
హైదరాబాద్: మహిళను వేధిస్తున్న ఆమె బావపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ హరీష్ తెలిపిన మేరకు.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ (31) జీహెచ్‌ఎంసీలో ఉద్యోగం చేస్తోంది. 2020లో ఆమెకు వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భర్త, అత్తా మామలు, బావ సంజీవ్‌కుమార్ (39)కుటుంబంతో కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు.
కొంతకాలంగా సదరు మహిళను బావ సంజీవ్‌కుమార్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 22వ తేదీన బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా వచ్చి చేయి పట్టుకున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రుల సహకారంతో సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు సంజీవ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment