Sailor
-
ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం.. నావికుడు గల్లంతు
ముంబై: భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని నౌకదళం డాక్‌యార్డ్‌లో మరమత్తుల కోసం నిలిపినన సమయంలో ఆదివారం సాయంత్రం ఈ యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నావికాదళంలోని ఓ జూనియర్ నావికుడు గల్లంతైనట్లు.. అతని కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యులు చేపట్టినట్లు పేర్కొన్నారు.మిగతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ప్రమాదంతో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయిందని పేర్కొంది. ‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు సోమవారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి’ అని తెలిపింది.అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి ఓడ ఓవైపుకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని పేర్కొంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. -
కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్ ప్రమాదం
కొచ్చి/న్యూఢిల్లీ: కొచ్చి నావికా కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో నేవీకి చెందిన ఒక నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఐఎన్ఎస్ గరుడపై ట్యాక్సీ చెకింగ్ సమయంలో చేతక్ హెలికాప్టర్ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లీడింగ్ ఎయిర్ మ్యాన్ యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ యోగేంద్ర సింగ్ మృతికి సంతాపం ప్రకటించారని వివరించింది. యోగేంద్ర సింగ్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అని తెలిపింది. -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబో రేస్‌ని పూర్తి చేసిన తొలి భారతీయుడు
రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్ డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో సెయిలింగ్ రేస్‌లో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చిన సెయిలర్‌గా(నావికుడు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ రేస్ సెప్టెంబర్ 4,2022న ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. దీంతో టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా సోలో సెయిలింగ్ రేసులో రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడంటూ రేసు అధికారిక వెబ్‌పేజ్‌లో ఒక ప్రకటనలో వెల్లడించింది. (చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..) -
ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు..!
‘నైజీరియన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్ ఇడున్’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్ ఇడున్ నౌకపై ఇక్వెటోరియల్ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిక్ ఇడున్ నౌక చీఫ్ ఆఫీసర్, భారత నావికుడు సాను జోష్ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్. బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్ ఇడున్ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
‘అందుకు మానసిక ధైర్యం చాలా అవసరం’
జీవితంలో ఏదో అవ్వాలనుకుని ఇంకేదో అవుతుంటాము. కొన్నిసార్లు మనం ఏది అనుకున్నా డెస్టినేషన్ లో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. అచ్చం ఇలానే నేత్రా కుమనన్ జీవితంలో జరిగింది. నేత్ర మరెవరో కాదు మన దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనే తొలి మహిళా సెయిలర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేత్ర సెయిలర్ అవ్వాలనుకోలేదు. అందరిలాగే స్కూలుకెళ్లి చదువుకుంటోన్న నేత్ర పన్నెండేళ్ల వయసులో మొదట టెన్నిస్ నేర్చుకుందామని బ్యాట్ పట్టుకుంది. కానీ అది కుదరలేదు. తర్వాత సైక్లింగ్ చేద్దామనుకుంది ఇది కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఇలా కాదు భారతీయ సంప్రదాయాలకు తగ్గట్టుగా భరతనాట్యం నేర్చుకుందామనుకుంది. అది కూడా పూర్తి చేయలేదు. అనుకోకుండా వేసవిసెలవుల్లో నేత్ర వాళ్ల అమ్మ ‘‘సమ్మర్ క్యాంప్‌లో భాగంగా సెయిలింగ్ నేర్పుతున్నారు వెళ్లు’’ అని చెప్పడంతో నేత్ర అక్కడికి వెళ్లింది. అప్పుడు తనకు తెలియదు. భవిష్యత్తులో దేశంలోనే తొలి మహిళా సెయిలర్‌ని అవుతానని. ఇటీవల ఒమన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్ లో నేత్ర టాప్‌లో నిలిచి ఒలింపిక్స్ బెర్త్ కొట్టేసింది. 21 పాయింట్ల తేడాతో భారత్‌కు చెందిన రమ్య, శరవణపై పైచేయి సాధించి క్వాలిఫై అయింది. మరోరేసు మిగిలి ఉండగానే నేత్ర టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో ఒకరోజు ముందుగానే ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఇప్పటిదాకా తొమ్మిది మంది సెయిలర్లు భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొనగా తొలిసారి మహిళా విభాగంలో నేత్ర అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎస్ఆర్ఎం కాలేజీలో రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతోన్న నేత్ర రెండుసార్లు జాతీయ ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంది. మరో రెండు సందర్భాల్లో రన్నరప్‌గా నిలిచింది. 2018లో జకార్తాలో జరిగిన ఏíషియన్ గేమ్స్‌లో లేజర్ రేడియల్‌లో ఐదోస్థానం లో నిలిచింది. గతేడాది జనవరిలో జరిగిన హెంపల్ వరల్డ్ కప్ సిరీస్‌లో కాంస్యపతకం గెలుచుకుంది. సెయిలింగ్ వరల్డ్ కప్ మెడల్ గెలుచున్న తొలి భారతీయ మహిళగా నేత్ర చరిత్ర సృష్టించింది. గత కొన్నేళ్లుగా జాతీయ చాంపియన్‌గా నిలుస్తోన్న నేత్ర ఏషియన్ గేమ్స్‌లో కొద్దిలో మిస్ అయినప్పటికీ నిరంతర కృషితో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు చేరుకుంది. నేత్ర మాట్లాడుతూ..‘‘నేను చెన్నైలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఒకసారి సమ్మర్ క్యాంప్‌లో భాగంగా తొలిసారి సెయిలింగ్‌లో పాల్గొన్నాను. ఇతర రకాల క్రీడలతో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంటుంది. సెయిలింగ్ చేయడానికి మానసిక ధైర్యం చాలా అవసరం. ఒకసారి చూద్దాం అని వెళ్లిన నేను సెయిలింగ్ బాగా నచ్చడంతో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాను. గతేడాది లాక్డౌన్ సమయంలో స్పెయిన్‌లో చిక్కుకుపోయాను. అప్పుడు రెండుసార్లు ఒలింపియన్‌గా నిలిచిన హంగేరియాకు చెందిన థామస్ ఇస్జ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. రేసింగ్‌లో ఒత్తిడిని ఎలా జయించాలో ఆయన చక్కగా వివరించారు. ఒకటిన్నర ఏడాదిపాటు ఇంటికి దూరంగా ఉండి కఠోర దీక్షతో కష్టపడడంతో ఈరోజు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాను’’అని నేత్ర చెప్పింది. ‘‘ఇవి నా తొలి ఒలింపిక్ గేమ్స్. సాయశక్తులా ప్రయత్నించి ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తాను. తరువాతి ఒలింపిక్స్‌లో కూడా పోటీపడతా’’ అని నేత్ర ధీమా వ్యక్తం చేసింది. ఇక ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతుండడం వల్ల ఇటు నా బీటెక్ ను అటు సెయిలింగ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. మా నాన్న గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనవల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న.. నా వెనుక ఉండి ఆయన నన్ను ముందుకు నడిపించారు.’’ అని నేత్ర చెప్పింది. -
14 గంటలు యముడితో పోరాడాడు!
అది పసిఫిక్ మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మధ్యలో ఒంటిరిగా ఓ వ్యక్తి. తన ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాడు. నీటిలో ఈదుతూ 14 గంటలు యముడితో పోరాడాడు. తుదకు తానే గెలిచాడు. తన కుటుంబంలో ఆనందం నింపాడు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సిల్వర్ సపోర్టర్ అనే ఓడలో విడామ్ పెరివెటిలోవ్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న ఆ ఓడ న్యూజిలాండ్‌లోని టౌరంగా పోర్టు నుంచి పిట్‌కెయిర్న్ దీవులకు సరుకులతో బయలుదేరింది. ఇంజిన్ రూంలో నైట్ డ్యూటీ విధులు ముగించుకున్న 52 ఏళ్ల విడామ్.. తెల్లవారుజామున తన కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఓడ డెక్ పైకి వచ్చాడు. నిద్రవస్తోందని కూడా కుమారుడికి చెప్పాడు. నిద్ర మత్తులో ఉన్న విడామ్ ఆ తర్వాత కొద్ది సేపటికే ఓడపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఇది గమనించని ఓడ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారు. నీటిలో పడ్డ విడామ్ పైకి వచ్చి చూసే సరికి ఓడ దూరంగా వెళ్లిపోయింది. ఫిషింగ్ బెలూన్ ఆసరా.. లైఫ్ జాకెట్ లేదు. ఎటు చూసినా నీళ్లు. ఎటు ఈదాలో తెలియదు. నడి సంద్రంలో విడామ్ పరిస్థితి కడు దీనంగా తయారైంది. దూరంగా ఏదో నల్లగా కనబడితే ఆదేదో దీవి అనుకుని అటు ఈదడం మొదలు పెట్టాడు. చాలా సేపు ఈదిన తర్వాత దానికి దగ్గరా వచ్చాడు. అప్పడు తెలిసింది అది దీవి కాదు. చేపల వేటకు ఉపయోగించే రబ్బరు బెలూన్ అని. దాన్నే ఆసరా చేసుకున్నాడు. దాన్ని అంటిపెట్టుకుని తాను మునిగిపోకుండా చూసుకున్నాడు. తాను ఎలాగైనా బతకాలని అనుకుని ఆ బెలూన్తోనే పాటే కొంత సేపు తేలుతూ.. కొంత సేపు ఈదుతూ ఉండిపోయాడు. ఆరు గంటల తర్వాత.. విడామ్ ఓడలో లేని విషయాన్ని ఉదయం పది గంటల తర్వాత సిబ్బంది గుర్తించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ విడామ్ షిప్‌లోనే ఉన్నట్లు నిర్దారించుకున్న సిబ్బంది.. ఎక్కడ పడిపోయి ఉంటాడో అనే అంచనా వేశారు. 400 నాటికల్ మైళ్ల దూరంలో అతను ఉండి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు. వెంటనే ఓడను వెనక్కు తిప్పారు. ఇంతలో సమీపంలోని ఆస్ట్రల్ దీవుల్లో ఉన్న ఫ్రెంచ్ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా విమానంలో వెతుకులాటకు బయలుదేరారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తాము అనుకున్న ప్రాంతానికి షిప్ చేరింది. అప్పటికే సముద్రంలో విడామ్ అలసిపోయాడు. దూరం నుంచి ఓడ కనబడటంతో నీరసించి ఉన్నా.. చేతిని పైకి ఎత్తి పిలిచాడు. దానిని గుర్తించిన ఓడ సిబ్బంది.. విడామ్ వద్దకు చేరుకుని ఓడ పైకి అతన్ని తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. సుమారు 14 గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అతని విల్ పవర్ చూసి ఓడ సిబ్బంది ఆశ్చర్యపోయారు. విడామ్కు జేజేలు పలికారు. నౌక సిబ్బందిని విడామ్ ఓ కోరిక కోరాడు. అదేంటంటే, ఆ బెలూన్ను సముద్రంలోనే వదిలేయమని.. ఎందుకంటే అది మరొకరి జీవితాన్ని రక్షిస్తుందనే ఉద్దేశంతో. ► సముద్రంలో ప్రమాదానికి గురైన తర్వాత ఎక్కువ రోజుల బ్రతికున్న వ్యక్తిగా జపాన్‌కు చెందిన కెప్టెన్ ఓగురి జుకుచి రికార్డు సాధించారు. 1813లో జపాన్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన ఆయన ఓడ మధ్యలో మునిగిపోయింది. వాటి శకలాలపైనే ఆయన, మరో నావికుడు ఓటోకిచి 484 రోజులు బతికి ఉన్నారు. ► ఎల్సాల్విడార్కు చెందిన అల్వెరెంగా 2012 నవంబర్‌లో సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదం బారిన పడింది. 2014 జనవరి వరకు అతను బతికుండి మార్షల్ ఐలాండ్ తీరానికి చేరుకున్నాడు. ► ఆరోగ్యవంతమైన మనిషి మంచి నీళ్లు తాగకుండా 3 నుంచి 4 రోజులు బతికుండే అవకాశం ఉంది. 5 డిగ్రీలు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే నీటిలో మనిషి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడం కష్టం. -
మినీ లైఫ్ ఆఫ్ పై
మాస్కో: అడుగుల ఎత్తున్న ఎగిసి పడ్డ అలలు.. దారి తప్పిన ఒంటరి నావ.. అందులో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలతో గడిపిన వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. సరదాగా నదీ విహారానికి వెళ్లిన వ్యక్తి తప్పిపోయి సముద్రం గుండా మరో ఖండాంతరానికి చేరుకున్నాడు. అలస్కా యాంకరేజ్‌కు చెందిన జాన్ మార్టిన్ విలియమ్-3.. అనే వ్యక్తి రెండు వారాల క్రితం క్రితం యుకోన్ నదీ తీరంలో విహారానికి వెళ్లాడు. వ్యక్తిగత బోట్లో విహారం చేస్తుండగా.. అలా బేరింగ్ సముద్రంలోకి చేరుకున్నాడు. అక్కడ అలల తాకిడికి తప్పిపోగా.. బేరింగ్ సముద్రం గుండా 50 మైళ్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకున్నాడు. ఆగష్టు 1న చుకోట్కా రీజియన్‌లోని లావ్రెంటియా గ్రామానికి(రష్యా) చేరకున్న అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాతావరణంలో మార్పులు, నేవీగేషన్ వ్యవస్థను కోల్పోవటంతో అతను దారితప్పిపోయినట్లు తెలుస్తోంది. అతని నుంచి వివరాలు సేకరించిన అనంతరం అమెరికా దౌత్య అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాలను రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జోఖరోవా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ రెండు వారాలు ఉప్పు నీటిని వేడి చేసుకుని తాగటం, చేపలతో ఆకలి తీర్చుకున్నట్లు మార్టిన్ వెల్లడించాడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని మరియా జోఖరోవా వెల్లడించారు. -
అందరూ చూస్తుండగా అధికారి చెంపచెళ్లు
న్యూఢిల్లీ: ఓ నావికుడు సర్వే షిప్ అధికారిపై చేయిచేసుకున్నాడు. ఆయన చెప్పిన ఆదేశాలు పాటించలేదని మందలిస్తుండగా నేరుగా చెంపచెల్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సహాయక నావికులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఒడిశాలోని పారాద్వీప్ పోర్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ సందాయక్ అనే నౌక సర్వే షిప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇందులో షిప్ బోర్డుకు అధికారిగా పనిచేస్తున్న ఆయన నౌకలోని మోటారు బోట్లను లాగేందుకు పనిచెప్పారు. ఈ విషయంలో నలుగురు సహాయక నావికులు కాస్త అసంబద్ధంగా ప్రవర్తించారు. పై అధికారి మాటలు లెక్కచేయలేదు. ఎదురు తిరిగేందుకు ప్రయత్నించారు. వీరిలో ఒకరు మాత్రం నేరుగా అధికారిపై చేయిచేసుకున్నాడు. దాదాపు దీనిని తిరుగుబాటు అని అనుకోవచ్చని సంబంధిత అధికారులు చెప్పారు. భారతీయ నానికా దళం అంటేనే క్రమశిక్షణకు పేరని, వారిని అలాగే క్షమించి వదిలేస్తే మిగితా వారికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లువుతుందనే ఉద్దేశంతో వారు నలుగురుపై వేటు వేసినట్లు తెలిపారు. ఐఎన్ఎస్ సందాయక్ను 2001లో ఈస్ట్రన్ నావల్ కమాండ్ ప్రారంభించింది. ఇది పూర్తిగా స్వదేశీ తయారీ నౌక. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సముద్ర సంపదను గుర్తించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. -
33 ఏళ్ల తర్వాత తెలిసింది.!
వాషింగ్టన్: చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న అమెరికా పౌరుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ మహిళను పిల్లలు నిద్రపోతున్న సమయంలో రేప్ చేసి, ఆమె భర్తను క్రూరంగా చంపాడనే కేసులో హార్వాడ్(59)కు కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. 1982లో ఈ ఘటన జరిగింది. నిందితుడికి డీఎన్ఏ పరీక్షను నిర్వహించి బాధితురాలి ఒంటిపై ఉన్న పంటి గుర్తులతో సరిపోలడంతో దోషిగా తేల్చారు. కాగా 33 ఏళ్ల తర్వాత డీఎన్ఏ ఫలితాలను మరోసారి చూసినపుడు అసలు విషయం వెలుగు చూసింది. నేరం చేసింది వేరొక వ్యక్తి అని, అతను జైలు శిక్షను అనుభవిస్తూ మరణించాడని తేలడంతో హార్వాడ్ ను విడుదల చేయాలని వర్జీనియా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం 2015లోనే అమెరికాలో చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న 149 మందిని అక్కడి కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి. వీరందరూ సగటున 14.5 సంవత్సరాల శిక్షను అనుభవించినవారే. -
అలలపై ఆట
డీలైట్ మాన్సూన్ రెగెట్టా పోటీలకు నగరం సిద్ధమైంది. అమెరికా కప్ ఫార్మాట్ తరహాలో తొలిసారిగా హుస్సేన్‌సాగర్‌లో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న సెయిలింగ్ పోటీలకు సెయిలర్లు సన్నద్ధమయ్యారు. ఈసారి రూ.కోట్ల విలువ చేసే అమెరికా బోట్లతో పోటీల్లో పాల్గొననుండటం నగరవాసులను ఆకర్షిస్తోంది. ఫ్లీట్ రేసింగ్, మ్యాచ్ రేసింగ్‌లు వురో ఆకర్షణ. పోటీలు టీవీలో కూడా ప్రసారవువుతారుు. అవగాహన కోసం సెయిలర్లకు ఇప్పటికే ప్రత్యేక కోర్సుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కొత్త తరహా నిబంధనల వల్ల బోట్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండదు. సెయిలర్లకు పూర్తి రక్షణ ఉంటుంది. ఏయే విభాగాలు... అప్టిమిస్ట్ (అండర్-15), టాపర్ (అండర్-19), ఒమెగా (పిల్లల నుంచి పెద్దల వరకు) విభాగాల వారీగా ఈ పోటీలు ఉంటాయి. లక్ష రూపాయల విలువ చేసే అప్టిమిస్ట్ బోట్లను పిల్లలు ఉపయోగిస్తారు. కోట్ల రూపాయల విలువ చేసే అమెరికా కప్ బోట్లను ఒమెగా విభాగంలో సెయిలర్లు వినియోగించనున్నారు. ఆనందంగా ఉంది ‘1994 సంవత్సరంలో తొలిసారిగా హైదరాబాద్‌లోనే సెయిలింగ్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచా. మళ్లీ ఇప్పుడు తొలిసారి అమెరికా కప్ ఫార్మాట్ పోటీల్లో పాల్గొననుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అని వరల్డ్ చాంపియన్ మహేష్ రాంచంద్రన్ చెప్పాడు. ‘నాలుగేళ్ల నుంచి హుస్సేన్ సాగర్‌లోనే సెరుులింగ్ ప్రాక్టీసు చేస్తున్నా. యాట్చ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ తీసుకున్నా. గతేడాది జరిగిన మాన్సూన్ రెగెట్టా పోటీల్లో కాంస్య పతకం సాధించా. ఈసారి కూడా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తా’నని హైదరాబాద్ సెయిలర్ రాగి రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. సిటీప్లస్ -
ఇంటికి చేరిన నావికుడు
ముంబై: టోగో నిర్బం ధంలో ఉన్న భారతీయ నావికుడు సునీల్ జేమ్స్ శుక్రవారం కుటుంబాన్ని చేరుకున్నాడు. ఐదు నెలలుగా ఇంటికి దూ రంగా ఉన్న జేమ్స్‌ను ఇంటికి చేరగానే విషాదమే పలకరించింది. ఈ నెల రెండో తేదీన ఆయన 11 నెలల కుమారుడు మరణించాడు. ఈ పరిస్థితిలో అతని విడుదల కోసం ప్రభుత్వం మీద వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చారు. జేమ్స్ భార్య అదితి... ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా కలసి తన భర్తను విడుదల చేయించాల్సిందిగా ప్రార్థించింది. చివరికి జేమ్స్‌ను టోగో ప్రభుత్వం విడుదల చేసింది. ‘నిర్బంధంలో ఉన్నప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తండ్రిగా నా విధిని నిర్వహించాల్సిన పరిస్థితి. దయచేసి అర్థం చేసుకొని వదలిపెట్టండి’ అని ఎయిర్‌పోర్టులో అతన్ని కలిసిన మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాడు. ప్రధాని కార్యాలయం, టోగో అధ్యక్షుల జోక్యంతోనే తనకు స్వేచ్ఛ లభించిందన్నాడు. కెప్టెన్ జేమ్స్ నాయకత్వం వహించిన మార్షల్ దీవులకు చెందిన ఎంటీ ఓషన్ షిప్‌ను దోచుకోవడానికి పైరేట్లకు సహకరించాడనే ఆరోపణతో జూలై 16న టోగో అధికారులు అరెస్టు చేశారు.డిసెంబర్ 2న గాంగ్రీన్‌తో మరణించిన జేమ్స్ కుమారుడి అంత్యక్రియలను నిర్వహించకుండా అతని రాక కోసం కుటుంబం ఎదురుచూసింది. జేమ్స్ ఇంటికి చేరినందున వివాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారని సన్నిహితులు తెలిపారు.