
వాషింగ్టన్: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో బ్రెయిన్ వాషింగ్ అనేది కూడా ఓ ప్రమాదరమైన ఆయుధం వంటిదే. ఇటీవల ఆమెరికాకు చెందిన ఓ తండ్రి తన పిల్లలను చంపిన సంఘటనే దానికి రుజువు నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మాథ్యూ టేలర్ కోల్మన్(40) అనే వ్యక్తి తన పిల్లలను క్యాంపింగ్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో.. ఎప్పుడు తీసుకువస్తాడో అతని భార్యకు చెప్పడానికి నిరాకరించాడు. అంతే కాకుండా ఆమె మెసేజ్‌లు, కాల్ చేసినపుడు కూడా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు యుఎస్‌కు తిరిగి వచ్చే క్రమంలో సరిహద్దు వద్ద ఆగస్టు 7న అతడిని ఎఫ్‌బిఐ అరెస్టు చేసింది.
భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని..
కాగా పోలీసు అధికారులు అతడి ఫోన్‌ని ఫైండ్ మై ఐఫోన్ యాప్ ద్వారా ట్రాక్ చేశారు. ఇది మెక్సికోలోని రోసారిటోగా అతని చివరిగా ఉన్నట్లు చూపించింది. దీంతో అప్రమతమైన ఎఫ్‌బిఐ అతడిని అరెస్టు చేసి ప్రశ్నించింది. ఇంటరాగేషన్‌లో కోల్మన్ తన పిల్లలను ఈటెల ఫిషింగ్ గన్‌తో చంపి, వారి మృతదేహాలను మెక్సికోలో పడవేసినట్లు ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను మెక్సికో అధికారులు కనుగొన్నారు.
కాగా తన భార్య ‘‘సర్పెంట్ డీఎన్‌ఏ’’ తన పిల్లలు కలిగి ఉన్నారనే కారణంతో వారిని చంపేశానని, ఈ ‘‘సర్పెంట్ డీఎన్‌ఏ’’ ను కలిగి ఉన్నందరున వారు భవిష్యత్తులో ‘‘రాక్షసులు’’గా ఎదుగుతారని ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. భవిష్యత్తులో ప్రపంచం "రాక్షసులతో" నిండి ఉంటుందని క్యూఆనన్, ఇతర కుట్ర సిద్ధాంతాల ద్వారా "జ్ఞానోదయం" పొందానని కోల్మన్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది ప్రపంచాన్ని రక్షించే ఏకైక చర్య అని నిందితుడు కోల్మన్ చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment