చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న శ్రీనివాస్, సునిత దంపతులు చిట్టీల పేరుతో అమాయకుల నుంచి సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి శ్రీనివాస్ దంపతులు పత్తాలేకుండా పోవడంతో.. బాధితులు సోమవారం మలక్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు.