Targeting sleeping homeless men: యూఎస్‌లో తుపాకీలతో దాడుల జరిపే కొంతమంది నేరస్తుల గురించి విన్నాం. జాతి వివక్షతతో దాడులు చేసేవాళ్లు కొందరైతే. మరికొందరూ మా దేశంలోకి ఎందుకు వచ్చారంటూ స్థానిక రౌడిలు కాల్పులు జరపడం చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషుల పైనే దాడి చేస్తాడంటా. పైగా వారిని హతమార్చేంత వరకు వదలడట.
వివరాల్లోకెళ్తే...న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలలో వరుస హత్యలు జరిగాయి. ఈ జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉన్న పురుషుల పైనే నిందితుడు దాడి చేశాడు. అతను ఇప్పటి వరకు ఐదుగురుని మట్టుబెట్టడు. పైగా గత రెండు రోజుల్లో చేసిన దాడిలో ఇద్దరూ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే అతను ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్‌లు అనుమానం వ్యక్తం చేశారు. వారు ఆ నేరస్తుడిని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా వ్యవహరించారు. అలాగే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మేయర్లు జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉండే పురుషుల కోసం ఒక హెచ్చరిక జారీ చేశారు.
మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును విచారిస్తుంది. అంతేకాదు దర్యాప్తులో.. అతను నిరాశ్రయుల పైన దాడులు జరుపుతున్నాడని, తాజాగా మాన్‌హట్టన్‌లోని ట్రిబెకా ప్రాంతంలో 43 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చడాని వెల్లడించారు. పోలీసుల నిందుతుడి ఫోటోను కూడా విడుదల చేశారు. పైగా నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 19 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.
Tonight, Washington, DC Mayor Muriel Bowser and @NYCMayor spoke about ongoing investigations by the @DCPoliceDept and the @NYPDnews. Following their conversation, Mayor Bowser and Mayor Adams released the following joint statement: https://t.co/MpcefoOowL pic.twitter.com/dbWmLxg1Tb
— Mayor Muriel Bowser (@MayorBowser) March 14, 2022
(చదవండి: ఆయువు తీసిన ఆన్‌లైన్ గేమ్స్!)
Comments
Please login to add a commentAdd a comment