sister-in-law
-
Lok sabha elections 2024: బారామతిలో ప‘వార్’
ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఇక్కడ వదిన మరదళ్ల పోరు తప్పదని తేలిపోయింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ అభ్యరి్థత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్‌కు సోదరి వరుసయ్యే సుప్రియా సూలే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. బారామతిలో పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు సమానమైన అంగబలం, అర్థబలం కలిగిన వదిన మరదళ్లలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారామతి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కడం పట్ల సునేత్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లక్కీ డే అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు శివసేన, బీజేపీ, ఎన్సీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం కలి్పంచారని పేర్కొన్నారు. -
Aadi Saikumar: ఆది సాయికుమార్ మరదలి ఎంగేజ్మెంట్.. హీరో కూతుర్ని చూశారా? (ఫోటోలు)
-
తెల్లారితే పెళ్లి.. ఇంటికి వచ్చిన అక్క భర్తతో వెళ్లిపోయిన నవ వధువు
జగిత్యాల క్రైం : తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరికి అక్క భర్తతోనే వెళ్లిపోయినట్లు తెలియడంతో వారంతా ఖంగుతిన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. ఆదివారం ఉదయం వధువు ఇంటివద్ద వివాహం జరగాల్సి ఉండగా అంతా సిద్ధంచేశారు. వేకువజామున వెళ్లి చూసేసరికి వధువు కనిపించలేదు. చివరికి పొరుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అక్క భర్తనే వివాహానికి వచ్చి, వధువును తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. దీంతో వివాహం నిలిచిపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. చెల్లె వివాహానికి వస్తే తన భర్తే ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఆందోళనకు గురైంది. -
వింత ఘటన: భర్త చెల్లినే పెళ్లి చేసుకున్న భార్య! అత్తింటి వారిపై కేసు
ఒక మహిళకు వివాహమై పదేళ్లు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఆమె తన భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తోంది కూడా. ఏమైందో ఏమో ఉన్నట్టుండి భర్త చెల్లినే పెళ్లి చేసుకుంది. పైగా ఆమహిళ తన మరదలితో భార్యభర్తల్లా కలిసి జీవిస్తున్నారు. దీనికి ఆమె భర్త సైతం అడ్డు చెప్పలేదు. ఇదంతా నచ్చని ఆ మహిళ అత్తమామలు ఆమె మరదలిని (భాగస్వామిని) తీసుకు వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ వారిపై కిడ్నాప్ కేసు పెట్టింది. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లో నివశిస్తున్న ప్రమోద్ దాస్, శుక్లా దేవి జంటకు వివాహమై పదేళ్లు అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. ఐతే ఏమైందో ఏమో ఆమె ఒక రోజు భర్త చెల్లెలు 18 ఏళ్ల సోని దేవిని పెళ్లి చేసుకుంది. పైగా వారిద్దరూ భార్యభర్తల్లా జీవించడం ప్రారంభించారు. అందుకు భర్త వ్యతిరేకించకపోగా, తన భార్య సంతోషమే తన సంతోషం అని శుక్లా దేవి భర్త దాస్ చెబుతుండటం విశేషం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇక్కడ వరకు కథ అంతా బాగానే సాగింది. ఎప్పుడైతే దాస్ భార్య అతడి చెల్లిని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి దాస్‌తో జరిగిన పెళ్లిని వ్యతిరేకిస్తోంది. అంతేగాదు అతడి భార్య తన పెళ్లి చేసుకున్న భర్త చెల్లెలుతో జీవించేందుకు మగవాడిగా మారాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా వేషధారణ మార్చంది కూడా. అక్కడితో ఆగక పోగా మగవాడిలా మారేందుకు సర్జరీ చేసుకోవాలని ప్లాన్ చేయడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుబ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేగాదు ఆ మహిళ అత్తమామలు సోని దేవిని ఆమె నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో శుక్లాదేవి పోలీసులను ఆశ్రయించింది. పైగా అత్తింటి వారిపై కిడ్నాప్ కేసు కూడా పెట్టింది. పైగా ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో తెలియదు, ఇది మనసుకు సంబంధించింది అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతోంది సదరు మహిళ శుక్లా దేవి. ఈ మేరకు ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్ ఇది కాస్త వివాదాస్పదమైన కేసు అని వాస్తవాలను వెలకితీసేలా సున్నితంగా దర్యాప్తు చేయాల్సి అంశం అని చెప్పారు. (చదవండి: మోదీపై తృణమూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు, జైశంకర్‌పై కూడా..) -
కోరిక తీర్చాలని బావ ఒత్తిడి తెచ్చాడు.. అందుకే చంపేశా
వరంగల్: మరదలి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మందలించిన బావను నమ్మించి మరో ఇద్దరి సాయంతో హత్య చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు మున్నేరువాగు సమీపంలో గత శుక్రవారం కుళ్లిన స్థితిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీలో సోమవారం కొత్త విషయం వెలుగుచూసింది. మరదలిపై అనుమానంతో తండావాసులు నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. దీంతో కోపోద్రిక్తులైన తండావాసులు ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే.. డోర్నకల్ పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన బానోత్ జగన్(30) ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. అవివాహితుడైన జగన్ హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఈ నెల ఒకటవ తేదీన తండాకు వచ్చాడు. జగన్ సోదరుడు గోపి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య తన ఇద్దరు పిల్లలను ఇతర ప్రాంతాల్లో పాఠశాలలో చదివిస్తూ తను ఒంటరిగా తండాలో ఉంటుంది. మరదలి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో జగన్ తరచూ మందలించేవాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి నుంచి జగన్ కనిపించకపోవడంతో సోమవారం తండావాసులు తన మరదలిపై అనుమానంతో గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తండావాసులకు వివరించింది. తన ప్రవర్తనపై బావ జగన్ తరచూ ప్రశ్నించేవాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ అడ్డు తొలగించుకోవాలని తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తితోపాటు మరొకరి సహాయం తీసుకున్నట్లు తెలిపింది. 2వ తేదీ రాత్రి కోరిక తీరుస్తానంటూ మున్నేరు శివారు శివాలయం సమీపానికి తీసుకెళ్లానని, అప్పటికే తన సమాచారం మేరకు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి బండరాళ్లతో తల, మెడపై కొట్టి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో కోపోద్రికులైన తండావాసులు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు. మెడలో చెప్పులదండ వేసి తండాలో ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
Viral Video: అన్న, చెల్లెల బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది ..!
-
మతిస్థిమితం లేదని.. సోదరి హత్య
మైసూరు: మానసిక అస్వస్థురాలు అయిన మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు, సుమారు రెండు సంవత్సరాల తరువాత ఈ ఘోరం బయటపడింది. చామరాజనగరకు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్దరాజుతో కలిసి హత్య చేసింది. వివరాలు.. హేమ కుమార్తె అయిన లక్షి్మని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్‌కు ఇచ్చి పెళ్లి చేయగా 7 ఏళ్ల ప్రీతం అనే కుమారుడు ఉన్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలిపెట్టాడు. అక్కడ రాయనహుండి గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీకి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయి ఉద్రేకంగా ప్రవర్తించసాగింది. మర్యాద పోతుందని ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి, నోట్లో బట్టలు కుక్కి రూపా, ఆమె భర్త సిద్దరాజు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి ఊపిరి ఆడక చనిపోయి ఉంది. గుట్టుగా ఇంటి వెనుకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎక్కడికో వెళ్లిపోయిందని బంధువులకు చెప్పారు. ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూపా అసలు విషయం చెప్పింది. తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: కంట్లో కారం చల్లి.. చేతులు నరికి) -
మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి..
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం): అయ్యో.. వద్దు అని అరుస్తున్నా వారి మనసు కరగలేదు. కొట్టొద్దు.. కొట్టొద్దు అంటూ వేడుకున్నా వారు కనికరం చూపలేదు. మానవత్వాన్ని మర్చిపోయి, సాటి మహిళ అని చూడకుండా ఇద్దరు మహిళలు తమ సొంత అన్న భార్యపై కర్కశంగా కర్రలతో దాడి చేశారు. బాధితురాలు ఎంతగా ఏడుస్తున్నా వదలకుండా పాశవికంగా కొట్టారు. రణస్థలం మండలం పిషిణి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని చుట్టుపక్కల వారు వీడియో తీయడంతో అది వైరల్ అయ్యింది. జేఆర్‌పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పిషిణి గ్రామానికి చెందిన రెడ్డి జానకి, కొత్తకోట్ల సుశీల, రెడ్డి నారాయణరావులు అన్నాచెల్లెళ్లు. నారాయణరావుకు భార్య కమల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జానకి అవివాహితురాలు కావడంతో తండ్రితో కలిసి ఉంటోంది. పక్కనే వేరే ఇంటిలో నారాయణ రావు కుటుంబంతో ఉంటున్నారు. సుశీలకు వివాహమై అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇటీవల నారాయణరావు తండ్రి రామ్మూర్తి పిషిణి రెవెన్యూ పరిధిలో తన భూమిని రూ.70 లక్షలకు విక్రయించారు. వచ్చిన సొమ్మును కుమారుడికి ఇవ్వకుండా ఆడపడుచులే పంచుకున్నారు. గతంలో కూడా ఆస్తులు అమ్మినప్పుడు ఇలాగే జరిగింది. దీంతో వదిన, ఆడపడుచుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని కమల ఆడపడుచులతో తగాదా పడుతూ ఉంటుంది. గతంలోనూ.. కర్రతో కర్కశంగా దాడికి పాల్పడిన రెడ్డి జానకి వ్యవహారం గతంలోనూ వివాదాస్పదమే. 2020లో ఏకంగా జేఆర్‌పురం ఎస్ఐపైనే ఆమె కేసు పెట్టింది. అప్పుడు ప్రకృతి లే–అవుట్లో అన్నాచెల్లెళ్ల మధ్య భూ వివాదంలో ఎస్ఐ అశోక్‌బాబు తలదూర్చడం, ఆ సెటిల్మెంట్ వ్యవహారం అక్రమ సంబంధం ఆరోపణల వైపు దారి తీయడం స్థానికంగా సంచలనం రేపింది. దీనిపై అప్పటి సీఐ హెచ్.మల్లేశ్వరరావుకు జానకి ఫిర్యాదు చేయడంతో ఆ పంచాయతీ ఎస్పీ వరకు వెళ్లింది. అప్పట్లో ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కూడా. తాజా ఘటన నేపథ్యంలో గత పంచాయతీని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. పోలీసుల అదుపులో నిందితులు కేసు నమోదు.. ఉదయం జరిగిన ఈ ఘటనపై స్థానికులు 112 నంబర్‌కు ఫోన్ చేయడంతో జేఆర్‌పురం ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి 7.15కు వె ళ్లారు. బాధితురాలు క మలను 108లో శ్రీకాకు ళం రిమ్స్‌కు తరలించారు. నిందితులైన జానకి, సుశీలను అదుపులోకి తీసుకుని జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. గొడవల నేపథ్యంలో వదినపై దాడి చేయడానికి ఆడపడుచులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్తవారింటిలో ఉన్న సుశీలను ముందురోజే జానకి ఇంటికి పిలిచింది. నారాయణరావు ఉదయం ఐదున్నరకే ఒక పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిపోతారు. ఆయన పరిశ్రమకు వెళ్లిపోయాక ఉదయం 6.45 గంటలకు వదిన కమలపై ఇద్దరూ కలిసి కిరాతకంగా దాడి చేశారు. కాళ్లు కట్టేసి మరీ కసి తీరా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియోలోనే జానకి 24 సార్లు కర్రతో కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో తీయకముందు ఎంతగా దాడి చేసిందోనంటూ స్థానికులు అనుకుంటున్నారు. -
పెళ్లి కూతురి బదులుగా.. చెంప పగలకొట్టిన మరదలు
వైరల్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు ఎంతో ప్రత్యేకమైనవి. వాటి వైరల్ హడావిడి మామూలుగా ఉండదు. అందునా.. వధువు, వరుడితో ముడిపిన ప్రత్యేకత ఏదైనా ఉంటే మాత్రం ఆదరించేస్తుంటారు నెటిజన్స్. తాజాగా పెళ్లిలో స్టేజ్‌పైనే బావ చెంప పగలకొట్టిన మరదలు అంటూ.. ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తప్పతాగిన వరుడు.. తూలుతూనే స్నేహితుడి సాయంతో స్టేజ్‌పై నిల్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా పెళ్లి కూతురు ఉంటుంది. ఇద్దరూ దండలు మార్చుకోవాల్సిన టైంలో.. వధువు వంతు పూర్తి అవుతుంది. ఈలోపు వధువు చెల్లి హరతి, అక్షింతల పళ్లెంతో స్టేజ్ మీద ప్రత్యక్షమవుతుంది. అయితే తాగిన మైకంలో వధువుకి బదులుగా...... కింద వీడియో చూసేయండి.. बिहार में शराबबंदी बा ... 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T — Vikki1975 (@Vikki19751) June 21, 2022 ఈ వీడియో ఇది కొత్తదా? పాతదా?.. ఏదైనా షార్ట్ ఫిల్మ్‌లో భాగమా? అసలు ఎక్కడ జరిగింది? కావాలనే తీశారా? నిజంగా జరిగిందా? అనే విషయాలపై ఎక్కడా క్లారిటీ లేదు. కేవలం వాళ్ల సంభాషణల ఆధారంగా అది బీహారీ వీడియో అని స్పష్టం అవుతోంది. వధువు చెల్లి బాదుతుంటే.. అడ్డుకునే ప్రయత్నాలు పెద్దగా కనిపించవు. పైగా తాగుబోతు తూలే నటన కూడా అంత బాగాలేదన్న కామెంట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌లో మాత్రం తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. -
భార్య తనతో రావడానికి నిరాకరించిందని.. మరదలితో కలిసి..
పాట్నా: భార్య తనతో రావడానికి నిరాకరించిందని ఓ వ్యక్తి తన మరదలితో కలిసి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛప్రా జిల్లాకు చెందిన కృష్ణ రామ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం సంకటి దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో తరువాత గొడవలు తలెత్తాయి. దీంతో సకంటి దేవి తన తల్లిగారి ఇంటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు రామ్ అత్తవారింటికి వెళ్లాడు. అయితే భర్తతో పాటు వెళ్లడానికి ఆమె నిరాకరించంది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ రామ్.. మైనర్ అయిన తన మరదలికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకొని పారిపోయాడు. దీంతో మైనర్ తండ్రి తన కూతురిని కిడ్నాప్ చేశారంటూ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి ఆచూకీ వెతికి పట్టుకున్నారు. అయితే అప్పటికే మైనర్ తనకు బాల్యం వివాహం చేస్తున్నారని సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతలో పోలీసులు ఇద్దరి ఆచూకి కనుగొన్నారు. మైనర్ని కిడ్నాప్ చేసినందుకు రామ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకే రామ్‌తో కలిసి పారిపోతున్నట్లు మైనర్ పోలీసులకు చెప్పింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. చదవండి👉 బంజారాహిల్స్: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని.. -
విషాదం! అత్తమామల ఇంట్లో అల్లుడు అనుమానాస్పద మృతి!
గోపాల్‌గంజ్: మరదలిని ప్రేమించి, వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి మూల్యంగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా తరేయా సుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిరోలి డాన్లో నివాసం ఉంటున్న నారాయణ్ సాహ్ కుమారుడు అచ్చెలాల్ సాహ్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అచ్చెలాల్ సాహ్‌కు జాదోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధ్ నగర్‌కు చెందిన మంజు దేవితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక భార్యతో కలిసి అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఐతే అదే ఇంట్లో ఉంటున్న మరదలు బేబీ దేవితో అచ్చే లాల్ సాహ్ ప్రేమలో పడ్డారు. ప్రేమ ఎంతగా పెరిగిందంటే వారిద్దరూ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు కూడా. కాగా గత బుధవారం రాత్రి ఇద్దరు భార్యల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి అచ్చే లాల్ ఓ గదిలోకెళ్లి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు తన అత్తమామల ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని, మొత్తం కేసును పోలీసులు విచారిస్తున్నారని మీడియాకు తెలిపారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
డ్రగ్స్ బిజినెస్‌లో ఉన్నారా.. మీకిది తగునా?
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమీర్ భార్య సోదరి గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ తాజాగా మాలిక్ ట్వీట్ చేశారు. దీనికి తనదైన శైలిలో సమీర్ కౌంటర్ ఇచ్చారు. ‘గుడ్ వర్క్ మిత్రమా. కానీ ఒక మహిళ పేరును స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంత వరకు సమంజసం? నిజానికి, మేము పత్రికా ప్రకటనను జారీ చేసేటప్పుడు, మహిళల గౌరవాన్ని కాపాడటానికి వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇద్దరు పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ పేరును ఇలా బహిరంగపరచడం మీకు తగునా? మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామ’ని సమీర్ పేర్కొన్నారు. (చదవండి: మంత్రి నవాబ్ మాలిక్‌కు హైకోర్టు చురకలు) సమీర్ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ పేరు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద 2008లో నమోదైన కేసులో ఉందని నవాబ్ మాలిక్ వెల్లడించారు. ‘సమీర్ దావూద్ వాంఖెడే.. మీ వదిన హర్షదా దీననాథ్ రెడ్కర్ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారా? ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున మీరు సమాధానం చెప్పాల’ని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. 2008 జనవరిలో ఈ కేసు నమోదైనప్పుడు తాను సర్వీస్‌లో కూడా లేనని సమీర్ వాంఖడే తెలిపారు. 2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే తన సోదరి ఈ కేసులో బాధితురాలిగా ఉందని సమీర్ భార్య క్రాంతి రెడ్కర్ అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. నవాబ్ మాలిక్‌ను తన సోదరి చట్టపరంగా ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. (చదవండి: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారు) -
భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
కలకత్తా: పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందారు. అలాంటి వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబుగీబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆమె ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్‌లో ఆమె మాసిపోయిన దుస్తులతో కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి. క్రికెట్లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు. ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి చందా స్పందించారు. ‘ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఈ సందర్భంగా తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య గురించి మాట్లాడింది. ‘నేను టీచర్‌గా ఉన్నప్పుడే అతడి నుంచి ఎలాంటి లబ్ధి పొందను. నా కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ నాకు వీఐపీ గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆమె బాగోగులు ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంది.