వాషింగ్టన్: చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న అమెరికా పౌరుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ మహిళను పిల్లలు నిద్రపోతున్న సమయంలో రేప్ చేసి, ఆమె భర్తను క్రూరంగా చంపాడనే కేసులో హార్వాడ్(59)కు కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. 1982లో ఈ ఘటన జరిగింది. నిందితుడికి డీఎన్‌ఏ పరీక్షను నిర్వహించి బాధితురాలి ఒంటిపై ఉన్న పంటి గుర్తులతో సరిపోలడంతో దోషిగా తేల్చారు.
కాగా 33 ఏళ్ల తర్వాత డీఎన్‌ఏ ఫలితాలను మరోసారి చూసినపుడు అసలు విషయం వెలుగు చూసింది. నేరం చేసింది వేరొక వ్యక్తి అని, అతను జైలు శిక్షను అనుభవిస్తూ మరణించాడని తేలడంతో హార్వాడ్ ను విడుదల చేయాలని వర్జీనియా సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం 2015లోనే అమెరికాలో చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న 149 మందిని అక్కడి కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి. వీరందరూ సగటున 14.5 సంవత్సరాల శిక్షను అనుభవించినవారే.
33 ఏళ్ల తర్వాత తెలిసింది.!
Published Fri, Apr 8 2016 5:00 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement