చిట్టీల పేరుతో మోసం
Published Sat, Oct 8 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
-వ్యక్తి అరెస్ట్
తాడేపల్లిగూడెం: చిట్టీల పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బయ్య రంగారావు చిట్టీ వ్యాపారం చేస్తున్నాడు. తనకు తెలిసిన వారి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ. 12 లక్షల వరకు వసూలు చేసి చివరకు మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల నగదును రికవరి చేశారు.
Advertisement
Advertisement