
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పొతవరం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసును పోలీసులు చేధించారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సత్యనారయణ వంశీ ను హత్య చేశాడాని పోలీసులు తెలిపారు. 2019 లో డేటింగ్ యాప్ ధ్వారా వంశీ కి సత్యనారాయణ పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరు మధ్య స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.
చింతలసత్యనారాయణ, కొనకళ్ల వంశీ రాత్రి 7 గంటల సమయంలో పోతవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కలిశారని..వంశీ రూ.5 వేలు ఇవ్వక పోవడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతిని తండ్రిని సత్యనారాయణ లక్ష రూపాయలు డిమాండ్ చేసి 40 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగాడబ్బులు తీసుకునే క్రమంలో సత్యనారాయణ ను అరెస్ట్ చేశామాని డీఎస్పీ పి.శ్రీనాధ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment