ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు... | NRIs can invest in chitfunds | Sakshi
Sakshi News home page

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు...

Published Fri, Jun 12 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు...

ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు...

ముంబై: ప్రవాస భారతీయులు  చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ నాన్-రిపాట్రియేషన్(వీటిని విదేశీ కరెన్సీలోకి మార్చడానికి వీలుండదు) ప్రాతిపదికన ఉండాలని పేర్కొంది. ఫలితంగా దేశంలోకి మరింతగా నిధులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ చిట్‌ఫండ్స్‌కు చందా చెల్లింపుల సాధారణ బ్యాంకింగ్ మార్గాల్లో చేయాలని పేర్కొంది. ఇక్కడి ఏ బ్యాంక్ శాఖ నుంచైనా ఈ చందా చెల్లింపులు చేయవచ్చని వివరించింది. ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిబంధనలను మార్చామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement