Sunita
-
గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్‌లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని: సింగర్ సునీత
సంగీత ప్రపంచంలో ఆమె స్వరం మధురం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికినా.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట.. ఆ మాటా ఓ అద్భుతం అనాల్సిందే. పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకుంది సునీత ఉపద్రష్ట. విశాఖకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతాన్ని ప్రేమించాలిసంగీతం అనేది భగవదత్తంగా రావాలి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. స్వరం మాత్రం జన్మతహా వస్తుంది. సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి. సంగీతాన్ని ప్రేమించాలి. నేటి తరం గాయకులకు ఇవే లక్షణాలు ఉండాలన్న నిబంధనలు లేవు. ఎవరు పాడినా తక్కువ సమయంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి.నేను అదృష్టవంతురాలినిచాలా కాలంగా పాటలు పాడటం వలన అనేక వైవిధ్యమైన పాటలు పాడే అవకాశం కలిగింది. అనేకమంది సంగీత దర్శకులు ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించారు. నా ముందుతరం వారు పాడిన కొన్ని పాటలు వింటుంటే కొన్ని సార్లు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇంతమంచి పాట నేను పాడలేకపోయాను అనే భావన కలిగింది.విశాఖలో బంధువులున్నారు మా అమ్మవాళ్లది విశాఖ. చిన్న తనం నుంచి అమ్మ ఈ నగరం గురించి చెబుతుంటే విశాఖపట్నం ఇలా ఉంటుందా అని ఊహించుకునే దాన్ని. అమ్మ చిన్నతనం ఇక్కడే సాగింది. అమ్మచెప్పినవి వింటూ ఊహల్లో పెరిగాను. ఆ విధంగా విశాఖ నగరంపై ప్రేమ పెరిగింది. నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది. కై లాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మా పెద్దమ్మ వాళ్లు విశాఖలో ఉండేవారు. ప్రకృతి అంతా ఇక్కడే ఉందని అని అనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు.పరిధి పెరిగిందినేడు సంగీత ప్రపంచం పరిధి విస్తరించింది, సినిమాల్లో పాత్ర, సంగీత దర్శకుడి ఆసక్తి, పరిస్థితులు ఆధారంగా పాటలు పెట్టడం జరుగుతోంది. సంగీతం నేర్చుకోవడం, గాయకులుగా స్థిరపడటంతో పాటు ఈ రంగంలో స్థానాన్ని నిలుపుకోవడం ఎంతో అవసరం.కాలంతో పాటు మార్పుల్లో భాగంగా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఆదరణ, ప్రాముఖ్యత పెరిగింది. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. సంగీత కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్యమాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం.ఇండిపెండెంట్ మ్యూజిక్కు ఆదరణనాకు కొండలు, సముద్రం అంటే ఎంతో ఇష్టం, నేనొక ప్రకృతి ప్రేమికురాలిని. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మధ్యలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడతాను. విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయి. -
దివి నుండి భువికి దీపావళి
దీపావళి తారాజువ్వ ఒకటి అంతరిక్షంలోకి దూసుకుని వెళ్లి, అక్కడున్న సునీతా విలియమ్స్‌ని ఎక్కించుకుని తిరిగి భూమి మీదకు చేరుకుంటే ఎంత బాగుంటుంది! వారంలో తిరిగొచ్చేందుకు వెళ్లి, అవాంతరం వల్ల అక్కడే చిక్కుకుపోయారు సునీత, ఆమె సహవ్యోమగామి విల్మోర్. వారిని స్పేస్‌లోకి మోసుకెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి, భూమి పైకి తిరిగొచ్చి కూడా రెండు నెలలు అవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో గానీ మరో కొత్త వ్యోమనౌకలో సునీత భూమి పైకి వచ్చే అవకాశాలు లేవు. సునీత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ‘నాసా’కు సంకేతాలు అందుతున్నాయి. కానీ అవి సునీత పంపుతున్న సంకేతాలు కావు. నాసా అంచనాలు మాత్రమే. నిజానికి ఆమె ధైర్యంగా ఉన్నారు. భూమిపైకి సందేశాలు పంపుతున్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి సంబరాలు జరుగుతున్నప్పుడు.. ‘‘అంతరిక్ష కేంద్ర నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి’ అంటూ వీడియోలో శుభాకాంక్షలు పంపారు! ఇది కదా ఈ ఏడాది అసలైన దీపావళి. భూమికి 260 మైళ్ల ఎత్తులో, నక్షత్రంలా మెరుస్తున్న మన సునీతను కళ్లారా చూడ్డం, ఆమె స్వరాన్ని చెవులారా వినటం.. ఇది కదా నిండైన దీపావళి.‘‘ఇంత ఎత్తు నుండి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు మాత్రమే లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గొప్పతనం గురించి చిన్నప్పుడు నాన్న మాకు చెప్పేవారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన దీపావళి ఉత్సవాలలో పాల్గొన్నందుకు అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌కు సునీతా విలియమ్స్ కృతజ్ఞతలు’’ అని సునీత తన సందేశాన్ని వినిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ధీరులు మాత్రమే ఇతరుల సంతోషాలలో పాల్పంచుకోగలరు. తమ కష్టాన్ని దాచి పెట్టి చిరునవ్వుల మతాబులను వెలిగించగలరు. -
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
పుట్టిన మూడు నెలలకే కూతురు చనిపోయింది: స్టార్ హీరో భార్య
బాలీవుడ్ నటుడు గోవిందా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లవ్ 86 మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తన సినీ కెరీర్లో పలు అవార్డులను అందుకున్నారు. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గోవిందా.. 1987లోనే సునీత అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా భార్య సునీతా అహుజా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అయితే తమకు పెళ్లైన ఏడాదికే టీనా జన్మించిందని వెల్లడించింది. కానీ.. టీనా తర్వాత మరో కూతురు కూడా పుట్టిందని సునీత తెలిపింది. కానీ నెలలు నిండకముందే బిడ్డ జన్మించడంతో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక మూడు నెలలకే చనిపోయిందని బాధాకర సంఘటనను గుర్తు చేసుకుంది.అందువల్లే తన కొడుకు యశ్‌వర్ధన్‌ను చాలా జాగ్రత్తగా పెంచుకున్నట్లు సునీత వెల్లడించింది. అంతే కాదు తన పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని వివరించింది. టీనా కంటే యశ్ ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో చాలా గారాబంగా పెంచుకుంటున్నట్లు పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన పిల్లలను పాఠశాల నుంచి నేనే తీసుకువస్తానని సునీత తెలిపింది. -
ఇక్కడ ముంచి.. అక్కడ తేలిండ్రు
సాక్షి, హైదరాబాద్: ‘మేము కలిసి వస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మీరు కలిసి వస్తారా?! అన్నం ఉడికిందా లేదా? అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకే రారు. వీరు కలిసి వస్తా అంటే నమ్మేది ఎవరు? నేను అందుకే వారికి (కేటీఆర్) సూచన చేస్తున్నా. నీ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (కాంగ్రెస్‌లో) ఉండి చెప్పి చెప్పి, ఇక్కడ ముంచి అక్కడ (బీఆర్ఎస్)తేలిండ్రు.. ఆ అక్కల మాటలు విన్నడు అనుకో, జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తది..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.శాసనసభలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లా డారు. ఆయన ప్రసంగం ముగించగానే ఆయన వెనకాల ఉన్న బీఆర్ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు గట్టిగా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ.. ‘వెనకాల ఉండే అక్కలు..’ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అరుపులు, నినాదాలు, కాంగ్రెస్ సభ్యుల ప్రతి నినాదాలతో గందరగోళం మధ్యే రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అండగా నిలబడతానని చెప్పి మోసం చేశారు: రేవంత్ ‘ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, ప్రజాజీవితానికి సంబంధించిన చర్చ ఉంటుంది. నాకు, సబితక్కకి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చను ఆమె సభలో చెప్పారు. కాబట్టి దానికి కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలను నేను సభలోనే చెప్పాల్సిన అసవరముంది. కాంగ్రెస్ పారీ్టలోకి నన్ను సబిత ఆహ్వానించడం, పెద్ద లీడర్ అవుతావని చెప్పడం వాస్తవమే. నేను ఆమె మాటను విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్‌లో చేరా. 2019లో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమంది.అప్పుడు సబితక్క నన్ను పిలిచి మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్యి.. ఎన్నికల్లో అండగా నిలబడతానని మాట ఇచ్చారు. కానీ నన్ను పార్టీ ఎంపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణమే ఆమె టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేశారు. (ఇది నిజమా? కాదా? అని సబితారెడ్డినుద్దేశించి ప్రశ్నించారు) కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు సూచించా. బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెబితే మేము ఏమైనా అమాయకులమా?..’ అంటూ సీఎం ప్రశ్నించారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని సభలో కూర్చోమని చెప్పండి..’ అని రేవంత్ అన్నారు. తాను కొత్త గవర్నర్‌కు ఆహా్వనం పలకడానికి విమానాశ్రయానికి వెళ్తున్నానని, తిరిగి వచి్చన తర్వాత అందరికీ సమాధానమిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సభ నుంచి వెళుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ‘షేమ్ ..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల నేపథ్యంలో స్పీకర్ అవకాశం ఇవ్వడంతో సబిత గద్గద స్వరంతో మాట్లాడారు. ఏం మోసం చేశాం: సబితా ఇంద్రారెడ్డి ‘రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టలో చేరినప్పుడు నేను అక్కగా ఆశీర్వదించా. నువ్వు చాలా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి సీఎం అవుతావు..అంటూ పారీ్టలోకి ఆహా్వనించా. సీఎం గుండెల మీద చెయ్యి వేసుకుని ఇది నిజమా? కాదా? చెప్పాలి. ఈ రోజు నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారీ అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తరని అన్నడు? ఏం మోసం చేశాం? ఏం ముంచినం? వీళ్లను ముంచినమా? ఎన్నికల సమయంలో కూడా నా నియోజకవర్గంలో మాట్లాడుతూ సబితక్క పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట మాట్లాడతది అన్నాడు.పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట ఏం మాట్లాడిన? ఎవరిని, ఎందుకు అవమానిస్తున్నవు? ఎందుకీ కక్ష ? ప్రతిసారీ టార్గెట్ చేస్తున్నరు. ఏం చేసినం మేము ఆడబిడ్డలం. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలి..’ అని సబిత డిమాండ్ చేశారు. సబిత ఆ మాట అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అంతకు ముందు ‘సీఎం రేవంత్ ఏ పార్టీలో నుంచి వచ్చారు? కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలినా కాలి్చవేస్తా అని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంత మందిని ఎందుకు చేర్చుకున్నారు..’ అని సబిత నిలదీశారు. -
ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం
సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్లో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమగోదావరి జల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేరుకున్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యులతో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఆ తరువాత సునీతతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్ నోట్లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ సమాచారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు. -
షర్మిల, సునీత, బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు షాక్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలు ఆరోపణలు, దుష్ప్రచారంతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాజకీయ లబి్ధకోసం వాడుకుంటున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిలకు కడప జిల్లా కోర్టు మరోసారి గట్టి షాక్ ఇచ్చింది.వివేకా హత్యకేసు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడొద్దని, దుష్ప్రచారం చేయవద్దని చంద్రబాబునాయుడు, లోకేశ్, షర్మిల, సునీత, బీటెక్ రవి, పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు ఆ పార్టీల కేడర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది.మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ షర్మిల, సునీత, బీటెక్ రవి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న వివేకా హత్యకేసు గురించి మాట్లాడటానికి వీల్లేదని పునరుద్ఘాటించింది. షర్మిల, సునీత, బీటెక్ రవిలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఖర్చుల కింద విధించింది. ఆ మొత్తాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్, లోకేశ్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తదితరులు చేస్తున్న దు్రష్పచారంపై వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్టులో దావా వేసింది. తమ పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు జగన్, కడప ఎంపీ అభ్యర్థితోపాటు పార్టీకి చెందిన వారిపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతారెడ్డిలను నిరోధించాలంటూ వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురే‹Ùబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా కోర్టు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నందున వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని ఆపాలని చంద్రబాబు, షర్మిల, సునీత, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి తదితరులను ఆదేశిస్తూ గతనెలలో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేలి్చచెప్పింది. జగన్మోహన్రెడ్డి, అవినాశ్‌రెడ్డిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలన్న హైకోర్టు ధర్మాసనం జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలంటూ షర్మిల, సునీత, బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ కడప జిల్లా కోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు వేశారు. షర్మిల తదితరుల వ్యాజ్యాలపై విచారించిన హైకోరుŠట్ ధర్మాసనం కడప కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేత కోసం కడప కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. షర్మిల తదితరుల అనుబంధ వ్యాజ్యాలపై కడప జిల్లా కోర్టు మూడు రోజులుగా విచారిస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున పిటిషన్ వేయడంపై షర్మిల తదితరుల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వ్యాఖ్యల వల్ల నష్టం వాటిల్లిందని భావిస్తే జగన్మోహన్రెడ్డి లేదా అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయాలే తప్ప పార్టీ జిల్లా అధ్యక్షుడు కాదని చెప్పారు. ఈ వాదనలను వైఎస్సార్సీపీ న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, కె.సుదర్శన్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందినందునే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరుల తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళితే ఓట్లపరంగా వైఎస్సార్సీపీకి నష్టం కలుగుతుందని, అందుకే పార్టీ తరఫున పిటిషన్ వేశామని తెలిపారు. వివేకా హత్యకేసు గురించి మాట్లాడవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తరువాత కూడా షర్మిల తదితరులు ఆ కేసు గురించి మాట్లాడారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బుధవారం జిల్లా జడ్జి కోర్టు హాల్లోనే ఉత్తర్వులను వెలువరించారు. నాగిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి వాదనలతో జడ్జి ఏకీభవించారు. మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ షర్మిల ఆ కేసు గురించి మాట్లాడారన్న వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు నిరాకరిస్తూ.. షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేశారు. -
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
బ్లడ్ గేమ్ బై సునీత.. తండ్రి రక్తంతో కూతురు కుటిల రాజకీయం
రక్తం ప్రశ్నిస్తోంది.. అవును రక్తం ప్రశ్నిస్తోంది. రక్త సంబంధం ఉన్న కూతురిని ప్రశ్నిస్తోంది. చంద్రబాబు ఆడుతున్న బ్లడ్ గేమ్‌లో నువ్వెందుకు పావులా మారావని ప్రశ్నిస్తోంది. యస్.. వివేకా రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నా రాజకీయ ప్రత్యర్థులతో నువ్వు, నీ భర్త ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నిస్తోంది. నన్ను గొడ్డలితో కసితీరా నరికి నరికి చంపిన దస్తగిరి బయట తిరుగుతుంటే.. నువ్వు బస్సెక్కి షర్మిల వెంట ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిల్‌పై బయట తిరుగుతుంటే.. అతడ్ని జైల్లో పెట్టించకుండా.. జగన్‌కు ఓటేయొద్దు.. అవినాష్‌కు ఓటేయొద్దు అంటూ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తోంది. నా రక్తపు మరకల తడి ఆరక ముందు అన్నీ నిజాలే చెప్పిన నువ్వు.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. నీ పక్కనే అసలు హంతకులు ఉన్నారని నీ అంతరాత్మకు తెలుసు. వారిని కాపాడుకునేందుకు అవినాష్‌కు ఆ రక్తపు మరకలు పూసే ప్రయత్నం చేస్తున్నావని నీ అంతరాత్మకు తెలుసు. ఎందుకమ్మా అన్ని తెలిసి ఈ బ్లడ్ గేమ్ లో నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావ్.. అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. హత్య చేసినోడు ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. హత్య చేయించినోడు ఇంట్లోనే నీ పక్కనే తిరుగుతుంటాడు. ఎంటమ్మా సునీత ఇది.. పదేళ్లలో ఎప్పుడైనా నాన్నా అని ఆప్యాయంగా పిలిచావా ? ఇప్పుడు నా రక్తాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నావే.. ఇది కరెక్టేనా ? నా రెండో భార్య షమీమ్ ను నువ్వు హింసించినా.. అవమానించినా.. నేను నిన్నేమీ అనలేదే..ఓహో ఆస్తిలో వాటా తగ్గుతుందని నా తర్వాత హోదా, పదవి నీ భర్తకు దక్కవని కోపంతో ఉన్నావా ? అందుకే నా ప్రత్యర్థుల వైపు నిలబడ్డావా ? జగన్ కు ఓటేయొద్దని అంటున్నావా ? అమాయకుడైన అవినాష్ ను బలి పశువుని చేయాలని చూస్తున్నావా ? అని వివేకా రక్తం తన రక్త సంబంధమైన సునీతను ప్రశ్నిస్తోంది. మర్డర్ చేయడమే కాదు.. దాన్ని ఇంకొకరిపై నెట్టేసే కుట్రపై.. ఇదే రక్తం సాక్షిగా.. అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి.. ప్రధానంగా ఓ పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. 1. వివేకా రెండో భార్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కాలర్ పట్టుకుని బెదిరించింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 2. వివేకా రెండో భార్య కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని రక్త చరిత్రకు తెరలేపింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 3. వివేకాకు చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఆయనకు చెక్ పెట్టింది నువ్వు, నీ భర్త నర్రెడ్డి కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 4. తండ్రి బతికుండగా పట్టెడన్నం పెట్టని నువ్వు ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 5. వివేకా రాజకీయ శత్రువులైన బీటెక్, ఆదినారాయణ రెడ్డి సహకారంతోనే హత్య జరిగిందని చెప్పింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 6. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచి పెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది నీ భర్త కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 7. అవినాష్ పేరు చెప్పకపోతే.. నీ భర్త జైలుకు పోక తప్పదని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 8. వివేకాను తానే నరికి చంపానని చెప్పినా.. దస్తగిరి బెయిల్‌కు నువ్వు సహకరించింది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 9. వివేకా హంతకులు పక్కనే ఉన్నా.. రక్తపు మరకలు మరొకరికి పూయాలని ప్రయత్నిస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు 10. నీ ఇంట్లో వారిని రక్షించుకునేందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుని రాజకీయం చేస్తున్నది నిజం కాదా.. నీ తండ్రి రక్తం మీద ఒట్టేసి నిజం చెప్పు -
సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్న కల్పనా సోరెన్!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు. తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని, ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు. తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు. #WATCH दिल्ली: झारखंड मुक्ति मोर्चा(JMM) नेता और पूर्व सीएम हेमंत सोरेन की पत्नी कल्पना सोरेन ने कहा, "जैसी घटना 2 महीने पहले झारखंड में हुई थी दिल्ली में भी वैसा ही कुछ हुआ है... मैं सुनीता केजरीवाल से मिलकर उनका दुख दर्द बांटने आई थी। हमने मिलकर प्रण लिया है कि इस लड़ाई को हमें… https://t.co/YzQ1M0Mktw pic.twitter.com/9JjhaVS7fR — ANI_HindiNews (@AHindinews) March 30, 2024 కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఇద్దరి పరిస్థితులు ఒకేలాంటివని విశ్లేషకులు అంటారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసే వరకు సునీతా కేజ్రీవాల్ తన ఇంటికి, కుటుంబానికే పరిమితమయ్యారు. హేమంత్ సోరెన్-అరవింద్ కేజ్రీవాల్‌ల అరెస్ట్ తర్వాత కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్‌లు తదుపరి బాధ్యతలను స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వారిద్దరూ ఈడీ రిమాండ్‌లో ఉన్న తమ భర్తలను కలుసుకుని వారికి ధైర్యాన్ని అందిస్తూనే, మరో వైపు పార్టీని ఐక్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. -
Lok sabha elections 2024: బారామతిలో ప‘వార్’
ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఇక్కడ వదిన మరదళ్ల పోరు తప్పదని తేలిపోయింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ అభ్యరి్థత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్‌కు సోదరి వరుసయ్యే సుప్రియా సూలే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. బారామతిలో పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు సమానమైన అంగబలం, అర్థబలం కలిగిన వదిన మరదళ్లలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారామతి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కడం పట్ల సునేత్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లక్కీ డే అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు శివసేన, బీజేపీ, ఎన్సీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం కలి్పంచారని పేర్కొన్నారు. -
చంద్రబాబు, మహాసేన రాజేష్‌కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత
సాక్షి, అమరావతి: ‘నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలిచిన చంద్రబాబు, పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రాజేష్ మహాసేనలకు కృతజ్ఞతలు’.. అంటూ మూడేళ్లుగా తన వెనుక ఉండి, తనను ఎవరు ఆడిస్తున్నారో, తన నోటి నుంచి వస్తున్న మాటల వెనుక స్క్రిప్ట్ ఎవరిదో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత విస్పష్టంగా వెల్లడించారు. ఇన్నాళ్లూ తాను కప్పుకున్న ముసుగును తొలగించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకు చంద్రబాబు ఆమెను తెరమీదకు తెచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుతో ప్రారంభించి, చివరకు ఏపీ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయొద్దని కోరుతూ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై మరోసారి అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అందుకోసం 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉదంతాన్ని వక్రీకరించారు. ఆమె తండ్రిని కుట్రతో ఓడించిన చంద్రబాబు ముఠాను వెనకేసుకొచ్చారు. ఆ ముఠా సభ్యులు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సునీత, ఆమె భర్త సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని దాటవేశారు. ఆమె తండ్రి రెండో వివాహంతో కుటుంబంలో తలెత్తిన విభేదాలను మరుగున పరచడానికి చూశారు. వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరితో మాటామంతీ కొనసాగిస్తున్న విషయం బయటి ప్రపంచం గుర్తించడంలేదనే భ్రమలో ఉన్నారు. వెరసి తాను చంద్రబాబు గూటిలో చిలకనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేర్పిన నాలుగు పలుకులనే పలికారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా ఆడారు. వివేకాను కుట్రతో ఓడించినందుకా చంద్రబాబు, ఆయన ముఠాకు కృతజ్ఞతలు? సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు బీటెక్ రవి, మహాసేన రాజేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడమే విడ్డూరం. వృత్తి రీత్యా డాక్టరైన సునీత ఉద్దేశపూర్వకంగా మతిమరుపు నటిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డిని 2017లో కుట్రతో రాజకీయంగా అంతమొందించింది చంద్రబాబే. తర్వాత 2019లో ఆయన్ని భౌతికంగా అంతం చేసిందీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఓడించారని ఆమె అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరం. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందినవారే కావడంతో ఆయన సునాయాసంగా గెలుస్తారని అంతా భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు. అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వారి వైపు లాక్కున్నారు. కుట్రపూరితంగా వివేకాను ఓడించారు. ఈ వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. హత్య వెనుకా ఎల్లో గ్యాంగే..! ఇక 2019 సాధారణ ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్ జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా వైఎస్ వివేకానందరెడ్డిని నియమించారు. వివేకానందరెడ్డి పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహాలు పన్నుతూ అందర్నీ కలుపుకొంటూ దూసుకుపోతున్నారు. దాంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి బెంబేలెత్తారు. వివేకా జీవించి ఉంటే వారితో పాటు బీటెక్ రవికీ రాజకీయంగా ప్రతిబంధకంగా మారుతారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. అంటే వివేకా భౌతికంగా లేకపోవడం రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని టీడీపీ పెద్దలు భావించారన్నది సుస్పష్టం. వివేకా హత్యకు ముందు టీడీపీ నేతలు కొందరితో రహస్య సమావేశాలు, హత్య తరువాత ఆ నేతలు వ్యవహరించిన తీరే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తిన కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డితో బీటెక్ రవి సాన్నిహిత్యం పెంచుకున్నారు. హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. అంటే వివేకా హత్య వెనుక ఎల్లో గ్యాంగ్ ఉందన్నది స్పష్టమవుతోంది. కానీ ఆ పచ్చ ముఠాలోని చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను సునీత వెనకేసుకు వస్తుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబ వివాదాల మాటేమిటి? వివేకానందరెడ్డి రెండో వివాహంతో కుటుంబంలో రేగిన విభేదాలు, ఆస్తుల కోసం ఘర్షణలు సునీత మరుగున పెడుతున్న మరో ప్రధాన అంశం. వివేకా మరణిస్తే ఎవరికి ప్రయోజనం, ఆయనతో వ్యక్తిగతంగా ఆస్తిపరంగా, రాజకీయంగా ఎవరికి విభేదాలు ఉన్నాయన్నది ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం. షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. ఆ మహిళకు పుట్టిన కుమారునికి ఆస్తిలో భాగం ఇవ్వాలని భావించారు. తన రాజకీయ వారసునిగా చేస్తానని కూడా ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలో ఆస్తి వివాదాలు, రాజకీయ వారసత్వ వివాదాలు తీవ్రస్థాయిలో తలెత్తాయి. వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్రంగా గొడవపడి ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబానికి చెందిన కంపెనీల్లో వివేకాకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి షమీమ్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, సునీత దూషించుకుంటూ చేసుకున్న వాట్సాప్ చాటింగ్‌ను కూడా అప్పట్లోనే సిట్ బృందం వెలికితీసింది. షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని, ఆమె కుమారుడిని హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నా అవడంలేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. షమీమ్ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి జీవించి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదికే ఎక్కువ ప్రయోజనమన్నది స్పష్టమవుతోంది. వివేకాను హత్య చేసిన తరువాత ఆయన నివాసంలో కొన్ని ఆస్తి పత్రాలు, రౌండ్ సీల్ కోసం హంతకులు వెదికారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంటే వివేకా తన రెండో భార్యకు రాసిచ్చిన ఆస్తి పత్రాలను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్లారన్నది స్పష్టం. వివేకా లేకపోతే ఆస్తి మొత్తం దక్కడంతోపాటు రాజకీయ వారసత్వం కూడా తమకే వస్తుందన్న ఉద్దేశం ఆయన బావమరిది, అల్లుడికి ఉందన్నది స్పష్టమైంది. లేఖను గోప్యంగా ఉంచి.. గుండెపోటు ప్రచారం వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పక్కా పన్నాగంతోనే వ్యవహరించారు. శివప్రకాశ్‌రెడ్డి మొదటగా ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. టీవీ చానళ్లలో ప్రసారమైంది. ఆ ప్రచారాన్ని కొనసాగించేందుకు వివేకా రాసిన లేఖను కుమార్తె, అల్లుడు రహస్యంగా ఉంచారు. ఆ లేఖను మొదటగా ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని సునీత భర్త రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖ, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని రాజశేఖరరెడ్డి ఆయనతో చెప్పారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసిపోయేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి ఆ లేఖను సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. వారు ఆ లేఖను చదివిన వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. వివేకా హంతకులతో సఖ్యత.. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో సాన్నిహిత్యం వివేకాను గొడ్డలితో నరికి చంపానని అంగీకరించిన హంతకుడు దస్తగిరితో సునీత సఖ్యతతో ఉండటం వెనుక గూడుపుఠాణి ఏమిటన్నది మరో కీలకాంశం. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన సిట్, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, సీబీఐ కూడా వివేకానందరెడ్డిని దస్తగిరితో సహా నలుగురు హత్య చేశారని నిర్ధారించాయి. వివేకాను గొడ్డలితో స్వయంగా నరికాను అని చెప్పిన దస్తగిరి అప్రూవర్‌గా మారడంతోనే ఈ కేసు దర్యాప్తు దారితప్పింది. సునీత, ఆమె భర్త దస్తగిరితో పలుసార్లు భేటీ అవుతున్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అంటే వివేకా కుటుంబం, టీడీపీ నేతల పన్నాగంలో భాగంగానే దస్తగిరి అప్రూవర్‌గా మారారన్నది సుస్పష్టం. వివేకా హంతకుడితో, రాజకీయ ప్రత్యర్థులతోనూ ఆ కుటుంబం సన్నిహితంగా ఉండటం ఈ హత్య కుట్రలో వారి సామూహిక భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది. వారంరోజుల్లో తేలిపోయేదే అయితే చంద్రబాబునే ప్రశ్నించాలి వివేకా హత్య కేసు వారం రోజుల్లోనే తేలిపోవాలి కానీ, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని సునీత ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమే. ఎందుకంటే వివేకా హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే. అప్పుడు వారం రోజుల్లోనే ఆ హత్య కేసును ఎందుకు ఛేదించలేదని సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే. ఇలా ప్రశ్నించకపోగా, వెనకేసుకు వస్తుండటం వెనుక ఉద్దేశం ఏమిటన్నది నిగ్గు తేలాలి. అంతేకాదు వివేకా హత్య జరిగిన వెంటనే ఆ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతో, మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు. అయినా సునీత చంద్రబాబును ప్రశ్నించడంలేదు. ఇప్పుడు కేసు సీబీఐ చేతుల్లో ఉంది...ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని కదా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఆ దర్యాప్తును అడ్డుకుంది సునీతే. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దని, సీబీఐ దర్యాప్తు కావాలని ఆమె న్యాయస్థానంలో కేసు వేశారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కేసును బదిలీ చేసింది. మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇప్పుడు సునీత నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నే. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన ఆమె అక్కడే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించాల్సింది. ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఎన్నికల్లో బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు అది ఇష్టం లేదు. బాబుకు ఇష్టంలేని పని సునీత చేయరు. అది ఆమె తండ్రి హత్య కేసు దర్యాప్తు అయినా సరే.. మాటలు మార్చిన సునీత సునీత వైఖరి ఊసరవెల్లిని తలపిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపి ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారని ఆమె 2019 మార్చిలో చెప్పారు. అంతే కాదు.. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. ఈ మేరకు 2019 మార్చి 21న హైదరాబద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ తన తండ్రి వివేకా, ఎంపీ అవినాష్‌రెడ్డి మధ్య ఉన్న అన్యోన్యతను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పూరితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ఆమె ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొంతకాలం అదే వైఖరి అవలంబించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్ళి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం మొదలెట్టారు. క్రమంగా మాటలు మారుస్తూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను విచారించాలంటున్నారు. చివరగా వైఎస్సార్సీపీకి ఓటేయొద్దంటూ ముసుగు తొలగించేశారు. తన ఎల్లో విధానాన్ని బహిర్గతం చేశారు. సునీత టీడీపీ గూటి చిలుకే ఇన్నాళ్లూ తన తండ్రి వివేకా హంతకులెవరో నిగ్గు తేలాలంటూ వాదించిన సునీత.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అసలు స్వరూపం బయటపెట్టారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే తనకు ప్రధానమని తేల్చిచెప్పారు. అందుకోసమే ఢిల్లీ ప్రెస్ మీట్లో రాజకీయ ప్రసంగమే చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, రఘురామరాజు, మహాసేన రాజేష్, పట్టాభి... ఇలా ఈ ఎల్లో గ్యాంగ్ కొన్నేళ్లుగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ఆరోపణలనే తాజాగా సునీతా చెప్పారు. అచ్చమైన టీడీపీ నేతగా మారారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటేయవద్దని చెప్పారు. ఇది నైతికంగా సునీత దిగజారుడుతనమే. ఇన్నాళ్లూ తండ్రి హత్యకు గురైన బాధితురాలిగా చెప్పుకున్న సునీత.. ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయంలో పావునని అంగీకరించారు. ఇన్నాళ్లూ తాను కార్చింది మొసలి కన్నీరేనని, చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనమే తన కంట్లో పన్నీరని చెప్పకనే చెప్పారు. వైఎస్సార్సీపీకి ఓటేయకూడదని అంటున్నారు. ఎందుకో మాత్రం ఆమె చెప్పనే లేదు. కులం, మతం, రాజకీయం చూడకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేసినందుకా? విద్య, వైద్య సంస్కరణలను ప్రవేశపెట్టినందుకా? గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చినందుకా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకా.. ఎందుకు ఓటేయకూడదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తన తండ్రి రెండో భార్యకు ఆస్తి లేకుండా అన్యాయం చేసినందుకు, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి హత్యను ఉపయోగించుకోవాలని చూస్తున్నందుకే ఆమెకు ప్రజలు సహకరించాలా అని ప్రశ్నిస్తున్నారు. -
11 లేదా 12న కాంగ్రెస్‌లోకి పట్నం దంపతులు!
తాండూరు (వికారాబాద్): కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం దంపతులు సిద్ధమవుతున్నారు. సతీసమేతంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్కు ప్రయతి్నస్తున్నారు. ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అధికారికంగా హస్తం పారీ్టలో చేరనున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాల పాటు ప్రాంతీయ పార్టీల్లో కొనసాగుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాబల్యం చూపుతున్న మహేందర్‌రెడ్డి తొలిసారి జాతీయ పారీ్టకి జై కొట్టారు. తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతకు కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ను వీడారు. మహేందర్‌రెడ్డి చేరికపై ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా..కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి స్పందిస్తూ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాను చెప్పేదేమీ లేదన్నారు. మరోవైపు ఏఐసీసీ సభ్యుడు రమేశ్ మహరాజ్...పట్నం చేరికపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సర్కారు నౌకరికి డేట్ ఫిక్స్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆర్కే టెలీ షో పై దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘సర్కారు నౌకరి’ని కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఘనంగా విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సహనిర్మాత: పరుచూరి గోపాలకృష్ణా రావు. -
జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. సునీతారావు ఆరోపించారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను మభ్య పెట్టేందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లు తెరపైకి తెచ్చారని, జనగణన జరగకుండా, మహిళల జనాభా తెలియకుండా ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మహి ళా బిల్లును వెంటనే అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే జనగణన పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. తక్షణం జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మోదీని నమ్మే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఇదో కొత్త నాటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. -
6 పాయింట్లలో సునీతా విలియమ్స్ లైఫ్ స్టోరీ!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ 1965,సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. 1 సునీతా విలియమ్స్ కుటుంబం సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్. పాండ్యా ఆయన భారతదేశంలోని గుజరాత్‌కు చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా.. స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్ఏలోని బోస్టన్‌కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్‌కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జెని వివాహం చేసుకున్నారు. అతను సునీతా విలియమ్స్ క్లాస్మేట్. 2 ప్రాథమిక విద్య సునీతా విలియమ్స్ మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. 3 అంతరిక్ష ప్రయాణ శిక్షణ సునీతా విలియమ్స్ 1987లో యూఎస్ నేవీలో చేరారు. ఆరు నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీతా విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. 4 195 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. 5 సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు సునీతా విలియమ్స్ 1998, జూన్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ (1998) మిషన్ ఎస్టీఎస్ 116, ఎక్స్‌పెడిషన్ 14, ఎక్స్‌పెడిషన్ 15, ఎస్టీఎస్ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 6 పద్మభూషణ్‌తో సత్కారం సునీతా విలియమ్స్‌కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదేకాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్‌లను అందుకున్నారు. ఇది కూడా చదవండి: జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు? -
తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత తీరు మరోసారి వివాదాస్పదమైంది. తండ్రిని హత్యచేసిన వారికి శిక్షలు పడేందుకు పోరాడుతున్నానని చెబుతున్న ఆమె వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం అనేకానేక సందేహాలు లేవనెత్తుతోంది. వివేకాను హత్యచేశానని స్వయంగా ఒప్పుకున్న దస్తగిరికి ఆమె పూర్తి అండదండలు అందిస్తుండటం తెలిసిందే. మరోవైపు.. వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో కలిసేందుకు సునీత శుక్రవారం ప్రయత్నించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి బెయిల్ వ్యవహారంలో సునీత వ్యవహారశైలి.. అనంతరం ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె యత్నించడానికి సంబంధం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులను ప్రభావితం చేయడం ద్వారా ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఆమె యత్నిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అసలు వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఆయన హత్యకు దారితీసి ఉండొచ్చన్న బలమైన ఆరోపణలకు సునీత ప్రస్తుత వ్యవహారశైలి బలం చేకూరుస్తోంది. హంతకుడు దస్తగిరికి సునీత అండదండలు.. సాధారణంగా తండ్రిని హత్యచేసిన వారిపై ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది. కానీ, వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న దస్తగిరిపై ఆయన కుమార్తె సునీత అంతులేని సానుకూలత ప్రదర్శిస్తున్నారు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని ఆమె ఏమాత్రం వ్యతిరేకించలేదు. అనంతరం.. బెయిల్ కోసం దస్తగిరి పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అంతేకాదు.. సునీత కూడా అతని బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించలేదు. మరోవైపు.. అసలు హత్యచేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడాన్ని వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాల్ చేశారు. అతనికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కూడా కోర్టును కోరారు. కానీ, సునీత వెంటనే ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం విస్మయపరిచింది. అలాగే, దస్తగిరి బెయిల్‌ను రద్దుచేయాల్సిన అవసరంలేదని ఆమె న్యాయస్థానికి తెలపడం గమనార్హం. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి ఎలాంటి అర్హతలేదని.. బాధితురాలిగా తనకే అది ఉందని ఆమె వాదించారు. దస్తగిరి బెయిల్‌పై బయట ఉండటంపట్ల తనకేమాత్రం అభ్యంతరంలేదని చెప్పుకొచ్చారు. అసలు తన తండ్రిని హత్యచేసిన వ్యక్తి జైలులో ఉండాలని కోరుకోవాల్సిన సునీత.. అతను బయట ఉండాలని ఆశిస్తుండటం వెనుక ఏదో మతలబు ఉందన్నది స్పష్టమవుతోంది. దస్తగిరి వాంగ్మూలాన్ని బలపర్చాలనే.. నిజానికి.. దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలతో ఎర్ర గంగిరెడ్డి విభేదించారు. సీబీఐ నమోదు చేసిన దస్తగిరి అప్రూవర్ వాంగ్మూలంలో చెప్పినవన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. దాంతో దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలం అంతా కట్టుకథేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. ఎర్ర గంగిరెడ్డిని కలిసి దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను బలపరచాలని ఒత్తిడి చేయడమే సునీత ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకోసం ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేయడం.. ఆయన బెయిల్‌కు సీబీఐ సహకరించేట్లుగా చేస్తానని హామీ ఇవ్వడం ఆమె ప్రణాళికగా ఉంది. వివేకా హత్య అనంతరం అక్కడ ఆధారాలను ధ్వంసం చేయాలని ఎర్ర గంగిరెడ్డిని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. ఇదే అంశం సునీత, ఆమె భర్తకు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో మాట మార్చాలని.. ఆధారాల ధ్వంసంతో తన భర్తకు సంబంధంలేదని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించాలన్నది సునీత ఉద్దేశం. తాను చెప్పినట్లు చేస్తే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ వచ్చేందుకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చేందుకు యత్నించినట్లు తెలిసింది. ఎర్ర గంగిరెడ్డిని కలిసే ప్రయత్నం ఎందుకో!? ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జైల్లో కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు విస్మయపరుస్తోంది. గంగిరెడ్డిని కలిసేందుకు ఆమె జైలు అధికారులను అనుమతి కోరగా వారు నిరాకరించారు. దాంతో ఆమె తన న్యాయవాది ద్వారా కొన్ని పత్రాలు ఆయన వద్దకు పంపి సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. అసలు తన తండ్రి హత్యకేసులో ఏ–1గా ఉన్న గంగిరెడ్డిని సునీత కలిసేందుకు యతి్నంచడం సందేహాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుచేయడంతో ఎర్ర గంగిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాను చెప్పినట్లుగా చెబితే దస్తగిరికి సహకరించినట్లుగానే ఎర్ర గంగిరెడ్డికి సహకరిస్తామని ఆయనకు చెప్పేందుకే సునీత ప్రయత్నించినట్లు సమాచారం. వేళ్లన్నీ సునీత, ఆమె భర్తవైపే.. ఈ మొత్తం పరిణామాలతో వివేకా హత్యకేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమైంది. ఆమె ఎందుకు హంతకులకు కొమ్ముకాస్తూ మరీ హత్య కేసు దర్యాప్తు దారి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నది కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తలెత్తాయన్నది బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో.. వివేకా హత్యకు గురికావడంతో ఆయన సొంత కుటుంబ సభ్యులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చదవండి: ఏది నిజం?: గంతలు కట్టేందుకే కట్టుకథలు వివేకా హత్య తరువాత ఆయన రాసిన లేఖ, సెల్ఫోన్లను పోలీసులకు వెంటనే ఇవ్వకుండా గోప్యంగా ఉంచమని పీఏ కృష్ణారెడ్డితో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఇదే అంశంపై సీబీఐ ఇటీవల వారిని విచారించింది కూడా. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే వివేకా హత్య స్థలంలో ఆధారాల ధ్వంసం చేశారన్నది వెల్లడైంది కూడా. వివేకా రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేత బీటెక్ రవి, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావగారు శివప్రకాశ్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారన్నది కూడా బహిరంగ రహస్యంగా మారింది. వాస్తవాలు వెల్లడి కాకూడదనే.. ఈ నేపథ్యంలో.. వివేకా హత్య కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డిల పాత్ర ఉందనే వాదన బలపడుతోంది. అంటే ఈ కేసులో వారిని నిందితులుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తాము బాధితులమని.. తమకే అర్హత ఉందని చెప్పేందుకు వారు నైతిక హక్కు కోల్పోయారు. మరోవైపు.. ఎర్ర గంగిరెడ్డి సీబీఐ ముందు నిజాలు వెల్లడిస్తే తమ కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని సునీత ఆందోళన చెందుతున్నారు. అందుకే వాస్తవాలు వెల్లడించకుండా కట్టడి చేసేందుకే ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు సునీత యత్నించినట్లు స్పష్టమవుతోంది. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఓ సినీ నిర్మాత తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ నిరసనకు దిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు గురువారం రాత్రి సునీత బోయ నగ్నంగా బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామానికి పంపించారు. వివరాలివీ... తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందిన బన్నీ వాసు తనను మోసం చేశారని... వాడుకొని వదిలేశాడని ఆమె ఆరోపించింది. బన్నీవాసు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ బైఠాయించడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో తనను బన్నీవాసు బెదిరిస్తున్నాడని మానసికంగా వేధించడమే కాకుండా చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ దుయ్యబట్టింది. రెండు గంటల పాటు ఆమె గీతాఆర్ట్స్ కార్యాలయం ముందు హడావుడి చేశారు. చదవండి: (కాంగ్రెస్‌కు క్యాన్సర్ సోకింది.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
‘జనసేన నాయకులు అన్యాయం చేశారు’
సాక్షి, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట సునీత బోయ అనే మహిళ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు మోసం చేశారని, ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు సొంత డబ్బు ఖర్చు పెట్టానని, అయినా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని చెప్పారు. పార్టీ కోసం తాను ఖర్చు పెట్టిన రూ.60 వేల నగదు తిరిగి ఇచ్చేయాలన్నారు. మహిళలకు న్యాయం చేయలేని జనసేన అధినేత, నేతలు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని సునీత ప్రశ్నించారు. పోలీసులు విచ్చేసి ఆమెతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. చదవండి: (ఓ దౌర్భాగ్యుడి క్రూరత్వం.. తల్లిని తన్ని.. పీకపై కాలితో తొక్కి..) -
నా పాటంటేనా? నేను బాగుంటానని ఇష్టపడుతున్నారా?: సునీత
సింగర్ సునీత.. తెలుగు సినీ, సంగీత ప్రియులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. గాయనిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందం, అభినయం, అంతకు మించి తన స్వీట్ వాయిస్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు సునీత. ఈ క్రమంలో ఆమెకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా తన ఫ్యాన్స్ బేస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమెకు టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్ బేస్ మీకుందని, మీరు ట్రెండ్ సెట్టరా అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ దీనిపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అదే అర్థం కాదని, అసలు వారంత తనలో ఏం చూసి అభిమానిస్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతానన్నారు. దీంతో అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనేది మీరు ఒప్పుకోట్లేదా అని అడగ్గా.. ఇలాంటి కొన్ని అంశాలు తనని ఇబ్బంది పెడతాయన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే. వారంత నా పాట అంటే ఇష్టపడతారా? నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్లిన ‘మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ పలకరిస్తారు. ఓ సారి నేను ఓ ఈవెంట్ వెళ్లాను. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న ‘మెగా’ డైలాగ్.. దీని ఆంతర్యం ఏంటి? అక్కడ నన్ను ఓ వ్యక్తి చూసి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. చూట్టూ బౌన్సర్స్ ఉన్నారు. అయినా అతను నా దగ్గరి పరుగెడుతున్నాడు. నేను అతడిని వదలిలేయమని బౌన్స్ర్కు చెప్పాను. అతను నా దగ్గరిక వచ్చి అభిమానాన్ని చాటుకుంటాడనుకున్నా. కానీ రాగానే అతడు తన ఫోన్లో నా ఫొటో చూపించాడు. అది చూపిస్తూ ‘మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు. ఈ చీర చాలా బాగుంది. ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా’ అన్నాడు అని చెప్పింది. అనంతరం ‘కొంతమందిని పక్కనే పెడితా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనీగా నా కళను గుర్తించి నన్ను.. నన్నుగా అభిమానించేవారు చాలామంది ఉన్నారని తెలిసి ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ -
ఛాతీలో నొప్పి! గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! ఇప్పుడిలా!
Sunita Meena: ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న చిన్ననాటి కల.. ఏళ్ల తరువాత మధ్యవయసులో నిజం కాబోతుందన్న ఆనందంలో ఉన్న ఆమెను క్యాన్సర్ వ్యాధి కమ్ముకున్నది. అయినా ఏమాత్రం బెదరలేదు. మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే, తన కలను నిజం చేసుకునేందుకు రన్నింగ్ చేస్తోంది సునీతా మీనా. ఒకపక్క కీమో థెరపీ తీసుకుంటూనే మరోపక్క రన్నర్‌గా రాణిస్తోన్న సునీత పరుగుల ప్రయాణం ఆమె మాటల్లోనే.... ‘నేను మధురలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ రేసుల్లో పాల్గొని విజేతగా నిలవాలని అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్ పాస్ అవగానే రైల్వేలో పనిచేస్తోన్న దినేష్ కుమార్‌తో నాకు వివాహం అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికే బాబు పుట్టాడు. ఇంటిపనులు, బాబుతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకుంటానని మా వారిని అడిగాను. ఆయన పెద్దమనసుతో ఒప్పుకోవడంతో డిగ్రీ పూర్తిచేశాను. ఆయన కూడా రన్నర్ కావడంతో... స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. కానీ పెద్దయ్యాక రన్నింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడంతోపాటు, రైల్వే టీమ్‌కు కోచ్‌గా పనిచేసేవారు. రోజూ ఆయన రన్నింగ్‌కు వెళ్తూ రన్నింగ్ గ్రూప్‌తో బిజీగా ఉండేవారు. నన్ను కూడా ‘‘రన్నింగ్ చెయ్యి, ఆరోగ్యంగా ఉంటావు’’ అని చెబుతుండేవారు. నా చిన్ననాటి కోరికే అయినప్పటికీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అప్పుడు వీలుపడలేదు. నా ఎత్తుకంటే, బరువు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు తలనొప్పిగా అనిపించేది. ఇలా ఇబ్బంది పడుతోన్న నాకు ‘‘ఈ సమస్యలన్నింటికి రన్నింగ్ చక్కటి పరిష్కార మార్గం’’ అని ఆయన పదేపదే చెబుతుండేవారు. పిల్లలు కూడా పెద్దవాళ్లు అవడంతో 43 ఏళ్ల వయసులో 2018లో రన్నింగ్ ప్రారంభించాను. ఒకపక్క రన్నింగ్ చేస్తూ బరువు పెంచని పోషకాహారం తీసుకుంటూ ఫిట్‌గా తయారయ్యాను. ఆరునెలల్లో మారథాన్ రన్నర్‌గా.. తెల్లవారుజామున నాలుగంటలకే నిద్రలేచి రన్నింగ్ సాధన చేసేదాన్ని. ఇలా అక్కడక్కడ జరిగే మారథాన్లలో పాల్గొనేదాన్ని. ఇలా పాల్గొంటూ తొలిసారి ఢిల్లీ స్టేట్ మారథాన్‌లో పాల్గొని రెండోస్థానంలో నిలిచాను. ఈ ఉత్సాహంతో ప్రతి మారథాన్‌లో పాల్గొనేదాన్ని. రేస్‌లో ఉన్నప్పుడు నా ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుండేది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ కొన్నిరోజులకు స్తనంలో వాపు కూడా రావడంతో మావారి బలవంతం మీద ఆసుపత్రిలో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి, వెంటనే సర్జరీ చేస్తామన్నారు. అప్పటికి సరిగ్గా వారం తరువాత రష్యాలో రన్నింగ్ రేస్‌లో పాల్గొనాల్సి ఉందని, తర్వాత చేయించుకుంటానని డాక్టర్‌కు చెప్పాను. ‘‘సర్జరీ వెంటనే చేయాలి, సర్జరీ తరువాత మీరు రన్నింగ్ రేస్‌లో పాల్గొన వచ్చు’’ అని అభయం ఇచ్చారు. సర్జరీ తరువాత కొంచం విశ్రాంతి తీసుకుని ఆయనతో కలిసి రష్యావెళ్లి రన్నింగ్‌లో పాల్గొన్నాను. రష్యా నుంచి వచ్చిన తరవాత కీమో తీసుకుంటూనే రన్నింగ్ కూడా చేసేదాన్ని. అలా ఏడు కీమోలు చేశారు. తొలి కీమో చేసిన తరువాత నా జుట్టు ఊడడం మొదలైంది. దీంతో నాకేదో అయిపోతోందని కుంగిపోయేదాన్ని. మా ఆయన, పిల్లలు... ‘‘ఇది శాశ్వతం కాదు కొన్నిరోజులే... తరువాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని ధైర్యం చెప్పడంతో కొంచెం కుదురుకున్నాను. భవిష్యత్‌లో మరిన్ని కిలోమీటర్లు.. ‘‘రన్నింగ్తోపోలిస్తే కీమోథెరపీ వల్ల కలిగే బాధ తక్కువే. అందుకే నువ్వు నీ రన్నింగ్‌ను ఆపాల్సిన పనిఏమీ లేదు. నువ్వు చక్కగా పరిగెత్తవచ్చు’’ అని డాక్టర్లు ధైర్యం నూరిపోశారు. దాంతో రెట్టింపు ∙ఉత్సాహంతో కీమోథెరపీ చేసిన కొద్దిరోజుల తరువాత ఢిల్లీలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ ను గంటా తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేశాను. ఆ తరువాత లద్ధాఖ్‌లో జరిగిన ఏడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది జూన్‌లో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెట్ చాంపియన్ షిప్లో పాల్గొని ఆరోస్థానంలో నిలిచాను. ఇప్పటికీ నేను కేవలం పదికిలోమీటర్ల రేసుల్లోనే పాల్గొంటున్నాను. భవిష్యత్ లో 21 కిలోమీటర్లు దూరం కూడా ప్రాక్టీస్ చేస్తాను. శరీరంలో క్యాన్సర్ మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయంటేనే జీవితం అయిపోయిందనిపిస్తుంది. అలాంటిది తన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ ‘‘... అయితే ఏంటి ..నా పరుగుని అది ఏం చేయలేదు’’ అని 47 ఏళ్ల వయసులో ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిగా నిలుస్తోంది సునీతామీనా. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం! -
కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం
తాడికొండ/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో జరిగిన ఘటనలో టీడీపీ శ్రేణుల వికృత చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు నల్లపు సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్లో మీడియాలో మంగళవారం ఉదయం వచ్చిన కథనాలు చూసి గుట్టుగా సంసారం చేసుకుంటున్న తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. మంచి చెడులు ఆలోచించకుండా మీడియా కూడా తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడంతో ఎవరూలేని సమయంలో ఉ.8 గంటలకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు, పోలీసుల సాయంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు.. తన కుమార్తెతో వెంకాయమ్మ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చిన వివాదాన్ని టీడీపీ నేతలు పెద్దదిగా చేసి తమ కుటుంబ పరువు బజారున పడేశారని మీడియా ఎదుట సునీత ఆవేదన వ్యక్తంచేసింది. ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అయినా టీడీపీ నాయకులు తమ దుష్ప్రచారాలు ఆపకపోవడంతో విరక్తి చెందిన సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సునీత ఆత్మహత్యాయత్నానికి బాబే కారణం చంద్రబాబు నీచ రాజకీయాల కారణంగానే సునీత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆస్పత్రిలో సునీతను పరామర్శించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎల్లో మీడియా తమ స్వార్థ రాజకీయాల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవను రాష్ట్ర వివాదంగా మార్చడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సునీత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆడపిల్లపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని రాజకీయం చేసేందుకు ఎక్కడెక్కడ నుంచో టీడీపీ నాయకులు రావడమేమిటని ఆమె ప్రశ్నించారు. మరోవైపు.. స్థానిక టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య కారణంగానే వివాదం పెరిగి తన సోదరి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సునీత సోదరి పక్కర కుమారి వెల్లడించింది. వెంకాయమ్మకు డబ్బులిచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, మంగళగిరి రూరల్ సీఐ తమను బూతులు తిడుతూ వెంటపడి కొడుతున్నారని ఆమె వాపోయింది. -
Guntur: కంతేరులో నల్లపు సునీత ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్వార్ధ రాజకీయాలపై మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత గొడవను రాజకీయరంగు పులమడంపై మనస్థాపం చెందిన నల్లపు సునీత అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోమవారం రోజున నల్లపు సునీత మాట్లాడుతూ.. రెండు కుటుంబాల మధ్య గొడవకు రాజకీయ రంగు పులిమి తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాడికొండ మండలం కంతేరుకు చెందిన బాధితురాలి తల్లి నల్లపు సునీత ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వచ్చిన గొడవకు, టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తానూ టీడీపీకి చెందిన మహిళనేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చూపించారు. తనతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వారిని కూడా బయటకు లాగి తప్పుడు కేసులు పెట్టించడం దుర్మార్గమని అన్నారు. ఆడపిల్లపై బురదచల్లి రోడ్డుపైకి లాగడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భర్తలేని తను చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నానని, ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటే తన పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రక్షణ కల్పించి, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: (యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..) -
Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..
‘చాయ్ చాయ్ కోసమే కాదు...సామాజిక విశ్లేషణకు కూడా’ అనడానికి సజీవ సాక్ష్యం ఈ పింక్ కేఫ్. హరియాణాలోని రోహ్తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు, గృహిణులు ‘పింక్ కేఫ్’ ప్రారంభించారు. దీని వెనుక ‘పథ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ ఉంది. స్థూలంగా చెప్పాలంటే...ఇది మహిళల కోసం మహిళల చేత ఏర్పడిన కేఫ్. ఈ కేఫ్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ హాట్ టాపిక్ల గురించి చర్చించుకోవచ్చు. భావాలను పరస్పరం పంచుకోవచ్చు. తమ బాధలకు పరిష్కార మార్గం వెదుక్కోవచ్చు. ‘గతంలో ఏదైనా సమస్య వస్తే నాలో నేను కుమిలిపోయేదాన్ని. దీంతో బాధ మరింత పెరిగేది. పింక్‌కేఫ్ పరిచయమయ్యాక వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది పరిచయమయ్యారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పింక్కేఫ్కు వస్తేచాలు ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికుతుంది’ అంటుంది నీలిమ అనే అమ్మాయి. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ఒకే కేఫ్ ఒక్కోరోజు ఒక్కో వేదికలా మారుతుంది. ఒకరోజు మహిళా రచయిత్రులు, కవయిత్రులు, సంగీతకారులు తమలోని సృజనను ఆవిష్కరించుకునే వేదిక అవుతుంది. ఒక రోజు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సెలింగ్ సెంటర్ అవుతుంది. ఒకరోజు...పేద మహిళలకు ఉపాధి మార్గాలను సూచించే వేదిక అవుతుంది. హక్కులు, ఆరోగ్యం, అనుభవాలు, పరిష్కారాలు... ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు ఈ పింక్‌కేఫ్ ఒక చుక్కాని. ఔత్సాహిక కళాకారులకు భుజం తట్టే వేదిక. ఉదా: రంజనికి కవిత్వమంటే ఇష్టం. తాను రాసిన కవిత్వాన్ని పుస్తకంగా వేసుకోవాలనేది ఆమె కల. అయితే తనకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కల కలగానే ఉండిపోయింది. ‘పింక్ కేఫ్’ పరిచయమ య్యాక... ఒకరోజు తన కవితలను అక్కడ వినిపించింది. అవి నచ్చిన ముగ్గురు కలిసి కవిత్వాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చూసి రంజని ఎంతగానో మురిసిపోయింది. ‘ఈ కేఫ్ మొదలు పెట్టినప్పుడు కాలక్షేపం కబుర్లకు తప్ప ఎందుకు అన్నవాళ్లు... ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇది చాలు పింక్‌కేఫ్ విజయం గురించి చెప్పడానికి’ అంటుంది పింక్ కేఫ్ మొదలు కావడానికి కష్టపడిన మహిళల్లో ఒకరైన సునీత. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
బన్నీవాసుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీత బోయ
Bunny Vasu And Sunitha Boya: సినీ ప్రొడ్యుసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసారంటూ జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ వాదిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీవాసు తనను మోసగించిన వైనంపై సోమవారం పోలీసు స్పందన కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను కలిసి ఆమె ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు సునీత, ఆమె తల్లి పార్వతమ్మను దిశ పోలీసు స్టేషన్లో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విచారణ చేశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. ఫిర్యాదుకు సంబంధించి ఆమె ఆధారాలను అందిస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: (నిర్మాత బన్నీవాసును వేధిస్తున్న యువతి అరెస్టు) -
ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడి యాలో వైరల్‌గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు. ‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్‌రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్‌కు బదిలీ చేయడం కొసమెరుపు. చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు -
‘పీసీఆర్’తోనే కోవిడ్‌పై స్పష్టత!
లక్డీకాపూల్: జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్–19 విలయతాండవం కొనసాగుతోంది. వేలల్లో పాజిటివ్ కేసులు తదనుగుణంగా మరణాలూ నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండే మార్గాల అన్వేషణలో నగరవాసులు తలమునకలవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైరస్ నిర్ధారణకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రయత్నంలో కొంత మందికి పాజిటివ్ వస్తుంది. మరి కొంత మందికి నెగిటివ్ వస్తుంది. కోవిడ్ నిర్ధారణ ఫలితాలు సరిగ్గా రాకపోవడానికి పలు కారణాలున్నాయని అపోలో ఆస్పత్రి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ సునీత నర్రెడ్డి పేర్కొంటున్నారు. ప్రధానంగా పీసీఆర్ టెస్ట్‌తోనే కోవిడ్ పాజిటివ్‌పై స్పష్టత వస్తుందంటున్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమన్నారు. వాస్తవానికి ఈ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని డాక్టర్ సునీత సూచించారు. ‘పాజిటివ్ వచ్చిన కొంత మంది రోగులకు మళ్లీ పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిన సందర్భాలూ లేకపోలేదు. కింద శ్వాస కోశంలో ఎక్కువ వైరస్ లోడ్ ఉంటుంది. కోవిడ్ నిర్ధారణకు ల్యాబ్‌లో శాంపిల్‌ను పైన శ్వాసకోశం నుంచి తీసుకుంటారు. వ్యాధి సహజ చరిత్ర, శాంపిల్ కలెక్షన్ టెక్నిక్ అంశాలతోపాటు వ్యాధి నిర్ధారణకు పీసీఆర్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని డాక్టర్ సునీత తెలిపారు. కొంత మంది రోగుల పాజిటివ్ నిర్ధారణకు 2 కంటే ఎక్కువ సార్లు నాసోఫారింజయల్ స్వాబ్స్ చేయాల్సి ఉంటుందన్నారు. వాస్తవానికి కోవిడ్–19 ఊహాత్మక నిర్ధారణకు సీటీ స్కాన్ (చెస్ట్) పరీక్ష ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. అయితే ఆ టెస్ట్ ద్వారా కచ్చితమైన నిర్ధారణ ఫలితాలు వెలువడవని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ టెస్ట్ అత్యుత్తమమైన ప్రామాణికత కాదని కూడా డాక్టర్ సునీత స్పష్టం చేశారు. కోవిడ్ టెస్ట్ ఇలా... కరోనా వైరస్‌ను పీసీఆర్ ద్వారా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఆర్టీ పీసీఆర్, సెఫిడ్– జెనెక్స్‌పర్ట్, ట్రూనాట్ టెస్ట్‌లు చేస్తారు. ఈ విధంగా వైరస్ నిర్ధారణలో పీసీఆర్ టెస్ట్ 60 నుంచి 70 శాతం సెన్సిటివిటీతోపాటు 95 శాతానికి పైగా ప్రత్యేకతను సంతరించుకుంటుందని డాక్టర్ సునీత పేర్కొన్నారు. పాజిటివ్ ఫలితం అంటే వ్యాధి సోకినట్టుగా నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. సెన్సిటివిటీ 70 శాతం ఉన్నా నెగిటివ్ టెస్ట్ ఫలితాలు వ్యాధి లేదని నిర్ధారించలేవని ఆమె పేర్కొన్నారు. యాంటిజెన్ తీరు ఇదీ... వ్యాధి మొదట పాజిటివ్‌గా ఉంటుంది. సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీలు పీసీఆర్‌కు ఒకే రకంగా ఉంటాయి. యాంటిజెన్ పాజిటివ్‌గా ఉన్నప్పడు వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారిస్తుందని డాక్టర్ సునీత చెబుతున్నారు. అయితే నెగిటివ్ కానీ అనుమానాస్పద ఫలితాలు వస్తే.. అప్పుడు వ్యాధి నిర్ధారణకు పీసీఆర్ టెస్ట్ అవసరం అవుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఐజీజీ విషయానికొస్తే అంటువ్యాధి సోకిన చాలా వారాల తరువాత పాజిటివ్ అవుతుంది. అదే ఐజీఎం విషయానికి వస్తే.. అంటువ్యాధి సోకిన కొద్ది రోజుల్లో పాజిటివ్ నిర్ధారణ అవుతుందని డాక్టర్ సునీత వివరించారు. పీసీఆర్ చేయాలా... ‘వ్యాధి సోకిందనే విషయం తెలుసుకోవడానికి పీసీఆర్ టెస్ట్ చేయకూడదు. ఎందుకంటే వైరస్ తొలగే ప్రక్రియ దీర్ఘకాలంపాటు కొనసాగుతుంది. చనిపోయిన, సజీవంగా ఉన్న వైరస్‌లను రెంటింటినీ పీసీఆర్ పరిగణనలోకి తీసుకుంటుంది. పీసీఆర్‌తో పాటు సీటీ స్కాన్ కూడా సెన్సిటివ్ టెస్ట్. వాస్తవానికి ఈ టెస్ట్‌ను వైద్య పరిస్థితి నిర్ధారణకు ఉపయోగిస్తారు’ అని డాక్టర్ సునీత స్పష్టం చేస్తున్నారు. -
హాకీకి సునీత వీడ్కోలు
న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతోన్న భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ సారథి సునీతా లక్రా గురువారం ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో గత గాయం తిరగబెట్టడంతో తాను రిటైర్ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొంటున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. అయితే నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ చేయించుకున్నా ఒలింపిక్స్ లోపు పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం లేదు’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొంది. 2008లో అరంగేట్రం చేసిన సునీత భారత్ తరఫున 139 మ్యాచ్‌లు ఆడింది. ఆమె నాయకత్వంలోని జట్టు 2018 ఆసియా చాంపియన్‌షిప్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సునీత 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టులో సభ్యురాలు. -
వత్తి నుంచి వత్తికి
సునీతా గాంధీ ప్రపంచబ్యాంకులో ఆర్థికవేత్తగా పనిచేశారు. అప్పటికే ఆమె మన విద్యా విధానం మీద పి.హెచ్డి. చేశారు. దానికొక ప్రయోజనం ఉండాలి కదా! ఉత్తరప్రదేశ్‌లోని మహిళలను విద్యా వంతులుగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందుకోసం ప్రపంచ బ్యాంకులో తన ఉద్యోగాన్నే విడిచిపెట్టారు. ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది మహిళల్ని వేలి ముద్రలు వేసే స్థితి నుంచి సంతకాలు పెట్టే స్థాయికి తీసుకువచ్చారు. ఆమె పెట్టిన చదువు దీపం వత్తి్త నుంచి వత్తికి వెలుగును వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని వారాల క్రితం గుడ్డీ (35) తన భర్తతో కలిసి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవడం కోసం తాసీల్దారు ఆఫీసుకి వెళ్లింది. అవి తీసుకున్నాక, భర్త వంగి వేలిముద్ర వేయబోతుంటే అతడిని వారించి, పక్కనే ఉన్న పెన్ను తీసుకుని రిజిస్టర్లో తన పూర్తి పేరును సంతకం చేసింది గుడ్డీ. అది చూసి ఒక్కసారిగా షాకైన భర్త ముఖం చూసింది. ఆమెకు చదవడం, రాయడం వచ్చన్న విషయం ఆ క్షణం వరకు అతడికి తెలియదు. తను బాగా చదువుకుని, తన భర్తకు కూడా చదువు నేర్పాలన్నది ఇప్పుడు గుడ్డీ ధ్యేయం. ఈ సంఘటన గుడ్డీ స్నేహితురాలైన ద్రౌపది (47)లో కొత్త ఆశలు రేపింది. ఆమె పంచాయతీ సభ్యురాలు. ఆఫీసుకి సంబంధించిన కాగితాలలో ఒక్క పదం కూడా అర్థం కాకుండానే కళ్లు మూసుకుని సంతకం పెట్టే ద్రౌపది ఇప్పుడు అక్షరాలు, పదాలు, వాక్యాలు నేర్చుకోవడంతో అన్నీ అర్థం చేసుకోగలుగుతోంది. కలల బోయీలు : టూల్ కిట్ వలంటీర్లు ఒకరిని చూసి ఒకరు ఉత్తరప్రదేశ్‌లోని కరౌనీ గ్రామంలో ఇలా ఒకర్నుంచి ఒకరుగా చదువుకున్న మహిళలు ఎనిమిది వందల మందికి పైగానే ఉన్నారు. ఇదంతా ‘గ్లోబల్ డ్రీమ్ లిటరసీ మిషన్’ కృషి ఫలితమే. ఇంత ఫలవంతమైన అక్షరాస్యతా కార్యక్రమాన్ని సునీతా గాంధీ అనే విద్యావేత్త నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ‘దేవీ సంస్థాన్’ అనే ఎన్జీవోని కూడా నెలకొల్పి, దాని ద్వారా ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహకారం అందచేస్తున్నారు సునీత. కలల పెట్టె నిరక్షరాస్యులలో చదువుకోవాలన్న ఆసక్తి కలిగించడం కోసం సునీత ఒక టూల్ కిట్‌ను రూపొందించారు. ఒక చిన్న కార్డ్‌బోర్డు ఉంటుంది. ఆ బాక్స్ మీద ‘గ్లోబల్ డ్రీమ్ టూల్ కిట్, కేవలం 50 రూపాయలు మాత్రమే’ అని రాసి ఉంటుంది. దానిని గ్రామాలలోకి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు విద్యా వలంటీరు. ఆ కిట్‌లో పలక, బలపం, డస్టర్, 30 కథల పుస్తకాలు, ప్లాస్టిక్ అక్షరాలు, బొమ్మల కార్డులు, వీటితోపాటు కూర్చోవడానికి ఒక రగ్గు ఉంటాయి. కరౌనీలో విద్యావ్యాప్తికి ఈ కిట్ బాక్సు ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం కరౌనీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరిన్ని గ్రామాలలో అక్షరాస్యులను పెంచే యోచనలో ఉన్నారు సునీతా గాంధీ. ప్రేరణ.. ఎర్నాకులం సునీత యు.కె.లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్డి. పట్టా పొందారు. ప్రపంచ బ్యాంకులో ప్రాజెక్టు మేనేజర్‌గా పది సంవత్సరాలు పనిచేశారు. అనంతరం బయటికి వచ్చి, పద్నాలుగు దేశాలలోని ప్రధాన పాఠశాలల మీద స్టడీ చేశారు.ఆమె తండ్రి జగదీశ్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ‘సిటీ మాంటిస్సోరీ’ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఇది. అయితే సునీతకు స్ఫూర్తిని ఇచ్చింది తండ్రి స్థాపించిన ఈ స్కూలు కాదు. కేరళలోని ఎర్నాకులం జిల్లా కేవలం ఒక సంవత్సర కాలంలోనే నూరు శాతం అక్షరాస్యతను సాధించడం.. సునీతకు ఇవన్నీ చేయడానికి ప్రేరణను ఇచ్చింది. –డా. వైజయంతి -
జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..
బంజారాహిల్స్: సినిమా అవకాశాల పేరుతో ప్రముఖ దర్శకుడు బన్ని వాసు తనను మోసం చేశారని, జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పిన ఆ పార్టీ నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ బుధవారం తెల్లవారుజామున ఫిలించాంబర్ గేటుకు తనను తాను గొలుసులతో బంధించుకొని నిరసన తెలిపింది. దీనిని గుర్తించిన సెక్యురిటీ గార్డు పోలీసులకు సమాచారం అందిచడంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపిచేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడితే తనను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు జరిగిన మోసంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించి అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో తాను శ్రీరెడ్డికి సోషల్ మీడియా వేదికగా జనసేన తరపున కౌంటర్ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. బన్నీవాసు సినిమా అవకాశాల పేరుతో తనను ఎన్నోసార్లు కార్యాలయానికి పిలిపించారని ఇప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్‌ద్వారా తనకు జరిగిన అన్యాయాలను వివరించింది. తనపై తప్పుడు ప్రచారం చేసి పోలీస్ స్టేషన్‌కు పంపించిన వారు ఫిలిం ఇండస్త్రీ నుంచి బ్యాన్ చేయిస్తామని మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బ్యానర్ ఏర్పాటు చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్‌కళ్యాణ్ దృష్టికి వెళ్లాలనే ఇలా చేసినట్లు తెలిపింది. మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సునీతను ఎట్టకేలకు గొలుసులు తొలగించి స్టేషన్‌కు తరలించారు. ఆమెపై మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆరు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కొందరిపై కేసులు పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్న వ్యవహారాలు తమ దృష్టికి వచ్చాయని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. చేతినిండా పవన్ కల్యాణ్ పేరు తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానమనీ అందుకే చేతుల నిండా పవన్ కల్యాణ్, జనసేన పేర్లు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు సునీత తెలిపింది. -
క్రికెట్‌బ్యాట్‌తో మోది.. ఫ్యాను వైరుతో ఉరివేసి
సాక్షి, మహబూబాబాద్ రూరల్: అనుమానంతో భార్యను అంతమొందించిన ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు పత్తిపాకలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ సుంకరి రవికుమార్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ శివారులోని పత్తిపాకకు చెందిన మునిసిపాలిటీ శానిటేషన్ వర్కర్ లంక రాముకు వరంగల్ దేశాయిపేటకు చెందిన పల్లపు సునీత(30)తో 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కవల కుమారులు నాగేంద్ర, నరేంద్రలున్నారు. పెళ్లయిన నెల రోజులకే రాము అనుమానంతో భార్య సునీతపై కిరోసిన్ పోసి చంపబోయాడు. ఆ సమయంలో ఆమె తన తల్లి గారింటికి వెళ్లింది. కొద్ది రోజులు అనంతరం రాము దేశాయిపేటకు వెళ్లి తన భార్యను మంచిగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చెప్పి సునీతను మహబూబాబాద్‌కు తీసుకెళ్లాడు. కానీ ఆ సమయంలో రాము ఏదో ఓ రోజున అఘాయిత్యానికి పాల్పడుతాడని మృతురాలి తల్లి ఎలిషా అనుమానం వ్యక్తం చేసింది. అనంతరం చిన్న చిన్న తగాదాల నడుమ భార్య, భర్తలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విషయాలన్నీ సునీత తన తల్లికి చెబుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏమి జరిగిందో ఏమో కానీ లంక రాము తన భార్య లంక సునీతను రాత్రి 10:30 నుంచి 11 గంటల సమయంలో కొట్టాడు. సునీత గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు ఇంటికి వెళ్లి చూసేసరికి గేటుకు తాళం వేసి ఉంది. రాము స్థానికులపై అరవడంతో వారు లోపలకు వెళ్లలేకపోయారు. అనంతరం సునీతను క్రికెట్‌బ్యాట్‌తో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను అక్కడే ఉన్న టేబుల్ ఫ్యానుకు గల వైర్‌ను తొలగించి ఆ వైరుతో ఆమె మెడకు ఉరి వేసి కిరాతకంగా చంపాడు. కొంత సేపటి తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అదే ప్రాంతంలో నివాసం ఉండే సునీత పిన్ని అక్కడకు వచ్చి చూసి జరిగిన విషయాన్ని మృతురాలి తల్లి ఎలిషాకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టౌన్ సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై సీహెచ్.అరుణ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ సువర్ణబాక వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి పల్లపు ఎలిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సునీత మృతితో పత్తిపాకలో విషాదం చోటుచేసుకుంది. -
సిట్‌ను తన పనిని తాను చేసుకోనివ్వండి
-
‘పాపం హనీమూన్‌కి తను ఒక్కతే వెళ్లింది’
‘నేను తనను ఒక ప్రాంక్ కాల్ ద్వారా కలిశాను.. రేపు పెళ్లి చేసుకుందాం అని చెప్పాను.. మరుసటి రోజే వివాహం చేసుకున్నాం.. పాపం హనీమూన్‌కి తనోక్కతే వెళ్లింది.. నా గురించి నా కన్నా ఎక్కువ తనకే తెలుసు, తనే నా బలం’ అంటూ భార్య సునీతను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు ‘మిస్టర్ ఇండియా’ అనిల్ కపూర్. వివాహం కంటే ముందే ఒక దశాబ్ద కాలంగా అనిల్ కపూర్‌కు సునీతతో పరిచయం. అంటే వీరి ప్రేమకు, స్నేహానికి 45 ఏళ్లు నిండయాన్నమాట. ఇంత అద్భుతమైన సుదీర్ఘ ప్రయాణం గురించి, తన భార్య సునీత గొప్పతనం గురించి సోషల్ మీడియా సాక్షిగా ప్రశంసలు కురిపించారు అనిల్ కపూర్. ‘సినిమాల్లోకి రాకముందే సునీతతో పరిచయం ఏర్పడింది. అది కూడా చాలా విచిత్రంగా. ఇప్పడు ప్రాంక్ కాల్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ 45 ఏళ్ల మునుపే మా పరిచయానికి కారణం ప్రాంక్ కాల్. ఆ రోజు సునీతకు ప్రాంక్ కాల్ చేసిన నేను ముందు తన గొంతుతో ప్రేమలో పడిపోయాను. అప్పటికింకా నేను సినిమాల్లోకి రాలేదు. ఇంకా జీవితంలో స్థిరపడలేదు. అయినా తను నన్ను ప్రేమిస్తూనే ఉంది. నన్ను వదిలేయాలని చాలా మంది, చాలా సార్లు ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. కానీ తను అలా చేయలేదు. నా జీవితంలో తొలి విజయం ‘మేరి జంగ్’. ఈ చిత్రం విజయం సాధించడంతో పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. వెంటనే సునీతతో మనం రేపు వివాహం చేసుకుందాం అని చెప్పాను. మరుసటి రోజే మేము వివాహం చేసుకున్నాం. అలా విజయం, అదృష్టం(సునీత) రెండు ఒకే ఏడాదిలో నా జీవితంలోకి వచ్చాయి. కానీ వివాహం అయిన మూడు రోజుల్లోనే నేను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. పాపం తను ఒక్కతే హనిమూన్‌కి విదేశాలకు వెళ్లింది’ అంటూ తమ బంధం గురించి తెలిపారు. బాలీవుడ్లో పర్ఫేక్ట్ జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు సునీత - అనిల్ కపూర్. ఈ విషయం గురించి అనిల్ కపూర్ ‘45 ఏళ్లుగా మా మధ్య ప్రేమ, స్నేహ, గౌరవం కొనసాగుతునే ఉన్నాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె లాంటి వ్యక్తిని మరోకరిని చూడలేదు. ఇంత చక్కని భార్య దొరికినందు వల్లే నా రోజు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. తను మంచి తల్లి, భార్య అన్నింటికి మించి మంచి మనిషి. నా గురించి నా కంటే బాగా తనకే తెలుసు. తనే నా బలం’ అంటూ పోస్టు చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ ప్రేమ ఎందరికో ఆదర్శం కావాలి. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.వీరికి ముగ్గురు సంతానం. సునీత - అనిల్ కపూర్లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్. వీరంతా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్ ‘ఫనే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కూతురు సోనమ్‌తో కలిసి తొలిసారి ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెళ్ళైన రోజే నవ వధువు అదృశ్యం
సాక్షి, కడప: ఉదయం వివాహం చేసుకున్న వధువు.. రాత్రికి అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని అత్తిరాలలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం.. స్థానిక వినాయక్ నగర్ ప్రాంతంలో నివసించే రమణమ్మ కుమార్తె సునీతకు ఈ నెల 25వ తేదీ ఉదయం కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే యువకుడితో అక్కడే వివాహం అయింది. అదే రోజు సాయంత్రం భర్తతో కలసి వధువు పుట్టింటికి వచ్చింది. రాత్రి పూట ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న సునీత ఒక్కసారిగా అదృశ్యమైంది. కల్యాణం అయిన కొద్ది గంటల్లోనే సునీత కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త, కుటుంబ సభ్యులు చుట్టు పక్కన ఇళ్లలో వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో సునీత తల్లి రమణమ్మ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ మహేష్ నాయుడు దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే పెళ్లికి ముందు వేరే ఎవరినైనా ప్రేమించిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. -
ఒక ఫ్యాషన్... ఒక ప్యాషన్!
ఆలోచనల్లో క్రియేటివిటీ మనల్ని కొత్తగా నిలబెడుతుంది! పనిలో ఆర్ట్.. మనల్ని గొప్పగా పరిచయం చేస్తుంది! ఈ రెండు ఏకమై పెట్టుబడిని తోడు తెచ్చుకుంటే ఎంట్రప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుంది! ప్రస్తుతం అదే షిప్లో ప్రయాణం చేస్తున్నారు విదిత, సునీత! ఒకరిది ఫ్యాషన్... ఇంకొకరిది ప్యాషన్! ఎవరు వీళ్లు? ఆ జర్నీ ఏంటీ? ఈ ఇద్దరూ సిలికాన్ వ్యాలీకి ఐకాన్స్ అని చెప్పొచ్చు ఒక్క మాటలో! (స్టాన్‌ఫర్డ్ నుంచి సరస్వతి రమ) అమెరికాలోని కాలిఫోర్నియా.. అందునా సిలికాన్ వ్యాలీ.. తెలుగు టెక్ వ్యాలీ అనొచ్చు! ఆ రాష్ట్రంలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో అయితే అచ్చంగా మన అమ్మాయిలదే హవా! బిజినెస్ మేనేజ్మెంట్ చదివి ఏ మల్టీనేషనల్ కంపెనీల్లోనో ఉద్యోగం వెతుక్కోకుండా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే సాహస వనితలు! ఈ నెల 28న హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్..పూర్తిగా మహిళా పారిశ్రామికవేత్తలదే! ఈ సందర్భంగా స్టాన్ఫర్డ్లోని, సిలికాన్ వ్యాలీలో మన మహిళా పారిశ్రామిక వేత్తల పరిచయంలో భాగంగా విదిత, సునీతల గురించి ఈ ఇండ్రక్షన్.. ఇండో ఫ్యాబ్రిక్ .. వెస్ట్రన్ డిజైన్ విదితాసుబ్బారావు స్వస్థలం హైదరాబాద్. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలోని బిజినెస్ స్కూల్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతూనే ఇంకో పక్క ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి కృషి చేస్తోంది. జోఫీ ఫ్యాషన్ పేరుతో ఆన్లైన్ సంస్థను నడుపుతోంది. బనారస్, కంచి, పోచంపల్లి వంటి మన సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌తో వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందించడమే జోఫీ ఫ్యాషన్స్ ప్రత్యేకత. ఆ రకంగా మన ఫ్యాబ్రిక్స్‌ను ప్రపంచానికి అందిస్తోంది విదిత. వస్త్రవ్యాపారమే కాక మధుబని వంటి ఫ్యాబ్రిక్ పెయింట్‌ను సంరక్షించే బాధ్యతనూ చేపట్టింది. మన చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పిస్తూ వారి నేత నైపుణ్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేస్తోంది. ఇప్పుడు వెస్ట్రన్ డిజైనర్స్తోనే డిజైన్స్ చేయిస్తున్నా త్వరలోనే నిట్, నిఫ్ట్ వంటి మన ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ విద్యార్థులతో కలిసి పనిచేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు దేశంలోని ఏ ప్రాంతంలో ఏ ప్రత్యేక నేతకళ ఉన్నా చేయూతనిచ్చి దానికి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది విదిత. ‘‘నేను ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కారణం మా అమ్మ (సరళా సుబ్బారావు) తను వృత్తిరీత్యా సైంటిస్ట్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్రాణం. ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తో వెస్ట్రన్ డిజైన్ అనేది అమ్మ ఐడియానే. ఎంట్రప్రెన్యూర్ కావాలనే నా యాంబిషన్కు అమ్మ ఐడియాను జోడిస్తే జోఫీ ఫ్యాషన్స్‌గా క్రియేట్ అయింది. ప్రస్తుతం మా బ్రాండ్‌తో 12 రకాల డిజైన్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికీ మా మార్కెట్ ఆన్లైనే. వెంచర్ క్యాపిటల్ కోసం ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదు. నా సొంతంగానే ఈ సంస్థను స్టార్ట్ చేశాను. డూయింగ్ వెల్. సవాళ్లుండవని అనను. ఆ మాటకొస్తే ఏ రంగంలోనైనా చాలెంజెస్ ఉంటాయి. వాటిని అధిగమించి వెళ్లడమే సక్సెస్ కదా! నేను అదే పోరాటంలో ఉన్నా. సిలికాన్ వ్యాలీ.. కొత్త ఆలోచనలను, ఇన్నోవేషన్స్‌ను ఆదరిస్తుంది. ఐడియాలుండాలే కాని అవకాశాలకేం కొదవలేదు. ధైర్యంగా ముందుకెళ్లడమే. ఇక్కడికి రావాలనుకునే వారికి నా సలహా ఒక్కటే. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. అధిగమించడం నేర్చుకోవాలి’’ అని చెప్తుంది యంగ్ ఉమన్ ఎంట్రప్రెన్యూర్ విదితాసుబ్బారావు. లాఫింగ్ బుద్ధా గేమ్స్ సిలికాన్ వ్యాలీలోని ఇంకో లేడీ ఎంట్రప్రెన్యుయన్ ఎఫర్ట్ ఇది. ఆమె పేరు సునీతా గిరీష్. స్వస్థలం కేరళ. అమెరికాకు వచ్చి దాదాపు పదేళ్లయింది. వాళ్ల కుటుంబంలో అమెరికాకు వచ్చిన తొలి మహిళే కాదు.. తొలి వ్యక్తి కూడా ఆమే. ఇంగ్లీష్‌లో లిటరేచర్ చేయడానికి వచ్చి అది పూర్తయ్యాక అందులో ఉపాధి అవకాశాలు దొరక్క.. సిలీకాన్ వ్యాలీ టెక్నికల్ క్వాలిటీస్కే ప్లేస్ ఇస్తుందని గ్రహించి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తీసుకుంది. గొడ్డు చాకిరే తప్ప స్టాఫ్ ఆలోచనలను ఆదరించే అధికార సిబ్బంది ఉండరని అర్థమై సొంతంగా ఏదైనా చేయాలనుకుంది. ఈలోపే పెళ్లి, పిల్లలు. అమెరికాలాంటి చోట... ఫ్యామిలీ సపోర్ట్ సిస్టం లేని దేశంలో ఇటు ఉద్యోగం, అటు పిల్లల పెంపకం.. చాలా కష్టం. ఈ బాధ్యతలతో ఉద్యోగ వేళలను అందుకోవడం దుర్లభం. అందుకే తనకు నచ్చిన ఆలోచనను. తనకు సౌకర్యంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం మంచిదని నిర్ణయించుకుంది. పిల్లలకు గేమ్స్ తయారు చేసే వర్క్ అయితే బాగుంటుందని ఆ రంగంలోకి దిగింది. లాఫింగ్ బుద్ధా గేమ్స్ పేరుతో. ఇదొక స్టార్టప్ కంపెనీ అయినా సేల్స్ బాగా ఉన్నాయి. ఆటల ద్వారా పిల్లలకు పాఠాలు బొధించడమే లాఫింగ్ బుద్ధా గేమ్స్ ప్రత్యేకత. ఈ గేమ్స్ కంపెనీ పెట్టడానికి ఇంకో కారణం సునీత పెద్ద కొడుకు. ఆ అబ్బాయి స్పెషల్లీ చాలెంజ్డ్. ఆటిజం చైల్డ్. ఎంత స్పెషల్ స్కూల్లో వేసినా... రాని మార్పు.. గేమ్స్ మాడ్యూల్స్ ద్వారా రావడంతో సునీతకు ఈ తలపు తట్టింది.. అందుకే సాధారణ పిల్లలతో పాటు స్పెషల్లీ చాలెంజ్డ్ పిల్లల కోసమూ ఈ గేమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మాడ్యూల్స్ ద్వారా వాళ్లకు పాఠాలు చెప్పేలా. వీటికి అమెరికాలో చాలానే డిమాండ్ ఉంది. ఇదీ ఆన్లైన్ మార్కెటే. ప్రస్తుతం ఆసియా దేశాల వైపూ దృష్టి సారించింది సునీత. మన దగ్గరా విద్యాశాఖ, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదించి ఆ స్కూళ్లకూ తమ మాడ్యూల్స్‌ను సరఫరా చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ముంబైలాంటి చోట్ల కొన్ని స్కూళ్లోతో ఒప్పందం జరిగింది. దీనికి మన దేశంలోనే కాదు పశ్చిమాసియాలోని చాలా చోట్ల లాఫింగ్ బుద్ధా గేమ్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ‘పిల్లలకు ఒత్తిడి లేకుండా ఆడుతూపాడుతూ.. మెంటల్ ఎక్సర్‌సైజ్‌తోపాటు ఫిజికల్ యాక్టివిటీనీ జతచేసి పిల్లలకు పాఠాలు నేర్పాలి. పిల్లలూ ఇలాంటి మెథడ్స్నే ఇష్టపడ్తారు. మొక్కుబడిగా కాకుండా ఆసక్తిగా నేర్చుకుంటారు. అందుకే లాభాపేక్ష కన్నా సృజనాత్మకతకు ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ స్కూల్స్‌కి, ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ‘మా లాఫింగ్ బుద్ధా గేమ్స్’ బేసిక్ మాడ్యూల్స్‌ను ఉచితంగా ఇస్తున్నాం. మన దేశంలోని అన్ని మెయిన్ సిటీస్ స్కూళ్లతో టై అప్ అయి ఆ తర్వాత నెమ్మదిగా గ్రామాలకూ విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటుంది లాఫింగ్ బుద్ధా గేమ్స్ అధిపతి సునీతా గిరీష్. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎన్నో... ఎందరో... సిలికాన్ వ్యాలీలో మన మహిళలు వ్యాపార దక్షతను చూపిస్తూ.. సామాజిక బాధ్యత మరవని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వీళ్ల పరిచయం, అనుభవం.. హైదరాబాద్ జీఈఎస్‌కు హాజరయ్యే మన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణ, స్ఫూర్తి! -
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని..
-
750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో...’ – ‘గులాబి’ చిత్రంలోని ఈ పాటతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుమధుర గాయని సునీత ఇప్పటివరకూ కొన్ని వేల పాటలు పాడారు. ఆమె మంచి గాయని మాత్రమే కాదు... డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ కూడా. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నూరవ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా. అందులో శ్రియ పాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతికి విడుదలైన శాతకర్ణి చిత్రం సునీత డబ్బింగ్‌కి సర్వత్రా ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన శాతకర్ణి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘సినిమా రంగంలో రకరకాల పాత్రలు పోషించినా, నాకు అత్యంత సంతృప్తికరమైన అంశం డబ్బింగే! ఏ సినిమాకు ఆ సినిమాలో పాత్రకు తగ్గట్లు, సీన్లోని భావోద్వేగానికి తగ్గట్టు పర కాయప్రవేశం చేసి స్వరదానం చేయడం ఒక సవాల్’’ అన్నారు. ‘శ్రీరామదాసు’లో స్నేహకీ, ‘శ్రీరామరాజ్యం’లో నయనతారకీ చెప్పిన డబ్బింగ్ ఎప్పటికీ మర్చిపోలేననీ, బాపు లాంటి మహానుభావులతో పనిచేయడం అదృష్టమనీ అన్నారు. -
కొడుకు చనిపోయాడనుకుని.. తనువు చాలించిన మాతృమూర్తి
మాట వినడంలేదనే కోపంలో కుమారుడిని గట్టిగా లాగిన తల్లి విసురుగా వెళ్లి మంచంకోడుకు తల తగిలి స్పృహ తప్పిన బాలుడు కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడని భయపడి ఆత్మహత్య బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన హైదరాబాద్: ఆడుకునేందుకు బయటకెళ్లిన కుమారు డు ఆలస్యంగా ఇంటికి చేరడం.. చెప్పిన మాట వినకపోవడంతో ఆ తల్లికి పట్టరాని కోపం వచ్చింది. కుమారుడిని గద్దించేందుకు గట్టిగా లాగడంతో అతను వెళ్లి మంచంకోడుకు తగిలి స్పృహ తప్పాడు. రక్తపు మడు గులో పడి ఉన్న కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడేమోననుకుని భయపడిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. హృదయవిదారకమైన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబగం గ్రామానికి చెందిన జి.సునీత(23), జి.ఈశ్వర్రావు దంపతులు. బంజారా హిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఈశ్వర్.. రెండు రోజుల క్రితం వైజాగ్ వెళ్లాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు నిహార్, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం నిహార్ బయటకు వెళ్లగా.. అతడి కోసం సునీత అంతటా గాలించినా ఎక్కడా ఆచూకీ లేదు. దీంతో ఇంటి ముందే ఏడుస్తూ కూర్చుంది. ఐదు గంటల తర్వాత నిహార్ ఇంటికి వచ్చాడు. దీంతో కోపం పట్టలేక సునీత కొడుకును లోపలికి ఈడ్చుకెళ్లి స్నానం చేయాలని చెప్పింది. వినకపోవడంతో నిహార్‌ను గట్టిగా లాగింది. విసురుగా లాగడంతో నిహార్ తలకు మంచంకోడు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కొడుకు ఎంతకూ కదలకపోయేసరికి సునీత భయపడింది. తీవ్ర మానసిక సంఘర్షణకులోనై చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి కళ్లు తెరిచిన నిహార్ లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ తల్లి కనిపించింది. అమ్మా.. అమ్మా అంటూ పిలుస్తూ ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు గమనించారు. చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు
• బాబు బాటలోనే మంత్రులు.. • వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగాలపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపో యిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రు లు, ఎమ్మెల్యేలు బేరసా రాలకు దిగుతున్నా రని మండిపడ్డారు. ఆమె బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సిద్ధాంతాల్లో భాగంగా మారిందని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ పదవిని టీడీపీ ప్రలోభాలతో లాక్కుకున్నారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు. ‘పోలవరం’కు సంబంధించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉమ అన్నారని పద్మ విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటే, పోలవరం కడుతుంటే జగన్ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యముంటే జగన్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. -
వివాహిత ఆత్మహత్య
కడప అర్బన్ : కడపలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో నివసిస్తున్న శీలం సునీత (22) అనే వివాహిత భర్త చంద్రపాల్ వేధింపులు తాళలేక శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో మానసిక ఆవేదనకు గురైన సునీత ఈ చర్యకు పాల్పడింది. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. -
గాయని గాయం
అవును. సునీత గాయని. ఎన్నో పాటలు పాడారు. అవును. సునీతకు గాయం అయింది. ఎన్నో పాట్లు పడ్డారు. మ్యారేజ్... మానని గాయం అయింది. ఇది... గాయని గాయం. - సునీత * ఈ ఇంటర్వ్యూ చూసి ఎందుకమ్మా డాడీ గురించి ఇలా చెప్పావని మీ పిల్లలు అడుగుతారేమో..? నా కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 14 ఏళ్లు. ‘మీ డాడీ ఇలా’ అని నేను పనిగట్టుకుని వాళ్లకు ఎప్పుడూ చెప్పలేదు. అయినా వాళ్లకు తెలుసు. అందుకని అడగరేమో. నా ఇష్యూ పక్కన పెడదాం. నో మేటర్ హి ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.. రెస్పాన్సిబుల్ ఆర్ నాట్? హీ ఈజ్ డాడ్. పిల్లలతో పిలిపించుకోవడానికి కాదు.. వాళ్ల బాగోగులు పట్టించుకున్నప్పుడే రియల్ డాడ్ అవుతాడు. * మీ బ్రేకప్ పిల్లలపై ఏమీ ప్రభావం చూపించలేదా? ఏమీ లేదు. మోసం చేసే లక్షణం అవతలి వ్యక్తికి ఉండటం వలన దూరం పెట్టాల్సి వచ్చింది. మనుషులు మారతారేమో అని ఎదురు చూశాను.. మారలేదు. నేను విడాకులు తీసుకున్నానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. విడి విడిగా ఉంటున్నాం. * విడిగా ఉండటం మొదలుపెట్టాక కొత్త విషయాలు ఏమైనా అర్థం అయ్యాయా? కలిసి ఉన్నప్పుడు ఎంత అజ్ఞానంలో బతికాననేది విడిపోయిన తర్వాత తెలిసింది. మా ఇద్దరికీ పరిచయం ఉన్నవాళ్లలో కనీసం నలుగురు వ్యక్తుల దగ్గరైనా నాకు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. ‘ఎందుకలా చేశావ్?’ అని అడిగితే.. ‘నిన్ను ఇవ్వమని అడిగారా.. అడగలేదు కదా.. ఎందుకు బాధపడుతున్నావ్’ అనేవాడు. అంత కూల్‌గా ఎలా ఉండగలుగుతాం? డబ్బులిచ్చిన ప్రతివాళ్లూ... మీ పేరు చెప్పడంవల్లే ఇచ్చామన్నారు. * సింగర్‌గా మీరు 21 ఇయర్స్ ఇండస్ట్రీ.. కొత్త సింగర్స్ వస్తున్నారు కదా... ఇన్సెక్యూరిటీ ఏమైనా? కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో నేను, కౌసల్య, ఉష ఎక్కువ పాటలు పాడేవాళ్లం. ఉషను ఆర్పీ పట్నాయక్, కౌసల్యను చక్రి ఎంకరేజ్ చేశారు. నాకలా ఎవరూ ఉండేవారు కాదు. అప్పుడే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడెందుకు వస్తుంది? * మరి.. మీకంటూ పర్టిక్యులర్‌గా ఎంకరేజ్ చేసే మ్యూజిక్ డెరైక్టర్ని ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఎవరు ఎవర్ని ఎంకరేజ్ చేయాలనే విషయంలో ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు. సింగర్‌గా వచ్చినప్పుడు నేను మరీ చిన్నపిల్లని కాదు. మరీ పెద్దమ్మాయిని కాదు. చాలా చిన్న వయసులో పెళ్లయింది. ‘హౌ ఓల్డ్ యు ఆర్?’ అనేది ఎవరూ ఆలోచించరు. పెళ్లయితే ‘ఓల్డ్’ కింద జమ చేస్తారు. యూత్‌ఫుల్ సాంగ్స్ ఇవ్వడానికి వెనకాడతారు. ఎంకరేజ్మెంట్ గురించి పక్కన పెడితే.. నాకు అందరి మ్యూజిక్ డెరైక్టర్ల దగ్గర పాడే చాన్స్ లభించింది. దాంతో ఒకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? * ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? 19 ఏళ్లకే చేసుకున్నాను. ఇప్పుడు నాకు 37 ఏళ్లు. * 19 ఏళ్ల వయసులో పెళ్లంటే.. మానసికంగా మెచ్యూర్టీ లెవల్స్ అంతగా ఉండే అవకాశం లేదు కదా? అవును.. మెంటల్‌గా మెచ్యూర్టీ లెవల్స్ లేని టైమ్‌లో పెళ్లి చేసుకున్నా. జీవితం అంటే ఏంటో కూడా అవగాహన లేదప్పుడు. చాలామంది పైకి ఆనందంగా కనిపిస్తున్నవారిని చూసి, ‘ఎవ్విరీ థింగ్ ఈజ్ ఫైన్’ అనుకుంటారు. కానీ, కాంప్రమైజ్‌లు, ఎన్నో త్యాగాలు చేస్తే.. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలసి చాలా హ్యాపీగా ఉంటారు. అందర్నీ అనడం లేదు. కొన్ని జంటల పరిస్థితి మాత్రం ఇదే. * అంటే.. మీరు త్యాగాలు చేశారా? రాజీ పడ్డారా? నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వడం కోసం పదేళ్లు పైనే రాజీపడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను. * అసలు మీ వైవాహిక జీవితం ఎలా గడిచింది? ‘ఐయామ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై ఫ్యామిలీ’. మా అత్తగారు, మామగారు, మామగారి అమ్మ, మా అమ్మానాన్న, నాన్నమ్మ, పిల్లలు... అందరి బాధ్యత నాదే. బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీభాయిలా అనిపిస్తుంది. అందరి బాగోగులూ చూస్తాం. జీవితంలో అలసట ప్రారంభమైనప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. ఇంత చేస్తున్నాం.. మన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదేంటి? మన గురించి ఆలోచించేవాళ్లు లేరా? అనిపించినప్పుడు అంతా కొలాప్స్ అవుతుంది. * పదేళ్లు ఎలాగూ రాజీపడ్డారు.. ఆ తర్వాత ఇక విడిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనేది నా తపన. ఎదుటి వ్యక్తి సరైన మార్గంలో నడవటం లేదు. పిల్లలను కనడం మాత్రమే కాదు, విలువలు తెలియజేయాలి. ఇంట్లో మనల్ని చూసి నేర్చుకోవడం పిల్లల అలవాటు. బాధ్యత ఉన్న వ్యక్తిని చూసి ఎంత నేర్చుకుంటారో... బాధ్యతారాహిత్యమైన వ్యక్తిని (భర్త కిరణ్‌ని ఉద్దేశించి) చూసి, బంధాలకు విలువ ఇవ్వనివాళ్లను చూసి కూడా అంతే నేర్చుకుంటారు. పెరిగే వయసు కదా. అందుకే, ఇక కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. * అఫ్కోర్స్ పడేవాళ్లకే బాధ తెలుస్తుంది... కానీ, ఎలా ఉన్నా సర్దుకుపోవాలని మన సమాజం చెప్తుంది కదా? నా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టమని, నేను ఎమోషనల్‌గా డౌన్ అయినప్పుడు ఓదార్చమని సమాజానికి చెప్పండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే నా గురించి చెడుగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించమని చెప్పండి. నా పిల్లలకి సమాధానం చెప్పమనండి. ప్రతి నెలా నాకు ఇంత అమౌంట్ ఇవ్వమనండి. ఆ డబ్బుతో నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు సమాజసేవ కూడా చేస్తా. * విడిపోవాలనుకున్న తర్వాత మీ పిల్లలతో డిస్కస్ చేశారా? ఏదీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండానే.. ఎవరేంటి? ఎవరేం చేస్తున్నారు? అనేది వాళ్లు చూశారు. నేను చేసిన మంచి పని ఏంటంటే.. ఎదుటి వ్యక్తి గురించి పిల్లల దగ్గర చెడుగా చెప్పలేదు. ఎవరంతట వాళ్లు తెలుసుకోవాలని నేను నమ్ముతాను. * మీది లవ్ మ్యారేజ్ కదా? ఇట్స్ నాట్ ఏ లవ్ మ్యారేజ్. కానీ అటువంటిదే. * అసలేంటి మీ ఇద్దరి మధ్య సమస్య? జీవిత భాగస్వామిని నమ్మాలి, నమ్మాను. అవతలి వ్యక్తి తప్పులు చేసి, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవ్వరినైనా భరించవచ్చు గానీ, పక్కనే ఉంటూ మోసం చేస్తూ, బయట అమ్మా.. బుజ్జీ.. కన్నా.. అంటూ మాట్లాడేవాళ్లని భరించలేం. ‘హి చీటెడ్ మి’. * ఇప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే మీ గురించి ఇలా.. (ప్రశ్న పూర్తికాక ముందే..) తనకంటే దేవత ఈ ప్రపంచంలో లేదని చెప్తాడు. నా అవసరం తనకుంది. * ఏంటా అవసరం? సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. ‘సునీత చాలా కష్టాల్లో ఉంది. అడగలేకపోతోంది. నా కూతురికి ఏదో అవసరం వచ్చింది’ అని నా పేరు వాడుకోకపోతే డబ్బులు ఎవరిస్తారు? పిల్లలు మీతోనే ఉంటున్నారు కదా.. నాన్నతో ఉంటామని ఎప్పుడూ అనరా? వాళ్లకా డిఫరెన్స్ కూడా తెలియకుండా పెంచానని గర్వంగా చెప్పగలను. నేనేదో గొప్ప పని చేశానని ఫీలవడం లేదు కానీ అలా పెంచే అవకాశం వచ్చింది. సింగిల్ హ్యాండెడ్‌గా రెండు రోల్స్ (అమ్మానాన్న) ప్లే చేయలేమా? దీన్నో సవాలుగా స్వీకరించాను. ఇండియాలో మంచి యూనివర్శిటీలో నా కొడుకు చదువుతున్నాడు. అది తల్లిగా నాకో గర్వం. వాళ్లకి ఓ మంచి జీవితాన్ని ఇస్తున్నాను. అంతకంటే ఏం కావాలి? వాళ్ల నాన్న ప్రభావమో.. మరొకటో.. వాడికి సినిమాల్లోకి రావాలనుంది. పీజీ వరకూ చదివి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నా. ‘వాటీజ్ గుడ్.. బ్యాడ్.. రియల్’ అనే విషయాలపై అప్పటికి వాడికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది కదా. * ఇప్పటికీ అలా జరుగుతోందా? ఇంకా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే.. వాళ్లంత ఫూలిష్ ఎవరూ ఉండరు. * విడాకులు ఇవ్వమని అడగలేదా? ఇవ్వడు. ‘నీకు విడాకులు కావాలని ఎంత గొడవ చేసినా, ఇవ్వను’ అని భయపెడతాడు. * ఫైనాన్షియల్ విషయాలు పక్కన పెడితే.. అతని క్యారెక్టర్?? నా దృష్టిలో భార్యాపిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్‌లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్శిటీలో చదువుతాడో అతనికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత ఇర్రెస్పాన్సిబుల్. *వృత్తిపరంగా సక్సెస్ అయిన మీరు వ్యక్తిగతంగా నిలవకూడని వార్తల్లో నిలవడం.. ఓ రాజకీయనాయకుడితో కూడా...? మధు యాష్కీగారితో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. దానికి నేను బలయ్యాను. ఓ బ్యూటిఫుల్ సింగర్‌తో ఆయనకేదో ఉందని వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిఫుల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని కావడంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన ఓ స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తాయా? లేకపోవడంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే ‘సునీత గ్రేట్’ అని గొప్పగా మాట్లాడుకునేవారు. లింకప్ రూమర్స్ కూడా వచ్చి ఉండేవి కావు. నన్ను ఎమోషనల్‌గా టార్చర్ చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా పర్సనల్ లైఫ్‌లో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకుని ‘మేం తప్పు చేశాం.. సారీ’ అని చెప్పి, అవకాశం ఇస్తున్నారు. నాతో పరిచయం లేనివాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక ‘మీరింత మంచి మనిషి అనుకోలేదు’ అంటారు. * ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా..? నా పిల్లలు, స్నేహితులు.. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. అందరూ నా ఎమోషన్స్‌ని అర్థం చేసుకునేవాళ్లే. అందుకే, నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించడం లేదు. *ఈ మధ్య రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఓ వార్త... చేసుకోబోతున్నారని మరో వార్త వినిపించాయి. విడిపోయాక అతని తాలూకు వాళ్లు నాతో లేరు. నా పిల్లలు, అమ్మా, నాన్న, నానమ్మ... నా చుట్టూ మనుషులే. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకునేవారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. నా ఇంటికి వచ్చి నా చుట్టూ ఉన్న మనుషులను చూసిన తర్వాత, ‘ఈవిడగార్ని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి అంతే’ అనుకోనివాళ్లు ఉండరు. * మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారనే వార్త కూడా...? సదరు కిరణ్‌గారి వల్లే ఈ పేరు కూడా వచ్చింది. నాకు ఒక్క పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకునే పనులు ఏ రోజూ చేయలేదు. చేయను. అలాంటిది సునీత ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. ‘సునీత నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి లేదు. వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు’ అని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వడం లేదు? * మీ భర్తని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా..? సగం తెలిసినవాడితో మాట్లాడొచ్చు. తెలియనివాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్లను మార్చలేం కదా. వాళ్లు పరమ మూర్ఖుల కింద లెక్క. *కిరణ్ గారి గురించి మీరింత ఘాటుగా ఎక్కడా మాట్లాడినట్లు లేదు. ఇప్పుడెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు..? ఒకప్పుడైతే.. చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే నా సహనాన్ని పీక్స్‌లో పరీక్షించాడు. ఎవరికీ తె లియకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు (చెమర్చిన కళ్లతో). ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్?’ అని కొడుక్కి ఫోన్ చేసి, మాట్లాడతాడు. ఫైనాన్షియల్‌గా కాకపోయినా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది?.. ఇవన్నీ మాత్రం పట్టించుకోడు (కన్నీళ్లు పెట్టుకుంటూ). * బాధ నుంచి బయటపడడానికి సైకియాట్రిస్ట్‌ని ఏమైనా..? ఆరేళ్ల క్రితం ఓసారి, రీసెంట్గా మరోసారి సైకియాట్రిస్ట్‌ని కలిసి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే.. సొసైటీలో ఓ వ్యక్తి గురించి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ల జీవితం గురించి తెలుసుకోకుండానే ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అది చాలా తప్పు. *చివరిసారిగా అతనితో ఎప్పుడు మాట్లాడారు..? రీసెంట్గా మాట్లాడాను. ‘ఎందుకిలా ?.. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు. గెడైన్స్ ఇవ్వు’ అన్నాను. ‘నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా’ అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది ‘నీకు నేను ఉన్నాను’ అనే నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారడానికి కాస్త టైం ఇవ్వాలి. ఎక్కువ టైమ్ ఇచ్చి చూశాను కాబట్టి.. ఇప్పుడు అతని గురించి ఓపెన్‌గా మాట్లాడా. * ప్రస్తుతం మీ కెరీర్ ఎలా ఉంది..? బాగుంది.. కాకపోతే తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనూప్‌ల టైమ్ కదా. వాళ్లు కొత్త వాయిస్‌ల కోసం చూస్తున్నారు. తమన్ దగ్గర తప్ప మిగతా ఇద్దరి సంగీతంలోనూ పాడాను. ఈ రోజున వాయిస్ ప్రాసెస్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పాడినా ఓకే అన్నట్లుగా ఉంది. అనుభవమున్న సింగర్ కావాలనే రూల్ లేదు. * ఒకవేళ మీ రెమ్యునరేషన్ ఎక్కువేమో ? నాకు డబ్బులు ఇవ్వాల్సినవాళ్ల లిస్టు ఇస్తా. సగం మీరు తీసుకుని సగం నాకు ఇవ్వండి (నవ్వుతూ). డబ్బుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పిలిచి పాట ఇస్తే పాడేస్తా. * ఫైనల్లీ... మీ యాంబిషన్ ఏంటి..? మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుంది. ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. శారీస్, డ్రెస్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలని ఉంది. డిజైనింగ్ అంటే నాకు చాలా ఇంట్రస్ట్. - డి.జి. భవాని -
అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు
వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ మహిళ ఒంటికి నిప్పంటుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహారాష్ట్రకు చెందిన చెందిన సునిత(20) భర్త పేరు పరమేశ్వర్ గత కొన్నేళ్ల క్రితం తుకారాంగేట్‌లో నివాసముంటున్నారు. సునిత గృహిణి. అయితే, బుధవారం రాత్రి సమయంలో ఇంటి పక్కనే ఉండే ఆమె అక్క సబిత ఇంటికి వెళ్లింది. అక్కడ వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సునీతను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 20 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. -
సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ సతీమణి?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 'ఆప్'లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను 'ఆప్' నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, 'ఆప్'లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు. 'ఆప్' రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. -
సేవ పేరుతో వచ్చి దోచుకెళుతుంది..
నర్సుగా చెప్పుకుని ఇంట్లో చేరి.. నగలు, ఖరీదైన వస్తువులను తస్కరించే ఓ మహిళను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు కె. ముత్తు, సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామానికి చెందిన మేరి సునీత(38) నర్సుగా పని చేస్తూ మెహిదీపట్నం అయోధ్య నగర్లో నివసిస్తోంది. వృద్ధాశ్రమాల్లో తన పేరును నమోదు చేయించుకొని ఎవరికైనా నర్సుగా సేవలు కావాలంటే అందిస్తానంటూ చెప్పేది. ఈ మేరకు ఆమెను ఎవరికైనా నర్సుగా సేవలు కావాలన్నప్పుడు పంపించేవారు. అలా, ఈ నెల 9వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-44లో నివసించే రత్న అనే వృద్ధురాలికి సేవల కోసం వాళ్లింట్లో చేరింది. ఆమెకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి తీసుకెళ్లింది. టవల్ తెస్తానంటూ బయటకు వచ్చి బాత్రూం తలుపులు మూసి బయట నుంచి గడియవేసి రత్న మంగళసూత్రంతో పాటు గొలుసును తస్కరించి పరారైంది. అదే రోజు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 23న వెంగళ్రావునగర్లో ల్యాప్‌టాప్‌ను, ఏప్రిల్ 30న మరో ఇంట్లో ఐపాడ్‌ను దొంగిలించింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ నంబర్లను ట్రేస్ చేశారు. ఆమె రాజమండ్రిలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు తెలుసుకొని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఆమె 13 దొంగతనాల్లో నిందితురాలుకాగా అయిదుసార్లు జైలుకు వెళ్లివచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, ఐపాడ్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
చిట్టీల పేరుతో మరో మోసం
చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న శ్రీనివాస్, సునిత దంపతులు చిట్టీల పేరుతో అమాయకుల నుంచి సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి శ్రీనివాస్ దంపతులు పత్తాలేకుండా పోవడంతో.. బాధితులు సోమవారం మలక్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ఆగిరిపల్లి పంచాయతీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి మాదల గోపాల్ రావు(60), సునీత(25) అనే ఇద్దరు మృతిచెందారు. ఉతికిన బట్టలను ఇనుప వైరుపై ఆరేస్తుండగా కరెంటు షాక్ తగలడంతో సునీత గిజగిజ కొట్టుకుంటుంది. ఇది చూసిన గోపాల్‌రావు ఆమె రక్షించబోయి పట్టుకోబోవడంతో ఆయనకు కూడా షాక్ కొట్టింది. కరెంటు షాక్‌తో ఇద్దరూ ఊగుతుండటంతో గమనించిన స్థానికులు కర్రతో కొట్టారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోపాల్ రావు గొంతులో ప్రాణం ఉందేమోనని ఆశతో ఆయనను విజయవాడకు తరలించారు. కానీ ప్రాణం పోయిందనుకుని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఆగిరిపల్లి తీసుకువచ్చారు. -
బాధల బతుకొద్దని..
ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య తాగుబోతు భర్త వేధింపులు భరించలేక.. అఘాయిత్యం రోజూ తాగొచ్చి కొడుతుంటే.. భర్తేకదా అని భరించింది. సొంతూళ్లో ఉన్న నాలుగెకరాల పొలాన్ని సారా కోసం అమ్మేసి నడివీధిలో నిలబెడితే.. ఓర్చుకుంది. చివరికి తలదాచుకునేందుకు గూడులేకుండా చేసినా.. తట్టుకుంది. ఇద్దరు బిడ్డలను తీసుకుని దుర్భర స్థితిలో పుట్టింటికి చేరుకుంది. అయితే అత్తగారింటికొచ్చినా.. ఆ మందుబాబులో మార్పు రాలేదు. కూలీనాలీ చేస్తే వచ్చిన సొమ్మును తాగుడుకు తగలేయడమే కాకుండా.. భార్యను రోజూ చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. శనివారం అర్ధరాత్రి ఆ వేధింపులు తట్టుకోలేనంత స్థాయికి చేరాయి.. ఇక మనం భరించలేం.. ఇలాంటి వాడితో నిత్యం చస్తూ బతకడం కంటే.. ఒక్కసారిగా వెళ్లిపోవడమే నయమని ఆ ఇలాల్లు నిర్ణయించుకుంది. అంతే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని.. సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. ఇంటి నుంచి తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్‌ను చిన్నకూతురుకి తినిపించింది. ఒక్కసారిగా కూతురుని చేతుల్లోకి తీసుకుని బావిలోకి తోసేసింది. అనంతరం పెద్దకూతురితో కలసి నీళ్లలో దూకి తనువు చాలించింది. మద్యం మహమ్మారి కుటుంబాలను ఎంత నిర్దయగా చిదిమేస్తుందో.. తెలియజేసే ఈ హృదయ విదారక ఘటన పీలేరు మండలంలోని మిథులానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పీలేరు : మద్యానికి బానిసైన వ్యక్తి భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెందింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం మిధులానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుల బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం మిథులానగర్‌కు చెందిన ఎం.దేవేంద్ర, వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె సునీత(32)ను నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మునిశేఖర్‌కు ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారి సంసా రం రెండేళ్లు సాఫీగా సాగింది. వీరికి యశ్విని(7), నవ్య(5) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన మునిశేఖర్ తనకున్న నాలుగు ఎకరాల పొలం అమ్మేశాడు. దీంతో నాయుడుపేటలో బతుకుదెరువు లేకపోవ డం, భర్త ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్న ఆశతో సునీత తన పుట్టినిల్లు అయిన మిథులానగర్‌కు వచ్చేసింది. వారితో పాటు మునిశేఖర్ కూడా ఇక్కడికే వచ్చేశారు. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మునిశేఖర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఐదేళ్లుగా భర్త పెట్టే నరకయాతనను బిడ్డల కోసం భరించింది. శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మునిశేఖర్ భార్య సునీత(32)ను తీవ్రంగా కొట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇద్దరు బిడ్డలతోపాటు ఆదివారం తెల్లవారుజామున ఊరు సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. తాను చనిపోతే బిడ్డలను చూసే దిక్కు ఉండదని భావించింది. చిన్నకుమార్తెకు బిస్కెట్ తినిపించి బావిలో తోసేసింది. తరువాత పెద్ద కుమార్తెను ఎత్తుకుని తానూ బావిలో దూకేసింది. సునీత కోసం బంధువులు, తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ తెలియలేదు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిథులానగర్ సమీపంలోని బావిలో నవ్య మృతదేహం తేలింది. దీన్ని గమనించిన గ్రామస్తులు పీలేరు సీఐ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని సునిత, యశ్విని, నవ్య మృతదేహాలను వెలికి తీయించి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సునిత భర్త మునిశేఖర్ పరారీలో ఉన్నాడు. తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో మిథులానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రాజయ్యగారి కోడలు
చేతనబడి పేరు సునీత. మనసు నవనీత. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది ఆ అమ్మాయి. అంతా కొత్త. అలవాట్లు కొత్త. పద్ధతులు కొత్త. తిట్లు, చీవాట్లు.. మళ్లీ మళ్లీ పొరపాట్లు. పుట్టినిల్లు ఫ్రెండ్లీ... మెట్టినిల్లు మిలటరీ! తేడా తెలుస్తోంది. తట్టుకోవడం కష్టమైంది! పసుపు కుంకుమలతో కోడలిగా వచ్చిన సునీత... చివరికి ఆ డిప్రెషన్లో ఊరికే అరిష్టమైంది! అసలేం జరిగింది? నల్గొండ జిల్లా కేంద్రం. ఆర్.డి.ఓ ఆఫీసులో సమావేశం. పరిస్థితి కొంచెం వేడిగానే ఉంది. ఎం.ఆర్.వోలు ఉన్నారు. ఆర్.డి.వో టేబుల్ మీద న్యూస్ పేపర్ ఉంది. చర్చ ఆ పత్రికలోని ఓ విషయం మీదనే సాగుతోంది. ‘ఎంతకాలంగా జరుగుతోందిలా’ అడిగారు ఆర్.డి.వో తిప్పర్తి ఎం.ఆర్.వోని చూస్తూ. ఎం.ఆర్.వో చెప్తున్న వివరాల్లో స్పష్టత లోపిస్తోందనిపించింది. ‘వి.ఆర్.వో ఉంటే పిలిపించండి’ అనగానే బంట్రోతు వెళ్లి వరండాలో తచ్చాడుతున్న వి.ఆర్.వోని పిలుచుకొచ్చాడు. వి.ఆర్.వో చెప్పినదంతా విన్న ఆర్.డి.వో ‘ఇది సున్నితంగా వ్యవహరించాల్సిన అంశం. నేనే వస్తాను. గ్రామంలో దండోరా వేయించి గ్రామస్థులందరినీ రేపు ఉదయాన్నే సమావేశ పరచండి’ అంటూ ముగించారు. తిప్పలమ్మ గూడెం రచ్చబండ దగ్గర ఆర్.డి.వో ఇతర అధికారులు కూర్చుని ఉన్నారు. వారి ఎదురుగా రాజయ్య, రంగమ్మ, వాళ్ల కొడుకు రాజు, నెలల పాపాయిని ఎత్తుకుని కోడలు సునీత ఉన్నారు. పెద్ద అధికారి ముందు నోరు తెరవడానికి భయపడుతున్నారు. ‘ఏం జరిగిందో చెప్పు’ అంటూ రాజును చూశాడు వి.ఆర్.వో. ‘పొద్దుగుంకిందంటే భయమైతాందయ్యా. ఎక్కడ నుంచి పడుతున్నాయో తెలియదు, నట్టింట్లో రాళ్లు పడుతున్నాయి, ఒక్కోరోజు పసుపు, కుంకుమ పడుతున్నాయి. ఒక్కో రోజైతే... అశుద్ధం కూడా ఉంటోంది’ అంటూ ఆగాడు రాజు. అతడి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ‘ఒక్కో రాత్రి మా కోడలి జడ కాలిపోతోందయ్యా’ అంటూ బావురుమంది రంగమ్మ. ఆమెను ఊరుకోమని భుజం మీద తడుతూ ‘ఇంటికి ఎవరో చేతబడి చేశారయ్యా, అరిష్టం పట్టిందని పూజలు చేయించాం. మేము రోజంతా పొలం పనులు చేసుకుంటాం. ఇంట్లో పగలంతా కోడలొక్కటే చంటిబిడ్డతో ఉంటుంది. ఏ గాలిసోకిందో, ఎవరు కళ్లలో నిప్పులు పోసుకున్నారో, పచ్చటి కాపురం, గుల్లవుతోంది. పొద్దుగాలం కష్టపడి వస్తాం, తిండి తిని పక్క మీద వాలాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎక్కడ నుంచి రాయి పడుతుందో తెలియదు, కళ్లు తెరిచి కప్పువైపు చూడాలంటే పసుపుకుంకుమలు కళ్లలో పడతాయేమోనని భయం, ఆఖరుకు అశుద్ధం కూడా పడుతుంటే ఇంట్లో ఎట్లాగుండాలో తెలియట్లేదు. ఇల్లు విప్పేసి ఎటైనా దూరంగా పోవడమే మార్గం అనిపిస్తోందయ్యా’ ఆవేదనతో చెప్పిందే చెప్పుకుపోతున్నాడు రాజయ్య. అతడి మాట పూర్తయిందో లేదో ఊరి వాళ్ల గొంతులన్నీ ఒక్కసారిగా లేచాయి. ‘‘వాళ్లింటికేదో అరిష్టం పట్టింది. అది అక్కడితో ఆగుతుందో లేక మా ఇళ్లంటినీ తగులుకుంటుందో తెలియక భయంతో చచ్చిపోతున్నాం. ఇక వాళ్లు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతే ఆ చేతబడి మా ఇళ్లకు పాకుతుంది...’’ అంటూ గొడవకు దిగారు. రాజయ్య కోడలు సునీత... తాను మాట్లాడాల్సిందేమీ లేనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఇదేమీ తెలియని ఆమె చంకలో బిడ్డ అందరినీ పరికించి చూస్తోంది. ఊరు అట్టుడుగుతోంది! ఆర్.డి.వోకి పరిస్థితి ఎంత క్లిష్టతరమవుతోందో అర్థమవుతూనే ఉంది. ఊరు ఊరంతా ఉడికి పోతోంది. మూఢనమ్మకం జడలు విప్పింది. పరిస్థితి చేయిదాటిపోయేటట్లుంది. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని ఊహించారాయన. పక్కనే ఉన్న అధికారిని ఆదేశించారు. ముదాం పెద్దగా అరుస్తూ ‘ఎవరూ మాట్లాడవద్ద’ని గదుముతున్నాడు. ఆర్.డి.వో లేచి రాజయ్య ఇంటికి హాని జరిగినా, ఆ కుటుంబంలో ఎవరిమీదనైనా దాడి జరిగినా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇంట్లో రాళ్లు, పసుపు, కుంకుమల వంటివి పడడానికి కారణాన్ని కనుక్కుంటామని రెండు- మూడు రోజుల్లో మళ్లీ వస్తామని చెప్పారు. ఒకరిని ఒకరు నిందించుకోవడం, దాడికి పాల్పడడం చేయకూడదని ఆదేశించి, పరిస్థితిని గమనిస్తూ ఉండమని రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు జనవిజ్ఞాన వేదిక (జెవివి) బృందం తిప్పలమ్మ గూడెం చేరుకుంది. బృందం సభ్యులు గ్రామస్థులందరినీ ప్రశ్నలడిగి మరో రెండు రోజుల తర్వాత వస్తామని వెళ్లారు. ఆ మూడో రోజున... జనవిజ్ఞాన వేదిక వాళ్లు ఏం చెబుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. జెవివి వాళ్లు వచ్చిన వెంటనే మొదటగా చేతబడులు, భూతవైద్యాలు లేవని చెప్పారు. మంత్రగాళ్లు చేసే మాయలను తామూ చేసి చూపించడంతోపాటు రాజయ్య కోడలు సునీత మానసిక స్థితినీ వివరించారు. ‘అదంతా చేసింది సునీతే’ అన్నారు. ఊరు ఆశ్చర్యపోయింది! అమెను తలా ఓ మాట అనడం మొదలుపెట్టారు. అసలేం జరిగింది? సునీత పట్టణంలో పెరిగి, పదవ తరగతి వరకు చదువుకున్న అమ్మాయి. 16 ఏళ్లకే పెళ్లి, ఆ తర్వాత ఏడాదికి బిడ్డ. తల్లిదండ్రుల ఆదరణలో ఆటపాటల్లో గడిచిన బాల్యం నుంచి ఒక్కసారిగా కుటుంబ భారం మీద పడడం, పనిలో ఏ చిన్న లోపం జరిగినా అత్తగారు చివాట్లు పెట్టడం, చేసిన పనిని ఎవరూ గుర్తించకపోగా పొరపాటు జరిగితే ఆకాశం విరిగి మీద పడ్డట్లు గొడవ చేయడం వంటి వాతావరణంలో చిక్కుకుపోయింది. విచిత్రమైన ప్రపంచంలోకి వచ్చినట్లు, ఎవరికీ అక్కర లేని మనుషుల మధ్య జీవించాల్సి వచ్చినట్లు న్యూనతకు గురయ్యేది. దీనికి తోడు బిడ్డతో రాత్రిళ్లు నిద్ర ఉండేది కాదు. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్న భావనతో డిప్రెషన్‌కు లోనైంది. ఆ స్థితిలో గదిలో రాళ్లు వేయడం, పసుపుకుంకుమలు చల్లుకోవడం, పాపాయి విసర్జించిన మలాన్ని కాగితంలో చుట్టి గదిలోనే విసిరేయడం వంటి పిచ్చి చేష్టలు చేయడం మొదలుపెట్టింది. అలా చేసినట్లు కూడా ఆమెకు తర్వాత గుర్తుండేది కాదు. జుట్టు కాలడంతో ఇంట్లో అందరూ సునీత పట్ల సానుభూతి వ్యక్తం చేయసాగారు. భర్త, అత్తమామల నుంచి ఆదరణ లభించడం మొదలైంది. ఆ స్థితిలో ఉన్న వాళ్లు అలాంటి ఆదరణ ఇంకా ఉంటే బావుణ్నని కోరుకోవడం సహజం. దాంతో జుట్టు కాల్చుకోవడం వంటి పనులు మళ్లీ మళ్లీ చేస్తుంటారు. అలాంటి స్థితిలో ఆమెకు మానసిక చికిత్స అవసరం అని జెవివి బృందం గుర్తించింది. అంతకంటే ముందు తనదైన, తనకు ఇష్టమైన ప్రపంచం ఆమెకు కావాలి. పుట్టింటిని చూస్తే మనసు కాస్త స్థిమితపడుతుంది. అందుకే ఆమెను పుట్టింటికి తీసుకెళ్లమని చెప్పారు. సైకియాట్రిస్ట్‌కి చూపించమని తల్లిదండ్రులకు సూచించారు. అనుకున్నట్లే ఆమె నెల రోజుల్లో మామూలైంది. సమస్య తీరిపోయింది. సునీత ఆరోగ్యం బాగైంది. అయితే అందరూ ఆమెను దోషిలా చూస్తే... పరిస్థితి ఇంకా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ఆమెను మామూలు మనిషిలా చూస్తూ ఎలా వ్యవహరించాలో కూడా ఇంటి వాళ్లను, ఊరి వాళ్లను ఎడ్యుకేట్ చేసింది జెవివి. ఇది జరిగి ఆరేడేళ్లయింది. సునీతకు ఇప్పుడది గతించిన పీడకల. ఇప్పుడామె ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా జీవిస్తోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎలా ఛేదించారు? రాళ్లు, పసుపు కుంకుమ, అశుద్ధం ఏ సమయంలో పడుతున్నాయంటే... రాత్రి పూట ఎక్కువగానూ, పగలు చాలా అరుదుగానూ పడుతున్నాయన్నారు. సునీత గదిలోనే పడుతున్నాయి కాబట్టి ఆమె భర్త ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయా... అనే కోణంలో ఆరా తీస్తే... అతడు లేనప్పుడు కూడా సునీత జుత్తు కాలుతోంది. అంటే వీటికి రాజుకి సంబంధం లేదు. అత్తమామలు ఏ రాత్రి ఏం జరుగుతుందోనని ఇంటి చుట్టూ చీమ చిటుక్కుమన్నా కళ్లింత చేసుకుని చూడడంలోనే వాళ్లకు తెల్లవారి పోతోంది. సునీతతో రాళ్లు, పసుపుకుంకుమల గురించి ప్రస్తావించకుండా ఇతర విషయాలెన్నో మాట్లాడాం. వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి ‘అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లి నెల రోజుల తర్వాత పంపించమన్నాం. అలాగేనంటూ అప్పుడే ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇక రాళ్లు పడవు, మా మాట మీద నమ్మకం ఉంచి హాయిగా నిద్రపొమ్మని చెప్పాం. రెండు రోజుల తర్వాత వచ్చి రాళ్లు ఎలా పడ్డాయో వివరిస్తామని చెప్పాం. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
పోస్టల్ సిబ్బంది తప్పిదం.. నవోదయలో సీటు కోల్పోయిన విద్యార్థిని
ధరూరు : ఆ గ్రామానికి ఒక్కటే పోస్టుకార్డు వచ్చింది కదా.. అంటూ పోస్టల్ సిబ్బంది చే సిన తప్పిదానికి ఓ విద్యార్థిని వట్టెంలో వచ్చిన గురుకుల సీటును కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 2014-15 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివి 9.2 జీపీఏ సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన కొత్తపాలెం గ్రామానికి చెందిన సునీత జవహర్ నవోదయ వట్టెం కళాశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. మండల టాపర్‌గా నిలిచిన ఆ విద్యార్థి ప్రతిభను గుర్తించి జిల్లా అధికారులు వట్టెం కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివేందుకు సీటును కేటాయిస్తూ ప్రవేశం కల్పించి ధృవీకరణపత్రాలను పోస్టల్ ద్వారా పంపించారు. ఈనెల 2న గద్వాల హెడ్ పోస్టాఫీసుకు చేరిన ఆ ధ్రువీకరణపత్రాలు కొత్తపాలెం గ్రామంలో బట్వాడా చేయాలి. ఆ గ్రామ పోస్టుమన్‌గా పనిచేస్తున్న వేములకు చెందిన భీమేష్ ఒక్క పోస్టే కదా.. అని 2న గద్వాల నుంచి స్వగ్రామమైన వల్లూరుకు వెళ్లిపోయాడు. వాస్తవానికి 3వ తేదీనే వట్టెం కళాశాలలో ప్రవేశం పొందాలి. వచ్చిన పోస్టును 8న అందించడంతో ఆ విద్యార్థిని మనోవేదనకు గురైంది. అదేరోజు వట్టెం కళాశాలకు చేరుకొని సీటు విషయమై అడుగగా రెండు, మూడురోజులపాటు మీ సీటు రిజర్వులోనే ఉంచామని, ఎంతకూ రాకపోవడంతో ఆ సీటు ఇతరులకు కేటాయించామని చెప్పడంతో ఆ విద్యార్థినితోపాటు తల్లిదండ్రులు బీపీఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోస్టల్ ఉద్యోగి కారణంగా తాము నష్టపోయిన సీటును తిరిగి తేగలిగితే బావుంటుం దని విద్యార్థిని తండ్రి తులసీరాం కోరుతున్నాడు. తామున్న పరిస్థితిలో ప్రైవేటు కళాశాలలో చదివించే స్థోమత లేదని, ఎలాగైనా తమకు సీటు కేటాయించాలని వారు కోరుతున్నారు. -
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
నిందితులు నలుగురూ యువతీయువకులే {పేమ, ఆర్థిక వ్యవహారాలే కారణం భీమడోలు : ఓ యువకుడిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను శుక్రవారం రాత్రి భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మండలంలోని ఆగడాలలంక గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల వినయ్సుధీర్ (28)ను జూలై 12న పోలసానిపల్లి పేరయ్యకోనేరు చెరువు వద్ద హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసు వివరాలను భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ విలేకరులకు తెలిపారు. ఆర్థిక పరమైన, ప్రేమ వ్యవహారాలే హత్యకు కారణమని ఆయన సృష్టం చేశారు. రాజమండ్రిలోని కొంతమూరుకు చెందిన అన్నాచెల్లెళ్లు లింగంపల్లి రమేష్ (22), లింగంపల్లి సునీత (19)తో పాటు కొవ్వలి సురేంద్ర (22), కుమారి రాజ్యలక్ష్మి పథకం ప్రకారం యాళ్ల వినయ్సుధీర్ను కాళ్లు కట్టి కర్రలతో కొట్టి అతికిరాతకంగా చంపారన్నారు. వినయ్సుధీర్కు కొంతకాలం క్రితం ఓ రాంగ్ కాల్ చేయడంతో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన లింగంపల్లి సునీత పరిచయమైందన్నారు. వారిద్దరి ఫోన్ పరిచయం ప్రేమగా మారింది. ఈతరుణంలోనే రెండేళ్ల క్రితం లింగంపల్లి సునీత కుటుంబం రాజమండ్రి మకాం మారింది. సునీత, సుధీర్ మధ్య సంబంధం కొనసాగింది. వీరిద్దరూ తరుచుగా పోలసానిపల్లిలో కలిసేవారు. వినయ్ సుధీర్ సునీత వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇదిలావుండగా అదే గ్రామంలో ఉంటున్న సునీత ద్వారా రాజ్యలక్ష్మి అనే మహిళ సుధీర్‌కు పరిచయమైంది. రాజ్యలక్ష్మి నుంచి కూడా సుధీర్ కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. సునీత తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. పెళ్లి విషయాన్ని సుధీర్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం గత నెల 12న సాయంత్రం సునీత సుధీర్‌కు ఫోన్‌చేసి పోలసానిపల్లి రమ్మంది. ఆమె స్కూటర్‌పై అక్కడికి వెళ్లగా, మిగిలిన ముగ్గురు కొంతమూరు నుంచి ఆటోలో వచ్చారు. బైక్‌పై వచ్చిన సుధీర్‌తో సునీత మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు కర్రలతో సుధీర్ మర్మాంగంపై కొట్టారు. కాళ్లు కట్టేశారు. అనంతరం హతమార్చి వెళ్లిపోయారు. నిందితుడు లింగంపల్లి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ సుధీర్‌ను భయపెట్టాలకున్నామే తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదన్నాడు. విలేకరుల సమావేశంలో సమావేశంలో ఎస్సైలు బి.వెంకటేశ్వరరావు (భీమడోలు), సీహెచ్ సతీష్‌కుమార్ (ద్వారకాతిరుమల), ఎం.సుభాష్ (దెందులూరు), హెచ్‌సీ అమీర్ పాల్గొన్నారు. -
మే 10న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునీత (గాయని), నమిత (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరం అన్ని ఆటంకాలూ తొలగిపోయి, వృత్తిపరంగా, కుటుంబపరంగా చాలా ప్రోత్సాహకరంగా, సంతోషంగా ఉంటుంది. మీడియాలో పని చేసేవారికిది మేలిమలుపు తిప్పే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారికి, విదేశాలలో ఉద్యోగాలకోసం ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. డాక్యుమెంట్లపై సంతకాలు చేసేటప్పుడు ఆలోచించి చేయడం అవసరం. పోటీ పరీక్షలు రాసేవారికి విజయం తథ్యం. లక్కీనంబర్స్: 1,5,9. లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్. కుజగ్రహ శాంతికై జపం చేయించుకోవడం, పేద అవివాహిత యువతుల వివాహ ఖర్చులలో పాలుపంచుకోవడం, అనాథల చదువుకు సాయం చేయడం వల్ల వీరికి మరిన్ని అనుకూలమైన అవకాశాలుంటాయి. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
నిద్రలోనే తల్లి, కుమారుడు, కుమార్తె దుర్మరణం నర్సింహులపేట: వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో అందులో నిద్రిస్తున్న తల్లి, కుమారుడు, కుమార్తె మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో శనివారం వేకువజామున జరిగింది. బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన బండి ఐల్‌రెడ్డి, బండి సునీత దంపతులు గ్రామ స్టేజీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి సునీత(35), కుమారుడు రాహుల్‌రెడ్డి(15), కూతురు ప్రగతి(13) ఇంట్లో నిద్రిస్తుండగా, ఐల్‌రెడ్డి ఇంటి బయట మంచంలో నిద్రపోయాడు. శనివారం వేకువజామున సుమారు 2.45 గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ అతివేగంగా వారింట్లోకి దూసుకెళ్లింది. దీంతో గోడలు కూలడంతో నిద్రలో ఉన్న సునీత, రాహుల్‌రెడ్డి, ప్రగతి అక్కడికక్కడే మృతిచెందారు. బయట పడుకున్న ఐల్‌రెడ్డిపై రేకులు పడడంతో వెంటనే నిద్రలేచాడు. అదే ఇంట్లో మంచంలో నిద్రిస్తున్న పక్కింటికి చెందిన వృద్ధురాలు పిట్సోజు శ్రీశైలమ్మపై కూడా కొన్ని మట్టిపెళ్లలు పడినా ఎలాంటి గాయూలు కాలేదు. మహబూబాబాద్ డీఎస్పీ నాగరాజు, తొర్రూరు, కురవి సీఐలు శ్రీధర్‌రావు, కరుణసాగర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉదయాన్నే సంఘటన స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై పోలీసు అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. -
143 I MISS YOU
లవ్‌కుమార్.. తనకు తాను ప్రేమకు ‘సింబాలిక్’ అనుకుంటాడు. అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచే మనోడు ప్రేమించడం మొదలుపెట్టాడు. స్కూల్ డేస్‌లోనే అతని హార్ట్ లవ్‌లవ్ అని కొట్టుకుంది. ఏడో తరగతిలో సునీత.. ఎనిమిదిలో ఫర్హీన్.. తొమ్మిదిలో పుష్పలత.. పదికొచ్చే సరికి రాధిక.. ఇలా క్లాస్కో గ్లామర్‌ను ప్రేమించేసిన మనోడికి టెన్త్‌లో అచ్చంగా వచ్చిన మార్కులు 413. దీన్నే ‘143’గా తిరగరాసుకుని... కాలరెగిరేసి మరీ ఇంటర్లోకి వచ్చేశాడు. టీనేజీ మోజు.. కాలేజీ ఏజ్.. తొలిప్రేమ సినిమా రిలీజైన తొలినాళ్లు.. నా మనస్సే.. స్సే.. సే..సే.. అంటూ కాలేజీలోకి ప్రవేశించాడు. కట్ చేస్తే.. ఇంట్రడక్షన్ క్లాస్ బై కెమిస్ట్రీ లెక్చరర్. ఒక్కొక్కరి పేరు.. టెన్త్‌లో వచ్చిన మార్కులు అడుగుతున్నాడు. తన కంటికి ఇంపుగా ఏ అమ్మాయి కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నాడీ నిత్య ప్రేమికుడు. ఇంతలో ఒకమ్మాయి ‘పేరు స్వప్న కుమారి.. మార్కులు 413’ అని చెప్పి కూర్చుంది. ఈ కుర్రాడి గుండెల్లో గంట మోగింది. ఆ వెంటనే తన వంతు.. చప్పున లేచి. పేరు చెప్పి, మార్కులు ‘ఫోర్ వన్ త్రీ సార్’ అని చెప్పేశాడు. ఆ అమ్మాయి చెప్పిన మార్కుల ను రిపీట్ చేశాననుకుని కెమిస్ట్రీ లెక్చరర్.. ‘ఏంట్రోయ్.. అప్పుడే కటింగ్‌లు ఇస్తున్నావా’ అంటూ కాస్త కోపంగా.. ఇంకాస్త కొంటెగా ప్రశ్నించి ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి క్యాటలిస్టు పాత్ర పోషించాడు. ఆనాటి నుంచి వాళ్లిద్దరి మధ్య కొంటె చూపులు.. చిలిపి నవ్వులు.. ఎన్నో విరబూశాయి. ఏడాది గడిచింది. సెకండియర్.. స్వప్నకుమారి అందాన్ని తలదన్నే మరో స్వప్నతో పరిచయం ఇష్క్వాలాకు కొంగొత్తగా అనిపించింది. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ కోసం మనోడు హైదరాబాద్ వచ్చేశాడు. మూడేళ్లు గడిచాయి. అప్పటికి నో మొబైల్స్, నో మెసేజెస్. మూడేళ్లు తనను కలవలేకపోయినా, స్వప్న తన మదిలోనే కొలువై ఉందనిపించింది. అప్పుడు తనది నిజమైన ప్రేమని తెలిసొచ్చింది. ఓ రోజు ధైర్యం చేసి.. ఇంటికెళ్లి మరీ ఆ అమ్మాయి ముందు మనసు పరిచేశాడు. అప్పటికే స్వప్నకు పెళ్లి నిశ్చయమైందని తెలిసింది. లవ్‌కుమార్ సైడైపోయాడు. పీజీలో... స్వప్న ఒక స్వప్నం అనుకుని.. పీజీలో చేరాడు. సరితను చూడగానే సరిజోడనుకున్నాడు. కొత్తగా తాకిన చెలిగాలితో ఊహల్లో చెలరేగిపోయాడు. మాటా మాటా కలిసింది. ఆలస్యం అమృతం విషం అనుకుని.. మనసులో మాట చెప్పగానే.. మాటామాటా పెరిగింది.. వెరసి సరిత నిష్ర్కమించింది. లవ్ పేరులోనే ఉందికాని.. లైఫ్‌లో లేదనుకుని.. నిరుత్సాహంలో కుంగిపోతున్న భగ్నప్రేమికుడి జీవితంలోకి జీవిత ఎంటరైంది. మొదట తనే ప్రపోజ్ చేసింది. ఇన్నాళ్లకు సార్థక నామధేయుడ్ని అవుతున్నానని సంబరపడ్డాడు. ప్రేమలో ఇద్దరూ మునిగితేలారు. సిటీరోడ్లపై చక్కర్లు కొట్టారు. మెసేజ్ ఆఫర్లు వేయించుకుని మరీ ప్రేమ ‘చాట్’కున్నారు. ఇది పెద్దలకు తెలిసి కిరికిరి మొదలైంది. ప్రేమపక్షుల్లా ఎగిరిపోవాలనుకున్నారు. జీవిత అందుకు సాహసం చేయలేకపోయింది. జీవితంలో తొలిసారి సొంతమైన ప్రేమను దక్కించుకునేందుకు లవ్‌కుమార్ విఫలయత్నం చేశాడు. కొన్నాళ్లకు జీవిత మరొకరితో జీవితం పంచుకుంది. లవ్‌కుమార్ మళ్లీ ఓడిపోయాడు. సాహసం చేయరా... ఓ ప్రేమను కమిట్మెంట్ లేక మిస్సయ్యాడు. మరో ప్రేమను ఆలస్యం చేసి పొందలేకపోయాడు. ఇంకోసారి తొందరపడి కోల్పోయాడు. మరోసారి పెద్దల పెత్తనంతో అందుకోలేకపోయాడు. వెరసి లవ్‌కుమార్ ఒంటరిగా మిగిలిపోయాడు. గుర్తుకొస్తున్నాయంటూ మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ప్రేమికులకు ఓ మాట చెబుతున్నాడు. ప్రేమికులకు టైమింగ్ కావాలి. ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యం కావాలి. అంతకుమించి కమిట్మెంట్ కావాలి. ఇవేవీ లేకపోతే ప్రతి ప్రేమికుడూ తనలా మిగిలిపోవాల్సిందే అని చెబుతున్నాడు. - త్రిగుళ్ల నాగరాజు -
మార్క్‌ఫెడ్‌కు కన్నం
ఖమ్మం వ్యవసాయం: ‘కంచే చేను మేసిన చందం’గా స్టేట్‌వేర్ హౌసింగ్ ముఖ్య అధికారి వ్యవహరించారు. కాపాడాల్సిన ఆయనే అవినీతికి యత్నించి అడ్డంగా దొరికి పోయారు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన వాటిని జిల్లాకేంద్రంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మార్క్‌ఫెడ్ 6,251 టన్నులు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. వాటిని మార్క్‌ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు అమ్మకానికి పెట్టి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత డెలవరీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల ఆధారంగా మొక్కజొన్న కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గోదాముల నుంచి వాటిని తరలిస్తున్నారు. జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది 6,251 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. 6,230 టన్నుల సరుకుకు మార్క్‌ఫెడ్ సంస్థ టెండర్లు పిలిచింది. అంటే 21 టన్నులు మినహా మొత్తం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అమ్మారు. 6,230 టన్నుల్లో 49 టన్నులు మినహా మిగిలిన మొత్తానికి మార్క్‌ఫెడ్ మేనేజర్ కాంట్రాక్టర్లకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే 49 టన్నులకుగాను గోదాముల్లో 9 టన్నులు మాత్రమే ఉన్నాయని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ తనకు సూచించారని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత చెబుతున్నారు. మిగిలిన 40 టన్నుల విషయం అడుగగా కొరత ఏర్పడినట్లు సమాధానం ఇచ్చారన్నారు. అక్రమానికి ఆజ్యం ఇలా... రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదివారం 550 మొక్కజొన్నల బస్తాలలోడుతో లారీ బయలుదేరింది. ఆ లారీ ప్రకాశ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు గోదాం వద్దకు చేరింది. అక్కడ దిగుమతి అయ్యే సమయంలో వ్యవహారం బయటపడింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి అక్కడ అన్లోడ్ చేయవద్దని హమాలీలకు సూచించారు. అక్కడ నుంచి లారీని తరలించారు. లారీ కాల్వొడ్డులోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల ప్రాంతానికి చేరింది. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ ఇలంబరితికి తెలిసింది. ఆయన రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుటాహుటిన అక్కడికి వెళ్లి లారీని పట్టుకున్నారు. అదో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఏపీ20 ఎక్స్-6336 నంబర్ లారీగా గుర్తించారు. ఈ లారీలో ఉన్న మొక్కజొన్నల విలువ సుమారు రూ.3 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేర్‌హౌసింగ్ అధికారే సూత్రధారి.. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు రక్షణ కల్పించి తిరిగి ఆ సంస్థకు అప్పగించాల్సిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారే అక్రమార్గం పట్టించారు. నిల్వ ఉంచిన స్టాక్‌లో సుమారు 40 టన్నులను కొరత పేరుతో లెక్కల్లో చూపించలేదు. వాటిని బయటి వ్యాపారులకు విక్రయించి లక్షల రూపాయలు వెనుకేసుకుందామన్న ఆ అధికారి యత్నం బెడిసికొట్టింది. ఆదివారం సెలవురోజు అని..ఇదే అనుకూల సమయమని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ వ్యవహారంపై సీరియస్ ఉన్న కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనితో సంబంధమున్న స్టేట్‌వేర్ హౌసింగ్ అధికారుల్లో వణుకుపుడుతోంది. మార్క్‌ఫెడ్ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులెత్తేశారు. -
ప్రమాదంలో దంతాలు విరిగాయి... నవ్వాలంటే భయమేస్తోంది!
నా వయసు 30 సంవత్సరాలు. ఇటీవల బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలింది. ముందు పళ్లు విరిగాయి. కొన్ని సగానికి విరిగాయి. రెండు మాత్రం చిగురుదాకా విరిగిపోయాయి. ముఖం మీద గాయాలు మానిపోయాయి. కానీ దంతాలు విరిగినందువల్ల నోరు తెరవాలంటే సిగ్గుగా ఉంటోంది. నాతో మామూలుగా మాట్లాడుతున్న వాళ్లు కూడా నేను నవ్వగానే ముఖం అదోలా పెట్టి చూస్తున్నారు. నా పలువరుసను అందంగా చేయవచ్చా? - పి. సునీత, అమలాపురం సాధారణంగా ప్రమాదం జరిగిన వెంటనే విరిగిన దంతాల పలుకులతోపాటుగా డెంటిస్టును సంప్రదిస్తే చికిత్స సులువుగా పూర్తవుతుంది. కానీ దంతాలు విరిగినంత ప్రమాదం అంటే తప్పనిసరిగా దేహంలో చాలా భాగాలు గాయాల బారిన పడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా ముందుగా ఆ గాయాల చికిత్స మీదనే దృష్టిపెడతారు. ఇది సహజమే. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆధునిక దంతవైద్యంలో ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారాలు ఉన్నాయి. దంతాల కొసలు మాత్రమే విరిగిన సందర్భంలో డాక్టరు కేవలం అరగంట లేదా గంటలో విరిగిన పంటి కొసల్ని కాంపోజిట్ మెటీరియల్ (పంటిరంగు పదార్థం)తో బిల్డప్ చేసేస్తారు. పన్ను సగం విరిగిన సందర్భంలో కూడా తొడుగు వేయడం ద్వారా పంటిని మామూలు షేప్‌లోకి తీసుకురావచ్చు. కృత్రిమ దంతాలను అమర్చుకోవడానికి రోజులు- వారాలు వేచి ఉండాల్సిన పనిలేదు. పంటి ముక్కలను తీసేసిన సిట్టింగ్‌లోనే ఇంప్లాంట్ అనబడే టైటానియం స్క్రూను పంటి వేరు భాగంలోని ఎముకలోకి బిగించుకుని దాని పైన కృత్రిమ దంతాన్ని అమర్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలం వరకు దంతాలకు క్యాప్‌లు వేసినప్పుడు కాని, కృత్రిమదంతాలను అమర్చినప్పుడు కాని అవి మిగిలిన పంటిరంగులో కలిసిపోకుండా చూడగానే పెట్టుడు పళ్లు అని తెలిసిపోతుంటాయి. ఈ సమస్యను కూడా ఆధునిక దంతవైద్యంలో అధిగమించవచ్చు. వందశాతం పక్క పంటిరంగులో కలిసిపోయేలా పంటిక్యాప్లను, కృత్రిమదంతాలను తయారుచేసుకోవచ్చు. అవసరం అయితే ముందు పళ్లు కాబట్టి స్మైల్ డిజైనింగ్ ద్వారా మీ ముఖానికి నప్పినట్లు ఉండేలా కృత్రిమదంతాలు, క్యాప్‌లను తయారు చేసుకుంటే ఎవరూ గుర్తు పట్టలేనంత సహజంగా ఉంటాయి. అత్యాధునిక జర్కోనియం టెక్నాలజీ వాడడం ద్వారా అలర్జీ రావడం, మెటల్ వల్ల చిగుళ్లు నల్లబడడం, మందంగా ఉండడం వంటి సమస్యలు లేకుండా ఎంతో చక్కగా సహజసిద్ధమైన పళ్లలాగానే కనపడతాయి. మీరు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కోల్పోయిన అందమైన పలువరుసను, చక్కటి చిరునవ్వును తిరిగి పొందే అవకాశం ఉంది. మంచి ల్యాబొరేటరీలు, స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోండి. - డాక్టర్ పార్థసారధి, దంతవైద్యనిపుణులు, పార్థ డెంటల్ హాస్పిటల్స్ -
అంగన్వాడీ కార్యకర్తల రాస్తారోకో
గండేడ్ : అంగన్వాడీ కార్యకర్తను గ్రామస్తులు విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహించిన అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం గండేడ్ మండల కేంద్రంలో రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. సుమారు మూడుగంటల పాటు రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు, వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. మండల పరిధిలోని షేక్‌పల్లి అనుబంధ గ్రామమైన మఠంలపల్లిలో అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన చిన్నాయపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండునెలలుగా మఠంలపల్లికి చెందిన సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా తమ గ్రామంలో తానే విధులు నిర్వహిస్తానని, మీరు మా గ్రామానికి రావద్దని కుటుంబీకులతో మంగమ్మను అడ్డుకుంటోంది. దీంతో నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15రోజుల క్రితం నిరసనలు కూడా తెలిపారు. అయినా అధికారుల అండదండలతో సునీత కుటుంబీకులు అంగన్వాడీ కార్యకర్తను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్ర హించిన తాలుకా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సీఐటీయూ అధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు. అందుకు కారణమైన సీడీపీఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 3గంటలు మహబూబ్‌నగర్ చించోళీ అంతరాష్ట్ర లింకుహైవే రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎంతకీ అధికారులు స్పందించకపోవడంతో అప్పుడే బయటి విధులనుండి వచ్చిన మహమ్మదాబాద్ ఎస్ఐ2 వెంకటేశ్వర్‌గౌడ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొన్నది. సీడీపీఓ ఇక్కడికి వచ్చేంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్ఐ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి అంగన్వాడీ కార్యకర్త విధులకు రాకుండా అడ్డుకునే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటయ్య, నాయకులు రాజు, భీమయ్య, వివేక్, వెంకట్రాములు,రవి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, కార్యకర్తలు సత్యమ్మ, వరలక్ష్మి, ముబీన్, బాల్‌రెడ్డి, భీమ య్య, మంగమ్మ, మన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
మా అబ్బాయిని క్షమాపణ అడగాలనుంది...
కోపం చెడ్డదని ఎందుకంటారో తెలుసుకోవాలంటే నా జీవితమే ఉదాహరణ. ఆవేశంలో నేను చేసిన పని వల్ల నేనిప్పుడు చాలా బాధపడుతున్నాను. ఆ రోజు నా కళ్లముందు నుంచి ఎప్పుడూ తొలగిపోదు. మా అబ్బాయి రవీంద్రకు ఓ సంబంధం చూశాం. నేను, మావారు వాళ్లతో మాట్లాడి వచ్చాం. మంచి రోజు చూసుకుని రవిని తీసుకుని వస్తామని చెప్పాం. కానీ ఆ రాత్రి మేం విషయం చెప్పీ చెప్పగానే నో అనేశాడు రవి. దానికి కారణం సునీత. తను మావాడి కొలీగ్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మావాడు తనకి మాట కూడా ఇచ్చేశాడు. ఆ విషయం చెప్పగానే మావారు సెలైంట్‌గా అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయారు. నేను మాత్రం వాడి మీద ఇంతెత్తున లేచాను. ‘పెళ్లి చేసేసుకోలేదు కదమ్మా, ప్రేమించానంతే, మీకు చెప్పకుండా చేసేసుకుంటానా ఏంటి’ అన్నాడు. ఆ అమ్మాయి వివరాలు చెప్పాడు. అవి విన్నాక మరీ మండుకొచ్చింది నాకు. అందుకే పెళ్లికి ఒప్పుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాను. దాంతో వాడు ఏకంగా మాతో బంధమే తెంచుకుని వెళ్లిపోయాడు. సునీతను పెళ్లి చేసుకుని, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. మావారు అది భరించలేక మంచం పట్టారు. ఆయన్ని దక్కించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొడుకు దూరమైపోయాడు. భర్త వదిలి వెళ్లిపోయాడు. దిక్కులేని పక్షిలా మిగిలాను. కొన్నాళ్లకు ఆయన వస్తువులన్నీ సర్దుతుంటే ఓ డైరీ దొరికింది. అందులో ‘‘శారదా... చాలా పెద్ద తప్పు చేశావ్. కొడుకునైనా వదిలేసుకున్నావ్ కానీ ఓ పేదింటి పిల్లని కోడలిగా ఒప్పుకోలేకపోయావ్. మా అమ్మ కూడా నీలానే అనుకుని ఉంటే మన పెళ్లి జరిగేదా? ఆ మాట అని నిన్ను బాధ పెట్టలేను. అలా అని నువ్వు చేసిన పనిని క్షమించనూ లేను.’’ ఆయన అన్నది నిజం. ఒకప్పుడు నేనున్న స్థాయిని మర్చిపోయాను. సునీత పేదరికాన్ని ఎత్తి చూపించి నా కొడుకు మనసును గాయపర్చాను. తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్లి నా కొడుకును క్షమాపణ అడగాలనుంది. నా కోడలిని గుండెలకు హత్తుకోవాలని ఉంది. మీరు ఇది చదివేనాటికి ఆ పని తప్పక చేస్తాను. నా తప్పిదానికి పరిహారం చేసుకుంటాను! - వి.శారద, నల్లజర్ల -
ఆత్మహత్యలపై వీడని సస్పెన్స్
రెండు కుటుంబాల్లో విషాదం పెనుగంచిప్రోలు/మక్కపేట : స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకుని రెండు రోజులు గడుస్తున్నా ఈఘటన వెనుక ఉన్న మిస్టరీ వీడలేదు. వత్సవాయి మం డలం మక్కపేట గ్రామంలో ఆదివారం పురుగు మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామంలోని తుఫాన్ కాలనీలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఆమెను చూ సేందుకు బంధువులు, గ్రామస్తులే కాక, స్నేహితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సునీత సోదరుడు గోపి పూణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోదరి మరణించి న విషయం తెలుసుకుని హుటాహుటిన ఇక్కడకు వ చ్చాడు. ఆమె మృ తదేహం చూసి గుండెలవిసేలా రోదించాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సునీతకు రెండు నెలల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లో ఉంటున్న భర్త, అత్తింటివారు ఇక్కడకు వచ్చారు. సునీత మృతదేహాన్ని చూ సి భోరున విలపించారు. మక్కపేట గ్రామానికి చెం దిన ధారావతు అరుణ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. కుమార్తె మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అరుణ సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సోదరి మరణవార్త విని వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. అరుణ మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు. వీరిద్దరి ఆత్మహత్యలపై కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ, స్నేహితు లు గానీ ఏ విషయం చెప్పలేక పోతున్నారు. పోలీ సులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వం ఉందా?
సాక్షి, కర్నూలు: ‘కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. పది రోజుల్లోనే టమాటా ధర కిలోపై రూ. 30 పెరిగింది. కిలో కొనేవాళ్లం అర కిలోతో సర్దుకు పోవాల్సిన పరిస్థితి. ఏ రకం కూరగాయలు కొందామన్నా కిలో రూ. 30 పైనే ధర పలుకుతోంది. పోయిన వారం టమాటా రూ. 30 ఉంటే ఈవారానికి రూ. 60కు చేరింది. పచ్చిమిర్చి ధర రూ. 20 నుంచి రూ. 40కి పెరిగింది. టమాటా, పచ్చిమిర్చికే రూ. 100 అయిపోతే మిగిలిన వాటిని ఎలా కొనాలి. రూ. 200 తీసుకువస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడేమో రైతుబజార్‌కు రావాలంటే రూ. 500 కావాలి. ప్రభుత్వం ధరలను నియంత్రించాలి’.. అంటూ సీ-క్యాంపులోని రైతు బజార్‌ను పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి సునీతను ప్రజలు నిలదీశారు. బుధవారం మంత్రి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సీ-క్యాంపులో ఉన్న రైతు బజార్‌ను పరిశీలించి అక్కడి రైతులతో కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. మహ్మద్ ఫరూక్ అనే వ్యక్తి దోసకాయలు కొనుగోలు చేస్తుండగా మంత్రి సునీత అతనిని పలకరించి.. వాటి ధర ఎంతుంది? అని అడగ్గా.. ‘రైతుబజార్లో ఇప్పుడు అతి తక్కువ ధరకు లభిస్తున్నది దోసకాయలేనని, ఏది కొనాలన్నా కిలో రూ. 30 పైనే ఉన్నాయని, కిలోల స్థానంలో అరకిలోతో సర్దుకుపోవాల్సి వస్తోంద’ని అతను వాపోయాడు. ప్రభుత్వం ఉందా? లేదో? తెలియడం లేదని.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యలు బతికేదెట్లా? ధరలు నియంత్రించండని మంత్రిని కోరారు. వినియోగదారులకు సరిపడా సరుకులు రైతుబజార్‌కు రావడం లేదని, దీంతో సాయంత్రంలోగా కూరగాయలు ఉండట్లేదని కూరగాయలు కొనేందుకు వచ్చిన ఓ జంట మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామంటూ మంత్రి వారికి సమాధానం చెబుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చివరగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను పరిశీలించి.. ఉల్లి, బియ్యం ధరలను ఎంతకు విక్రయిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలుతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. పరిటాల రవిని అభిమానించే వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర..వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించడంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని ఆ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఏటేటా కూరగాయ పంటల విస్తీర్ణం పెరుగుతోందని, కూరగాయల ధరలలో నిలకడ లేకపోవడంతో రైతులు ఏటా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు మార్కెట్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోవడంతో పంట పండించిన రైతుల కంటే దళారులు అధికంగా ఆర్జిస్తున్నారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. -
చంద్రబాబు ఆదేశాలకు ధిక్కారం!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలను రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు జడ్పిటిసి సభ్యులు ధిక్కరించారు. టీడీపీ జడ్పిటిసి సభ్యులను కాపాడుకోవడంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విఫలమయ్యారు. టిఆర్ఎస్ జరిపిన బేరసారాలు ఫలించాయి. ఆ పార్టీ జడ్పిటిసి సభ్యురాలు, మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి భార్య సునీత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో చావుదెబ్బతిన్న కాంగ్రెస్, టిడిపిలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్నైనా గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. జిల్లాస్థాయి నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కైనట్లు ప్రచారం జరగడంతో నేరుగా రాష్ట్ర స్థాయి నాయకులే రంగంలోకి దిగారు. గులాబీ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. టిడిపి నేతలు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మాటలు కూడా వినలేదు. వారి ఆదేశాలను ధిక్కరించి ఆరుగురు టిడిపి జడ్పిటిసి సభ్యులు టిఆర్ఎస్లో చేరిపోయారు. దాంతో మంత్రి మహేంద్ర రెడ్డి భార్య సునీత గెలిచారు. వైస్ ఛైర్మన్‌గా కుత్బుల్లాపూర్ టిడిపి జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోపాయికారిగా టీఆర్ఎస్కు మద్దతిచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. -
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా సునీత ఎన్నిక
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టిఆర్ఎస్ జడ్పిటిసి సభ్యురాలు మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి భార్య సునీత ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఆమె రెండవ సారి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్మన్‌గా టిడిపి కుత్బుల్లాపూర్ జడ్పిటిసి సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపికైన వెంటనే సునీత చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. తగిన బలం లేకపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో టిఆర్ఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. తగిన వ్యూహంతో ముందుకువెళ్లి జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. కాంగ్రెస్‌లో లుకలుకలు ఆ పార్టీకి బాగా ఉపయోగపడ్డాయి. టీడీపీతో రాయబేరాలు సాగించి సరిపడా సంఖ్యాబలాన్ని సమీకరించడంలో సఫలీకృతమైంది. -
సునీత హత్య కేసులో విజయారెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : అంబర్‌పేట బాపూనగర్‌కు చెందిన సునీత దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... బాపూనగర్‌లో ఉంటున్న కొట్లూరి కృష్ణ, రామంతాపూర్ ప్రశాంతనగర్, సరస్వతి బ్లాక్‌లో ఉంటున్న కల్లు విజయారెడ్డి కలిసి కొన్నేళ్ల క్రితం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేశారు. బీబీనగర్, కొండమడుగులో కూడా వీకే డ్రగ్స్ పేరిట కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీలకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఫైనాన్స్ కంపెనీలో రూ. కోటి, బ్యాంకులో రూ. 3 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ, విజయారెడ్డిల మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని మధ్యవర్తులు, లా బోర్డు ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ కృష్ణపై విజయారెడ్డి కక్ష పెంచుకుంది. తనకు పరిచయమైన పార్ట్‌టైమ్ పోలీసు రైటర్ జగన్నాథనాయుడుతో కలిసి కృష్ణ కూతురు శ్రావణిని చంపాలనుకుంది. అయితే వీలు కాకపోవడంతో గతనెల 16న కృష్ణ భార్య సునీతను జగన్నాథనాయుడు కారులో తాను ఉంటున్న అత్తాపూర్‌కు తీసుకెళ్లి చీరకొంగును మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం సునీత మృతదేమాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. గోనె సంచుల్లో పెట్టి మూసీలో పడేసిన విషయం విదితమే. అయితే కృష్ణ గతనెల 18న తన భార్య కనిపించడం లేదని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు జగన్నాథనాయుడు హత్య చేసినట్లు తెలిసింది. దీనికి ప్రధాన సూత్రధారి విజయారెడ్డి అని కూడా గుర్తించారు. దీంతో పోలీసులు నిన్న జగన్నాథనాయుడు, విజయారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (Woman hacked to death case two accused arrested) -
నాన్నా... అమ్మను చూపించవా?
* హత్య విషయం తెలిసి తల్లడిల్లిన సునీత కుమార్తె *మృతదేహమైనా చూపమంటూ తండ్రికి వేడుకోలు *ఇంకా దొరకని హతురాలి తల, కొన్ని శరీరభాగాలు సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా... అమ్మని ఒక్కసారి చూపించు’... అంటూ తన తల్లి హత్యకు గురైందని తెలిసిన క్షణం నుంచి సునీత పదేళ్ల కుమార్తె గుండెపగలిలేలా రోదిస్తూనే ఉంది. ఇంకా తల లభించని, గుర్తించడానికీ వీలులేని, భయంకర స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆ చిన్నారికి చూపించలేక అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న కృష్ణ పంటి బిగువనే తన బాధను దిగమింగుకుంటున్నారు. ఇది కుటుంబీకులు, బంధువులనే కాదు పరిచయస్తులు కాని వారినీ కూడా కంటతడి పెట్టించింది. మరోపక్క వరుసగా రెండో రోజూ మూసీ నదిలో సునీత మృతదేహం కోసం గాలింపు కొనసాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన 21 ఏళ్లకు పుట్టిన శ్రావణి... అంబర్‌పేట్‌కు చెందిన కృష్ణ, సునీతలకు ఇద్దరు సంతానం. వివాహమైన 22 ఏళ్లకు (కుమారుడు పుట్టిన 11 ఏళ్లకు) జన్మించిన కుమార్తె శ్రావణి (10) అంటే వీరికి ప్రాణం. తండ్రి వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం వివిధ చోట్లకు తిరుగుతూ ఉండటంతో శ్రావణికి తల్లితోనే అనుబంధం ఎక్కువ. గతనెల 16న సునీత అదృశ్యమైనప్పటి నుంచి కంటిమీద కునుకు లేకుండానే గడిపింది. ఎప్పటికైనా తనను అమితంగా ఇష్టపడే తల్లి తిరిగి వస్తుందనే ఆశతో ఉంది. సునీత హత్య విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చినా... గురువారం వరకు కుమారుడు, కుమార్తె శ్రావణికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే బంధువులు రాకతో పాటు పరిస్థితుల్ని గమనించిన శ్రావణి కాస్త అనుమానం వ్యక్తం చేయడంతో తప్పనిసరై కృష్ణ విషయాన్ని బయటపెట్టారు. ఆ క్షణం నుంచి తల్లడిల్లిపోతున్న చిన్నారి ‘మమ్మీని ఒక్కసారి చూపించు డాడీ’ అంటూ విలపిస్తూనే ఉంది. అయితే ఓ పక్క ముక్కలైన మృతదేహం, మరోపక్క హత్య జరిగి 20 రోజులు దాటడంతో కుళ్లిన స్థితిలో ఉన్న అవయవాలు... ఈ రెంటికీ మించి 36 గంటలుగా గాలిస్తున్నా ఇంకా దొరకని తల. ఈ స్థితిలో తల్లి మృతదేహాన్ని చూస్తే శ్రావణి అనుభవించే క్షోభను ఊహిస్తున్న కృష్ణ కుమార్తెను మార్చురీ దగ్గరకు తీసుకువచ్చే సాహసం చేయలేకపోతున్నారు. మూసీలో మాంసం ముద్దలు ఏరుతూ... సునీత మృతదేహాన్ని జగన్నాథనాయుడు ముక్కలుగా చేసి మూసీలో పడేసిన విషయం గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం నుంచి అత్తాపూర్‌లోని మూసీలో కుటుంబీకుల సాయంతో గాలిస్తున్నారు. బుధవారం దొరికిన కొన్ని ముక్కలు మినహా ఎలాంటి ఫలితం కనిపించలేదు. కనీసం హతురాలి తలనైనా వెతికి తీయాలనే ఉద్దేశంతో గురువారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం మూడు సంచుల్లో కొన్ని మాంసం ముద్దలు కనిపించడంతో వాటిని వెంటనే ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరిశీలించిన ఫోరెన్సిక్ వైద్యులు అవి హలీంకు సంబంధించినవని చెప్పడంతో మళ్లీ గాలింపు మొదలెట్టారు. గురువారం చీకటి పడటంతో తాత్కాలికంగా ఆపేసి తిరిగి శుక్రవారం ప్రారంభించాలని నిర్ణయించారు. కర్కశుల అసలు టార్గెట్ చిన్నారే... సునీత హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఏర్పాడిన విభేదాలు, స్పర్థల నేపథ్యంలో కృష్ణపై ఉన్న కక్షతో మాజీ వ్యాపార భాగస్వామి, జగన్నాథనాయుడు అతడిని మానసికంగా కుంగదీసి, కోలుకోలేని దెబ్బతీయాలని భావించారు. దీనికోసం ఆ కుటుంబం అల్లారుముద్దుగా చూసుకునే శ్రావణిని టార్గెట్‌గా చేసుకున్నారు. జూన్ 15 వరకు చిన్నారిని అపహరించి, హతమార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆఖరి నిమిషంలో సునీతను టార్గెట్‌గా చేసుకుని జూన్ 16న పథకాన్ని అమలు చేశారు. సునీతను అత్తాపూర్‌లోని జగన్నాథనాయుడికి చెందిన కార్యాలయానికి తీసుకువెళ్లి ఆమె చీరతోనే ఉరిబిగించి చంపేశారు. ఆపై విషయాన్ని మాజీ వ్యాపార భాగస్వామికి తెలిపి, అక్కడకు రప్పించి చూపించారు. తర్వాత ఐదు గన్నీ బ్యాగ్స్‌లు కొనితెచ్చారు. మృతదేహాన్ని ముక్కలు చేసి.. బ్యాగుల్లో పెట్టి మూసీలో పడేశారని వెలుగులోకి వచ్చింది. -
‘సెటిల్’ చేసుకొని విడిపోయినా ఆమె పగ చల్లారలేదు
*వివాహిత దారుణ హత్య *భర్త వ్యాపార భాగస్వామే సూత్రధారి *నిందితులలో పోలీసు కాంట్రాక్ట్ ఉద్యోగి *అంబర్పేట్ పోలీసుల తీరుపై విమర్శలు సాక్షి, హైదరాబాద్: వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం భాగస్వాముల మధ్య స్పర్థలకు దారి తీసింది. ఫలితంగా ఇద్దరూ ‘సెటిల్’ చేసుకొని విడిపోయారు. అయినా అతనిపై ఆమెకు ద్వేషం తగ్గలేదు. పగ చల్లారలేదు.దీంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలసిపోయింది. ఒక ఠాణా అధికారుల నిర్లక్ష్యం కుట్రకు దారి తీయగా... మరో పోలీస్ స్టేషన్ అధికారుల అలసత్వం పదేళ్ల బిడ్డకు కన్నతల్లిని దూరం చేసింది. ఇవీ బుధవారం అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.113 వద్ద మూసీ నదిలో ముక్కలుగా లభించిన సునీత హత్య వెనుక ఉన్న కఠోర వాస్తవాలు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని, వారికి ఎదురయ్యే సమస్యలపై తక్షణం స్పందిస్తామని చెప్పుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు సునీత కేసులో సిబ్బంది చూపిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. అసలేమైందంటే... అంబర్పేట్ ప్రాంతానికి చెందిన కృష్ణ, అదే ప్రాం తంలో నివసించే ఓ మహిళ, మరికొందరు కలిసి కొన్నేళ్ల క్రితం సనత్‌నగర్ ప్రాంతంలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించారు. ఇందులో కృష్ణ భార్య సునీత (44)తో పాటు మరికొందరూ డెరైక్టర్లుగా ఉన్నారు. సంస్థకు సంబంధించిన వివాదాలపై కంపెనీ లా బోర్డ్‌తో పాటు ఇతర చోట్లా భాగస్వాములపై కృష్ణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కక్షకట్టిన భాగస్వామ్య మహిళ తనకు మాజీ హోం మంత్రి సహా మరికొందరితో దగ్గరి బంధుత్వం ఉందని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న లావాదేవీలు సెటిల్ చేసుకున్న కృష్ణ కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అయినప్పటికీ తనపై వ్యాజ్యాలు దాఖలు చేశాడని ఆ మహిళ కృష్ణపై కక్ష పెంచుకుంది. తనకు పరిచయస్తుడైన జగన్నాథనాయుడిని రంగంలోకి దింపింది. ఆయన వివిధ ఠాణాల్లో పార్ట్‌టైమ్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతడి సహకారంతో కృష్ణ మాజీ భాగస్వామి ఈ ఏడాది మార్చి 14న సనత్‌నగర్ ఠాణాకు చెందిన ఓ ఎస్సైతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లనూ రంగంలోకి దింపింది. ఆ రోజు కృష్ణ ఇంటికి వెళ్లిన బృందం మూసాపేట్లో జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపిస్తూ సనత్‌నగర్ ఠాణాకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జగన్నాథనాయుడు కల్పించుకుంటూ మాజీ భాగస్వామి అయిన మహిళతో ఎందుకు స్పర్థలు పెంచుకున్నావంటూ కృష్ణను బెదిరించాడు. కొన్ని తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో కృష్ణను వదిలేశారు. దారుణంగా చంపేసి, ముక్కలుగా నరికేసి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కృష్ణ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇంతలో బీహార్‌లోని పాట్నాలో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ఇక్కడే వదిలి, అక్కడికి వెళ్లిపోయారు. అదే సమయంలో జగన్నాథనాయుడు సహా మరికొందరు కృష్ణపై కక్ష తీర్చుకునేందుకు ఆయన భార్యకు హాని చేయాలని పథకం వేశారు. ఇదిలా ఉండగా... ఈ ఏడాది మార్చి 10న సైబరాబాద్ పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడితో పాటు అతడి సెల్‌ఫోన్‌నూ సనత్‌నగర్ ఠాణాలో అప్పగించారు. రైటర్‌గా పని చేస్తున్న జగన్నాథనాయుడుఆ సెల్‌ఫోన్‌లోని సిమ్‌ను చేజిక్కించుకుని దాని ద్వారానే తన కుట్రను అమలు చేశాడు. సనత్‌నగర్ ఠాణా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సిమ్‌కార్డును దొరకబుచ్చుకున్నాడు. దాని ద్వారా ఏప్రిల్ 23 నుంచి సునీతతో సంప్రదింపులు జరుపుతూ ఆమెకు ఉచ్చు బిగించారు. గత నెల 16న మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు రప్పించిన జగన్నాథనాయుడు బృందం ఆమెను కిడ్నాప్ చేశారు. తాను దూరంగా వెళ్లిపోతున్నానంటూ ఆమె సెల్‌ఫోన్ నుంచి భర్తతో పాటు మరికొందరికి ఎస్సెమ్మెస్‌లు పెట్టి ఫోన్‌ను అంబర్‌పేట్‌లోనే పడేశాడు. నేరుగా అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.113 వద్దకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికేశారు. మృతదేహం ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో గోనె సంచుల్లో పెట్టి మూసీ నదిలో పడేశారు. తన భార్య సెల్ నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్ చూసి కంగారుపడిన కృష్ణ అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. బాధ్యత మరిచి హేళన చేసిన ఖాకీలు... ఓ పక్క తన భార్య కనిపించ డం లేదని ఆందోళనలో ఉన్న కృష్ణకు అంబర్పేట్ పోలీసుల నుంచి సహకారం లభించకపోగా, సూటిపోటి మాటలు, హేళనలు ఎదురయ్యాయి. పరిస్థితిని గమనించిన కృష్ణ అతి కష్టం మీద సనత్‌నగర్ ఠాణా నుంచి గల్లంతైన సిమ్‌కార్డు ద్వారానే తన భార్యతో దుండగులు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అంబర్పేట్ పోలీసులకు తెలిపి, ఓ ఎస్సైతో కలిసి సనత్‌నగర్ ఠాణాకు వెళ్లి దీన్ని నిర్ధారించుకున్నారు. అయినా సరైన స్పందన లేకపోయింది. సనత్‌నగర్ ఠాణా సైబరాబాద్ పరిధిలోకి వస్తుందని తెలుసుకున్న ఆయన శుక్రవారం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కేసును మానవతా దృక్పథంతో పరిశీలించిన ఆయన పరిధుల విషయం పక్కనపెట్టి తక్షణం స్పందించారు. తమ సిబ్బందినే రంగంలోకి దింపి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. ఈలోగా అంబర్పేట్ అధికారులూ కదిలారు. జగన్నాథనాయుడిని అనుమానించి బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా... నేరం అంగీకరించాడు. అత్తాపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చిన అధికారులు మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా దొరకలేదు. చివరకు జగన్నాథనాయుడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి వెతకగా... సునీత తల, మరికొన్ని భాగాల మినహా మృతదేహం దొరికింది. మృతదేహంలోని మిగిలిన ముక్కల కోసం గాలిస్తున్న పోలీసులు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.అంతవరకూ బాగానే ఉంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని అందరూ చర్చించుకుంటున్నారు. -
ఫకీరేం కాదు కోటీశ్వరుడే
తాను ఫకీర్‌నని... తన జేబులో రూ. 500 మాత్రమే ఉంటాయని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోటీశ్వరుడని ఆయనే పరోక్షంగా ఒప్పుకున్నారు. తన పేరిట ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో రూ.4 లక్షల నగదు, భార్య సునీత వద్ద రూ. 17 లక్షలకుపైగ చరాస్తి కలిగి ఉన్నట్లు ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే రూ.90 లక్షలు విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న స్థిరాస్తి విలువ రూ.కోటికి పైగా ఉంటుందని చెప్పారు. ఇదంతా ఆయన ఎక్కడ నోటి ద్వారా ప్రకటించలేదు. వారణాసి నుంచి ఆప్ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దూకిన కేజ్రీవాల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో తన నామినేషన్ పత్రాలతోపాటు తనకు, తన కుటుంబసభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వారణాసి నుంచి బీజేపీ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన మోడీ లాగా హెలికాప్టర్లో తాను తిరగలేనని.... నామినేషన్ వేసేందుకు డొక్కు జీపులో వెళ్లానని బుధవారం వారణాసిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పోలీసుల అదుపులో మహిళా దొంగలు
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళపై తోటి మహిళలే మీదపడి బంగారం చైన్ తస్కరించారు. మెడలో నుంచి చైన్ దొంగలించినట్లు గమనించిన ఆ మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. దీంతో ఓ కానిస్టేబుల్ వెంటపడి దొంగను పట్టుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని చంద్రనగర్‌కు చెందిన అంబట్ల సునీతతోపాటు మరొకరు సోమవారం ఉదయం ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆటోలో వచ్చారు. అదే ఆటోలో తమిళనాడుకు చెందిన నలుగురు మహిళలు ఎక్కారు. ఆటో ఖలీల్‌వాడికి వచ్చేంతలోపు ఈ ముఠా మూడుసార్లు సునీతపై పడినట్లు నటించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ కత్తిరించారు. చైన్ ఆటోలోనే కిందపడిపోయింది. దాన్ని ముఠాలోని ఓ మహిళ తీసుకుంది. సునీత మెడలో చైన్ లేక పోవటాన్ని గమనించిన సహచర మహిళ ఆమెకు చెప్పింది. దీంతో సునీత ఆటోలో ఉన్న మహిళలతో మీరే నా చైన్ దొంగలించారంటూ కేకలు పెట్టింది. కంగారు పడిన ముఠా సభ్యులు చైన్‌ను కింద పారేసి తలోదిక్కుకు పారిపోతుండగా అక్కడి కళాశాల వద్ద పరీక్ష బందోబస్తు నిర్వహిస్తున కానిస్టేబుల్ హైమద్ వారి వెంటపడి ఒకరిని పట్టుకున్నాడు. మిగతా ముగ్గురుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురి ముఠా సభ్యులను ఒకటోటౌన్ కు తరలించారు. వీరి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
శేఖర్ కమ్ముల సినిమాలో యాక్టింగ్!
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, వ్యాఖ్యాతగా.. ఇలా అడుగుపెట్టిన ప్రతి శాఖలోనూ ప్రజ్ఞ కనపరిచిన సునీత... త్వరలో నటిగా కూడా వెండితెరపై కనిపించబోతున్నారు. గానం, అనువాద కళ, వ్యాఖ్యానం ఈ మూడూ నటనతో కూడుకున్నవే. ఆ ప్రకారంగా చూస్తే.. సునీతకు నటన కొత్తేం కాదు. అందుకని సునీత చేస్తున్నది పూర్తి స్థాయి పాత్ర అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌లో సునీత నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల లాంటి మంచి దర్శకుని చిత్రం ద్వారా నటిగా సునీత తొలి అడుగు వేయనుండటం నిజంగా అదృష్టమే. ఎందుకంటే ఆయన పరిచయం చేసిన చాలామంది యాక్టర్స్ ఈ రోజున స్టార్స్‌గా వెలుగుతున్నారు. మరి.. సునీత అదృష్టం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ రోజు నుంచే (సోమవారం) సునీతపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు శేఖర్ కమ్ముల. -
శిశు విక్రయంపై తొలి కేసు
సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు శిశు విక్రయాలపై తొలి కేసు నమోదైంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు మధ్యవర్తిత్వం నెరిపిన దళారులపై శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ పరిధిలోని తౌర్యతండాకు చెందిన పతలోత్ బన్య, సునీత దంపతులకు 2013 నవంబర్ 23న మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. తొలి రెండు కాన్పుల్లో ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో కాన్పులోనైనా మగ శిశువు పుడుతుందని ఆశించారు. కానీ మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో వారు ఆ శిశువును విక్రయించాలనుకున్నారు. ఈ వ్యవహారంలో శిశువు రెండుసార్లు చేతులు మారింది. తాళ్లపల్లితండాకు చెందిన కంసి, లాలూ దంపతులు 2013 డిసెంబర్ 4న తౌర్యతండాకు వెళ్లి బన్య దంపతులకు రూ.2 వేలు చెల్లించి 10 రోజుల వయస్సు గల శిశువును తీసుకెళ్లారు.ఈ దంపతులు ఆ శిశువును సంగారెడ్డికి చెందిన విష్ణువర్ధన్ గౌడ్, ఉమాదేవి దంపతులకు అప్పగించారు. వారి నుంచి సంగారెడ్డికి చెందిన ఏటీ శేఖర్, నాగరత్నం దంపతులు శిశువును కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో విష్ణువర్ధన్ గౌడ్ దంపతులు కీలక పాత్ర పోషించినట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విచారణలో తేలింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ ఫిర్యాదు మేరకు విష్ణువర్దన్ గౌడ్ దంపతులను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొత్తం 8 మందిపై శివ్వంపేట పోలీసులు 2013 డిసెంబర్ 27న ఐపీసీ సెక్షన్ 317 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. 12 ఏళ్ల వయస్సున్న శిశువులను వదిలించుకోవడం/ అమ్మివేయడం లాంటి ఆరోపణలపై ఈ సెక్షన్ వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక శిశు విక్రయాల రాకెట్ హస్తం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నా.. అలాంటిదేం లేదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిందితులను గతంలోనే అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు
సాక్షి, సిటీబ్యూరో: ఇద్దరికి మించి సంతానం కేసులో జీహెచ్ఎంసీలోని మరో కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడింది. అడిక్‌మెట్ కార్పొరేటర్‌గా ఎన్నికైన సి.సునీత (కాంగ్రెస్) ఇద్దరికి మించి సంతానం కలిగి ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అదే డివిజన్ నుంచి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీ చేసిన ఎస్.సుకన్య ఫిర్యాదుపై విచారణ జరిపిన సిటీ సివిల్‌కోర్టు.. కార్పొరేటర్‌గా సునీత అనర్హురాలంటూ తీర్పునిచ్చినట్లు సుకన్య పేర్కొన్నారు. కోర్టు తీర్పు మేరకు.. సునీతను అనర్హురాలిగా ప్రకటించాలంటూ గురువారం మేయర్, ఎన్నికల అధికారి, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు విజ్ఞాపనపత్రాలు అందజేశారు. అధిక సంతానం కేసులోనే గతంలో ఇద్దరు కార్పొరేటర్లపై అనర్హత వేటు పడటంతో పాటు ఆయా డివిజన్లకు కొత్త కార్పొరేటర్లు రావడం తెలిసిందే. లంగర్‌హౌస్ కార్పొరేటర్ రవియాదవ్ (ఎంఐఎం)పై అనర్హత వేటు పడగా, ఆ డివిజన్ ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన ఉదయ్‌కుమార్(బీజేపీ)ను కార్పొరేటర్‌గా పరిగణించాలంటూ కోర్టు తీర్పునివ్వడంతో, ఆయనను నియమించారు. బోరబండ కార్పొరేటర్ వనజ (కాంగ్రెస్)ను అనర్హురాలిగా ప్రకటించిన కోర్డు రెండో స్థానంలో నిలిచిన భానుమతి(ఎంఐఎం)ని కార్పొరేటర్‌గా నియమించేందుకు ఎలాంటి ఆదేశాలి వ్వక పోవడంతో.. ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించగా, భానుమతే గెలిచారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన సుకన్య, ఆమె భర్త శ్రీనివాస్ వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం పార్టీలో చేరారు. కొద్దికాలం క్రితం శ్రీనివాస్ మృతి చెందారు. జీహెచ్ఎంసీలోని ప్రస్తుత పాల క మండలిలోనే ముగ్గురు కార్పొరేటర్లపై అనర్హత వేటు పడడం విశేషం. -
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు. -
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు.