
కీలక లోక్‌సభ స్థానంలో వదినా మరదళ్ల పోరు
ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఇక్కడ వదిన మరదళ్ల పోరు తప్పదని తేలిపోయింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ అభ్యరి్థత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్‌కు సోదరి వరుసయ్యే సుప్రియా సూలే మరోసారి బరిలోకి దిగబోతున్నారు.
బారామతిలో పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు సమానమైన అంగబలం, అర్థబలం కలిగిన వదిన మరదళ్లలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారామతి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కడం పట్ల సునేత్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లక్కీ డే అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు శివసేన, బీజేపీ, ఎన్సీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం కలి్పంచారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment