![INS Brahmaputra Severely Damaged In Fire,Lying On Its Side Sailor Missing](/styles/webp/s3/article_images/2024/07/22/ins.jpg.webp?itok=MQVrytWC)
ముంబై: భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని నౌకదళం డాక్‌యార్డ్‌లో మరమత్తుల కోసం నిలిపినన సమయంలో ఆదివారం సాయంత్రం ఈ యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నావికాదళంలోని ఓ జూనియర్ నావికుడు గల్లంతైనట్లు.. అతని కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మిగతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ప్రమాదంతో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయిందని పేర్కొంది. ‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు సోమవారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి’ అని తెలిపింది.
అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి ఓడ ఓవైపుకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని పేర్కొంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment