సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్ కాలనీ/శంషాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ఫైనాన్స్, చిట్‌ఫండ్, ఈ–కామర్స్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ మెరుపు దాడులు చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని 24 చోట్ల ఏకకాలంలో 100 బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకల ఆరోపణలపై సోదాలు కొనసాగినట్లు సమాచారం. హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్‌కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడి ఇల్లు, ఆఫీసులు, కూకట్‌పల్లి హిందూ ఫారŠూచ్యన్ విల్లాలోని అరికపూడి కోటేశ్వరరావు, రైల్వే కాంట్రాక్టర్ వరప్రసాద్ ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే మాగంటి బంధువులు, స్నేహితుల వ్యాపారాలు లక్ష్యంగానే సోదాలు జరిగినట్లు ప్రచారం సాగింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది.
పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసంపై ఆరా..
ఎల్లారెడ్డిగూడలోని పూజకృష్ణ చిట్‌ఫండ్స్‌లో 40 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్‌ఫండ్స్ డైరెక్టర్స్ నాగరాజేశ్వరి, పూజాలక్ష్మి, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అమీర్‌పేట్‌లోని సన్‌షైన్ అపార్ట్‌మెంట్‌లోనూ తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ–కామర్స్ వ్యాపారవేత్త రఘువీర్ ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఐదేళ్ల ఐటీ లావాదేవీలను పరిశీలించారు.
చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలకు చెందిన రికార్డులతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్‌డిస్‌్కలు, పలు ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు జీవనశక్తి చిట్‌ఫండ్, ఈ–కామ్ చిట్‌ఫండ్ సంస్థలపైనా సోదాలు జరిగాయి. ఐటీ రిటర్న్‌లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment