వారు కేవలం మధ్యవర్తులనేని, అసలైన నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీసు సచిన్ పాటిల్ హెచ్చరించారు. ఈ నిందితులందరూ దక్షిణ ముంబాయికి చెందినవారేనని పేర్కొన్నారు. గొరై ప్రాంతంలోని ఓ వ్యక్తికి వీటిని డెలివరీ చేయడానికి తీసుకెళ్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిలో ఎవరైనా ఎన్ఆర్ఐల ప్రమేయముందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కాగ, విదేశాల్లో ఉన్న భారతీయులకు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి తుది గడువు రేపటితో ముగియనుంది. -
కొత్తమార్గాల అన్వేషణలో బెస్ట్
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో మెట్రో రైల్వేస్టేషన్లను కలుపుతూ సాగే కొత్తమార్గాల కోసం బెస్ట్ అన్వేషణ ప్రారంభించింది. ఇటీవలే ప్రారంభమైన వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో సేవలు ప్రారంభం కావడంతో బెస్టుకు చెందిన బస్సులలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఘాట్కోపర్-అంధేరీల మధ్య నడిచే బెస్టు బస్సు సర్వీసులను సగానికి సగం తగ్గించింది. మెట్రో సేవల ప్రారంభానికి ముందు 340 నంబరు బెస్టు బస్సులు 292 ట్రిప్పులు తిరిగేవి. మెట్రో రైల్వే సేవలు ప్రారంభంతో ఈ ట్రిప్పుల సంఖ్యను 150కి తగ్గించారు. ఇలా మెట్రో సేవలు అందుబాటులో ఉన్న మార్గాల్లో బెస్ట్ ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో కొత్తమార్గాలపై కన్నేసిన బెస్ట్ మెట్రో స్టేషన్లను కలుపుకొని వెళ్లే కొత్త మార్గాల్లో బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ దూరమైనప్పటికీ ప్రయాణికుల సంఖ్య ఆశించినస్థాయిలోనే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు, కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బెస్ట్ బస్సులను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయించిన అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సర్వేలకు సంబంధించిన నివేదికలు రాగానే సర్వీసులను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కలిసొచ్చే అంశమే... మెట్రో చార్జీలు ఎక్కువగా ఉండడం బెస్ట్ సంస్థకు కలిసొచ్చే విషయంగా ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఘాట్కోపర్ నుంచి అంధేరీకి మెట్రో రైలు చార్జీ సుమారు రూ. 30 ఉంటుందని అంచనా. అయితే బెస్టు బస్సు చార్జీ మాత్రం ఘాట్కోపర్ నుంచి అంధేరి వరకు కేవలం రూ. 15 ఉండనుంది. దీంతో రానుపోను చార్జీలు కలిపితే మెట్రో ఒక చార్జీతో సమానం అవుతుండడంతో ప్రయాణికులు బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తారని, ఫలితంగా ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెరుగుతున్న నష్టం.. మెట్రోసేవలు అందుబాటులోకి రావడంతో బెస్ట్ సంస్థలో ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం మెట్రో చార్జీలు తక్కువగా ఉండడం, సేవలు కొత్త కూడా కావడంతో ప్రయాణికులంతా మెట్రోల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బెస్ట్‌కు ఇప్పటిదాకా రూ. 18 కోట్లమేర నష్టం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. నెలరోజులపాటు మెట్రో చార్జీలు ఇంతే ఉండే అవకాశం ఉండడంతో తమ నష్టాలు మరింతగా పెరిగే అవకాశముందంటున్నారు. -
ఈస్టర్న్ ఫ్రీ వే రెండో టన్నెల్ ప్రారంభం
సాక్షి, ముంబై: ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం శనివారం ప్రారంభమైంది. వాహనాలు సాఫీగా, ఎలాంటి అవరోధాలు, సిగ్నల్లు లేకుండా గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఘాట్కోపర్ వరకు వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ ఫ్రీవే వల్ల ఠాణే, నవీముంబై నుంచి దక్షిణ ముంబైకి చాలా తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా ఆరెంజ్ గేట్, పాంజర్పోల్ మీదుగా ఘాట్కోపర్కు కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ మార్గం నుంచి ప్రతిరోజు సుమారు 25 వేలకుపైగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే ఈస్టర్స్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాల మీదుగా వెళితే ట్రాఫిక్ కారణంగా సుమారు గంటకుపైగా సమయం పట్టేది. ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం వల్ల ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాలలో కొంత మేర ట్రాఫిక్ తగ్గనుంది. కాగా, దక్షిణ ముంబైని శివారు ప్రాంతాలతో నేరుగా కలిపేందుకు ఇప్పటికే నిర్మించిన ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ తొలి భూగర్భ సొరంగ మార్గం 2013 జూన్‌లో ప్రారంభమైంది. ఠాణే, నవీముంబై ప్రాంతాల నుంచి దక్షిణ ముంబైకి, దక్షిణ ముంబై నుంచి ఠాణే, నవీ ముంబైకి వెళ్లాలన్న ట్రాఫిక్ వల్ల చాలా సమయం తీసుకునేది. ఈ ఫ్రీవే వల్ల తక్కువ సమయంలో దక్షిణ ముంబై - ఠాణే, నవీ ముంబై ప్రాంతాలకు చేరుకునేందుకు వీలు కలిగింది. ట్రాఫిక్ సమస్య నుంచి కూడా కొంత ఊరట లభించింది. పి.డిమెల్లో రోడ్పైనున్న ఆరే ంజ్ గేట్ నుంచి ఘాట్కోపర్ వరకు మొత్తం 16.4 కి.మీ. పొడవుగల ఈస్టర్న్ ఫ్రీ వే మార్గాన్ని ఎమ్మెమ్మార్డీయే మూడు విడతల్లో నిర్మించింది. ముందుగా ఆరేంజ్ గేట్ నుంచి అణిక్, అణిక్ నుంచి పాంజర్పోల్ వరకు 13.59 కిలోమీటర్ల మార్గంలో 9.29 కిలొమీటర్ల ఫ్లై ఓవర్ వంతెన ఉంది. ఇక పాంజర్పోల్ నుంచి ఘాట్కోపర్ వరకు 2.5 కి.మీ. ఫ్రీ వే పనులు కూడా పూర్తి అయ్యాయి. ఓ టన్నెల్ కారణంగా ఆలస్యమైంది. 550 మీటర్ల పొడవైన ఈ రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో శనివారం ఈ ఫ్రీవేను ప్రారంభించారు.