కృష్ణా: కృష్ణా ప్రాంతంలో ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. 2017 సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగాలిప్పిస్తామని 34 మంది నిరుద్యోగులతో కోటి రూపాయలను డ్రైవర్ రవి వసూలు చేశాడు. నిరుద్యోగులను మోసం చేసేందుకు ఘరానా మోసగాళ్లు ఫేక్ ఐడి కార్డులు, ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించారు. ఈ విషయం తెలుసుకొని మోసపోయామని భావించిన బాధితుడు గణేష్ విజయవాడ సీపీని ఆశ్రయించి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. విజయవాడ సీపీ ఆదేశాలతో టాస్క్‌పోర్స్ పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసును ఏడీసీపీ శ్రీనివాస్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మోసగాళ్లు నిరుద్యోగుల నుంచి ఒక్కో పోస్టుకు ఐదు లక్షలు వసూలు చేసినట్టు పిర్యాదు అందిందని ఏడీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఏడీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాధితులు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారని, నిరుద్యోగ బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు. నిరుద్యోగులను చీట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఏడీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment