Chit Funds
-
రామోజీ రావు ఎదుగుదల ఆ ఒక్క అడుగుతో మొదలైంది
-
చిట్ ఫండ్ మోసాలకు కళ్లెం
-
’మార్గదర్శి’పై పోలీసుల అప్పీళ్లను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీరాల, విశాఖపట్నం, సీతంపేట బ్రాంచీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తాము మార్గదర్శి చిట్ గ్రూపుల్లో చందాదారు కాకపోయినప్పటికీ, తమ సంతకాలను ఫోర్జరీ చేసి చందాదారులుగా చూపారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని, ఇలా చేసినందుకు మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు చందాదారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అలాగే చీటీ పాట పాడుకున్నా తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ మరో చందాదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. చీరాల, విశాఖపట్నం, విశాఖలోని సీతంపేట బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేరానికి సంబంధించినదని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ బ్రాంచీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ బ్యాంకులకు నోటీసులిచ్చారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల నోటీసులను సవాలు చేస్తూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పోలీసులు జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం విచారణ జరిపింది. -
ఫైనాన్స్, చిట్‌ఫండ్ సంస్థలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా.. ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్‌ఫండ్స్‌లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్‌ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్‌పేట్‌లోని సన్‌షైన్ అపార్ట్మెంట్లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్‌డిస్‌్కలు, పలు ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్‌ఫండ్, ఈ–కామ్ చిట్‌ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్‌లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
రామోజీ చట్టాలకు అతీతుడా?
సాక్షి, అమరావతి/ గాందీనగర్ (విజయవాడ): కేంద్ర చిట్‌ఫండ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈనాడు రామోజీరావుకు రాజ్యాంగం వర్తించదా? ఆయన చట్టాలకు అతీతుడా అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ‘చిట్‌ఫండ్స్ సంస్థలు, ఆర్థిక సంస్థల మోసాలు – నివారణ చర్యలు’ అనే అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో కొమ్మినేని శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్రాల్లో చిట్‌ఫండ్స్ సంస్థల మోసాలపై దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నించారు. కేంద్ర చట్టాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు వర్తించవా అని సామాన్యులకు సందేహం కలుగుతుండటం న్యాయ వ్యవస్థకు కూడా అపప్రదను తెస్తుందని అన్నారు. రామోజీరావు తప్పు చేయలేదని భావిస్తే సీఐడీ దర్యాప్తునకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని నిశితంగా పరిశీలించి అడ్డుకట్ట వేయాలని కోరారు. ♦ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ విచారణకు రామోజీరావు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీరావు ఈనాడు పత్రికను కవచంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సహకార వ్యవస్థను కుట్రపూరితంగా దెబ్బతీశారని శారదాంబ మహిళా సహకార బ్యాంకు మాజీ చైర్పర్సన్ శిష్టా ధనలక్ష్మి చెప్పారు. ఆర్బీఐ ఆడిటింగ్ నిర్వహించే పటిష్ట వ్యవస్థ కలిగిన సహకార బ్యాంకులపై ఈనాడు పత్రిక ద్వారా దు్రష్పచారం చేయించారన్నారు. ♦ ప్రముఖ ఆడిటర్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తోందని విమర్శించారు. చట్టాల అమలుకు అథారిటీ పోలీసు శాఖే అని, ఆ శాఖ ఆధ్వర్యంలోని సీఐడీ దర్యాప్తు చేయకూడదని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మేధావులు ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. కృష్ణా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సైకం భాస్కరరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేంద్రంగా నల్లధనం భారీగా చలామణి చేస్తున్నారని విమర్శించారు. నగదులోనే లావాదేవీలు నిర్వహిస్తూ ఆ పూర్తి మొత్తానికి కూడా రశీదులు ఇవ్వరని చెప్పారు. ♦ న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్గదర్శి తరహాలోనే విజయవాడలో 15 ఏళ్ల క్రితం అక్రమాలకు పాల్పడిన సిరి గోల్డ్ వంటి సంస్థలను మూసివేయించారన్నారు. అంతకంటే భారీ మోసాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో కనీ్వనర్ ఎం.కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు, ఆడిటర్లు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిబంధనలను అనుసరించి సోదాలు చేయొచ్చు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అన్ని శాఖల్లో సోదాలు చేయవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం చిట్ పుస్తకాలు, రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందని తెలిపింది. అలాగే ప్రభుత్వం నియమించే అధీకృత అధికారి కూడా పని వేళలు లేదా పని దినాల్లో నోటీసు ఇచ్చి లేదా నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేయవచ్చని చెప్పింది. మార్గదర్శి రోజూవారీ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సోదాలు చేయొచ్చని, ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలిపింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా తప్ప, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి సోదాలు నిర్వహించడానికి వీల్లేదంది. సీఐడీ లేదా ఇతర అధి కారులు సోదాల పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యా పార కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదని చెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ కొందరికి ఆథరైజేషన్ ఇవ్వడం చిట్స్ ఇన్స్పెక్టర్ల నియామకం కిందకు రాదని పేర్కొంది. అలాంటి ఆథరైజేషన్ అనుమతించదగ్గదా కాదా అన్న విషయాన్ని లోతుగా విచారిస్తామంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థకు చెందిన అన్ని శాఖల్లో చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోదాల నిమిత్తం జారీ చేసిన ప్రొసీ డింగ్స్‌ను స్టే చేయడంతో పాటు తమ సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య రెండు రోజుల క్రితం మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ వాదనలు విని తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. బుధవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖల్లో సోదాలను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే చట్ట ప్రకారం సోదాలు చేసేందుకు అనుమతినిచ్చారు. -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్‌ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్‌లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్‌తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్‌లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు (ఫోర్‌మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్‌షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్‌సైట్‌ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వెబ్‌సైట్‌ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్‌కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్‌సైట్‌పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్‌సైట్‌ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడ్డ జగజ్జనని చిట్స్
-
చిట్టి డబ్బులడిగితే.. కోరిక తీర్చమని వేధింపులు
సాక్షి, మెదక్ మున్సిపాలిటీ: చిట్టీల వ్యాపారం నిర్వహించే ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు తనకు ఇవ్వాల్సిన చిట్టీ డబ్బులు అడుగుతుంటే కోరిక తీరిస్తేనే ఆ సొమ్ములు ఇస్తానని వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఉత్తరాలు రాసింది. మెదక్ పట్టణంలో కలకలం రేపిన ఈ లేఖల వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ‘తండ్రి మద్యానికి బానిసగా మారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నా పెళ్లికోసమని జీతంలో నుంచి కొంత పొదుపు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర రూ.2 లక్షలకు చిట్టీ వేశాను. 26 నెలల చిట్టీ గడువు తీరి చాలా కాలమైంది. ఇటీవల పెళ్లి కుదరడంతో డబ్బులు అడిగితే మీ నాన్న కు ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. ఈ మధ్యన ఒంటరిగా కలిసినప్పుడు ఎలాగూ వచ్చేనెల పెళ్లి కాబట్టి, ఓ నాలుగు రోజులు నా దగ్గర గడుపు.. అలా అయితేనే నీ డబ్బులు నీకిస్తా’ అని వేధిస్తున్నాడు.. లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లి కొడుకు వాళ్లతో చెబుతాను.. మీ నాన్నకు ఓ పది వేలిస్తే అతను కూడా అదే చెప్తాడు.. అప్పుడు పరువుపోతుంది.. పైసలు పోతాయి.., పెళ్లి క్యాన్సిల్ అవుతుంది’ అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి ఆ లేఖల్లో పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక) -
నవీన మోసాలపై అప్రమత్తం
సాక్షి, అమరావతి: నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు, ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారం మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సూచించారు. బుధవారం సచివాలయంలో జరిగిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ రాష్ట్రస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రావత్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకూ ఆన్లైన్, నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, డిజిటల్ లెండింగ్ కంపెనీల మోసాలు అధికమవుతున్నాయని అన్నారు. అలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీలు సకాలంలో కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన మోసాలపై వారికి పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని సూచించారు. అనేక రకాల కొత్త యాప్‌లు పుట్టుకొచ్చి ఆర్థికపరమైన మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరిట పెద్దఎత్తున ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోకుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈవి ధమైన మోసాలను నియంత్రించేందుకు వివిధ కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల మాట్లాడుతూ..వివిధ ఆర్థిక పరమైన మోసాలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలు, నకిలీ కంపెనీల మోసాలపై చర్చించి నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత బాడీ ఎస్ఎల్సీసీ ఉందని పేర్కొన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ బాడీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే త్రైమాసిక సమావేశాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించేలా చూడాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వై.జయకుమార్ అజెండా అంశాలను వివరాలను సమావేశంలో చర్చకు పెట్టారు. వివిధ చిట్ ఫండ్ కంపెనీలు అగ్రిగోల్డ్, అక్షయ గోల్డు, హీరా గ్రూప్ తదితర మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వివిధ లోన్ యాప్‌ల ద్వారా వేధింపుల ఫిర్యాదులు, ముద్రా అగ్రికల్చర్–స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ, వర్థన్ బ్యాంకు స్కాం తదితర సంస్థలపై మోసాలు ఇప్పటి వరకు నమోదైన కేసుల ప్రగతి తదితర అంశాలను సమీక్షించారు. అదే విధంగా బానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ (బడ్స్)చట్టం 2019పై చర్చించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, న్యాయశాఖ కార్యదర్శి సునీత, రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ బాబు ఏ, సీఐడీ డిఐజీ సునీల్ కుమార్‌నాయక్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
చిట్టీలపేరుతో భారీ కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్‌లో చిట్టీలపేరుతో రూ.కోటి యాభై లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. వివరాలు.. ఈసీఐఎల్ చౌరస్తాలోని త్రిపుర చిట్ ఫండ్స్ పేరుతో సురేష్ బాల, పీవీ కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తులు 30 మంది వద్ద చిట్టీలు వేయించుకున్నారు. చిట్టీలు ఎత్తి డబ్బులు ఇవ్వమంటే చాలా రోజులుగా రేపు మాపని తప్పించుకుని తిరుగుతున్నారు. పది రోజుల నుంచి కార్యాలయానికి తాళం వేసి కనిపించకుండా పోవడంతో కుషాయిగూడ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడ్డి విరుస్తున్న వడ్డీ!
జిల్లాలో అనధికార చిట్‌ఫండ్స్, ఫైనాన్సులు మోసపోతున్న అమాయకులు చిట్టీల నెల టర్నోవర్ రూ.120 కోట్లపైనే రూ.30 కోట్లపైనే వడ్డీ వ్యాపారం ప్రభుత్వ ఆదాయానికి గండి జిల్లాలో చిట్టీల నిర్వహణ పేరిట మోసం జరుగుతోంది. రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్‌లో ఉన్న కఠిన నిబంధనలకు భయపడుతూ అనధికారిక ‘చిట్స్’పై ఆధారపడుతున్న ప్రజలు నట్టేట మునుగుతున్నారు. ముందు చూపుతో చిట్టీవేస్తే గడువు ముగిసేలోపే నిర్వాహకులు పరారవుతున్నారు. అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వారు నిఘా పెట్టకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది. జిల్లాలో 20కి మించి చిట్‌ఫండ్స్‌కు ప్రభుత్వ అనుమతి లేదు.. అయినా సుమారు వందకుపైనే చిట్‌ఫండ్స్ కొనసాగుతున్నాయి. ప్రతి నెల రూ. 120 కోట్లకు పైనే టర్నోవర్ ఉంది. ఇందులో రూ.80 కోట్లకు పైగానే జీరో లావాదేవీలు సాగుతున్నట్లు అంచనా. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న చిట్టీలతో ప్రభుత్వానికి పన్నురూపంలో రావాల్సిన కోట్ల రుపాయలు రాకుండా పోతున్నాయి. చిట్టీల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఎక్కడా అమలు కావడంలేదు. జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో అనధికారికంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారు గడువు ముగిసేలోపే పరారవుతున్నారు. మూడు నెలల క్రితం.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిట్‌ఫండ్ నిర్వాహకుడు రూ. 2 కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించాడు. పదిరోజుల పాటు అతని ఇంటి చుట్టూ తిరిగిన బాధితులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు చిట్టీ నిర్వాహకుడిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇంత వరకు ఆ అక్రమార్కుడి ఆచూకీ లేదు. రెండు నెలల క్రితం.. మెట్‌పల్లిలోనూ ఓ ఉపాధ్యాయుడు రూ.2.50 కోట్ల చిట్టీ డబ్బులతో ఉడాయించాడు. అడ్డగోలు వడ్డీ.. అవసరానికి అప్పుచేస్తే.. వడ్డీ వ్యాపారులు రుణగ్రహితులను అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం వడ్డీ వ్యాపారం ఓ పరిశ్రమగా తయారైంది. ద్విచక్ర వాహనం, బంగారం, ఇళ్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి పట్టా, చెక్కు బుక్కులు, ఉద్యోగులైతే వారి బ్యాంకు ఏటీఎంలను తమ వద్ద కుదువ పెట్టుకొని 5 నుంచి 20 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పుల పాలై.. వడ్డీ వ్యాపారుల చేతిలో నరకయాతన అనుభవిస్తున్న వాళ్ల సంఖ్యా జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే ఉంది. ముఖ్యంగా రైతులు వడ్డీ వ్యాపారుల దోపిడీకి బలవుతున్నారు. పంట కోసం బ్యాంకు రుణం తీసుకోవాలంటే.. అప్పటి వరకు తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించిన వారంలోపే బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేస్తాయి. వాటిని రెన్యూవల్ చేసుకోవాలంటే.. పాత బకాయిలు చెల్లించక తప్పదు. దీంతో వారంలోగా రుణం మంజూరవుతుందనే ఆశతో రైతులు స్థానికంగా తమకు తెలిసిన వడ్డీ వ్యాపారుల నుంచి ఫైనాన్స్ తీసుకుంటారు. వడ్డీ వ్యాపారులు రైతుల పాస్ పుస్తకాలు తమ వద్ద పెట్టుకుని 10 శాతం వడ్డీతో రుణాలు ఇస్తారు. ఇలా జిల్లాలో రూ. 30 కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. మరోవైపు రుణం మంజూరు కాక.. వడ్డీలు చెల్లించలేక సతమతమవుతోన్న రైతులు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి.. ఫైనాన్స్ నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. తాము నిర్వహిస్తున్న ఫైనాన్స్ పేరిట జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిష్ట్రేషన్ చేయించుకోవాలి. అదే పేరున పాన్, టాన్ కార్డు తీసుకోవాలి. రిజిష్ట్రేషన్, పాన్, ట్యాన్లతో బ్యాంకులో సంస్థ పేరున ఖాతా ప్రారంభించాలి. వీటితో పాటు మండల తహసీల్దార్‌తో ఏటా మనీ లెండింగ్ లైసెన్స్ సర్టిఫికెటు తీసుకోవాలి. ఏటా మున్సిపాలిటీకి కార్మిక శాఖ కార్యాలయంలో కూడా పన్ను ప్రతి చెల్లించాలి. ఏడాదికోసారి చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ద్వారా ఆడిటింగ్ చేయించి ఆదాయపు పన్ను శాఖకు తాము చేసిన వ్యాపారంపై పన్ను చెల్లించాలి. తప్పనిసరిగా పాన్ కార్డుతో పాటు ఆదాయపు పన్ను దాఖలు చేయాలి. ఈ నిబంధనలు పాటిస్తోన్న ఫైనాన్స్ నిర్వాహకులు జిల్లాలో బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు. పెద్ద పెద్ద కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని అందర్ని ఆకర్శితుల్ని చేస్తూ అక్రమంగా కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తున్న వడ్డీ వ్యాపారులు ఎంతో మంది ఉన్నారు. మరోపక్క.. గుట్టుచప్పుడు కాకుండా ఎలాంటి కార్యాలయం లేకుండానే అవసరమున్న వారికి అప్పులు ఇస్తూ వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులు ఎంతో మంది ఉన్నారు. -
చిట్టీల పేరుతో మోసం
-వ్యక్తి అరెస్ట్ తాడేపల్లిగూడెం: చిట్టీల పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బయ్య రంగారావు చిట్టీ వ్యాపారం చేస్తున్నాడు. తనకు తెలిసిన వారి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ. 12 లక్షల వరకు వసూలు చేసి చివరకు మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల నగదును రికవరి చేశారు. -
చిట్టీల పేరుతో మరో మోసం
చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన దంపతులు సుమారు కోటి రూపాయలతో ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న శ్రీనివాస్, సునిత దంపతులు చిట్టీల పేరుతో అమాయకుల నుంచి సుమారు రూ. కోటి వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి శ్రీనివాస్ దంపతులు పత్తాలేకుండా పోవడంతో.. బాధితులు సోమవారం మలక్‌పేట్ పోలీసులను ఆశ్రయించారు. -
చిట్టీల వ్యాపారి భారీ మోసం
-
ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు...
ముంబై: ప్రవాస భారతీయులు చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ నాన్-రిపాట్రియేషన్(వీటిని విదేశీ కరెన్సీలోకి మార్చడానికి వీలుండదు) ప్రాతిపదికన ఉండాలని పేర్కొంది. ఫలితంగా దేశంలోకి మరింతగా నిధులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ చిట్‌ఫండ్స్‌కు చందా చెల్లింపుల సాధారణ బ్యాంకింగ్ మార్గాల్లో చేయాలని పేర్కొంది. ఇక్కడి ఏ బ్యాంక్ శాఖ నుంచైనా ఈ చందా చెల్లింపులు చేయవచ్చని వివరించింది. ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిబంధనలను మార్చామని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
చిట్ ఫండ్స్
-
చిట్‌ఫండ్స్ OUT OF SERVICE
-
చిట్ ఫండ్ మోసాలపై ఫోరం
ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపిం ది.ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు.